Wednesday, October 10, 2018

ప్రశ్న

అర్జునునికి కురుక్షేత్రం లో గొప్ప ధర్మసందేహం , కలిగింది ! ".యుద్ధం చేయాలా !  వద్దా. ? " అన్యాయంగా బంధుజనాలు ,అకారణంగా సైన్యం ,తన మూలంగా చావడం,కష్టం గా తోచింది. ! కేవలం" రాజ్యకాంక్ష !"కోసం ఇంత విధ్వంసం అవసరమా ?" అంటూ గుండెల్లోంచి పొంగి వస్తున్న  దుఃఖంతో .,మనసును ప్రతిఘటన పై నిల్పుకోలేక పోయాడు..అర్జునుడు.! ఇదే విషాదయోగం..!జీవునికి దేవుడు జ్ణాపకం వచ్చేది ఇప్పుడు..!  మొదట్లో ,సామాన్యుని వలె ,తనకు తెలిసిందే సత్యమంటూ , అన్నీ తెలిసిన వేదాంతిలా  "యుద్ధం చేయడం అధర్మం !" అని తేల్చేసి , చిన్న ఉపన్యాసం ఇచ్చేసి ,! నేను యుద్ధం చేయనని " తానే తీర్మానించు కున్నాడు.. ! శ్రీకృష్ణుడు ప్రశాంతంగా అతని ఆవేదన విన్నాడు. ఏమీ అనలేదు.!. అర్జునునికి ఏం చేయాలో తెలియడం లేదు ! మిత్రుడు ,బావగారిలా భావించే కృష్ణునితో తన గోడు అంతా వెళ్లబోసుకున్నా కూడా , ! తాను  దిక్కుతోచనిదుస్థితి లో ఉన్నానని గ్రహిస్తూ  ,ఇక గత్యంతరం లేక ,"కృష్ణా ! వాసుదేవా ! అమితమైన బాధ ,దుఃఖంతో నిన్ను ఆశ్రయిస్తున్నాను , ! ఒక్క  "యుద్ధం !" తప్ప నీవు నన్ను ఏమి చేయమన్నా చేస్తాను అన్నాడు..! యుద్దానికి అన్నీ సన్నద్ధం చేసుకొని వచ్చి యుద్ధరంగం మధ్య నేను యుద్ధం చేయను  ! అంటూ మూర్ఖంగా తీర్మానించుకుంటూ  ,"అది తప్ప మరేదైనా చెప్పు!" అనడం ,అర్జునుని అవివేకం అవిద్య ,అజ్ఞానాన్ని సూచిస్తోంది ! ఏం చెయ్యాలి శ్రీకృష్ణుడు ఇప్పుడు ? కాస్సేపటికి అర్జునుని . ఏడుపు ఆగింది! ,ఇక వేడుకోడం మాత్రమే మిగిలింది ! అప్పుడు, ఎదుట కనబడే నందగోపాలుడు ఆచార్యునిలా భాసించాడు.!. భావం మారింది.! ఇద్దరి మధ్య మిత్ర  ,బంధు సంబంధం తొలగి  ,"గురు శిష్య సంబంధం ! " ఏర్పడింది.!".  "కృష్ణా.!. నాకు నీవే దారి చూపాలి  !,ఎటూ తోచని సందిగ్దత లో నేను పూర్తిగా మునిగిపోయాను !కాపాడు !" అంటూ దీనంగా అశ్రుధారలతో వేడుకున్నాడు !.అయినా శ్రీకృష్ణుడు  చిరునవ్వు తో మిన్నకున్నాడు.!.ఎప్పుడైతే  "అన్యధా శరణం నాస్తి ! , త్వమేవ శరణం మమ !" అంటూ " నీవే శరణు!" అంటూ రెండు చేతులూ జోడించి  పాదాక్రాంతు డౌతూ "శరణాగతి "చేశాడో అప్పుడు గీతాచార్యుడు ఉపక్రమించి అతడికి మార్గదర్శనం చేశాడు..!అలా Complete గా surrender అవుతూ,"మీ పాదాలే శరణ్యం !" గా భావిస్తే గాని ,గురువు కృప శిష్యునికి లభించదు కదా ! అర్జునునికి వచ్చిన ధర్మసందేహం   మనకు కూడా అనునిత్యం కలుగుతూనే ఉంటుంది. ఇది చేయాలా  ? అది చేయాలా ! ఏదీ వద్దా...! అనుకుంటూ ఎటూ తోచక మనసు ఏ నిర్ణయం కూడా తీసుకోలేని సంకట పరిస్థితి అందరికి దాపురిస్తోంది... తాగుబోతుకి తాగడం తప్పని తెలుసు కానీ ఈ దురలవాటునుండి తప్పించే దిక్కు  కరువై ,అధఃపతనానికి దిగజారి పోతాడు. !అలా జీవితంలో ఎన్నో సమస్యలు ,సంకటాలు, మనసును ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అప్పుడు మార్గదర్శనం కోసం , శ్రీకృష్ణునివలె గురువు దొరకడం తో మనఃశాంతి, ఆనందము ,విజయము లభిస్తాయి .!ఇక్కడ అర్జునుడు తన మనసుని ,ఎదుట  గురువుగా ప్రకాశిస్తూ న్న సాక్షాత్తు భగవన్తుడు అయిన  శ్రీకృష్ణుని పై కేంద్రీకరించాడు.  !అలా" ఉత్తమ" శిష్యుడుగా తన బుద్దికుశలతను ప్రదర్శించాడు  !ఆ విధంగా" గీతోపదేశం" పొందడానికి  యోగ్యతను ,పాత్రతను ,అర్హతను   సంపాదించు కున్నాడు! , ఇలా ఆధ్యాత్మిక చింతన విషయంలో మన మనస్సును ముందు దైవం పై నిలపాలి !,తర్వాత ఆ దైవం యొక్క రూపగుణ మహాత్మ్యాన్ని, వైభవాన్ని బుద్దిని ఉపయోగించి ఆత్మానుభవం లోకి తేవాలి.!. ఇది ఒక భక్తుని భక్తిశ్రద్దలను అనగా మనసు, బుద్దిని సూచిస్తూ ఉంటాయి.! శంకరుడు ముందు మనసుకు సూచనగా తర్వాత గౌరీదేవి బుద్ధికి గుర్తుగా ఒకరివెంట మరొకరు భక్తుని అనుగ్రహిస్తూ ఉంటారు మనం ..ఈ విదంగా ఆధ్యాత్మిక భక్తిశ్రద్దలను దైవారాదనకు  వినియోగిస్తూ ఉండాలి. !ఇదే లోక వ్యవహారాలు చూడటానికైతే మాత్రం , ముందు బుద్దిని ,ఆ తర్వాత మనసును ఉపయోగించాల్సి ఉంటుంది... మొదట్లో నే మనసును ఉంచితే పిచ్చివాడు అంటారు... నిజానికి ఏదైనా  ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో  కలిగే సందేహాల నివారణకు గురువుగారిని , మధ్య మధ్య ప్రశ్నలు అడగడంతో. విషయం అవగాహన  దానిపై గట్టిపట్టు కలిగి తీరుతుంది.!.  ఊ , ఊ,.. కొడుతూ వింటుండడం వల్ల  ఎన్నిసార్లు పురాణం లేదా  రామాయణాది పుణ్య చరితలు విన్నా ఫలితం శూన్యం అవుతోంది!   ఇటు వింటూ అటు వదిలేస్తూ ఉన్నారు..! తలకెక్కించు కోవడం లేదు..!అలా అర్జునుడు మధ్య మధ్యలో శ్రీకృష్ణుని పరిప్రశ్నలు అడుగుతూ సందేహాలు తీర్చుకోడం చేయడం వలన మనకు భగవద్గీతను ఆమూలాగ్రంగా ,సవివరంగా  పొందే భాగ్యం కలిగింది..! అందుకే అతిలోక సుందరమైన ,జగన్మోహనాకారమైన ,నయన మనోహరమైన ,రాధమా నస చోర విహారుడైన ,,వేణునాద విశారదుడైన, గోపాల కృష్ణభగవానుని అద్వితీయమైన ,అపురూప మైన సచ్చిదానంద ఘన స్వరూప సౌందర్య లావణ్య లీలా మానుషవిగ్రహంపై , మన మనసును  మొదట లగ్నం చేస్తూ , పిదప బుద్ధితో మనహృదయంలో గోపిలోలుని చరణారవిందాల ను సుస్థిరం చేస్తూ., పారవశ్యంతో, నందకిశోరుని దర్శనా నంద మకరంద అమృతాన్ని గ్రోలుతూ.ఈ నరజన్మ ను పునీతం చేసుకుందాం..!  స్వస్తి ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...