Monday, October 1, 2018

సత్సంగం

మహా పండితుడు, శాస్త్ర కోవిదుడు, వేదవేదాంగ పారంగతుడు, మహా పరాక్రమశాలి, అన్నింటికీ మించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మెప్పించిన శివభక్తుడు అయిన రావణాసురుడు ,అన్నిధర్మాలు  తెలిసినా కూడా అధర్మ పరుడై సీతాదేవిని అపహరించి,  స్త్రీశక్తిని  కించపరచి , తద్వారా తన కులవంశ నాశనానికి కారకూడయ్యాడు. ఎందుకు అంటే వివేకం కోల్పోయాడు. కనుక...!ఇక తాను ఏది చేసినా  పొగిడి సమర్తించే వందిమాంగదులే కానీ అన్యాయం అని విభీషణుని వలె ఖండించిన వారు కరువయ్యారు.అంటే సత్సంగం, సజ్జనసహవాసం లేక, వివేకశూన్యుడయ్యాడు . అందుకే రావణుడు మహా జ్ఞాని,శివభక్త శిఖామణి అయినా మండోదరి లాంటివారు హితవు చెప్పినా అహంకారంతో , ధన బల బంధు,వర్గమదం తో మూర్ఖంగా ప్రవర్తించి తనకు తాను చేజేతులారా తమ రాక్షసజాతికే చేటు తెచ్చాడు... అలాగే సుయోధనుడు క్రమంగా దుర్యోధనుడు అయ్యాడు.,కౌరవక్షయానికి కారకడయ్యింది తన దుష్టచతుష్టయం సహవాసం తోనే .కదా !. అందుకేదుష్టసహవాసం సూచించే  ఆ పేర్లు కూడా ఎవరూ పేట్టుకోరు పుట్టుకతోనే ఎవరూ దుర్మార్గులు కారు. కేవలం సత్సాంగత్యం లేక చెడు దారి పడతారు..మరి..!. అందుకే  మనిషి తనకున్న జ్ఞానంతో, చక్కని మార్గదర్శకం చేసే చదువు, గురువు,తలిదండ్రులు,స్నేహితులు, సజ్జనసంగత్యం, దైవభక్తి, సంస్కృతి సంప్రదాయాలపట్ల ఆసక్తి,పెద్దల పట్ల వినయ విధేయత లు పెంచుకోవాలి. ఇవన్నీ  కలగాలంటే కేవలం సత్సంగం వల్ల మాత్రమే సాధ్యం. బాల్యం నుండి మంచి మాటలు, భగవన్తుని గూర్చిన భజన, కీర్తన, స్మరణ ,పూజనం,లాంటి సేవా దృక్పథాన్ని అలవాటు చెయ్యాలి.! ఇంటిలో అనునిత్యం పిల్లలను ప్రక్కన ఉంచుకొని దైవారాధన చేస్తూ  వారిలో భక్తి బీజాలు చిన్నతనంలోనే  వారి మనసులో నాటాలి..!ఉత్తమ పౌరుడుగా, ఎదగాలంటే అది ఇంటినుండి ప్రారంభించాలి.!. ఇది ఒక ప్రశాంత మైన శాంతియుత ఉద్యమం!. మానవజీవిత వికాసానికి నాంది.! కన్నవారికి ,వంశానికి, పెద్దవారి పరువుప్రతిష్టలకు పేరు తేవడానికి సుక్షేత్రంలో నాణ్యమైన విత్తనం నాటడం లాంటిది.. !అది మొలకెత్తి ఫలరసాలను పండించి పదిమందికి అందంగా ఆనందంగా  పంచే విధంగా ఎదగడానికి తలిదండ్రులు కూడా ధార్మిక బుద్ధితో ఎదగాలి.తాము సాత్వికంగా బ్రతుకుతూ తమ సంతానానికి,ఓర్పుతో బాటు నేర్పును నేర్పించాలి. నేటి పోటీ ప్రపంచంలో, తాము కూడా ఎదుగుతూ, పిల్లలకు వివేకాన్నిి  విజ్ఞానాన్ని విశిష్టమైన  వ్యక్తిత్వాన్ని తగురీతిలో అందిస్తూ వారికి మొదటి గురువులు కావాలి. ! అందుకు సత్సాంగత్యమే సద్గురువుల ఆశ్రయమే బోధనలే  పరమాత్మ కృపయే  శరణ్యం కదా..ఓమ్ శ్రీ గోపాలకృష్ణ పరబ్రహ్మణే నమః.

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...