Oct 21, 2018
మన ఇళ్లల్లో " గోవింద " అంటే అదేదో అనకూడని మాటలా భావిస్తూ ఉంటారు..!. ఇలా భ్రష్ఠు పట్టిన ఆలోచనలు శుద్ధి చేయడం ఎలా....? "గోవిందా. !..నీకు ఈ నామం ఎంత ప్రీతికరమైన దో ,మాకు తెలుసు..! "గోవిందా !"అన్న పిలుపుకు నీవు ఎంత పరవశించి పోతావో.? ఎంత ఆనందమో ?,,నీ భక్తులకు కూడా , అంతే ఆనందానుభూతి కలుగుతూ ఉంటోంది.. కదా ! పైగా నీకు మాములుగా వచ్చిందా ఆ పేరు ? స్వామీ ! నీవు ఏడురాత్రులు ,ఏడు పగుళ్ళు ,గోపగోపీజనాలను ,అలమందల ను ,దేవేంద్రుడు కోపంతో కురిపించే భీభత్సకరమైన వర్షాలు ఉరుముల దాడినుండి నీ చిటికెనవ్రేలి తో గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగులా ధరించి కాపాడుతూ ,, "శిష్ఠజన రక్షకత్వ ""బిరుదును సార్ధకం చేసుకోడానికి ఎంతో కష్టపడుతూ , సంపాదించుకున్న "బిరుదు" ఈ గోవింద నామం..! అందుకే నీ సహస్రాధిక నామాలలోకెల్లా ,ఈ గోవింద నామం నీకు బహు ప్రీతికరం కదా ! కానీ ఎందుకీ అర్థం కాని ,జ్ఞానం లేని మనిషి ప్రవర్తన తీరు..! శవాల ఊరేగింపు సమయంలోనో ,వైష్ణవ ఆలయాలలోనో ,,లక్ష్మీ రమణుని బ్రహ్మోత్సవాలలో నో , మాత్రమే పరిమితం చేస్తూ "గోవిందా" అంటూ ఉచ్చరించాల్సి రావడం, అలా భక్తులు వ్యవహరించడం ,హరి హరి నామానికి హద్దులు పెట్టడం.. చాలా బాధాకరం గా ఉంటోంది..గోవిందా ! "గోవిందా !"అంటే అంతా అయిపోయింది ! ఇక ఏమీ మిగిలి లేదు !" అనేగా మన భావన ! నిజానికి అనునిత్యం ఈకాలచక్ర భ్రమణం లో నలిగిపోతున్న జగతి లోని సమస్త చరాచర జీవులు ,,జగతిలో ని అందాలు ఆనందాలు, అనిపించే సృష్టిలోని ప్రతీదీ ,, వాని కాల వ్యవధి పూర్తి అవగానే "గోవిందా" అవుతున్న విషయం మనకు తెలియనిదా.?. రేపు మనం కూడా ఇలాగే "గోవిందా "అనుకుంటూ గోవిందునివద్దకు చేరవాల్సిందే కదా..! ఇంతటి భక్తిని జ్ఞానాన్ని వైరాగ్య భావనా సంపదను కలిగించే ఈ గోవింద నామం భుక్తి ముక్తిదాయకము కదా ! మరి ఎందుకు ఈ చీకటిలో దోబూచులాటలు..? ఎంత పుణ్యం చేసుకుంటే అలా "గోవిందా " అనుకుంటూ తుది శ్వాస విడిచే యోగం సిద్ధిస్తుంది ? చేసుకున్న కర్మఫలాలు పూర్తి కాగానే అందరూ "గోవిందా" అనవలసిందేకదా ! కానీ అప్పడు గోవిందుని స్మరించే భాగ్యం ఉంటుందో ,,ఉండదో ! అందుకే ,,ఇప్పుడే అందాం ! అనుకుందాం ! కేవలం ఎవరో ఎక్కడో "చస్తేనే "కానీ జ్ణాపకం రాని గోవిందు ని ఇప్పుడే స్మరించుకుందాం..! అలా క్రమంగా "గోవింద "నామం పై పవిత్రభావన ను పెంచుకుందాం..! అంతేగాని , దీనికి విపరీతవ్యాఖ్యలు చేసేవారికి ఘోరమైన పాపం చుట్టుకుంటుంది..సుమా ! అందుకే అన్నమయ్య చెప్పినట్టుగా ""భావములోనా ,బాహ్యమునందున ,గోవింద! ,గోవింద! అని కొలువవే మనసా ! ""అంటూ గోవిందుని నామ వైభవ స్మరణతో పులకించి ,అమృతతుల్య మైన గోవిందుని వేలాది సంకీర్తనలు రచించి గానం చేసి , తరించడానికి మనకు అందించి ,తాను",గోవిందుని దివ్య పరందామాన్ని"" చేరుకున్నాడు..!అలా గోవింద నామ విశిష్టత ఎంత గొప్పదో ,చాటి చెప్పాడు..!అందుకే , మనలో కొలువై ఉన్న "గోవిందుని చరణారవింద స్మరణ!" నిరంతరం చేయుమని "కోతి "లాంటి మన మనస్సును వేడుకుందాం. ! గోవిందా ,గోవిందా !"",,అంటూ నోరారా ,తనివారా ,,పిలుద్దాం !అలాగే మరొక్క విషయం ! " సకల జనహితము,సమ్మతము " అయిన మన "భగవద్గీతను" శవాల యాత్ర సందర్భంగా మాత్రమే ఉపయోగిస్తూ ఉండడాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంటుంది.!. చచ్చినవారు "గీతాబోధనలు " "ఎలాను వినలేరు..! ఇక ,"చావబోతూ ఉన్నవారు శ్మశాన వాటిక లోనే గీతావాక్యాలు వినాలా.?. అది దానికే నిర్దేశింప బడిందా? ,అందుకోసమే అని చెప్పాడా శ్రీకృష్ణుడు ? అక్కడ "గీతను "వినడం వల్ల వచ్చే పుణ్యం ఎవరికి వస్తోంది ? జీవుడు బ్రతికి ఉండగా వినలేని గీతను కనీసం అతడు పోయాక అయినా వినిపించాలని అనుకోవడం అవివేకం అజ్ఞానం కాదా.? శవానికి జ్ఞానేంద్రియాలు పని చేయవు !" అని మనకు తెలుసు కదా ! తెలిసీ, తెలిసీ ,తెలియని వారి వలె నటించడం ,భగవద్ భావాల మర్యాదను కించపరచడం బాధగా అనిపిస్తోంది కదామనకు ! ఇక వెంట వెళ్ళేవారి జ్ఞానోదయం కోసమా. అలా వినిపించడం .! "స్మశాన వైరాగ్యం " పురాణ వైరాగ్యం ,ప్రసూతి వైరాగ్యం !"" అంటే ఒక గంటసేపు" అయ్యో! జీవితం అంటే ఇంతేనా ?"" అని అనుకోవడమేనా ? అంత సులభమా వైరాగ్య భావన రావడం ? మన ఇండ్లలో లేదా దేవాలయాలలో ,సత్సాంఘాలలో ,అలా ఎక్కడ వీలైతే అక్కడ చదువుకోవడం, లేదా వినడానికి తీరిక ఓపిక భక్తి శ్రద్ధ ఆసక్తులు మనకు ఉండడం లేదా. ? ఈ విదంగా మన సంప్రదాయం ను మనమే ఒక చిన్నచూపు చూస్తూ. పవిత్రమైన సద్గ్రంథమునకు మచ్చ తెస్తూ ,ఇతరులు వేలెత్తి చూపే అవకాశాన్ని మనమే వారికి ఇస్తున్నాం.. !మన బ్రతుకురాత లను మార్చే గీతాగ్రంధమును చదువుకున్నా ,వినకున్నా ఫర్వాలేదు.!. కానీ ఇలా దుర్వినియోగం చేసే అధికారం మనకు లేదు కదా..! ప్రక్కదారి పడుతున్న ఈ వ్యవస్థను మనమే అప్రమత్తంగా ఉంటూ మనమే దిద్దుకోవాలి..,,! ఎవరో వస్తారని ,,ఎదో చేస్తారని ఆశించడం. అలా అనుకోవడం తప్పు ! తప్పు అని తెలిసి కూడా మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుండడం ఘోర అపరాధం అవుతోంది..,, అని నా భావన ! ,దానిని మీ ముందు పెడుతున్నాను.!. ఎలా దిద్దుకోవాలి.? ఎలా సంస్కరించాలి.? ఏం చేస్తే ఆధ్యాత్మిక విలువలు, భక్తి శ్రద్దలు ,ఆచార వ్యవహారాలు ,సంప్రదాయాలు దెబ్బతినకుండా , మన పరమ పవిత్ర సద్గ్రంతం,భగవద్గీతను సద్వినియోగం చేయవచ్చు నో, మేధావులు ,పండితులు ,శాస్త్రం తెలిసిన వారు,శ్రుతి స్మృతి ,పురాణ ఇతిహాసాలు తెలిసినవారు ,విజ్ఞులు ప్రాజ్ఞులు ,నీతి కోవిదులు ఇందులో ఉన్నారు .!.వారు నిర్ణయించాలని ,ఇది " సమస్య !"అనుకుంటే నివారణ చర్యలు ,మార్గదర్శనం చేయాలని వారిని సవినయంగా కోరుతున్నాను! .ఈ సంస్కృతి ,రాబోయే తరాలకు , మన సద్ గ్రంధాల పట్ల , వాటి అధ్యయనం , అన్వయం ,ఆచరణ ల పట్ల చక్కని అవగాహనని ,పెంపొందించే రీతిలో ఉండాలని కోరుకుందాం.!. ఈ సందర్బంగా గీతాచార్యుడు ,శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత లో ప్రబోధించిన ఒక శ్లోకాన్ని తలంచుకుందాం..! 9.27.:::::!! శ్లో !!"'యత్ కరోషి , యదా ష్ణాసి,యత్ జుహోసి,దదాసియత్ ,,,, యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం !"" అనగా ""నీవు ఏ పని చేసినా ,ఏది తినినా ,ఏది యజ్ఞములో హవిస్సు గా వేసినా , ,ఏది దానము చేసినా ,తపస్సు చేసినా ,,అర్జునా. !అవన్నీ నాకే సమర్పించిన భావంతో చేయుము...!"అని మనకు సందేశాన్ని అందించాడు శ్రీకృష్ణుడు ! అనగా మనం చేసే ప్రతీ పనిని " సర్వమ్ శ్రీకృష్ణార్పణ మస్తు !" అన్న అంతర్గత భావనతో చేయాలని ,,, చూసే ప్రతీ పదార్థంలో ,యదార్థమైన పరమాత్మ దివ్య వైభవంగా ,దర్శించాలని ఆ అంతర్యామి ఉపదేశం..!అలా, భగవన్తుడే స్వయంగా మనకోసం భూమిపై కి దిగివచ్చి ",భగవద్గీత "ద్వారా అందించిన అమృతతుల్య ఉపదేశ సారాన్ని గ్రహిస్తూ ఉత్కృష్టమైన ఈ మానవజన్మ ను ఉద్ధరించుకోవాలి.!. అన్ని రోగాలకు దివ్య ఔషధం ,! వేదాల సారం ,,!జీవన వేదం..! వేదనల నివృత్తికి మూలం ..!ఆధ్యాత్మిక ఆనందానుభూతులను,పరమాత్మ సాక్షాత్కారం ను అలవోకగా అందించే సద్గ్రంథం , మన ఈ భగవద్గీత !! అలాంటి పవిత్రమైన పుస్తక పఠనం ,శ్రవణం ,పూజనం, చేస్తూ ,భావిస్తూ.. మనతో బాటు అందరినీ ,ఇదే స్ఫూర్తితో ,భగవద్ సేవలో ,కలుపుకుంటూ ,, మానసికంగా, శారీరకంగా ఆధ్యాత్మిక భావ సంపద తో ఎదుగుతూ ,తరించుదాం..! గీతామాతకు జై ! గోవిందునికి జై ! గోపాలకృష్ణ భగవానునికి జై !!" హరిః ఓమ్ తత్సత్ ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ ! స్వస్తి !!"
No comments:
Post a Comment