Monday, October 1, 2018

కాశీ క్షేత్రం

Sept 23
కాశీ క్షేత్రం, స్మశానవాసం, ఆనందనిలయం..!" అంటూ సంకల్పం చెబుతారు ఇక్కడ.  !అంటే శివుడు నివాసం ఉన్నస్థలంలో శివమ్ సత్యం సుందరం, అనగా భక్తి జ్ఞాన వైరాగ్యాలకు నిలయాలు. ఇక్కడ ఉన్న స్థలాలు..!చూడగలిగిన కళ్ళకు అడుగడుగునా శివలింగాలు దర్శించవచ్చును . ! లయకర్త శివయ్య అంటే, జీవాత్మ పరమాత్మతో యోగించే అనుసంధానమే నిజమైన ఆనందం.!.స్మశానం లో అనగా మనికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లలో నిత్యం దర్శించే కాటి వెలుగులు, ఫటిల్ ఫటిల్ మని పేలుతున్న చప్పుళ్ళు నిరంతర అఖండ శివజ్యోతుల వలే బరబరా మండే మంటల్లో ,కాలుతున్న శవాల సందడితో, ఆ హృదయవిదారక భయానక భయంకర దృశ్యాల మధ్య, కొన్ని నిముషాలు నిలిచి చూస్తే చాలు ,అనుభవించే  జీవుని యాతన,వేదనల మధ్య , వైరాగ్యం పుడుతుంది.! బ్రతుకంటే ఇంతేనా.?. ఎక్కడి చుట్టాలు, బంధువులు, ఐశ్వర్యాలు.?. అని దుఃఖించే మనసే వైరాగ్యానికి నాంది అవుతుంది.!. ఇక అనునిత్యం వైభవోపేతంగా రమణీయంగా, మనోరంజకంగా  కన్నులపండువుగాజరిగే  గంగా హారతి వైభవాన్ని వర్ణించతరమా !.చూడటానికి  ఈ మాంసనేత్రాలకు తనివి తీరదు. ఆర్తి చాలదు.కదా!.. ఇక్కడే జ్ఞానానికి అంకురార్పణ జరిగేది,! గంగమ్మ తల్లికి ప్రతిరోజూ సాయంత్రం 6pm కు జరిగే షోడశోపచారాలతో చక్కని  భక్తిపారవశ్యంతో  శ్రావ్యమైన సంగీత వాయిద్యాల మధ్య, అలపించే గానంతో  నిర్వహించే పూజల సమర్పణ విధానాన్ని ,ప్రశాంతంగా, నింగిన మెరిసే తారలు ,చందమామ కాంతుల్లో, గంగా తీరంలో మూడు నాలుగువేలకు తక్కువ కాకుండా ఆనందంగా తిలకించేందుకు వచ్చిన  భక్తజనసందోహమ్ నడుమ ,7గురు పట్టుపీతాంబరదారులు యువకులు కలిసి సామూహికంగా అభినయ యుక్తంగా, సంగీతానికి అనుగుణంగా చేసే విన్యాసాన్ని  ఎన్నిసార్లు, ఎన్ని రోజులు చూసినా తనివితీరదు కదా.!  భక్తి అంటే ఇది.!. మనస్సును కదిలించే దివ్యమైన మంగలకరమైన దృశ్యం తో ఒక గంట సేపు లయం చేస్తూ తాదాత్మ్యం పొందడమే దైవభక్తి. !ఇలా మనలో దైవారాధన భావము పెంచుకోవడం కన్నా మహాభాగ్యం జీవితంలో ఇంకా  ఏముంటుంది  కనుక..! ఈ దృశ్యాలు మనకు భక్తిని నేర్పుతాయి. తర్వాత కాశీవిశ్వనాథుని గర్భగుడీలో స్వామికి జరిపే సప్తఋషి పూజలు జ్ఞానాన్ని ప్రసాధిస్తాయి.! అనునిత్యం ఏడుగురు బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా 7pm నుండి నిర్వహిస్తుంటారు.. నగరవాసులు అంతా వచ్చి కీర్తనలు పాడుతూ సంతోషంగా పాల్గొనడంతో వేలమంది భక్తుల సందడితో ఆలయం క్రిక్కిరిసి పోతుంది..! గంటలు, తప్పేటలు, ఢమరుకం, తాళాలు,ఇలా విశ్వనాథుని ఆలయం కోలాహల ధ్వనులతో హోరెత్తి కైలాసనాథుని కొలువులో జరిగే , ప్రత్యక్ష తాండవ నృత్యాన్ని తలపిస్తుంది. ఎలుగెత్తి స్తోత్రం చేసే భక్తియుత భక్తజన గానాలు వినడానికి ఈ  చెవులు,చాలవు . ఇక విశ్వేశ్వరుని కి జరిపే పూజ ,అర్చన అభిషేక,,నివేదన, మంగలహారతి వెలుగుళ్ళకోటి కాంతుల్లో గౌరీశంకరులపూజ  తిలకించడానికి ఈ కళ్ళు chalavu. నయన మనోహరము.. సుందరము,  ఈ కమనీయ రమనీయ దృశ్యాలు .ఇది మన పూర్వజన్మ కృతసుకృత వైభవ ఫలము.. !ఇది మనిషికి కావాల్సిన విజ్ఞానాన్ని అందిస్తుంది ,సూచిస్తుంది కూడా..! ఇలాంటి అనుభవైకావేద్యము ఆనందభరితము అద్వితీయము. ముక్తిదాయకము, అయిన కాశీ క్షేత్రం.. దర్శించి తరింపజేసిన భాగ్యాన్ని అనుగ్రహించిన మహాదేవునికి శతకోటి సాష్టాంగ ప్రణామాలు..! మహాదేవ మహాదేవా  కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఉంటున్నా..2nd అక్టోబర్ వరకూ.... గంగా మాతాకి జై. భవానీ అన్నపూర్ణ, మాతా కాశీ విశాలాక్షి కీ జై.. ఏదైనా ఏమైనా  వారం రోజులు  పరమాత్ముని తోగాని, పరాయివారితో గాని ,సోపతి  చేస్తేనే  తెలుస్తుంది ఆంతర్యం ,అంతరంగం ,అనుబంధం.
దేవదేవా ! ఇలాంటి నీ దివ్య వైభవాలను ఇంకా ఇంకా కరుణించు.! తండ్రి ! దయమయా..! భవానీ శంకరా. !శరణు !శరణు! శరణు!" 

Sept 24
కాశీ క్షేత్రం అందరిదీ.. విశ్వనాథుడు అందరివాడే .!' "కరివేన ధర్మ సత్రం వారి పుణ్యమా  !"అని సాయంత్రం ఉపహారం, మధ్యాహ్నం  కమ్మని ఉచిత భోజనం. !ఇలాంటి వ్యవస్థ దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ఉద్యమం వెనక గల అమృతహృదయులు , సద్బ్రహ్మణ సంప్రదాయ సంస్కార శీలురు , తోటివారి పట్ల అభిమానులు.  అలాంటి ఎందరో మహానుభావులు,  అందరికీ వందనాలు !" కాశీ విశ్వేశ్వరా.  ! నీవు  ఉన్నా వయ్యా..! క్షేత్రాలలో జరిగే కొన్ని అవకతవకలు, అధిక్షేపణలు ఎన్నిఉన్నా నిన్ను నమ్మి కొలిచే భక్తజనాల విశ్వాసాన్ని గోరంత కూడా అది వమ్ము చేయదు..! సరికదా , రెట్టింపు భక్తిప్రపత్తులను పెంచుతాయి . పైగా  నీ ఈ పరీక్షలో నిలిచినవారే నిర్మల యోగులు, !ధన్యజీవులు..  !అయినా పరమేశ్వరా.!. ఇదీ ,అదీ అన్నియు నీ లీలలే.. కదా ! సమస్యలు లేని వ్యవస్థ. మనుష్యులు ఉంటారా..? అది కష్టమనిపించడం మా ఖర్మ.. !ఇష్టమనిపించడం నీ దయ.. ! ఈ . ఇష్టాలు కష్టాలు కేవలం మనసుకే,  కానీ లోన ఉండి ,మమ్మల్ని బ్రతికిస్తూ, మాలోని చైతన్యానికి శక్తికి  బలమిచ్చి పోషిస్తున్న అంతర్యామికి కాదు.! ఈ సత్యాన్ని , అను నిత్యం పరమాత్మ తత్వాన్ని అవగాహనతో ,సాధన చేసే ప్రక్రియ చేపట్టడం లేదు అని అర్థం.! అంటే ఇంద్రియాల నియంత్రణ సరిగా లేదని అర్థం !,అనగా  కేవలం అది మనిషిలోని బలహీనతను ,అజ్ఞానాన్ని ,అవివేకాన్ని  సూచిస్తుంది. అంతే !.!.చూడు ఒకసారి నీ  ప్రక్కన !  మతాభిమానంతో, ఇలాంటి బలహీనులను దెబ్బతీయాలని పొంచి చూస్తున్న శక్తుల ప్రభావాన్ని  !  వారిలో ఉన్న సంఘటితభావాన్ని.. చూడాలి. మంచిని ఎక్కడ ఉన్నా చూస్తూ  ,పోటీ పడుతూ నేర్చుకోవాలి కూడా..దానికి లొంగకుండా  నీ జాతిధర్మం,  సనాతన సంస్కృతి సంస్కార ,పై గల అభిమానం, దృఢమైన నమ్మకాన్ని  చక్కని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ. సత్సంగం సహాయంతో పెంచుకోవాలి ! దేవుడిచ్చిన అద్భుతమైన, అపురూపమైన, అందమైన మనుష్యజన్మ ను  విజ్ఞానాన్ని. సార్ధకం చేసుకోవాలి ! అలసత్వం కలుగకుండా   అనుక్షణం జాగ్రత్త పడుతూ  ఉండాలి  ! అప్రమత్తంగా ఉండాలి కూడా ! మనలో అంతరంగంలో నిద్రాణం గా ఉన్న అంతరాత్మ అసలు స్వరూపాన్ని, అది అందించే పరమార్ధాన్ని ,గ్రహిస్తూ , ఓపికతో భగవద్గీత లాంటి సద్గ్రంథాల అధ్యయనంతో మన పై మనకు  ఆత్మవిశ్వాసాన్ని  నిలపాలి.! గుండెల్లో దైవభక్తిని చెదరకుండా నింపుకోవాలి  . !విశ్వశ్వరుణ్ణి నిర్మల హృదయంతో ధ్యానిస్తూ వేడుకోవాలి !. ఆర్తితో ఆక్రోశించాలి ! అందుకు కావాల్సిన శక్తినీ, బుద్దీని స్పూర్తిని అనుగ్రహించమని ప్రార్తించాలి కూడా  !మనం అనుభవిస్తున్న కర్మఫలం తో బాటు, ఈశ్వరుని కృపను, వివేకాన్ని, కరుణించమని కోరుకుందాం. !  ఆయన పరమ కృపాకరుడు.! కరుణాసింధువు  ! మనసు పెట్టి చేసే ఏ ప్రార్థన అయినా భోళాశంకరుడు వింటాడు. ! అనుగ్రహిస్తాడు కూడా.! దైవంపై భారాన్ని వేసే చిత్తశుద్ధిని అలవర్చుకుందాం !..హరహర మహాదేవ. ,శంభో శంకర..!. మహాదేవ మహాదేవా..!శరణు ! శరణు ! శరణు  !

Sept25
మన ఈ కాశీ నగరంలో అడుగడుగునా అద్భుతాలు . ! భక్తిశ్రద్ధలతో తిలకిస్తే  ఎన్నో  రమణీయ స్థానిక గాథలకు ప్రత్యక్ష సాక్ష్యాలు  కనిపిస్తాయి..! గంగాతీరం పొడవునా 64 ఘాట్లు చూడవచ్చును. అందులో 5ఘాట్లలో విధిగా స్నానం చేయాల్సి ఉంటుంది .1 పంచ గంగ.. గంగాయమున సరస్వతి మరి రెండు నదులు కలుస్తున్నాయి.ఇక్కడే అగ్నిద్యోతనుడు అనే ఋషి ఘోర తపస్సుకు విష్ణువు ప్రత్యక్షం కాగా " ,స్వామీ ! నీవు ఇక్కడే కొలువై ఉండాలి !" అని కోరగా  విష్ణువు బిందుమాధవుని  మూర్తిగా వెలిశాడు.ఇది ఈ క్షేత్ర మహాత్మ్యం..2.మణికర్ణికా ఘాట్ వద్ద కల కుండం , ఈ స్థలం , శివతాండవం అనవరతం జరిగే స్మశానవాటిక . !నిత్యం 300 కు పైగా శవాదహనాలు జరుగుతూ ఉంటాయి !.మాకు ఇచ్చట ఈ రోజు స్నానం చేసే భాగ్యం లభించింది.!. ఇక్కడ ఈ కుండం లో మధ్యాహ్నం వేళలో స్నానం చేస్తే ముక్తిదాయకము..3 దశాశ్వ మేధ ఘాట్.!.రాముడు అశ్వమేధం చేసిన చోటు .!నిత్యం వందల ఏళ్లనుండి గంగాహారతి ని వైభవంగా నిర్వహిస్తున్న పుణ్యక్షేత్రం..!.4.కేదారఘాట్. !జ్యోతిర్లింగ దర్శనం !,ఇక్కడ గల గౌరికుండ్ ,కుండంలో స్నానం చేయాలి  !.దీని ప్రాశస్త్యం గురించి నరసింహశాస్ట్రీ అనే  బ్రాహ్మణుడు వివరించారు. గత పదేళ్లుగా ఇదే కేదారఘాట్ సమీపంలో అద్దెకు భార్యతో కలిసి ఉంటున్నారు. వారు .ఆయనను అడిగితే చెప్పారు ..ఒకసారి గౌరీదేవికి " త్రిమూర్తులలో ఎవరు గొప్ప? " అన్న సందేహం కలిగిందట. సృష్టి చేయడంతో బ్రహ్మ,లయం చేసుకోడంతో శివుడు.తృప్తి పడతారు .! కానీ ప్రాణికోటిని బ్రతికించి స్థిరమైన జీవితాన్ని ఇచ్చే శ్రీహరి  ఆ ఇద్దరికంటే గొప్ప కదా  !అని అనుకుంటుంది .ఇది శివయ్య పసిగట్టి ,ఎవరో సామాన్యులకు కలిగే సందేహం  నీకు రావడం తప్పు.! అందులో భర్తను కుంటి గ్రుడ్డి అవిటి, రోగిష్టి ,ఇలా ఎలాంటివాడైనా ఇతరులకంటే  తక్కువగా అంచనా వేయడం ,అతడిని  అవమానించడం., భార్య గా మరొక తప్పు! .అందుకు శిక్ష 12 ఏళ్ళు ,ఇక్కడ కేదారఘాట్ వద్ద తపస్సు చేసి .పాప పరిహారం చేసుకో.  !"అనగా గౌరీదేవి ఇక్కడ ప్రాయశ్చిత్తము చేసుకుంది,ఈ కుండ్ లో స్నానం చేస్తూ....!.5.సూర్యకుండము .ఇది లోలార్క్ ఘాట్ వద్ద ఉంది..దివోదాసు  అనగా దేవతలను దాసులుగా చేసుకున్న వాడు, ! అతడు ఈ కాశీ నగరానికి రాజుగా ఉన్నకాలం లో ఏ దేవునికి ఇక్కడ స్థానం ఇవ్వలేదట ! .ఈశ్వరున్ని కూడా అజ్ఞాపించడట రావొద్దని...!. అంత ధర్మం గా పాలించాడు  ఈ రాజ్యాన్ని.ఆయన !. అప్పుడు శంకరుడు అగ్నిని పంపిస్తాడట చూసి రమ్మని .!.అగ్ని ఇదే సూర్య కుండం ఏర్పాటుచేసుకొని ఉండి. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించినా ఒక్క తప్పు కానరాలేదు. శివుడి వద్దకు వెళ్లి  సిగ్గుతో తలవంచుకొని   కాశీ నగరంలో ఎక్కడా కూడా అధర్మం   అనే పదానికి చోటు లేకుండా దివోదాసు పాలన ఉంది అంటాడు..! ఆ విధంగా ఇక్కడ సూర్యభగవాను ని ప్రత్యక్ష నిలయంగా సూర్య కుండం వెలిసింది.!. ఈ పౌరాణిక ఆధ్యాత్మిక  పరమార్ధం గల ఐదు గంగాతీర పుణ్యతీర్టాలలో  మహాభాగ్యం గా భావిస్తూ ,స్నానం చేస్తూ ఆయా దేవతలను స్మరిస్తూ పూజిస్తూ తరించడం మనం చేయవలసిన ధర్మం. !ఈశ్వరుడు ప్రసాదించిన మానవ.జన్మను  ,బుద్దిని,సార్ధకం చేసుకోడానికి ,పితృదేవతలకు కృతజ్ఞతతో విధిగా పిండప్రదానాలు  చేయడానికి  విధిగా , కాశీయాత్ర చేయాలి !  "అన్న సంకల్పాన్ని ,శక్తిని   యోగ్యతను అనుగ్రహించమని  ఈశ్వరుని ప్రార్థిద్దాం.!. ఎంత చూసినా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని   పుణ్యభూమి కాశీ క్షేత్రం, ఒక్కటే ! నిజంగా ఇది  ఆనందనిలయం. !ఇందుకు నిదర్శనం  ,,రమణీయంగా నయన  మనోహరంగా నిత్యం నిర్వహించే గంగాహారతి  !"  ఈ  దివ్యజ్యోతుల వెలుగులో ,  మనలో నిద్రాణంగా ఉన్న దైవభక్తినివైభవంగా  వెలికి తీసుకొని రాగలిగే ఏకైక శక్తి ,ఈ గంగాహారతి ఘట్టం ! అద్భుతమైన అనంతమైన ఆధ్యాత్మిక సంపద  ఈ కాశీ ఖండం. లో నిక్షిప్తమై భక్తులకు కొంగు బంగారమై వెలిసి ఉంది..!"" హర హరమహాదేవ శంభో హర..!"

పరమేశ్వరునికి  శతకోటి ప్రణామాలు.. !ఈశ్వరుని  నమ్మి చెడిన వారు లేరు. ! ఎంత విశ్వాసమో అంత ఫలితం..! మహాదేవ దేవా. ఇలాంటి సేవలు చేసే భాగ్యాన్ని మరీ మరీ అనుగ్రహించు. ! తండ్రీ ! కాశీ విశ్వనాథ ! నీదయకు శతకోటి ప్రణామాలు.. ! శంభో మహాదేవ ,! హర హర మహాదేవ  !
సోమవారం ఉదయం రుద్రాభిషేకం ,జోషి వారింట్లో 18 మందికి సామూహికంగా భోజనం. సాయంత్రం గంగాహారతి. కరివేన సత్రం నుండి ఉపహారం పులిహోర ఇడ్లి లు..
మంగళవారం !' ఉదయం కేదారఘాట్ లో గౌరికుండ్ లో స్నానం తో బాటు  గంగాస్నానం, ! పితృదేవతలకు తర్పణాలు ,. !కేదారనాథ్ ఆలయంలో అరగంట భజన వేణునాదం ,చేసుకునే భాగ్యం.  ! 12 pm  కి మాతా అన్నపూర్ణదేవి  మందిరంలో  అన్నప్రసాదం !. మణి కర్ణిక ఘాట్ కుండం లో  అపర్ణాహ స్నానం  !,సాయంత్రం గంగా హారతి.! కరివేన వారి ఉప్మా ,మిరియాల పులిహోర....!అహో భాగ్యం  అహో భాగ్యం.. మహాదేవ దేవా.! విశ్వేశ్వరుని సన్నిధిలో ఆనందానికి లోటు ఉండదు కదా.. !ఆర్తుల పాలిట పెన్నిధి ఈ  పావన గంగా తీర పవిత్ర కాశీ క్షేత్రం  !.నిత్య నూతనం . !పరమనందకరము...!

Sept 26
కాశిక్షేత్రం దివ్యమైన ఆనందనిలయం.! .భక్తాభీష్ట ఫల ప్రదం.! మనం అనుకున్నట్టు జరుగదు. ఇక్కడ ! శివాజ్ఞ ప్రకారం మన పనులు  జరుగుతూఉంటాయి.. నేడు మహాదేవుని కృప అపారంగా ఉంది .మాపై ..!రాజా ఘాట్లో స్నానం ,విశాలాక్షి మాత, దర్శనం ,విశ్వేశ్వరుని అద్భుతమైన శివలింగ దర్శనం, క్యూ లో శివసహస్ర నామ పఠనం, శివయ్య ఆలయ ప్రాంగణంలో  మృత్యుంజయ ,గాయత్రీ  మంత్రం ధ్యానం , అన్నపూర్ణమ్మ సన్నిధిలో లలితా స్తోత్ర పఠనం. దశ అశ్వమేధ ఘాట్ ,అహల్యబాయి ఘాట్ లలో మధ్యాహ్న స్నానం..ఈశ్వరుని కరుణ దయ ఇంత వైభవంగా దర్షింపజేస్తున్న గౌరీశంకరుల పాదపద్మాలకు  సాష్టాంగ ప్రణామాలు.. ఇంతకంటే జగదీశ్వరునుకి ఏమివ్వగలం. అంతా నిండి,అన్నింటా ఉండి, సర్వము తనదై ఉన్న రాజేశ్వరునికి మనసా వచసా శిరసా నమస్కరించడం తప్ప..! ఇలాంటి కరుణ తో స్వామి సేవలు ఇంకా ఇంకా అనుగ్రహించమని కోరుకోవడం తప్ప .! రోజూ ఎన్ని ఆపరాధాలు చేస్తున్నామో.స్వామీ తప్పులు సైరించి, నీపై  భక్తిశ్రద్దలను  అనుగ్రహించు. తల్లీ తండ్రి గురువు దైవం అన్నీ నీవే అని నమ్ముకుంటున్న  ఈ దీనులకు మార్గదర్శనం చేసే భారం నీదే ఈశ్వరా .శరణు శరణు శరణు

సతీ వియోగం తర్వాత శివుడు మందరగిరి పర్వతం పైకి సతి తో కలిసిఉన్న కాశీలో ఉండలేక. ఆమె జ్ఞాపకాలు వేదించగా  వెళ్ళిపోయాడు..అయితే భార్యా వియోగం కంటే ఎక్కువగా కాశీ ని విడిచి నందుకు విరహాన్ని పొందాడు .కనీసం కాశీ నగరం నుండి వీచే గాలి అయిన అటుగా వచ్చి శివుడిని తాకినా చాలు ,కొంత సేద తీరినట్టుగా బాధను అనుభవించాడు.సాక్షాత్తు శివునికే ఇంత ప్రీతికరమైన కాశీ నగరం మహత్తు ప్రభావం. సామాన్యమా.. అద్భుతం అమోఘం .కదూ.!

Sept 27
ఇన్నాళ్లు పార్టీవశివలింగ రచన  చేయడం,తుమ్మిపూలు , శివనామాలతో అర్చించుకోడం  తోనే అనుగ్రహించిన కాశీ విశ్వనాథుడు  ,,ఈ రోజున సాయంత్రం  కాశీ క్షేత్రంలో, గంగాతీరం లో ,గంగాహారతి సమయంలో విచిత్రంగా నాకు  మధురానుభూతిని ప్రసాదించాడు .  వైభవంగా రమణీయంగా గంగాహారతి అయ్యాక ,మెత్తటి గంగ మట్టితో  నేను చేసిన  పార్టీవశివలింగమూర్తిని చూసి , ముగ్దుడై  ,ఒక కాశీ బ్రాహ్మణుడు వచ్చి ""మై అభిషేక్ కర్దూమ్ క్యా. ? భగవాన్ కో పానీ చడావూ  ? అని నావంక చూస్తూ  అడిగాడు . అనుకోకుండా కుంటివాడి వద్దకు గంగ వచ్చినట్టుగా ,.నుదుట భస్మధారణ తో పాతికేళ్ల కుర్రాడు ,నడుముకు దోతీ భుజాన ఎర్ర పంచె వేసుకొని వచ్చిన  బాల విశ్వనాథుని  రాక ,వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా, ఆకలిగొన్న వాడికి మృష్టాన్నం లభించినట్టుగా , నాకు అనిపించింది , ! ఇంత గొప్ప ఆనందాన్ని పట్టలేక  , ఇంతకన్నా  భాగ్యం ఉంటుందా .. !అనుకుంటూ," .ఇస్ సే బడా సేవా భగవాన్ కో క్యా హోసక్తా,? పండిట్ జీ  ! "అంటూ  చేతులు జోడించి శివలింగాన్ని అభిషేకించమని , నమస్కారం చేశాను..ఆయన తన రాగి చెంబులో ఉన్న నీటితో చక్కగా ధారాళంగా పోస్తూ. పూలు వేస్తూ ," నమస్తేస్తు విశ్వేశ్వరాయ . !...."అంటూ పార్టీవశివలింగ అర్చన చేస్తుంటే ,ఆనందం పట్టలేక కళ్లనుండి అశ్రుధార ప్రవహించింది..రెండు నిముషాల్లో ముగించి,శివలింగాన్ని స్పర్శించి ,నీటిని కళ్ళకు అద్దుకొని వెళ్ళిపోయాడు.. ఈ సంతోషంలో నీటి ధారతో తడిచినా కూడా చెక్కు చెదరని ,మట్టి శివలింగాన్ని చూస్తూ , ,నన్ను నేను మరిచి ,  ఆయనకు అతని కాళ్లకు నమస్కరించి, దక్షిణ సమర్పించుకోవాలన్న  ధ్యాస కూడా లేకుండా పోయింది. తిరిగి వెనక్కి చూస్తే ఎక్కడా ఆ కుర్ర బ్రాహ్మణుడు కనబడలేదు.నిజానికి గంగాహారతి అయ్యాక భక్తజనం  చాలాపలుచగా ఉంది.పెద్ద పెద్ద మెట్లు దశాశ్వ మేధ ఘాట్ వద్ద దూర దూరంగా ఉన్నాయి. ఎంతదూరంలో వ్యక్తిని కూడా ఇట్టే గమనించవచ్చును ..అద్భుతంగా, ఆశ్చర్యంగా , ఆనందంగా  అనుగ్రహించిన ,అద్వితీయమైన పరమేశ్వరుని కృపా రసధారతో మునిగిన నా మనసు  ,హృదయం విశ్వనాథుని పాద కమలాల నంటి , కృతజ్ఞతతో ఆర్ద్రతతో, భక్తిశ్రద్ధలతో  వినమ్రంగా, విధేయత తో ప్రణమిల్లుతోంది .!". ఇంత చిన్న మనసుకు ,ఎంత  పెద్ద  దీవెనలు అందించావు తండ్రీ.. !కాశీ విశ్వనాథ ! కాశీక్షేత్ర వైభవం అంటే ఏమిటో ,? స్వామీ ,! నీవే స్వయంగా వచ్చి నన్ను ఈ విధంగా కరుణిస్తూ నిరూపించావు. కదా ! ప్రభూ  !దీనికి ఏమిచ్చి నీకు ప్రతిఫలం సమర్పించగలం  ?. హృదయాన్ని నీ ముందు కుప్ప పోస్తూ ,భక్తితో చేతులెత్తి వందనం సమర్పించుకోవడం తప్ప.! హే పరమేశ్వరా.!, నీ దయ ఇలాగే ఉండనివ్వమని మనసారా  ప్రార్థిస్తున్నాము ! గౌరీమనోహరా, !భక్తజనప్రియా,! ఆనందస్వరూపా,! నాగాభరణా..! నీకు సహస్రాధిక శతకోటి సాష్టాంగ ప్రణామాలు.! దయాసింధూ.. !ఆపద్బంధూ.. శరణు! శరణు !శరణు  !"

ఉదయం కేదారఘాట్ వద్ద .గౌరికుండ్,గంగా స్నానం పితృదేవతలకు తర్పణాలు, సూర్యభగవాను నికి ఆర్ఘ్యం. ,కేదారేశ్వరుని దర్శనం,అక్కడ గల మధుర మీనాక్షి ,లక్ష్మీ నారాయణుల పూజనం ,కాశీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణ మాత ల దర్శనం ,కరివేన వారి ప్రసాద గ్రహణం ,సాయంత్రం కాశిఖండం వైభవ  పురాణ శ్రవణం గంగాహరతి ,పార్టీవశివలింగ అర్చనకు తానే స్వయంగా వచ్చి శివలింగ అభిషేకం జరిపి. నన్ను తనవాడిగా చేసుకున్న  ,విశ్వనాథుని  అపార కృపామృతధ్యాన పాన వైభవ విశేష శుభదినం. తన సన్నిధి  తనను నమ్మినవారి పెన్నిధి యని చాటిన  పరమ దయాలువు ,భోళాశంకరుని కొలువులో  లోటు ఉంటుందా..? ఇదీ ఈరోజున  పరమేశ్వర లీలా వినోదం ..,హరహర మహాదేవ శంభో హరహర.. మహాదేవ మహాదేవా..

Sept 28
""కాశీలో పార్వతీ పరమేశ్వరుల సంచారం ఉంటుంది  "అంటారు కదా !..మరి ఏరీ.?. కనపడరే  ? " అనే  సందేహం కలుగుతుంది సహజంగా..! మనం సాధన చేస్తూ ,వారిని మనలోనే దర్శించగలం ! .లోనున్న జ్ఞానమే శివుడు.. ! ఈ జీవన చైతన్యమే పరమేశ్వరి ! వారి కృపతోనే ఈ బ్రతుకు. !ఈ మనుగడ..! నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని, ముక్కు ద్వారా జరిగే శ్వాసక్రియను బంధించి,ఇళ,పింగళ , సుషుమ్నా  నాడీమండలం అనే  త్రివేణీ సంగమ ప్రదేశాన్ని  మేల్కొలిపితే..కుండలినీ శక్తి మూలాధారం నుండి  అనాహత ,చక్రం ద్వారా  ఆజ్ఞాచక్రంలోకి ,అనగా మన రెండు కనుబొమలు కలిసే చోటు ,బొట్టు పెట్టుకునే చోటు వద్ద , ప్రవేశిస్తుంది..ఇక్కడినుండి ఇక క్రిందికి జారిపోయే ప్రసక్తి లేనే లేదు ! .శంకరాభరణం  సినిమా లో శంకరశాస్త్రి గారి అపురూపమైన సంగీత సాధన ద్వారా ఆయన సాధించిన అద్భుత మైన ప్రయోజనాన్ని మనం  చూడవచ్చును. భౌతికంగా పడుకుని ఉన్నా  కూడా,ఆజ్ఞా చక్రంలోనున్న సంగీతభరిత కుండలినీ శక్తి , నిరంతర నాదోపాసన తో , నాదో బ్రహ్మ !"  సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మము నాదరూపంలో  కూడా దర్షింపజేస్తున్న విషయాన్ని  గ్రహించవచ్చును.ఈ చైతన్యమే జాగృతమై ,బ్రహ్మా నుసంధానం  తో  ఐక్యమై,, శంకరుని తనువు ,మనసు నిరంతరం నిండిఉంటుంది  !" .అని తెలిపాడు దర్శకుడు మన విశ్వనాథుడు !...తాను నేర్పిన సంగీతం లో కన్నకూతురు తప్పు చేసినా కూడా క్షమించు కోలేక ,  "తన శిక్షణ లోపమేమో !" అని బాధతో ఆ ఆపరాధానికి తానే శిక్ష విధించుకోడం ,, ఆయన విజ్ఞతను ,ఆత్మసమర్పణ భావాన్ని , సంగీతానికి సంపూర్ణంగా అంకితమైన ద్యేయం తెలుపుతోంది . దారిద్ర్యాన్ని సైతం లెక్కచేయకుండా  జీవితాన్ని , కేవలం సంగీతప్రపంచం పై తనకు గల మక్కువను, పరమేశ్వరునికి కైంకర్యం చేసుకున్న శంకరశాస్త్రి గారి త్యాగనిరతి,అకుంఠిత దీక్షా తత్పరత లను   సూచిస్తోంది..!  ",మానస సంచరరే.. బ్రహ్మణి ! "  అనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన ద్వారా , బ్రహ్మానందమంటే ఏమిటో  అద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు ఆ  సినిమాలో . !   "..ఓ మనసా.  !అంతటా అణువణువునా నిండిఉన్న బ్రహ్మపదార్థంతో సంచరించవే.. ! శిఖి పించము  ,కపోలాలపై మెరిసే  నాసికాగ్ర మున  నవమౌక్తికము  ,రుక్మిణీ సహితకృష్ణుని వేణు గానము  , లాంటి అలౌకిక ,భావసంపద లతో భాసించే  పరమహంస లా ,, ,శ్రీకృష్ణ  ముఖ చంద్రమండలంలో సంచరించే చకోరపక్షిలా  , నిరవతిశయ నిర్గుణ నిరాకార నిశ్చలానంద స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆనందంగా విహరించవే !" అంటూ కీర్తించారు.. ! ఇది భక్తి సంగీత ప్రధాన సాధనప్రక్రియ. !అయితే... యోగాధ్యయనంతో  కూడా,లోనున్న శక్తి చైతన్యాలను , అనుక్షణం జరిపే శ్వాసక్రియలకు అనుసంధానం చేస్తూ.  "అహం బ్రహ్మో స్మి.!". నేనే బ్రహ్మను  ! నేనే ఆ చైతన్యాన్ని.కూడా !" అని భావిస్తూ ఈశ్వర దర్శనాన్ని అంతరంగంలో అనుభవిస్తూ, రమిస్తూ.అందుకు శ్రమిస్తూ  కూడా సాదించవచ్చును  ! ,అలా ,పొందే జీవన మాధుర్యం అమృతం ! అద్భుతం! ,అమరం !,అమోఘం !,పరమనందకరము ,!దివ్యము .!భవ్యము ..!.ఇదే మోక్షసాధన మార్గము నకు నాంది కూడా. ! హరహర మహాదేవ ,శంభో హర  !"

శుక్రవారం.పరమ పవిత్రమైన కాశీ క్షేత్రం  లో 6వ రోజు. ఉదయం కేదారఘాట్ లో గంగా  స్నానం , పితృదేవతలకు  జల తర్పణాలు, సూర్యనారాయణ భగవానుని కి గంగజలాల తో ఆర్ఘ్యం ,మీనాక్షి మాత బదరి లక్ష్మినారాయణుల ,కేదార్నాథ్  ల దర్శనం ,ప్రక్కనే గల కరపత్ర స్వామీజీ ఆశ్రమం లో స్వామి దర్శనం,  శంకరం మట్,లో రుద్రహోమ దర్శనం .మధ్యాహ్నం కరివేన సత్రం లో సమస్త బ్రాహ్మణ యుక్త భజన,స్తోత్ర గానం,, సాయంత్రం కాశిఖండం పురాణ శ్రవణం, కాశిక్షేత్రంలో పుట్టిన చెట్లు చేమలు, చచ్చిన జీవులు రుద్రుని తారక మంత్రం ఉపదేశం తో  పాపాలన్నీ భస్మం అయ్యి, నేరుగా  ముక్తిని పొందుతారు అని చెప్పారు,గబ్బేట ఆంజనేయ శాస్త్రిగారు... తర్వాత రెండు ఘాట్ల లో ఒకేసారి ఒకేచోట నుండి  గంగాహరతి లను చూసే భాగ్యం ..పార్టీవశివలింగా అర్చన. పవిత్ర అమృతగంగా జలాల  పానం.. తదుపరి విశ్వనాథుని కోవెలలో గంటసేపు జరిగిన ఋషిపూజ దివ్య సందర్శనం... ఏడుగురు ఋషులచే నిర్వహింపబడే యజ్ఞం లాంటి ఈ శివ పూజ చూసిన జనులు  నిజంగా ధన్యజీవులు. వర్ణింప వశమా బ్రహ్మాండనాయకునికి  అనునిత్యం జరిపే ఈ కల్యాణ కమనీయ అపురూప నీరాజన సుందరానంద దృశ్యరూపం... నిజంగా కాశీ వాసులు ధన్యులు.పునర్జన్మ అంటూ ఉంటే కాశీలో పుట్టాలి . అనిపిస్తోంది ..

వందల వేల లో కాశీ నగరం భక్తజనులతో నిండి పోతోంది ,మహాలయ అమావాస్య పితృపక్షాల సందడి..గంగాతీరం ఇసుకవేస్తే రాలని జనం , ఇక వీధుల్లో .........

ఉడవై రా చార్యులు  కాశీ వెళ్లి విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని పూరీ జగన్నాథుని క్షేత్రం వెళ్తాడు. ఆలయం  తలుపులు మూసి ఉంటాయి ,కాపాలదారులను బ్రతిమిలాడుతాడు, తాను కాశీ నుండి నడిచి వచ్చానని స్వామి దర్శనం కోసం ,, ,టైం అయిపోయింది కుదరదు అన్నారు వాళ్ళు , ! ఇంకేం పట్టరాని కోపం వచ్చింది ,  " ఏమయ్యా స్వామీ ,!లక్ష్మీదేవితో సరసాల్లో మునిగి  నీకోసం వచ్చే భక్తులను  చూడటం లేదా.?..ఐశ్వర్యమత్తులో కన్నుమిన్ను గానక మదం పట్టిందా..? నారాయణా! ఉన్నావా ?,లేవా  ?"..అంటూ క్రోధంతో శోకంతో, ఆర్తితో ఆర్ద్రతతో బాధతో, స్వామిని చూడాలన్న తపనతో  ,చేసే దూషణ నారాయణుడికి ఆనందాన్ని కలిగించింది  ద్వారాలు వాటికవే తెరుచుకున్నాయి. ఆచార్యులు ఆనందభాష్పాలతో  శ్రీహరి పాదాలను అభిషేకించాడు .వేదనాపూరిత హృదయకుసుమాన్ని  జగన్నాథుడు తప్పక  సంతోషంగా స్వీకరిస్తాడు.. ఎచ్చట లేడు హరి ?  ఎందెందు వెదికి చూసినా అందందే కలడు.. ఆ వెదకడం నేర్చుకోవాలి అదే సాధన మార్గం. ఓమ్ నమో భగవతే వాసుదేవాయ !'

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...