Oct 13
"అయ్యప్పస్వామి అనుగ్రహం, అద్భుతం, అమోఘం !" నమ్ముకున్న దైవంపట్ల తనకు ,ఎంత విశ్వాసమో అంత ఫలితం అందిస్తూ ఉంటాడు!అందుకే మనకు . ఒక మూర్తిపై, ఒక దైవంపై ,గురి ఉండితీరాలి.!. జీవితంలో ఒక ద్యేయం! ,ఒక అలంబనం !ఒక ఆధారం !,ఒక సహకారం ,!సహాయము, సానుభూతి లేనిదే జీవితం సాఫీగా సాగదు. కదా ! పైగా అదే తోడు దైవమే ఐతే ,అతడు మనకు స్నేహితుడై ,సహచరుడై ,బంధువై ,ఆత్మీయుడై, ఆంతర్యామియై నిలిస్తే, ఇక బ్రతుకులో" లేమి "అనేదే లేకుండా పోతుంది..కదా !అయినా స్వామి ఏమడిగాడు నిన్ను. ? ,,,కాస్తంత నీ గుండెలో నిలుచోడానికి తనకి " చోటు "అడిగాడు..! ఆ సర్వాంతర్యామికి ఆ మాత్రం చోటుఎక్కడా దొరకడం లేదనా. ?. కాదు ! నిన్ను ఉద్ధరించి ,నీకు సద్గతిని అనుగ్రహించడానికి.నీకు.. ఒక అవకాశం ఇస్తున్నాడు అంతే ! అయినా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి నీవేం ఇవ్వగలవు..? అన్నీ ,అంతా ,సమస్తము, చివరకు నీవు కూడా అతని వాడివే కదా..! నీకంటూ ఎక్కడా ఏమీ లేదు ! ఏమీ తేలేదు కూడా ! ఏమీ,తీసుకుని పోలేవు కూడా. !. కోట్ల డబ్బులు ,అందమైన బంగాళా ,కార్లు ,బంధువులు ఆస్తి ..ఇదంతా ఆ స్వామిదే.. ! కదా ! అయినపుడు నీకు ఎందుకింత టెంపరితనం ,మిడిసిపాటు..? ఆయనది ఆయనకు ఇవ్వడానికి తప్ప నీవద్ద ఏం మిగిలింది కనుక.....! కానీ ఒక్కటి మాత్రం నీకు మిగిల్చాడు. !అదే ,,నీవు అనుకునే భావన.! అందులో స్వామిని కూడా నిలుపుకుంటే , ప్రతిష్టిస్తే చాలు ! ఆయన పొంగిపోతాడు.! నీవు ,ఏది కోరితే అది ఇచ్చేస్తూ ఉంటాడు!. ఆ ఒక్కటి మాత్రమే నీ దగ్గర ఉంది ! అదే మన స్వామికి కావాల్సింది.కూడా. !అదే నీ ఎదలో మదిలో హృదిలోని స్వచ్ఛమైన ప్రేమ..!నీ భార్యాపిల్లలపై ,బంధుజనం పై , నీవు చూపిస్తున్న కపట ప్రేమ మాత్రం కాదు సుమా.. !దానిని ప్రేమ అనకూడదు..!అది మోహం!తీరని ,తెగని , వ్యామోహం ,!మరో విదంగా చెప్పాలంటే ఒక నాటకం, ! ఎందుకంటే ఇక్కడ పారదర్శకంగా ,మాటలు ,పనులు ఉండవు. , ! దాపరికం లేని సంసారాలు ఉండవు. అంతా స్వార్థం తో కూడుకున్న మోసపూరిత వ్యవహారం ,,!ఒంటరిగా సమాజంలో ,బ్రతకలేక , స్వతంత్రంగా ఉండలేక ,మనుగడ కోసం ,ఒక ఆధారం కోసం తపిస్తూ ,ఒక తోడు, నీడ ,గూడు ,తిండి ,డబ్బు సుఖం ,,వీటికోసం ,సాధిస్తూ , నిరంతర ఆరాటాలు ,పోరాటాలు....ఇవన్నీ కలిస్తే జీవితం అవుతోంది !ఎన్ని అబద్దాలు ,అన్యాయాలు ?,ఎన్ని ఘోరాలు , కళ్ళతో చూస్తున్నాం ?,పేపర్లో చదువుతున్నాం.!". సభ్య సమాజం "అంటే ఇలా ఉంటుందా !",మానవత్వం" అంటూ అసలు ఎక్కడైనా ఉందా ?అన్న అనుమానం నిజాయితీ ,దైవం పై గురి ఉన్న ప్రతివాడికి కలిగి తీరుతుంది..! కల్మషము అవుతోందిి చుట్టూ ఉన్న వాతావరణం కాదు..! పవిత్రమైన , సుకుమారము అయిన హృదయ పద్మాన్ని ,మసకబార్చే కల్మషం ,,నీలో ,నీ ఆలోచనా సరళి లోనే ఉంటోంది..! నీ చేయి దాటి పోతున్న ఆ దుష్ప్రభావం ,కలిగిస్తున్న దృక్పథాన్ని మార్చుకోవాలంటే ,అది నీ తరం కాదు ! నీవు నీవుగా ,స్వయంగా ,దైవానుగ్రహం లేకుండా చేయలేవు.!. అందుకే స్వామి ,,అయ్యప్పస్వామి సాన్నిధ్యంలో ,నీ వేదన లను తెలియజెయ్యి..!పశ్చాత్తాపంతో పాపాలు పరిహారం చేసుకునే మార్గం వెదుకు ! నీ బంగారు భవితను దిద్దుకునే అవకాశం నీ చేతుల్లో చేతల్లో ,ఉంది !నీ సంసార బంధాలను సున్నితంగా ప్రక్కన ఉంచి ,నిష్కల్మషమైన ప్రేమతో మణికంఠ స్వామిని వేడుకో!.. అతడు బ్రహ్మచారి.!. నీవు కూడా బ్రహ్మచర్యాన్ని వ్రతం లా ఆచరించి స్వామిని స్వాములను, గురుస్వాములను ,అనుసరించు ! చాలు ,!ఇక నీవు వెనక్కి తిరిగి చూడకుండా అంట నీ బ్రతుకులోే ఖేదమ్ లేకుండా ,నీ బాధ్యత భారం స్వామి భరిస్తాడు ! నిన్ను, నీ సంసారభారాన్ని ,నీ గతజన్మ పాపాలను క్షాళనం చేసే బాధ్యతని కూడా స్వామి వహిస్తుంటాడు..! ఆహా ! ఒకే ఒక చిన్న కానుక సమర్పణా భావానికి , తన అమూల్యమైన సంపదను , నాకు ఎంత అనుగ్రహిస్తున్నాడో.. చూశావా..? ఆయన చూపుతున్న అపారమైన కారుణ్య హస్తాల అద్వితీయమైన ప్రభావంతో ,నీ జీవన సరళి ,సదా సుఖవంత మై పోయింది కదా !ఆ ఆధ్యాత్మిక సుగంధ పరిమళాల సౌరభాలతో, నిన్నే కాదు ,నీ కుటుంబాన్ని , నీ స్నేహితులు ,బంధువుల పరివారములు కూడా , స్వామి కరుణా కటాక్ష వీక్షణాల కృపచే సంరక్షింప బడుతున్నాయి కదా.. !మరి ,, ఇంతకన్నా ఆనందం మరొకటి ఉంటుందా....? అందుకే అందరితో కలిసి కట్టుగా సామూహిక ప్రయోజనం కోసం ఉందాం. !ఉంటూ మనసారా స్వామిని ప్రేమిద్దాం !,ప్రేమిస్తూ , స్వామిని మన కుటుంబంలో ఒక సభ్యునిగా భావిద్దాం.! భావిస్తూ... అతడు మన ఇంట్లోనే , మన ప్రక్కనే, మన మధ్య నే ,ఉంటూ, తింటూ ,తిరుగుతూ , మనం చేసే పనులను సమీక్షిస్తూ. మనవిజయం ఆనందం ,సంతృప్తి ల కోసం స్వామి పడే ప్రయాస కు ,కృతజ్ఞతగా అనునిత్యం ధన్యవాదాలు చెబుతూ హృదయపూర్వక ప్రణామాలు సమర్పించుకుందాం..! స్వామి ,దివ్యమైన ,అద్భుతమైన ,ఆనందకరమైన అందాల బాలుడు ,,అయిన మణికంఠుని మంగళ కరమైన విగ్రహస్వరూపవైభవాన్ని ,హృదయంలో నిష్ఠగా ,,నిశ్చలంగా ,నిలుపుకుందాం.!. ఆయనకు ఇష్టమైన ,బహు ప్రీతికరమైన ,స్వచ్చమైన, ,అవ్యాజమైన ,ప్రేమను సమర్పించు కుందాం , !,శరణుఘోషతో " శరణు !స్వామీ, శరణు ,!అయ్యప్పస్వామి ,శరణు! "" అంటూ శరణాగతి చేద్దాం....!.. స్వస్తి ! స్వామియే శరణం ! సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు.! హరిః ఓమ్ తత్సత్ !
Saturday, October 13, 2018
అయ్యప్పస్వామి
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment