Monday, October 1, 2018

జగన్నాటక సూత్రధారి

జగన్మోహనకారుని దివ్యసందర్శన విశ్వరూప క్షేత్రం , ఈ విశ్వం ! ,విశ్వకర్మ, విశ్వాత్ముడు, ఆనంతుడు, ఆదిదేవుడు అందించిన అద్భుత ,అందాల ఆనందాల  జగతి ఈ ప్రకృతి కాంత..! కరుణాంతరంగుడు , ఆశ్రితరక్షకుడు అయిన ఆ  దేవదేవుడిచ్చిన  ఈ కళ్ళతో అంతటా  విశ్వమూర్తిని, పరదైవాన్ని తిలకిస్తూ పులకిద్దాం !స్వామి అనుగ్రహించిన ఈ ,కాళ్లతో  "హరి హరి  "యంటూ  అడుగడుగునా ఆనందనిలయుని దివ్యసన్నిధిగా భావిస్తూ పొర్లుదండాలతో  స్వామికి ప్రదక్షిణ చేద్దాం. ! ఇక  ఈ చేతులతో  స్వామి పాదాలు చుట్టి  ,ఆ బంగారు కమలాల వంటి చరణాల పంజరంలో మనస్సనే చిలుకను బందీ చేయమని దీనంగా అడుగుదాం.!రాధామనోహరుడు ,నందనందనుడు ,ఆ.  వనమాలి  కంఠంలో  వ్రేలాడే సుమధుర పరిమళాలు వెదజల్లే తులసీ దళాలనుండి వచ్చే సు గంధ ,సుమధుర ఘ్రాణము ను దైవం అనుగ్రహించిన నాసిక తో ఘ్రాణిద్దాము ! "ఈ..పంచేంద్రియాలను, మనసును, బుద్దిని, పరమేశ్వరుని చింతనలో సమర్పిద్దాం..! ఆయన సొమ్ములం! , అయన చేసిన బొమ్మలం మనము.!.సంపూర్ణ అధికారం మనపై ఆ జగన్నాటకసూత్రధారి కి ఉంది .!ఇక ఈ  అహంకార మమకారాలు ఎవరిపై చూపించేది  ? ",నాది నాది అనుకున్నది నీది కానే కాదు..  "అని తెలుసు. ! అయినా ఈ మాయామోహ పాశ జాలంలో చేపల వలె చిక్కి,  "అయ్యో  ! ఏమిటి నా దుర్గతి   ?అని విల విలా ఏడుస్తూ గుండెలు పగిలేలా రోదించడం ,జ్ఞానమా !  అజ్ఞానమా. ? . శవపేటిక వెంట వెళ్లే వారు ,తనవెంట అలా వచ్చేవారి కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సిందే కదా.. ! అందుకే హృదయంలో తపనతో సాధన చేస్తూ , వివేకంతో  వేంకటేశ్వర  స్వామి సుందర సాలగ్రామ విగ్రహ సౌందర్య ఆరాధన చేస్తూ, ఆ వైభవాన్ని ధ్యానిస్తూ , భావిస్తూ  ,"నిత్యము సత్యము ఆనందకరమూ మంగళక రము  "అయిన సచ్చిదానంద ఘన స్వరూపాన్ని అనునిత్యం స్మరించుదాం, !తరించుదాం..! ఓమ్ నమో నారాయణాయ..!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...