Wednesday, October 3, 2018

తండ్రీ! కాశీ విశ్వేశ్వరా

Oct 3
ప్రతిరోజూ ,ప్రదోషువేళల్లో, పరమేశ్వరుడు గౌరీ సమేతుడై ,నందివాహనా రూఢుడై, తన ప్రమధ. గణాలతో భూతలంపై సంచరిస్తూ ,,జీవ జంతు జాలముల చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ , ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి !,అందుకే సాయంకాలం ఇంటింటా ,ఆలయాలలో , దీపారాధన ,చేస్తూ ఆదిదంపతులకు స్త్రీలు నీరాజనాలు పలుకుతుంటారు ..తమకు పసుపుకుంకుమసౌభాగ్యాలు కలకాలం అనుగ్రహించమని మొక్కుకుంటారు !. ఈ ప్రభావాన్ని ప్రత్యక్షంగా వారణాసి లో అనుభవ పూర్వకంగా గ్రహించవచ్చును .సౌభాగ్యవతుల మాంగళ్య రక్షణ చేసే గౌరీమాత , గంగాభవాని, అన్నపూర్ణ, విశాలాక్షి దేవీ రూపాల్లో ,కటాక్షిస్తూ.. సాయంకాల వేళల్లో నిర్వహించే గంగాహారతి ని వీక్షించే మహిళమణులకు పసుపుకుంకుమాలని ప్రసాదిస్తోంది ...!ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఇది అక్షరాలా పరమసత్యం ! .కాశీక్షేత్రంలో పరమ పావన గంగాతీరం లో కాశీపురవాసులచే నయన మనోహరమైన ,అత్యంత రమణీయ మైన, సకలపాపతాప ప్రక్షాళనకరమైన గంగాహారతిని భక్తిశ్రద్ధలతో ,రాగ రంజితంగా, అద్భుతమైన వేదికపై.అనునిత్యం సమర్పిస్తూ ఉంటారు !.దశాశ్వమేధ ఘాట్ కి కుడివైపు ఐదుగురు,ఎడమవైపు ఐదుగురు పట్టు వస్త్రాలు ధరించి చక్కని అలంకరణ తో , విద్యుత్ కాంతుల్లో అపర దేవతామూర్తులవలె శోభిస్తూ ఒకే సమయంలో వేలమంది కాశితీర్థ పురజనులు, యాత్రికులు విదేశీయుల మధ్యచక్కని సంగీత రసభరితంగా గానం చేస్తుండగా ,షోడశోపచారా లు గంగభవాని మాతకు నివేదిస్తూ తమ హావభావాలతోభక్తులకు మహదానందాన్ని, నిశ్చలమైన భక్తినీ అందిస్తూ ,కాశీ యాత్ర చేసేందుకు వచ్చినవారికి మరపురాని మధురానుభూతిని ,సంతృప్తి ని ,జీవన సాఫల్యాన్ని అందిస్తున్నారు .. !కాశీ పురవాసులు ఎంత భాగ్యవంతులో కదా , ! " భాగ్యం అంటే వారిదే ! అన్నానికి ,ఆశ్రయానికి ,త్రాగునీటికి లోటులేకుండా ఉంటున్నారు వారు .,ఏ కాలంలో కూడా నీటికరువు తెలీకుండా భూమిలో 30 ఫీట్లలోతున బోర్ వేస్తే బోలెడు నీళ్లు. ! పైగా చుట్టూ వరి ,చెరకు, గోధుమ ,కూరగాయల పంటల తో , పొలాలతో సస్యశ్యామలం కాశీ క్షేత్రం. !మనం .చేసిన పాపాలు తొలగిస్తూ, తీయని త్రాగునీటిని నిరంతరం అందించే గంగమ్మతల్లి కృప, ఎన్ని వేలమంది అన్నార్తులు వచ్చినా లేదనకుండా తన అక్షయపాత్రతో అన్నదానం చేస్తున్న అన్నపూర్ణమ్మ తల్లి వాత్సల్యం, కోరినవరాలు ఇచ్చే విశాలాక్షి మాత దీవెనలు ,శంభో హరహర అంటూ పొసే కాసిని నీళ్లు ,పాలు, పుష్పాలతో సంబరపడే విశ్వనాథుని అపారమైన ప్రేమ , కాశీ క్షేత్ర మహిమను ,ప్రాచుర్యాన్ని ,పవిత్రతను ,ఖండాంతరాళం లో వ్యాపింపజేసి ,కులమతవర్గ జాతి లింగ వివక్షత లేకుండా రోజుకు దాదాపు ,లక్షల భక్తులవరకు విశ్వశ్వరుణ్ణి సేవించుకుని తరించే భాగ్యాన్ని కలిగిస్తున్నాయి.!నిజమైన భక్తిని నిత్య గంగాహారతి చూడడం వలన,,,, జ్ఞానాన్ని విశ్వనాథుని దర్శనం వలన, ,,,వైరాగ్యాన్ని గౌరీశంకరుల విహార స్థలమైన ఆనందవనాన్ని తలపించే రెండు స్మశానవాటికలు, ఒకటి మణికర్ణికా ఘాట్ ,రెండవది హరిశ్చంద్ర ఘాట్ .లను వీక్షించడం వలన కలుగుతున్నాయి!..భగవద్గీత లో భక్తి,జ్ఞాన వైరాగ్యాలకు మూడు అధ్యాయాలు వేరు !.కానీ ఈ మూడింటిని ఏకకాలంలో ఒకే క్షేత్రంలో ఇక్కడ వాటి అనుభూతులను పొందవచ్చును .!ఉదయం ప్రాతః కాలం సమయంలో ,సూర్యోదయానికి ముందుచేసే గంగాస్నానం అద్భుతమైన ఆనంద అనుభూతిని కలుగజేస్తుంది. నునువెచ్చని గంగా జలాల్లో మునగడంతో, మాతృగర్భంలో ఉన్నపుడు పిండానికి అందే వెచ్చని మధురానుభూతిని వలె మనం ఆ ప్రశాంతంగా, నిశ్శబ్దంగా, నిదానంగా ప్రవహించే గంగాజలాల మాధుర్యాన్ని,పొందవచ్చును. గంగమ్మతల్లి తన ఒడిలోకి వచ్చిన బిడ్డలకి తన మాతృసహజమైన అవ్యాజమైన మమతానురాగాలని పంచుతూ ,వారి అలసట,ఆర్తిని ,ఆవేదనలను తీరుస్తూ , జన్మ జన్మల పాపతాపాలను పరిహారం చేస్తూ, మానవజన్మకు సార్ధకత చేకూరుస్తూ ,జీవితంలో కావాల్సిన ఆనందాన్ని ,మనః శాంతినీ ప్రసాధిస్తోంది .!.మనం కోరేది ఒక్కటే ..!ఈశ్వరా! సర్వేశ్వరా! జగదీశ్వరా !,విశ్వేశ్వరా.! సర్వాంతర్యామి ,సర్వజ్ఞుడు ,సచ్చిదానంద స్వరూపుడు ,స్వయంభువు అయిన ఓ పరమేశ్వరా..! నేను అజ్ఞానిని. !అవివేకిని ! మహా పాపిని,! అసత్యవాదిని.!. నన్ను ఉద్ధరించడానికి తగిన సద్గతిని సన్మార్గాన్ని చూపించి నడిపించి ,సదా నీసేవలో తరింపజేసే భారము బాధ్యతా నీదే , తండ్రీ..! ఆపద్భాందవా ! పంచభూతాత్మకము ,పంచేంద్రియ ప్రకోపితము ,అరిషడ్వర్గాల ప్రభావితము ,పూర్వజన్మల కర్మల వేదితము అవుతున్న ఈ తనువు మనసు లను నీ అదీనము చేయుట నా తరం కావడం లేదు. ! నన్ను నీవాడిగా భావించి ,నాకు ఏది యుక్తమో, ఏది సవ్యమో ,భావ్యమో ,ఆ విధంగా నన్ను తీర్చి దిద్దుకో ! , ఈశ్వరా! నీరూపు తెలీదు ! ఎలా ఉంటావో ,ఎక్కడ నీ నివాసమో, ఏం చేస్తే నా మొర ఆవేదన నీకు చేరుతుందో.. ,,స్వామీ! అవేమి నాకు తెలియవు ! అందుకే నిన్ను ఆశ్రయిస్తున్నాను !.ఆదుకొమ్మని ఆర్తిస్తున్నాను ! నీవే గతి ! "అంటూ ..నీ పాదకమలాలను నా కన్నీటి ధారలతో అభిషేకిస్తున్నాను .!తండ్రీ! కాశీ విశ్వేశ్వరా ! కరుణించు !.నీ అనుగ్రహానికి సరిపడేి యోగ్యతను ప్రసాదించు !.ఆవేదనతో నివేదించే నా ప్రార్థన లను నీ సన్నిధిని చేరే సద్భావ సంపదను ,భక్తి జ్ఞాన వైరాగ్యాలను దయయుంచి ఈ దీనునిపై అనుగ్రహించు !.అపారమైన నీ కరుణా కటాక్ష వీక్షణాలను నాపై వర్షించు..! సదా నీ స్మరణం , నీ సేవనం,నీ భావనం , నీ పూజనం ,నీ శ్రవణం, లో తరించే మహద్భాగ్యాన్ని అందించు ! ..మహేశ్వరా! శరణు !శరణు !శరణు ..!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...