Sunday, October 7, 2018

గమ్యం

Oct 7, 2018

మనం ట్రైన్ లో కాశీయాత్ర కు వెళ్లే సమయంలో ఆ కంపార్ట్మెంట్ లో కొందరు అపరిచితులు కనబడతారు.మాట్లాడుతూ, మాట్లాడుతూ వారి స్టేషన్ రాగానే దిగిపోతారు.!అలాగే  చివరకు మన మజిలీ రాగానే  టికెట్అంతవరకే కాశీ  అంటే వారణాసి వరకే కనుక  మనం కూడా దిగిపోవాల్సిందే .కదా !.ఇలా నిత్యజీవితంలో కూడా పుట్టగానే తల్లి ,తండ్రి, తోబుట్టువులు ,తాత అమ్మమ్మ బంధువులు క్రమంలో  ఎదుగుతూన్న దశలో పరిచయం అవుతుండగానే ,మరికొందరు పెద్దవాళ్ళు వయసుతీరి  జీవితరంగం నుండి నిష్క్రమించడం కూడా చూస్తున్నాం! ..కొన్నాళ్ళయింతర్వాత మన వంతు కూడా వస్తుంది..!తెలుస్తూ ఉంటుంది, మన టికెట్ అయిపోయే ,మనం ఆగిపోయే చోటు వస్తోందని గ్రహిస్తూ ఉంటాము..! అందుకోసం స్టేషన్ రాకముందే మన సామాన్లు ,లగేజీ సర్దుకొని రెడీ గా పెట్టుకుంటాం కూడా.!. స్కూల్ లో విద్యార్థులకు  నెల రోజులకు సరిపడే  హోంవర్క్  ఉపాధ్యాయులు సెలవులముందు  ఇస్తారు.. కొందరు తెలివిగల విద్యార్థులు ముందే పూర్తి చేస్తారు.తర్వాత వారు ఆనందంగా  సెలవుల ను గడుపుతారు. !ఇక సోమరులు  , (అంటే కాలం విలువను ,జీవిత పరమార్ధాన్ని, , నిర్లక్ష్యం చేయడం వలన పొందబోయే అనర్థాన్ని అవగాహన లేక. ,అర్థం చేసుకోవడానికి   శ్రద్ధ అసక్తులను ,చూపకుండా ,దైవభక్తిపై విశ్వాసం  ఇసుమంతైనా ఉంచకుండా  సమ యాన్ని వ్యర్థం చేసుకున్న వారు  ,.). ,రేపు స్కూల్ తెరుస్తారు అనగా గాబరాబడుతూ అదరబాధరా గా ముగించి ,తప్పులు ఉన్నాయన్న భయంతో వెనక బెంచీలో కూర్చుంటారు.. శిక్షకు ఎదిరిచూస్తూ. !.. కానీ   ఉత్తమ విద్యార్థి  అంటే  ,   ముందుచూపు గలవాడు ,కాలం విలువ తెలిసినవాడు  ,పరీక్షిత్తు మహారాజు లాంటి మహానుభావుడు ,తనకున్న  ఏడు రోజుల గడువును ,భగవాన్ శుకమహర్షి బోధనతో , అద్భుతంగా శ్రవణం చేసి , హృదయం లో ను ,సమస్త, జీవరాసుల యందు పరమాత్మ వైభవాన్ని దర్శిస్తూ ,చావంటే భయపడకుండా  సంతోషంగా చిరునవ్వుతో తక్షక సర్పము యొక్క శాపగ్రస్తమైన కాటును మహదానందంగా స్వీకరించాడు . !*.ఆలా మనం దిగిపోయే స్టేషన్ చేరిలోపు  ,ఆధ్యాత్మిక సౌరభాలు మదిలో నింపుకొని  ,మృత్యువంటే భయం ,లేని సమున్నత స్థాయికి ఎదగాలి .!..ఇక్కడ ఒక సమస్య ఎదురౌతోంది.మనకు ! .మృత్యువు ఎప్పుడు వస్తుంది. ?  మనం దిగిపోయే స్టేషన్ వస్తోందని ఎలా గ్రహించాలి, రెడీగా ఉండడానికి..? ఈ అమాయకమైన ప్రశ్నకు మనలోనే జవాబు కూడా ఉంది.. !నల్లరంగు వేసుకున్నంత మాత్రాన నీ వెండ్రుకలు సూచించే వయసు మీరినతనం దాగుతుందా.? పళ్ళుకట్టించుకున్నంత మాత్రాన తగ్గిన దవడల దారుడ్యం  నీ లో తొంగి చూస్తున్న పెద్దరికాన్ని గుర్తు చేయడం లేదా.? చెవిలో వినికిడి యంత్రాన్ని పెట్టుకుంటే మాత్రం, వయసు పైబడి  నీకు చెవిటితనం వచ్చిందని తెలియనంత అమాయకుడివా నీవు ? కళ్ళకు అద్దాలు మారుస్తూ. మారుస్తూ , కంటి పాపకి అద్దం తగిలించుకుని ,పడుచువానిలా నటిస్తూ బింకం చూపిస్తూ ఉంటే మాత్రం, ముసలితనంతో చూపు మందగిస్తోంది అనడానికి ముందస్తు చిహ్నమే అని తెలియనంత పిల్లాడివా నీవు ! కదా. !".ఇక నడుం పట్టేయడం ,మోకాళ్ల నొప్పితో కర్రలేకుండా అడుగు వయలేకుండా పోవడం ఇదంతా  .మనం దిగిపోయే స్టేషన్ సమీపిస్తోంది.అంటూ రైలు వచ్చేముందు హెచ్చరికగా స్టేషన్లో కొట్టే గంటలుగా  అర్థం చేసుకోవడం  నీకు అంత కష్టమైన పని కాదు..కూడా ! కానీ  ,అలా ఎవరో దిగిపోవడం నీకు  బావుంటుంది .కానీ నీవరకు వచ్చేసరికి అది నీకు ఇష్టం లేని పని కనుక బలవంతంగా నైనా స్టేషన్లో నిర్దాక్షిన్యంగా మెడలు పట్టి డబ్బాలోంచి లాగేస్తారు కనుక  , "కుయ్యో !మొర్రో మంటూ నేను అప్పుడే  దిగను   ! please  నన్ను  దయచేసి వదిలిపెట్టండి !" అంటూ దీనంగా  చుట్టూ చూస్తూ .ఈ అపద నుండి కాపాడే వారు లేరా అంటూ భోరున ఏడుస్తావు !..అయినా తప్పదు  !పుట్టినప్రతి ప్రాణికి గిట్టక తప్పదు .కదా ! అలా అని .గీతాచార్యుడు శ్రీకృష్ణభగవాను డు  భగవద్గీత యందు .బోధించినట్టుగా   " అందుకే ""జాతస్య మరణం ధృవం !"అన్నది ప్రసిద్ధ గీతావాక్యం  !కావున , వృద్ధుడవు కాక మునుపే జ్ఞాన వృద్ధుడవు కావాల్సి ఉంటుంది  నీవు !  అందుకే దీపం ఉన్నపుడే అంటే వయసు పైబడక ముందే, ఇల్లు అంటే జీవాత్మను  చక్కబెట్టుకోవాలి ,అనగా దేవుడు మనిషికి ఇచ్చిన వివేకం ,విజ్ఞానం అనే కాంతి వెలుగుల్లో ,పరమాత్మగురించిన ధ్యాసతో, భక్తిమార్గంలో దృష్టిని సారించాలి !,  అందుకు నీలో ఉన్న ఆత్మశక్తికి తోడుగా దైవబలం అండగా నిలిస్తే కానీ గమ్యం చేరుకోలేవు ! కనుక మార్గం సుగమం కావడానికి ఈశ్వరునికి నీ అసమర్థతను తెలియజేస్తూ ,నిన్ను ఉద్ధరించే సమస్త భారం ,అతనికే అప్పగిస్తూ ,"".నీవే తప్ప ఇతః పరంబెరుగ,, మన్నింపన్ దగన్  ,దీనునిన్,! రావే ఈశ్వరా ! కావవే వరదా ! సంరక్షింపు భద్రాత్మకా !"" అంటూ అలనాడు గజేంద్రుడు చేసిన అక్రందన లను తలపించేలా  "శరణు! శరణు !శరణు ! ""అనడమే మన  జీవితాలను ఉద్ధరించడానికి  మనముందు ఉన్న ఒకే ఒక దారి,!అదే .ఉత్తమ శరణాగతి.! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ ! అనే మహా మంత్ర వైభవ మహిమయే మనకు దిక్కు దిశ దశ లను సూచించే అత్యద్భుత  పరమపద సోపానము..! సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! ఓమ్ శాంతి శాంతి శాంతిః !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...