Sunday, October 7, 2018

భక్తి

"భక్తి  !"అంటే కోరికలు లేకుండా దైవాన్ని సేవించుకోడం ,ఒక పద్ధతి,అయితే ,రెండవది  "దైవంపై మమకారం" తో   ఒక సంబంధం పెట్టుకోడం. !నామదేవుడు , సూరదాసు ,నర్సీ మెహతా,మీరాబాయి లాంటి భక్తులకు దైవాన్ని పిలిస్తే వచ్చి వారి పూజలను స్వీకరించేంత అవినాభావ సంబంధం ఉండేదట ! , అనగా దేవుణ్ణి వాళ్ళు ప్రత్యక్షంగాను అంతంరంగంలోను రమిస్తూ , ఎప్పుడూ దర్శిస్తూ తరించేవారు.! సూరదాసు జన్మతఃఅంధుడైనా కూడా తన  అంతరంగంలో బాలకృష్ణుని అందమైన ఆనందకరమైన దివ్య మంగళకర ఘన శ్యామా కృత స్వరూపాన్ని భావిస్తూ, ఆరాధిస్తూ, భక్తిపారవశ్యంతో కృష్ణకీర్తనలు పాడుతూ ఉంటే, నిజంగానే అతని ముందు చిన్నికృష్ణుని జగన్మోహన రూపంలో ,కూర్చుని తన్మయుడై వింటూ ఉండేవాడట  భక్తపరాదీనుడైన శ్రీకృష్ణుడు! అలాగే ఒకరోజు , నామదేవున్ని లోనికి రాకుండా  ఆలయఅధికారులు నిబంధనలు   చేస్తే ,పాండురంగడు ఆయన భక్తికి, తనను చూడాలన్న ఆర్తితో ,ఆవేదనతో, ఆశువుగా  పాడుతూన్న  అద్భుత అపూర్వ  అభంగాల గానానికి పరవశుడై ఆలయం బయటికి వచ్చి నామదేవున్ని  కరుణించాడట !. ఇక నర్సీ మెహతా కీర్తనలను వినడానికి శ్రీకృష్ణుడు స్వయంగా 26 సార్లు వచ్చాడట.!  ఆ విధంగా మన త్యాగయ్య, పోతన ,రామదాసు, అన్నమయ్య, పురందరదాసు లు మన దక్షిణ భారత దేశంలో తమ దివ్యమైన కీర్తనలతో తమ ఇష్ట దైవాన్ని  ప్రత్యక్షంగా దర్శించి ,పులకరించి ,పరవశించి ,ధన్యులయ్యారు. అయితే వారి భక్తి గీతాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి , భక్తితరంగలాల లో ఒలలాడుతూ పరమాత్మ వైభవాన్ని  ఖండాతరాలకు వ్యాపింపజేశారు. వారు లేకున్నా వారి స్మృతులను , స్వరగతులు వారికి  అమరత్వాన్ని  అనుగ్రహించాయి.అందుకే వారు పరమాత్మ అంతరంగ విహంగాలయ్యారు !  , అలాంటిదే , కృష్ణునితో మీరాబాయి పెట్టుకున్న అనుబంధం  నిష్కామభక్తి !ఈ రాగబంధం  లో అచంచలమైన ప్రేమ  దైవంపై సంపూర్ణమైన విశ్వాసం ,తప్ప మరే ఇతర సంబంధం లేదు ! ,"శ్యామసుందరుడు తన వాడు ! ,కాన్హా  ,తనను ఎన్నడూ ఒంటరిగావిడిచి వెళ్లడు..!""అనే ఆధ్యాత్మిక అలౌకిక, అద్భుత, మానవాతీత మైన , అపారభావసంపదను స్వంతం చేసుకున్న మహనీయురాలు మీరా.!  కృష్ణుడు అనే ప్రియుని ఎడబాటు క్షణమైనా  సహించలేని నిరుపమానమైన నిష్కలంకమైన భక్తి ఆమెది.! అలా కృష్ణయ్య తో పెట్టుకున్న సంబంధాన్ని  ఎన్ని ఇబ్బందులు వచ్చినా , తెగిపోకుండా ,విడిపోకుండా, కృష్ణునిపై గల అవ్యాజమైన ,అనురాగాన్ని అనురక్తిని  మరింతగా రెట్టింపు చేసుకొంటూ.తానే కృష్ణుడై ,కృష్ణయ్య నే తానై , పరమాత్ముని పరమపథంలో ఐక్యం అయ్యింది !.."భక్తి అంటే ప్రేమ  !" ప్రేమ అంటే అంకితబుద్దితో తన సర్వస్వాన్ని ప్రియునికి సమర్పించుకునే ప్రియతమ తత్వం  !,,హృదయంలో నిక్షిప్తం చేసుకున్న గోపాలకృష్ణ భగవానుని సచ్చిదానంద ఘన శ్యాముని దివ్యమంగళ వైభవ స్వరూపం !"అని నిరూపించింది. భక్త మీరా! శ్యామసుందరునికి చేసే పూజలు కీర్తనలు ,సేవలకు కొంత అవది ఉంటుందేమో కానీ అనంతమైన,రాధామాధవ ప్రేమకు పరిమితి , ఉండదు కదా  !,ఎన్నిజన్మలు సేవించినా సరిపోని పరమ ఉత్తమమైన   అద్వితీయమైన శక్తిసంబంధం ఈ భక్తి  !..ఏది చేసినా ,ఏమి చూసినా ,ఎక్కడ ఉన్నా, ఎంత బాధ కలిగినా.   "సర్వమ్ శ్రీహరి మయం ! భక్త ప్రహ్లాదుని వలె శ్రీహరి పట్ల ఏర్పడిన భక్తి అనే దృఢమైన కవచం , మన పాలిట శ్రీరామరక్షగా భావిస్తూ ,జీవితాన్ని "శ్రీకృష్ణ పరందాముని చరణకమలాల" వద్ద అంకితం చేసుకోడంఅనే భావం  ,,మానవజన్మకు సాఫల్యాన్ని  ఇస్తోంది కదా!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...