Tuesday, October 9, 2018

జీవాత్మ  పరమాత్మ

Oct 8, 2018

"శరీరం శాశ్వతం కాదు ,!ఆత్మ శాశ్వతం,! ఆత్మ వేరు !,శరీరం వేరు,! ఆత్మకు చావు లేదు ,! ఇలాంటి శరీరాలను దుస్తుల వలె విడుస్తుంది  ఈ ఆత్మ !'" అంటూ గీతాచార్యుడు శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి హితబోధ చేస్తూ  అన్న గీతా శ్లోక తాత్పర్యం అది. ! పైగా శరీర ప్రయోజనాన్ని  ఆనందంగా ,ఆరోగ్యంగా మానసికంగా ,భౌతికంగా, ఆధ్యాత్మికంగా  ఉంచుకుంటూ,దైవారాధన తో  ఎదుగుతూ ,జీవాత్మను  పరమాత్మ తో  అనుసంధానం చేస్తూ ,ఈ శరీరాన్ని ధ్యాన ,పూజ, జప,తీర్థ యాత్ర,లాంటి సత్కర్మల ద్వారా  ఈ సాధనా శరీరంతో , ,పరిపూర్ణ సంకల్పం తో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో జీవన మాధుర్యాన్ని పండించుకొని ,,పరమానందాన్ని పొందవచ్చును !జీవాత్మను పరమాత్మ పరందామాన్నికూడా చేరుకోవచ్చును అన్నాడు  శ్రీకృష్ణుడు , ..అది జ్ఞాన ,కర్మ ,భక్తి ,యోగాది వివిధ శాస్త్ర అభ్యసన ప్రక్రియ సవివరణ లతో విశదీకరించి చెప్పాడు !. ఈ మానవ శరీరం ఒక సాధనా పరమైన ,దైవంశసంభూతమైన యోగ శాస్త్ర విజ్ఞాన భాండాగారం !,ఒక వరం,!ఒక యోగం ! ఒక దైవం ! ఒక అమూల్య ఆధ్యాత్మిక, శాస్త్రీయ, లౌకిక, పారలౌకిక, అద్భుతమైన ,అపురూప ము, అద్వితీయమైన,, అనుభవైకావేద్యమైన ,నిరూపమానమైన, నిరంజన, నిశ్చల ,నిర్వికార కర్మాగారం !.  సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే బ్రహ్మసూత్రాన్ని ధారణ చేస్తూ ,తానే బ్రహ్మగా భాసిల్లే  జీవుడు ఉన్న ఈ శరీరం పూజించడానికి సంపూర్ణ యోగ్యత లభిస్తోంది. అందుకే సాధువులను ,పురాణపురుషులను ,యోగిపుంగవులను ,ప్రవచన కర్తలను వ్యాసపీఠం పై సన్మానించి సత్కరిస్తూ ఉన్నారు.. శరీర సాధనం ఖలు !"  కావున ఎన్ని అపజయాలు జీవితంలో ఎదురైనా కూడా ,ఆత్మజ్ఞానం ,,శరీరపటుత్వం , పరిపూర్ణవ్యక్తిత్వం గల వివేకి ,ఇదే శరీరంతో ,తిరిగి ప్రయత్నిస్తూ , విజయాల పరంపర లు స్వంతం చేసుకుంటాడు .రాముడు కృష్ణుడు, లాంటి దేవుళ్ళు !,యోగులు, సిద్ధులు, మహా ఋషులు, లాంటి తపస్సంపనులు !,వాల్మీకి, వ్యాసుడు, నన్నయ లాంటి రామాయణ మహాభారత భాగవతకావ్య గ్రంథ కర్తలను !, త్యాగరాజు, పోతన, అన్నమయ్య, మీరాబాయి, తులసీదాసు, లాంటి అపర భక్త శిఖామణులు  !,మహాత్మాగాంధీ, వివేకానందుడు  లాంటి ఉద్యమ వైతాళికులు , !శ్రీకృష్ణదేవరాయలు ,శివాజీ వంటి దేశభక్తులు,!జాతీయ నాయకులు, మహావీరులు..! ఇలా మన భారతదేశ ఔన్నత్యాన్ని, కీర్తిప్రతిష్టల ను,సనాతన వారసత్వ సంపదను సుస్థిరం చేస్తూ ,మన సంస్కృతి ,సంప్రదాయాలను  తరతరాలకు అందించిన ఎందరో మహానుభావులు,  ఈ వేదభూమిలో జన్మించిన వారే !అందరూ ఈ మానవ శరీర దారులే. కదా!"బొందితో స్వర్గాన్ని !" అనగా శరీరంతో నేరుగా పరమాత్ముని దివ్యదామాన్ని చేరుకున్న పుణ్యాత్ములు కూడా మన భారతావని లో ఉన్నారు !,దైవాన్ని నేరుగా చేరుకోవాలన్నా ,భక్తితో పూజించాలన్నా, చేసిన పాపాలు భస్మం చేయాలన్నా, ప్రేమానురాగాలతో స్నేహ ,బందుత్వ అనుబంధాలతో " ఇలను స్వర్గధామం!" చేసుకోవాలన్నా, మహాత్ములు,మహనీయులు  ,మహానుభావులు కావాలన్నా  ,ముముక్షువులు భక్తశిఖామణులు  ,త్యాగం దానము, తపస్సు ,జప, తప, హోమ, యజ్ఞ యాగాదులు చేయాలన్నా..," ధ్రువ తారగా" మెరిసిపోవాలి ! అనుకున్నా ,, ఏ సత్కర్మలు చేయాలన్నా కూడా  మానవశరీర ధారణ అత్యవసరం !, ఈ కర్మభూమి ,పుణ్యభూమి ,వేదభూమి,పరమ పావన భారత దేశ ధరిత్రి పై , ,అందులోకూడా , ఉత్తమమైన మానవ శరీరం తో జన్మించడం  ,మన పూర్వజన్మ పుణ్యఫలం !,పితృదేవతల ఆశీర్వచన బలం.!.భగవద్ అనుగ్రహం !"  నిజానికి ఇందులో ఈ" శరీరాన్ని, ఈ జీవుడు ధరించి  ఈ భూమిపైకి రావడానికి  మన ప్రమేయం ఏ మాత్రం లేదు కదా  ! అంతా ఈశ్వరుని ఇచ్చా ప్రకారం  జరుగుతోంది !ఆయన శాసనం ద్వారా జగతి ప్రవర్తిస్తుంది..! శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా ! నదులు ప్రవహించినా ,సూర్యుని ఉదయ అస్తమయ విధులు చూసినా ,కాలచక్ర భ్రమణంలో ,ఋతువులు, మారినా, రాత్రి పవళ్లు ఏర్పడినా  జనన మరణాలు , ,సంకల్ప వికల్పాలు ,ఆకాశంలో నక్షత్రాల సోయగాలు. ఇలా కనిపించేది ,కనిపించనివి ,చరాచరములు , అంతా దైవాధీనం  !ఈశ్వరుని జగన్నాటకం !అని  శాస్త్ర ప్రమాణం తో చెప్పిన  సత్య వాక్యం ! అందుకే ఈ మానవజన్మ  అన్ని జన్మలకల్లా ఉత్తమమైనది.!ఉత్కృష్ట మైనది అవుతోంది !.. ఇక భగవన్తుని వరప్రసాధము ,, అయిన ఈ శరీరానికి ,ఏ ఇతర ప్రాణికి లేని దివ్యమైన శక్తులను,వైభవాన్ని ప్రసాదించాడు .  నిజానికి ఈ మనిషి అనేవాడు దేవుని అవతారం అని చెప్పవచ్చును. మనలో దాగివున్న దైవత్వాన్నీ గుర్తించే యోగ్యత స్తోమత గురూపదేశం వైభవం బహిర్గతం కాకుండా పూర్వజన్మ  సంచిత  ప్రారబ్దకర్మలుఅడ్డుపడుతున్నాయి .!  ఈ అడ్డుతెరలను అజ్ఞానాంధ కారాలను తొలగించే శివుని మూడో కన్ను లాంటి జ్ఞాననేత్రం మన అంతరాళం లో మసకబారి ఉంది. దానిని ఆత్మచైతన్యం తో యోగసాధన తో భక్తివిశ్వాసాలతో సాధించి వెలిగించడం వలన నీవు , హనుమంతునికి తనలో దాగిన అద్భుతశక్తులు ఒక్కదారిగా విజృంభించి  ఈ దేహంలో అజ్ఞానం అవిద్య అనబడే చీకటి తొలగి కోటికాంతులు  విరజిమ్మే ,దైవ దర్శనానికి దారి చూపుతుంది..!చురుకైన పంచేంద్రియాలతో ,చక్కని అవయవ సౌష్టవం తో, లోన పరమాత్మ అంశమైన ఆత్మతో, జీవుణ్ణి స్థిరపరచి,కదిలే దేవాలయం లా వైభవంగా ఈ శరీరాన్ని అందంగా ,తీర్చి దిద్దాడు భగవన్తుడు  !ఆ దివ్యమైన , మంగళకర మైన , వినూత్నమైన తేజోవంతమైన కాంతులను అంగాంగములో  పొదిగి,ఉత్సాహంతో ఉద్వేగంతో , ప్రజ్వరిల్లేలా ఈ శరీరాన్ని రూపొందించిన పరందాముని అపురూప శిల్పకళా నైపుణ్యాలను, చాతుర్యాన్ని ఏమని పొగడగలం , ?ఎంతని వర్ణించగలం.?ఏ స్క్రూ లు ,పట్టీలు లేకుండా ,శరీరాన్ని ఎటు వంచినా, ఎంత దొర్లించినా కూడా ఏ ఒక్క అవయవం దాని స్థానం నుండి వైదొలగకుండా పొందించి ,మన వినియోగానికి అందించిన దేవాదిదేవుని దయ అపారము ఆనంతము ఆమోఘము కదా !" జ్ఞానం!" అన్న ఒకే ఒక ఆయుధంతో ,పంచేంద్రియాలను నియంత్రిస్తూ ,తనను సృజించిన సృష్టికర్తను కూడా తెలుసుకునేంతగా ఎదిగిపోయాడు. కదా ఈ మానవుడు  ! సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ ,భూమిపై సముద్రాలలో నే కాకుండా  తన,,మేధస్సు ను రోదసీయాత్రలో పరిశోధనకు ఉపయోగిస్తున్న మనిషి దేవుని కరుణ ,దైవ అనుగ్రహం లేకుండా  ఇంత ప్రగతి వికాసము విజ్ఞానము సాదించగలడా ?   ఇలాంటి దివ్యమైన ఈ శరీరం తో ,నిరంతర సాధన తో సత్యాన్వేషన మార్గంతో చేసే దైవారాధన మన జీవనానికి అలంబనం చేసుకోవాలి ..! తలలోని ఈ  "మెదడు!" అనే కేంద్రంలో నిక్షిప్తం చేయబడిన  కంటితో చూపు! ,చెవులతో వినికిడి, !ముక్కుతో శ్వాసక్రియ !,నోటితో శబ్ద ఉచ్చారణ, ! సున్నితమైన చర్మంతో స్పర్శజ్ఞానం..! ఇలా మన ఈ శరీరం లో ని వేల వేల నరాల స్పందనలతో అనుసంధానం చేయబడుతూ... నిర్గుణము ,నిరాకారముఅయిన పరమాత్ముని  ప్రత్యక్ష రూప ప్రతిబింబంలా, లోనున్న  జీవాత్మ  స్వయం ప్రకాశంతో ,ఈ శరీరం పరంజ్యోతిలా వెలుగుతోంది.!.ఈ శరీరంతో మనం పొందే మదురానుభూతులు,,మానవ జన్మను సార్ధకం చేసే సాధనా సంపత్తి అనుభవాలు  ఇవన్నీ,,ఇతర ప్రాణులకు  అందని ద్రాక్షపండ్లే కదా..! సంతోషము , సుఖదుఃఖాలు ,కష్టాలు ,కన్నీళ్లు ,భోగాలు ,ఆనందాలు , అన్నీ ఈ శరీరాధారణవైభవం వలనే కదా..! అయితే  చనిపోయిన శరీరం ముందు ఈ శరీరం ఏడుస్తుంది..! ఎందుకు..? అంటే.. !ఇలాంటి పరమాద్భుతకరమైన సాధనా యుతమైన శరీరాన్ని తాను కూడా విడిచి పెట్టాల్సి వస్తుందని. ! అంతే కాదు, ఆ శరీరంతో ఇన్నాళ్లు తాను పంచుకుంటూ పెంచుకున్న అనుబంధాలు, ప్రేమానురాగాలు  ,ఇకపై ఉండవు కనుక ,,! అందుకే ఈ" శరీరం శవం!" కాకమునుపే ",జీవాత్మను ఉద్ధరించుకోవాలి  !"అన్నది ఇక్కడ నేర్చుకోవాల్సిన పరమ నగ్నసత్యం..!అదే జీవితపరమార్ధమ్  కూడా  !జగతిలో ఉన్న దృశ్యాలు, పదార్థాల అందాలు ,సొగసులు, రుచులు, ఆకారాలు ఇలా ఎన్నో అద్భుతాలు, ఆనందాలు,   కన్నులు  లేని గ్రుడ్డివాడు చూడగలడా..? ఎన్ని కోట్ల కోట్ల కోట్ల ధనం ఇచ్చినా ఈ "కన్ను "తో చూడబడే నేత్రానందానికి విలువ కట్టగలమా ? అయినా సూరదాసు అనే పుట్టు గ్రుడ్డివాడు , బాలకృష్ణుని పరమ భక్తుడిని అడిగితే ,,కంటి చూపు విలువ తెలుస్తుంది ! లేనివాడికి తెలిసినంతగా వస్తువు విలువ ఉన్నవాడికి తెలియదు కదా !..అలాగే ముక్కు ,నోరు ,చెవి, చర్మము ల ఘనత ప్రతిభ, అమూల్యమైన ప్రయోజనాలను త్యాగయ్య అన్నమయ్య లాంటి వాగ్గేయకారుల కీర్తనలను చదివితే ,వింటే,  దర్శిస్తే తెలుస్తోంది.!. ఇలా ఈ భగవద్ ప్రసాదితమైన ఈ శరీరాన్ని  అలా "భగవదర్పితం  "చేసిన వారంతా ధన్యులయ్యారు.! వారి పుణ్యచరితలను,అమూల్యమైన రచనలను మన పాలిట పెన్నిధి వలె భావిస్తున్నాము, !అందుకే జీవితంలో మనం పొందే సంఘటనలను ,కర్మలను, సుఖదుఃఖాలను పూర్వజన్మ కృత సుకృత ఫలాలుగా దైవనుగ్రహంగా స్వీకరించుదాం.. ! అదే సమయంలో  ఉత్తమమైన  ఈ మానవ జన్మకు ఇదే శరీరంతో ,మనసా వాచా కర్మణా,సన్మార్గాన్ని పాటిస్తూ ,సత్సంగాన్ని ఆశ్రయిస్తూ ,సద్గతిని పొందే మార్గంలో "సచ్చిదానంద ఘన శ్యామసుందర రూపాన్ని "జీవిత ధ్యేయంగా భావిస్తూ., నిత్యకర్మలు చేస్తూ ,ఉండాలి  .! దానితో బాటు,  ఈ శరీరాన్ని చైతన్యవంతం చేస్తున్న  ,దా పంచేంద్రియశక్తుల ప్రభావాన్ని ,జీవితంలో సంఘంలో ,దేశంలో సమున్నత స్థాయి కి ఎదుగుదలకు  ఉపయోగించాలి. ఈ శరీరం ఉద్దరణకు , అందాల ఆనందాల అనుభవాల పెంపునకు  కావాల్సినంత కరుణించాడు  ఈశ్వరుడు. అనంతమైన.ప్రకృతి సంపదలను ,బంధు బలగాన్ని, ఆహారపదార్థాలు అందించే మొక్కలు వృక్షాలను , ,త్రాగడానికి కమ్మని స్వాదుజాలన్ని ఇచ్చే నదులు ,వర్షాలకు వీలుగా మబ్బులు,సముద్రాలను , చల్లనిగాలిని  వీస్తూ ప్రాణవాయువు ను నిరంతరం కరుణించి   శరీరం పడిపోకుండా ప్రాణాన్ని నిలబెట్టే వాయువును ,..ఇవన్నీ, అనుగ్రహించి ఈ శరీరానికి సమతుల్యంలో సహకరించే వాతావరణం  పైన కర్మసాక్షి సూర్యభగవాను ని ,అనుగ్రహము ,రాత్రి చల్లన వెన్నెలకాంతితోి, ఔషధగుణాలతో, చంద్రుడు ,,ఇలాఇటు శరీర పోషణ  అటు ఆత్మసంరక్షణ లను చూస్తూ యోగక్షేమం వహామ్యహం ! అంటూ సదా  సృష్టి స్థితి లయలను గతులు తప్పకుండా సంరక్షిస్తూ జీవజాతిని ,వాని శరీర పోషణకు తానే భారం వహిస్తూ , తాను మాత్రం కేవలం "సాక్షిగా" నిలుస్తున్నాడు..! నిజానికి  అంతా ఈశ్వర ప్రసాదితం! మనదంటూ ఏమీ లేదు..!దుర్లభమైన మానవ జన్మకు మూలాధారం అవుతున్న ఈ శరీరం కూడా మనం కావాలని  తెచ్చుకుంది కాదు కదా.. ! ఈ రూపం, ఈ రంగు ,ఆకారం ,ఈ తలిదండ్రులు, ఈ బంధువులు ,ఈ ఊరు ,ఈ సంపదలు ,ఆస్తి ,ఆరోగ్యం, ఐశ్వర్యం , వనరులు , అన్నీ అతని కారుణ్యం, ప్రేమచే  ఇవ్వబడ్డవే !.అనుగ్రహించబడినవే !,నీ ఈ మానవ జన్మ ఉద్ధరించుకోడం కోసం భగవన్తుడు అందించిన అపురూప లావణ్య సౌందర్య విశ్వం ,..అతనిదే  ఈ సకల విశాల సమున్నత ఐశ్వర్య భాండాగార సామ్రాజ్యము ,అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని కేళి విలాస చిద్రూప విలసద్ విశ్వరూప కళా వైభవము !  అందు వలన , మనం చేయగలిగింది , ఒక్కటే !ఇంత అద్భుతంగా శరీరనిర్మాణం చేసి భుక్తి ముక్తి ప్రదాయకమైన  ముముక్షువుగా, జన్మరహిత్యమైన పరమ పద సోపానంలో పయనించేందుకు  సహకరిస్తున్న ఈ శరీరాన్ని ,నిత్యం పరమాత్మ స్మరణతో పవిత్రం చేద్దాం ,!జగద్గురువు శంకరాచార్యులు , మానవకోటి కల్యాణం కొరకై ఆసేతు హిమాచల భారతదేశం ,నలుమూలలా సంచరించి సాక్షాత్తు పరమశివ అవతారంగా  శృతి స్మృతి పురాణ ఇతిహాసాలను , మనకు అందించారు  .ఇదే మనుష్య జన్మతో ,30 ఏళ్ల వయసులోనే ,మన దేశ సనాతన హైందవ ధర్మాన్ని సంస్కృతి ని పునరుద్ధరించాడు ! ,దేహం యొక్క ప్రయోజనం  అణువణువునా పరమాత్మ వైభవాన్ని దర్శిస్తూ. ముక్తసంగుడివి కావడమే..!  అన్న ఆనందంతోీ జీవితాన్ని  అనుభవించు !  కానీ   ,ఈ ఆనందం నీలో ఉండి నిన్ను ఆనందింపజేస్తున్న పరమేశ్వరుడే  నీ  సకల భోగ ఐశ్వర్యాలకు మూలకారణం ! అని విచక్షణ , వివేక జ్ఞానంతో  తెలుసుకొంటూ.ఈశ్వర దత్తమైన ఈ శరీరాన్ని  ఉపయోగిస్తూ ఆత్మావలోకనం చేసుకొంటూ ,లోనున్న జీవుడు సంస్కరింపఁ బడేలా దృక్పథాన్ని మార్చుకోవాల్సి వుంటుంది!  మానవత్వం నుండి దైవత్వం స్థితికి ఎదిగిన మహాత్ములు నిరంతర సాధన, కఠోర దీక్షలు, యోగాభ్యాసం చేస్తూ. తాము తమ శరీరాలను క్రమశిక్షణ తో అదుపు లోకి తెచ్చారు. జితేంద్రియులై మనసు బుద్ది  ని దైవం పై నిలిపి ,దేహాన్ని ఒక పనిముట్టుగా ఉపయోగించుకున్నారు.. దీనికి సహకరించిన ఈ దేహాన్ని పవిత్రంగా ,పరమపూజ్యంగా, పరమాత్ముని కైంకర్యానికి యోగ్యం గా  వినియోగిస్తూ, సేవిస్తూ తరించాలి. కూడా !అందుకు కృతజ్ఞతగా ,మన రెండుచేతులూ పైకెత్తి నమస్కరించి , జేజేలు పలుకుతూ , దైవభజన చేస్తూ వేనోళ్ళ స్తుతించుదాం  ! కాళ్లతో వేసే ప్రతి అడుగు  ,,లోనున్న పరమాత్ముని కి  చేసే "ఆత్మ ప్రదక్షిణ "లా భావించుదాం!. చూసే చూపులో ,వినే శబ్దంలో, శ్వాసించే గాలిలో, స్పర్శించే వస్తువులో సర్వాంతర్యామి సామీప్యన్ని,,సన్నిధానాన్ని ,,పరమానందాన్ని పొందుదాం..! పరమేశ్వరుడు తన అవ్యాజమైన ప్రేమతో కనికరించి కరుణించిన ఈ మానవ శరీరాన్ని. దుర్వ్యసన లు ,దురాలోచనలు,దుర్మార్గపు చేష్టలతో పాడుచేయకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ ,సద్గ్రంథాల పఠనం తో ,సత్సంగం  ఆశ్రయిస్తూ.. సద్భావనతో ,దేహాన్ని  ,నడుస్తున్న దేవాలయం వలె మార్చుకుందాం ! " భక్తవత్సలుడు ,పరమ దయాలువు ,సచ్చిదానంద స్వరూపుడు అయిన కాశీ విశ్వేశ్వరుని చరణ కమలాల చెంత ఈ శరీర సహకారంతో ఆత్మశుద్ది చేసుకొంటూ ,భక్తిశ్రద్ధలతో  సాష్టాంగప్రణామాలు    చేయడం వలన ,దానిలో దాగిన  "అరిషడ్వర్గాల ను  ఈశ్వరునికి నైవేద్యంగా "" మనస్సనే హారతి పళ్ళెంలో ",జ్ఞాన "మనే జ్యోతిని వెలిగించి ,హృదయం అనే"" కమలం "లో నెలకొన్న పరందాముని కి భక్తిశ్రద్ధలతో ,వినయ విధేయతలతో ,అనునిత్యం మంగళ  "నీరాజనాలు  " సమర్పించుకుందాం ! జగత్ప్రభూ ,! సర్వేశ్వరా.! దయానిధి..! దీనజనబంధవా ,!ప్రాణేశ్వరా.. ! "కాయేన వాచా.., మనసేంద్రీ యైర్వా, భుధ్యాత్మనావా ,ప్రకృతే స్వభావాత్,, కరోమి యద్యత్ సకలం పరస్మై. నారాయణాయేతి సమర్పయామి.!" అంటూ తనువు మనసును స్వామికి అర్పణ చేద్దాం. !. . హరిః ఓమ్ !   ఓమ్  తత్సత్ ! స్వస్తి ! ""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...