9/21- గయా
మహిళలు శక్తికి భుక్తికి యుక్తికి ముక్తికి కారకులు.. యత్ర నార్యస్టు పూజ్యంతే తత్ర దేవీ పరమేశ్వరా..
అనునిత్యం గంగాయమున సరస్వతీ త్రివేణీ నదుల పవిత్ర సంగమ జలాల్లో స్నాన ఫలితమస్తు. అని అనుకుంటూ చేసే స్నానం ఈ విధంగా ఫలించింది. చక్కగా తీరాన ఉన్న మెత్తని పిండిలాంటి నల్లని మట్టితో మూడుసార్లు పార్టీవశివలింగాలు చేసే భాగ్యం, పితృదేవతలకు తర్పణాలు ,విడుచే అదృష్టం పరమేశ్వరుని దయ వలన ప్రాప్తించినందుకు ఈశ్వరునికి శతకోటి ప్రణామాలు.. మహాదేవ మహాదేవా... మహానుభావా.. శరణు శరణు. శరణు..
సూర్యకుం డం లో గయా క్షేత్రంలో అపర్ణాహ స్నానం, అనుకోని భాగ్యం.. సకల పాప హరమ్, జ్ఞాన సిద్ధిదం..
గయలో. సూర్యకుండమ్ ,వైతరిని కుండం, రుక్మిణీ కుండం, బ్రహ్మకపాలకుణ్డ, రామ్ కుండ్, సీతా కుండ్,ఇలా పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. రేపట్నుంచి ఇక్కడ కుంభమేళా ఉత్సవాలు 15రోజులుగా గొప్పగా సాగుతాయి..దానికి ఏర్పాట్లు ప్రభుత్వం చక్కగా చేస్తోంది.
గయక్షేత్రంలో పిండ ప్రదానం, కొడుకుగా పుట్టినందుకు తండ్రికి, తాత ముత్తాతలకు తల్లికి అమ్మమ్మ ,ల వైపున రెండు వంశాల వైపులా గతించిన సమస్త పితృదేవతల కు ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతా పూర్వకంగా పిండాల రూపంలో ప్రతిష్టించి శర్మగారు వివరంగా చేయించాడు..మూడు పాళ్లలో ఉన్న పిండాలను .ఒక పాలు గోమాతకి, పెట్టించాడు. ఒక బ్రాహ్మణుడితో ,పితృదేవతలు అందరూ తృప్తిపడినట్టుగా, దీవించినట్టుగా అనిపించాడు., తులసిమాల, రాగిచెంబు, గీత పుస్తకం, వగైరాలు మాతో దానం ఇప్పించాడు..రెండవది పెద్ద పెద్ద ఊడలతో విస్తారంగా వ్యాపించిన సనాతన మర్రివృక్షం మొదలులో పెట్టించాడు. ప్రదక్షణ చేయిస్తూ విష్ణుపాద మహిమ చెప్పి.వటవృక్షానికి ప్రదక్షణ చేయించి ,విష్ణు పాద ప్రతిమ ,ఇప్పించి పూజా మందిరంలో పెట్టి పూజించాలని చెప్పి దీవెనలు ఇచ్చాడు. ఇక మూడవ పాలు విస్తరి లోని పిండాలను సాక్షాత్తువిష్ణు భగవానుని కుడి పాదం ,ఒక గజం పొడవు ఉన్న రాతి ప్రతిమ పై పెట్టించాడు. ఇది విష్ణుభగవాను ని విగ్రహానికి ఎదురుగా వర్తులా కారంలో ఉన్న రాతి కట్టడం మధ్య 8అడుగుల పరిధిలో ,స్వామికి 3గజాల దూరంలో సాక్షాత్తూ జగద్గురువు శంకరాచార్యులు గారిచే స్థాపించబడి ఉంది..అనగా పితృదేవతలు నేరుగా విష్ణులోకానికి వెళ్లినట్టిగా భావించవచ్చును.. దీనితో పిండ ప్రదాన కార్యక్రమం సుసంపన్నం అవుతుంది....నిజానికి ఏ క్షేత్ర దర్శనానికి వెళ్లినా ముందు దాని చరిత్ర,మహత్తు,తెలియాలి.అప్పుడే యాత్రలో ఆనందాన్ని, తృప్తినీ, ఫలితాన్నీ సంపూర్ణంగా పొందుతాము .
No comments:
Post a Comment