Oct 4
కాశీ క్షేత్ర మహాత్మ్యం అనుభవైకావేద్యము .!"భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని సన్నిధిలో చింతనతో స్మరిస్తూ అనునిత్యం ,ఆ దివ్య వైభవాన్ని అనుభవిస్తూ ఉంటూ అనునిత్యం సేవించుకుంటు ,కాశీక్షేత్రం స్థల మహాత్మ్యాన్ని నమ్ముతూ ,చేసే నిత్య కర్మలు మోక్షదాయకం ! "శివార్పణమ్ "అంటూ కైంకర్యబుద్ధితో ఆత్మసమర్పణ భావంతో ,ఇక్కడ గడపడం నిజమైన దైవానుగ్రహం. !ఇక్కడ ఉండే విదేశీయులు ఏండ్ల తరబడి ఉంటూ,కాశీక్షేత్రం పై విశ్వాసం ఉంచి తమదైన పద్దతిలో నిరాడంబరంగా జీవనాన్ని కొనసాగించే వారు వందల్లో, కనబడుతుంటారు ! .నుదుట ఎర్రని సిందూరంబొట్టుతో ,స్త్రీలు కొందరు జడలు వేసుకొని కూడా మన సంప్రదాయాన్ని పాటిస్తూ తిరుగుతూ కనిపిస్తారు. ! ముఖ్యాంగా "గంగాహారతి " సమయంలో వేదిక ముందు ,చుట్టూరా దాదాపు రెండు మూడు వందల విదేశీయులు, స్త్రీలు పురుషులు, చక్కగా భక్తిశ్రద్ధలతో, వినయ విధేయత లతో ఆనందంగా గంగస్తోత్రగానానికి అనుగుణంగా తాముకూడా గొంతుకలిపి ,చేతులతో చప్పట్లు చేస్తూ.ఎగురుతూ ఉత్సాహంగా ,గంగమ్మతల్లికి సమర్పించే ,నిత్యనీరాజనం మహోత్సవంలో విధిగా పాల్గొంటూ కాశీలో నివాసం చేస్తున్నారు ..,మన సనాతన హైందవ ధర్మం పట్ల ,కాశీ విశ్వేశ్వరుని నివాసంలో తమకు కావాల్సిన శాశ్వత ఆనందాన్ని ,ప్రశాంతత ను అందించే ఆనందవన నిలయ ప్రభావం పట్ల , ఆకర్షితులై,సమ్మోహింపబడుతూ , పరమేశ్వరచారణారవిందాలపట్ల ఆత్మసమర్పణ భావంతో వారు మెలగడం,వారి ఆధ్యాత్మిక చింతన ను ప్రశంసింపదగిన విషయం ! .ప్రాతః కాలంలో విదేశీ వనితలు కొందరు రాజ ఘాట్ ,లాంటి కొన్ని తీరాల్లో ,గంగా జలాల స్నానం చేస్తూ ,నది ప్రవహించే దాపున గల దాదాపు 20 నంది సహిత శివలింగాలకు "ఓమ్ నమః శివాయ!" అంటూ దోసిలితో నీళ్లు పోస్తుండడం నేను చూశాను ..! విశ్వేశ్వరుని ఆలయంలో పూజరిచేత శివాభిషేక పూజలు చేయించుకునే విదేశీయులను కూడా చూడవచ్చును ,మనకు అప్పుడనిపిస్తుంది ,,"దైవారాధన "కు నమ్మకం ముఖ్యం ,కానీ జాతిమత వర్గంతో పనిలేదు అని ..! అలా చిత్తశుద్ధితో శివపూజ చేసేవారు ,శివ సాన్నిధ్యంలో ,యోగ్యత లభించి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు పొందుతారు . !కాశీ నగర వీధుల్లో ను ,కాశీ విశ్వేశ్వరుని దర్శనం నిమిత్తం క్యూలో ను ఓపికతో నిలబడే వారిని చూడవచ్చును.!. నిజానికి మనం ఎక్కడ పుట్టినా ,ఏ జాతివారం అయినా. కొంత పూర్వజన్మ కృత సుకృత వైభవం తోడైతే తప్ప ,జీవితంలో ఇలాంటి turning point రావడం కష్టమేమో. ! అనిపిస్తుంది !. లేదా ఇలాంటి భావ సంపద కొరకు కాశీ లాంటి అవిముక్త దివ్యక్షేత్ర నివాసాన్ని ద్యేయంగా పెట్టుకోవాలి ,! సత్సంగం ను అయినా ఆశ్రయించాలి. !.లేదా నేరుగా ఆ పరమేశ్వరున్నే వేడుకోవాలి. ! దేవాదిదేవా.!విశ్వనాథ..! "నిన్ను ఆశ్రయించే సద్భావనను ,నిశ్చలమైన మనస్సును,దృఢమైన సంకల్పాన్ని , వివేకాన్ని నాకు అనుగ్రహించు , తండ్రీ.. ! అంటూ స్వామికి మన అంతరంగ ములో కలిగే ఆర్తిని తెలియజేయాలి ! "అడగందే అమ్మైనా '"అన్నం పెట్టదు కదా ! అప్పుడప్పుడు చిన్న సందేహం కూడా కలగవచ్చు ను ..ఈ విశ్వేశ్వరాలయంలో ,ఒక మూలన ఉన్న ఒక ఇంత "చిన్న శివలింగానికి "అంత మహత్తు ఉంటుందా.? అని ..! ప్రతిరోజూ వేలమంది భక్తులు "శివ శివ శివ !" హరహర మహాదేవ శంభో శంకరా ! అంటూ.చిన్నా పెద్దా ,అడా మగా అనకుండా ఉదయం 3.30 am నుండి రాత్రి స్వామి " పవ్వళింపు సేవ" వరకు ,ఇసుక వేస్తే రాలని జనం విశ్వేశ్వరుని దర్శనం కోసం పవిత్ర గంగజలాలలో స్నానం చేసి,వస్తుంటారు..,స్వామి యొక్క దయానుగ్రహాలకోసం ,భోళాశంకరుని అమృతకటాక్ష వీక్షణాలు తమపై ప్రసరించాలన్న తపనతో,ఆర్తితో, ఉబలాటంతో, ఉత్సాహంతో తండోపతండాలుగా దర్శిస్తూ అమితానందాన్ని పొందుతూ ఉండడం ", "కాశీక్షేత్ర మహిమా."!. లేక "శివలింగ ప్రభావమా !".లేక ఆ క్షేత్రంలో నెలవై ఉన్న బ్రహ్మ విష్ణు సహిత ముక్కోటి దేవతల అనుగ్రహబలమా...!" లేక ఏ క్షేత్రాన్ని తమ నివాసంగా చేసుకున్న గౌరీశంకరుల మహిమాన్వితమైన అద్భుత సచ్చిదానంద స్వరూప సందర్శన వైభవమా..! మన ఊహకు అందని దివ్యమైన పరమేశ్వర లీలలు ,రూపాలు ఈ కాశీ క్షేత్రం లో అడుగడుగునా ఉంటాయి. పదేళ్లు ఇక్కడ ఉన్నవారికి కూడా ఇక్కడి మహిమలు ,ఈశ్వర తత్వం , అంత సులభంగా అర్థం కాదు ! విశ్వేశ్వరుని, దర్శించడానికి భక్తులకు దొరికేది, కొన్ని సెకండ్ల సమయమే..! దాదాపుగా 10 నుండి 20 సెకన్లు మాత్రమే ! కారణం భక్తజన సముద్రం తాకిడి వలన..! ఇక్కడ ఉన్న గొప్ప సౌలభ్యం ఏమంటే ఇన్ని నీళ్లు,పాలు, పుష్పాలతో స్వయంగా విశ్వేశ్వరుని మనం అభిషేకించుకొని తృప్తిని పొందవచ్చును. ! ఎంతటి ధనవంతుడైనా ,బీదవాడైనా ఖచ్చితంగా క్యూలో రావాల్సి ఉంటుంది. పరమేశ్వరుని సన్నిధిలో అందరూ సమానమే.. కదా..! .ఏదైనా ఏమైనా అలాంటి సద్భావన తో మన జీవనయాత్రను కాశీ యాత్రగా భావనతో సుసంపన్నం చేసుకోవచ్చును. !.మహాదేవ ! మహాదేవా..!"
Oct 5
కాశీ క్షేత్రంలో దర్శనీయస్థలాలు ఎన్నో ఉన్నాయి .చూడటానికి ఒక సంవత్సరం కూడా సరిపోదు ! ,అందులో తులసీ మానస మందిరం, సంకటమోచన హనుమాన్ మందిరం ,గవ్వలమ్మ గుడి ,కాలభైరవ మందిరం.. వ్యాసకాశీ ,ఆదిగౌరి ,.లాంటి పవిత్రమైన ఇతిహాస మహాత్వ స్థలాలు .. ఇలా చాలా ఉన్నాయి! .ఇందులో ప్రతీ స్థలం క్షేత్ర స్థల మహాత్మ్యం ,ప్రాచుర్యాన్ని సంతరించుకున్న సిద్ధి ప్రదేశాలే.!. సంకటమోచన హనుమాన్ మందిరంలో వందల్లో వానరాలుంటాయి .. !.హనుమంతుని విగ్రహం మాత్రం , నిలబడి ఉంటూ ,తలమాత్రం కొంత కుడివైపున కు వంగి చూస్తున్నట్లు ఉంటుంది.! అదే విషయం అక్కడ ఉన్న పూజారిని అడిగాను .!.ఆయన అపర శ్రీరామ భక్తుడుఅయిన తులసీదాసు గారు ఇక్కడనే రామాయణం రచించినట్టు చెప్పారు !...అలా రాస్తున్న ఒకరోజున తులసీదాసు గారికి మధ్యాహ్నం ఎండ ఆయనపై కి రావడంతో, శరీరం అంతా చెమట పట్టేసింది. ఆట ! అయినా కనీసం భుజంపై గల కండువా తో చెమట తుడుచుకుని, తాను రాస్తున్న తాటాకుపత్రాలను చెమట తడిపేస్తుందన్న విషయం కూడా పట్టించుకోకుండా కావ్యరచన లో లీనమయ్యాడు ,!, రసవత్తరమైన ,రమణీయమైన రామాయణ కావ్యరచనా భక్తి భావ తరంగాల లో ఆయన నిమగ్నమయ్యారు..! ఆయన నిశ్చలమైన,నిర్మలమైన,, నిరుపమాన నిష్కలంకమైన భక్తిశ్రద్దలకు ,శరీరం పడే బాధలు కూడా మరిచి , ఆత్మను , అద్భుతమైన ,ఆనందమయమైన ఆత్మారాముని తో అనుసంధానం చేస్తూ. రామాయణ దివ్య ప్రబంధకావ్య ర చనా వైభవంలో తాదాత్మ్యం పొందుతూ.ఉన్నాడు , తన ప్రియ భక్తుడు ,తనకోసం ,తన గాథను ,పామర భాషలో ,సామాన్య జనం కూడా అర్థం చేసుకొంటూ చదువుకొనే శైలిలో రాసి అందించాలన్న తపనతో, చేస్తున్న రామాయణకావ్యావిష్కరణ కోసం శ్రమిస్తూ ,అతడు పడుతున్న దీనావస్తను చూడలేక తులసీదాసు వద్దకు రామచంద్రుడు పరుగు పరుగున వస్తాడు.చెట్టుక్రింద కూర్చుని ఉన్నా కూడా పొద్దు పడమర వైపు వాలి పోతుండడం తో నీడ తొలగి ,తీవ్రమైనఎండ ఆయన పై పడుతోంది..! అది గమనించి , వెంటనే రామయ్య ,తులసీదాసు కి ఎండ తగలకుండా అడ్డం నిలబడుతూ , తనభుజంపై ఉన్న పట్టు ఉత్తరీయంతో ఆయనపై చెమటతొలగేలా ,ప్రేమతో , మెల్లిగా ,విసనకర్ర వలె కదిలిస్తూ, సేవ చేస్తున్నాడు..!అలా సాక్షాత్తూ భగవన్తుడు స్వయంగా తన స్వహస్తా లతో తన భక్తునికి సేవ చేసుకుంటున్న ఈ అద్భుతమైన అమోఘమైన అపురూప దృశ్యం చూసి ఆంజనేయస్వామికి కళ్ళ నుండి భాష్పాధారలు ఆగకుండా స్రవించ సాగాయి . ! రాముడే దిగివచ్చి సేవ చేసుకుంటున్న ""వైనం చూస్తూ .ఈ తులసీదాసు ఎంత పుణ్యాత్ముడో కదా అనుకుంటూ అతని భాగ్యానికి మురిసిపోతూ.." స్వామీ !..రామచంద్రా ! నేనుండగా నీవు ఇలా శ్రమ పడుతుండడం చూడలేకున్నాను . !నేను చేస్తాను ,మన తులసిదాసుకు మీరు చేసే పరిచర్యలు ! "అంటూ ముందుకు వస్తున్న హనుమను కళ్ళతో వారించి ,తానే స్వయంగా పూనుకొని ఆయన ఆ రోజున కావ్యరచన ముగించే వరకు సపరిచర్యలు చేశాడట ! అలా తనభక్తుని ఆనందంలో ,తన ఆనందాన్ని. ఆయన అంతరంగం లో నిక్షిప్తమై న తన ప్రతిరూపం తో మమేకమై, అతడే తానై ,తానే అతడై ,తన రామాయణ కావ్య రచన తానే తులసీదాసు గా మారి " తులసీదాసు మానస చరిత " మానస రామాయణం ,రచించాడు.!.మన పోతనామాత్యుడు కూడా భాగవతాన్ని తెలుగులో అంద్రీకరిస్తూ రాసిన ." .పలికెడిది భాగవత మట !,,పలికించెడి వాడు రామభద్రుండట..! " నే పలికిన భవహర మగునట ! పలికెద వేరొండు గాథ పలుకగ నేలా ! "" అని తాను నిమిత్తమాత్రుడి నని, రాసింది స్వయంగా ఆ " శ్రీరామచంద్రుడే !!" అని ,తాను కాదనీ, అంటూ ఇష్టదైవము అయిన రాముని పట్ల తనకు గల అపారమైన నిరపమానమైన భక్తిశ్రద్దలను ప్రకటించుకున్నాడు. !. ఆ విధంగా తులసీదాసు భావోద్వేగాలతో రామయ్య ఆనందం తోడైన మధురాతిమధురం, అద్భుతమైన సన్నివేశంలో హనుమ అలా భుజంపై నుండి కుడివైపు నకు తలవంచి తన స్వామిని ఓరగా చూస్తున్న అనుభూతుల సంకేతమే ఈ సంకటమోచన హనుమ ప్రస్తుత విగ్రహ దర్శనా భాగ్యం. ! ఆయన.కంటి నుండి వచ్చినవి ఆనందామృత భాష్పాధారలు.. ! అలా ఎక్కడనైతే రామసంకీర్తన,,రామ కావ్య రచన , అఖండ రామనామ ఆలాపన ,, రామాయణ పురాణ పఠన ,జరుగుతాయో అక్కడ హనుమ వినమ్రుడై, తలవాల్చుకొని ,అంజలి ఘటించి ,పారవశ్యంతో, కళ్లనుండి ఆనందాశ్రువు లు స్రవిస్తూ ఉండగా , రామకథను వింటూ రాముని పట్ల ,రాముని భక్తుల పట్ల ,రామనామ గాన వైభవం పట్ల ,దానికి గల అమోఘమైన మహిమ పట్ల తనకున్న భక్తి తత్పరత ను,రామనామానికి గల అద్భుతమైన శక్తిపట్ల ,గల ప్రాచుర్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి .శ్రీ రామభక్త తులసీదాసు గారు ,తన "హనుమాన్ చాలీసా " లో లిఖిస్తూ ఇలా ప్రకటించాడు..!యత్ర యత్ర రఘునాథ కీర్తనం , !తత్ర తత్ర కృత మస్త కాంజలిమ్ ,!,భాష్ప వారి పరిపూర్ణ లోచనం ,!మారుతిం నమత రాక్షసాంతకం..! ."అంటూ కళ్ళకు కట్టినట్టుగా ,తాను దీనికి ప్రత్యక్ష సాక్షిగా అద్భుతంగా విశదీకరించాడు .!..ఇదీ సంగ్రహంగా ,ఇక్కడ కాశీ క్షేత్రంలో గల ,మన సంకటమోచన హనుమాన్ క్షేత్ర స్థల ఇతిహాస వైభవం ! ,ఇది చదివినవారికి ,వినిన వారికి శ్రీరామ చంద్రుని అపార కరుణా కటాక్షము ,అతని ప్రియభక్తుడు , ముక్త సంగుడు అయిన హనుమ యొక్క అనుగ్రహమును మనం పొందుతాము. ! హనుమయే శివుడు.! రాముడే విష్ణువు !ఆ హరిహరుల దివ్య అవతార లీలా విశేషాలు ,మన పాలిట కల్ప తరువులు..! మానవ జీవితం పరమార్ధాలుకదా ! ...ఇటువంటి అపూర్వమైన, నయన మనోహరమైన దృశ్య సందర్శన అనుభూతులను అందించిన "రామమానస చరిత కర్త "" అయిన తులసీదాసు భక్తినీ రామకథామృతం పై అతనికి గల అనురక్తిని ,మనం ఆస్వాదిస్తూ ,పదిమందికి మనకు కలిగే మదురానుభూతులను పంచుతూ ,దైవారాధన పై ఆసక్తి ని ,మక్కువను పెంచుతూ , ఆనందిస్తాం..!." జై శ్రీరామ్ .!". శ్రీరామ భక్త హనుమాన్ కి జై . ! భక్త తులసీదాసు కి జై !అమరము , ఆమోఘము ,పరమ పావనము ,తారక నామవైభవ పూరితము అయిన రామాయణ దివ్య కావ్య కల్పతరువు కీ జై .. !గౌరీశంకర భగవానుని కి జై. ! మహాదేవ మహాదేవా !"
No comments:
Post a Comment