Friday, October 12, 2018

దైవభక్తి

Oct 12

దైవభక్తి రెండు రకాలు ,! ఒకటి.!.దినచర్యలో భాగంగా ఉదయం సాయంత్రం దైవారాధన కు కొంత సమయాన్ని కేటాయించి ,మిగతా సమయాన్ని సంసారం విషయాల్లో వినియోగించడం ..!.రెండు!.. నిరంతరం నిత్యకృత్యాలలో దైవాన్ని దర్శిస్తూఉండడం,!అంటే భోజనము చేస్తూ స్వామికి నివేదిస్తూ, లోనున్న అంతర్యామికి తినిపిస్తున్నట్టుగా  ,,కొత్తబట్టలు ధరిస్తే ,వీనిలో "నా  స్వామి ఎంత అందంగా ఉంటాడో కదా !" అని,మురిసిపోతుండడం ,! ఇలా పీలుస్తూ విడుస్తున్న శ్వాసలో   దైవ నామాన్ని  మంత్రం లా భావిస్తూ ధ్యానిస్తూ. ,శ్వాసక్రియా యోగాభ్యాసం ద్వారా దైవారాదనకు ప్రాణవాయువు ను సంధించి ఉపయోగించే గాలిని  పంచభూతాలలో ఒకటైన వాయువును ,ఒక ప్రాణశక్తిలా భావించవచ్చును! .త్రాగినా, తిరిగినా ,"దైవం తనకు నీడలా వెన్నంటి ఉంటాడన్న  '"పవిత్ర భావన తో జీవితంలో నిత్యం తృప్తిగా గడపడం ....! ఇదంతా లోనున్న దైవం ,మండుతున్న జ్ఞాన జ్యోతిలా ,పంచభూతాలలో రెండవది అయిన అగ్ని తేజంలా,భగవద్ ఆరాధనా ప్రభావం తో ,పండిన ఆత్మజ్ఞానం తో భక్తుడు ప్రకాశిస్తూ  ఉంటాడు  ! . ఇక భగవత్ కథా శ్రవణం లేదా కీర్తనలు స్తోత్రాలు గానం  చేస్తుండగా  ,పరవశత్వం చెంది ,వింటూ వింటూ కళ్లనుండి ఆనందాశ్రువులు రాలిస్తే  ,అవి జల రూపంలో ,గత జన్మ కర్మలను  పవిత్రమైన నిర్మలమైన ,దివ్యమైన నీటితోక్షాళనం చేస్తున్న శక్తి స్వరూపంగా భావించ వచ్చును , !ఇది పరిపూర్ణమైన భక్తితత్పరతకు పరాకాష్ట ,,! ప్రేమతో ,భక్తిపూర్వకంగా గుండె నిండా భగవద్ స్వరూపాన్ని నిలుపుకొంటూ ,తన్మయ స్థితిలో రెండు ఆనంద భాష్పాలు రాలిస్తే చాలు ,భగవన్తుడు ఆనందంగా స్వీకరిస్తాడు... దీనికి ఏడూ సముద్రాల నీరును కూడా  విలువ కట్టలేము కదా !  ఇట్టి స్థితి పొందడం  కేవలం దైవానుగ్రహం !  ఇది నీరుగా భావించే మూడవ పంచభూతం ! నాలుగవది మట్టి ,అనగా పృథ్వి ! ఇది మనం విశ్వసించి ,కొలిచే గురువుల చరణ ధూళి..! దీని మహిమ ఆమోఘము౧ ,అద్భుతం !,మహనీయులు ,మహానుభావులు ,మహాత్ములు ,అందరూ గురువుల ను ఆశ్రయించి ,సేవించి ,తమజీవిత పరమార్ధాన్ని సాధించారు..  ! "గురుర్  బ్రహ్మ గురుర్ విష్ణు..  !"అనే శ్లోకంలో భావం , గురువు పాద సన్నిధిలో శిష్యుడు తన అస్తిత్వాన్ని ,సర్వమ్ సమర్పిస్తూ ,శరణాగతి భావంతోమెదలడమే ! నిజమైన గురుపూజ ,గురుభావన , శిష్యుని జీవనగతిని , ఆధ్యాత్మిక దిశవైపు మరలిస్తూ , అతనికి ఉన్నత దశను  ,,భవితను అనుగ్రహిస్తాడు ఉత్తమగురువు. .!  ఇక ఐదవది    చివరిది అయిన ,'ఆకాశం  !'అని పిలువబడే అనంతమైన విశ్వం  .!అక్కడ అంతా శూన్యమే.!.ఏ పదార్థము కనపడదు..,! చూసేది పరమాత్మ యొక్క అసలు సిసలైన నిర్గుణ నిరాకర  పరబ్రహ్మ స్వరూపం .!.సత్యం ,జ్ఞానం, అనంతం, బ్రహ్మ..!అనగా పరమాత్మ సచ్చిదానంద  స్వరూప వైభవం ! ఇహలోకాన్ని చూపించిన నాలుగు పంచభూతాల కంటే అతీతమైనది అద్వితీయమైనది ,ఈ ఆకాశం...! ఇందులోని ఆనంతకోటి  బ్రహ్మాన్దాలను తన కుక్షియందు దాచుకున్న పరందాముని బ్రహ్మానంద స్వరూపదివ్య స్థితి ,! ఆ విధంగా భగవద్ ఆరాధనా బలం ఒక్కటే కర్మలను తొలగించే సాధనా మార్గం అవుతోంది ..!నిజానికి జీవితంలో కలిగే దుఖఃము లకు పరమాత్మ కారణమని భావిస్తూ కొందరు దైవాన్ని దూషిస్తూ ,ఆరాధనా, సేవ పూజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు..!  కష్టాలు కలిగేవి తన పూర్వజన్మ ఫలం వలననే గానీ  అది ,,దేవుడు కక్షతో ఇచ్చే శిక్ష కాదు  ! సుఖాన్ని ఎంత సంతోషన్గా  స్వీకరిస్తూ అనందిస్తూ ఉంటావో ,అలాగే కష్టాలను కూడా గతంలో చేసిన ఆపరాధాలకు ఫలితంగా అంగీకరిస్తూ ,కష్టాలను స్వాగతించాలి.!. శని ప్రభావం, రాహు కేతు దోషాలనుండి గ్రహ దోష పూజలను చేస్తూ తప్పించుకోవచ్చు నేమో గానీ ,కర్మఫలాల ను ఎవరూ తప్పించుకోలేరు.!. ఎంతటివారైనా చేసిన కర్మలు  అనుభవించక తప్పదు.!.ఒక్క దైవం తప్ప కర్మానుభవాన్ని తగ్గించగల శక్తి మరే విధంగా కూడా వీలు కాదు!..అందుకోసం నిష్కల్మషమైన ప్రేమతో ఇష్టదైవాన్ని పూజిస్తూ ,జీవితంలో ఆనందాల వెలుగులను నింపుకుందాం..! సర్వమ్ శ్రీ పరమేశ్వర చారణారవిందార్పణ మస్తు ! స్వస్తి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...