ధన్యులు గణేశుని సేవించే యువత ,ప్రజానీకం కూడా...! ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ,వినాయకుని మనసారా కొలిచి సేవించి , గణపయ్య దీవెనలు అందుకుంటున్న భక్తజనుల జీవితం నిజంగా ధన్యం.. !.ఇదే విషయం నేను నిన్న గణనాథుని వద్ద భజన సందర్భంగా చెప్పాను. క్లుప్తంగా..! వినాయకుని ఎందుకు ఇంత గొప్పగా అద్భుతంగా పూజించాలి. ? అన్న దానికి సమాధానం నా మాటల్లో చెప్పాను.. మనిషికి జంతువుకు బేధం కేవలం జ్ఞానం ఒక్కటే కాదు. వివేకం కూడా. !.గ్రంథాలు చదవడం, లేదా డిగ్రీలు, వేదాంతం, శ్రుతి స్మృతి పురాణాలు ఉపనిషత్తులు వల్లె వేయడం వల్ల నే కాదు.. ,, దానితోబాటు వివేకం కూడా కలిగి ఉండాలి..అని ...కానీ అది సత్సాంగత్యం వల్లనే కలుగుతుంది.. అటు రావణుడు. ఇటు దుర్యోధనుడు కేవలం మంచిమాట వినకుండా సత్సాంగత్యం లేకుండా చెడిపోయారు.. అందుకే ఈ వివేక జ్ఞానాన్ని పొందడానికి వినాయకుని పాదాలు ఆశ్రయించాలి. !ఆయన సద్గురువు, మార్గదర్శి, దారిలో ఉన్న ఆటంకాలను తొలగించి వివేకమనే జ్ఞానాన్ని అందించే మహానుభావుడు., ఈ శంకర సుతుడు.!. ఎక్కడచూసినా కూడా వందల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా హుషారుగా కలిసి పాల్గొనడం వలన ఈ పదిరోజులు భగవన్తుని సన్నిధిలో సేవలో, భజనలో తరిస్తున్నారు. ! అన్ని వసతులు , సంపదలు, ఆస్తి, ఐశ్వర్యం ,చదువు సంస్కారం , బంధువులు, స్నేహితులను ఇచ్చిన దైవం, ఇది మాత్రం ఇవ్వలేదు. కేవలం ఎవరికి వారే స్వయంగా ఈ వివేకం అనే అమూల్యమైన ధనాన్ని శ్రమించి ,తపించి, ఆరాధించి సంపాదించుకోవాల్సి ఉంటుంది కదా..మనకున్న విజ్ఞానం ద్వారా.. ! కోట్లాది మంది మనుజుల్లో అరుదుగా కనిపించే ది ఈ వివేక జ్ఞానమే.. ! "నేను ఎందుకు పుట్టాను.? " "ఏం సాధించాలి. ?" " ఎవర్ని నేను ? ఎక్కడినుంచి వచ్చాను.. ? వెళ్ళేది ఎక్కడికి..? దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు ?అతని ఉనికి ఎక్కడ.. ?నేను అనేవాడితో నా శరీరానికి సంబంధం ఉందా, !లేదా.. ? "నిద్ర పోవడం, అంటే ఏమిటి.. ? ఆకాశం కంటే పెద్ద వస్తువు ఉంటుందా..? నా జీవిత పరమార్ధం ఏమిటి.?. నాకు సన్మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువు ఎవరు.. ?సత్సంగం, సజ్జనసంగత్యం ఎలా లభిస్తుంది. ?..ఇలా ఎన్నో జీవిత సత్యాల అన్వేషణ చేయడమే వివేకం..కదా !' విఘ్నేశ్వరుని సేవలో ఆయన మూర్తిలోనే మనకు ఈ తత్వబోధన బోధ పడుతుంది. ఆ వెడల్పైన చెవులు సత్కథలు, ఎన్నైనా శ్రవణం చేయాలని, అంత గొప్పగా మననం కూడా చెయ్యాలని అతనిి పెద్ద తలా, సూక్ష్మంగా చూసే అతని కంటి చూపులు, జగతిలో అణువణువు నా పరబ్రహ్మము నూ, వంకర తొండము ఓంకారాన్ని. దంతాలు జ్ఞానాన్ని ,విశాలంగా ఉన్న కుక్షి ,బ్రహ్మాన్దాలు ఇమిడివున్న సంకేతాలను సూచిస్తున్నాయి అలాగే తాను.మెల్లిగా వేసే అడుగులు జీవితంలో మనం తొందరపడకుండా ఆలోచిస్తూ ,ఒక్కొక్కటి తూచి తూచి వేయాలని. దిశ, దశ లను నిర్దేశిస్తూ తెలుపుతోంది. ఇక ఏకదంతుని సేవా భాగ్యం ..ముఖ్యన్గా మన కుటుంబం వారితోనే కాకుండా వాడలో, వీధిలో, ఉన్న అందరూ మనవారుగా కలుపుకు పోయే అద్భుతమైన సద్భావన ,పవిత్రమైన యాత్ర ,దీక్ష,, పండుగ, లను తలపిస్తున్నాయి... ! వివేకం, మానవత్వం, దైవత్వం. అంటే ఇదే కదా !.పరమాత్మ కృపకు నోచుకోవడం అంటే ఇలా పదిమందిలో పరమేశ్వరుని దర్శించడమే కదా..! అందమైన వినాయకుల విగ్రహాల ఉత్సవాల వెనక మన దైవభక్తి, పరస్పర సహకార భావన ,అవగాహన లాంటి దివ్యమైన పరమాత్మ వైభవం అవిష్కరించ బడుతున్నాయి...నిజంగా మానవజన్మ కు ఇంతకంటే ఆనందం మరేముంటుంది..? అందరిని సంఘటిత పరిచే ఇలాంటి దైవిక శక్తుల ఉద్యమం ,సకల జనావళికి శుభకరం ! మంగళకరం.!. "గౌరీ నందనా..!" నీవు అనుగ్రహిస్తున్న ఇలాంటి స్పూర్తిని, శక్తిని, వివేకాన్ని సదా మానవ కల్యాణానికి వినియోగించేలా మమ్మల్ని కరుణించు.!. నీ అపారమైన దయను అనుగ్రహించి.., ఇలా నీ సేవలో సదా తరించే మహాభాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ.!..సకల జనులను చల్లగా చూడు.!. స్వామీ..! నీ కరుణకు శతకోటి ప్రణామాలు..!
Monday, October 1, 2018
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment