Monday, October 1, 2018

మోక్షం

Sept 30

"మోక్షం రావడం కాశీలో మరణిస్తేనే. ! "అని కాశీ క్షేత్ర మహిమ చెబుతోంది. !గంగా ప్రవాహానికి పశ్చిమంలో కాశీ క్షేత్రం.ఉంది. !ఇక్కడ  పుట్టిన చలి చీమలు  ,కీటక ములు,,బురద పురుగులు ,అవి కొన్నిరోజుల బ్రతికినా  పుట్టడం చావడం కాశీలోనే  కనుక వాటికి మోక్షం రావడం గ్యారంటీ.  ! ఈ ఆశతోనే శివ భక్తులు  9రోజులు , ,9 నెలలు,9 ఏండ్లు కాశీలో ఉండడానికి రావడంతో " నిత్యకల్యాణం పచ్చతోరణం  !" వలె కాశీ నగరం ఎప్పుడూ కళకళ లాడుతూనే ఉంటుంది.. !మాబోటి వాళ్ళు return ticket book చేసుకొంటూ కాశీ క్షేత్ర వైభవానికి మచ్చ తెస్తున్నారు.విశ్వేశ్వరుని ఆలయంలో శివలింగం పైనుండి పూజారి భక్తుల నుదుట భస్మధారణ చేస్తాడు  ! ,అంటే విశ్వేశ్వరుని సన్నిధానానికి ఆహ్వానం అందినట్టే కదా..! కాశీ క్షేత్రంలో ఉండడానికి అర్హత పాత్రత యోగ్యత లభించినట్లే కదా!"".. నీవు నావాడివి  !"" అని విశ్వేశ్వరుని సూచన అందినట్లే కదా. !.ఇక్కడ ఉండడానికి నియమాలను పాటిస్తూ ఆఖరు శ్వాసవరకు శివస్మరణ శివధ్యానం లో ఉండడంతో జీవిత పరమావధిగా ఇక్కడే పడి ఉండాలి కదా .!.నమ్మకం 100,%ఉండాలి గానీ. తక్కువ ఉంటే భ్రష్టునివి అవుతావు. కదా  !  నా గుడికి రావడం పోవడం అన్నీ నీ ఇష్టమేనా..? ఎవరి ఇంటికి వస్తున్నావో , ఆ ఇంటి మర్యాదలు పాటించాలి కదా..! బ్రహ్మాండనాయకుని ముందు చెలగాటమా ? .  "నా ఇష్టం ఉంటేనే వస్తాను .!నమ్ముతాను.! నాకు అనుకూలంగా నీవు ఉండాలి . !" అంతే ! "అంటూ ఈశ్వరుడినే శాసించే అహంకారం ,,సంసారం పై మమకారం  ,ఇలా మనిషిలో మనసులో పీకుతున్నంత వరకు  మనం ఈ.జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి కదా..! ఆత్మ సమర్పణా భావం రావడం , సర్వాంతర్యామి తత్వాన్ని అంతటా అందరిలో అన్నివేళలా దర్శించడం , అంత సులభమా. ? నిరంతర సాధన ,గురు శుశ్రూష ,తపన ,ఆవేదన ,పరమాత్మ దర్శనం అనే ఆకలితో అన్వేషిస్తే , ప్రేమతో నిష్ఠతో ఆరాధిస్తే ఈశ్వరుని కటాక్షం తప్పక లభిస్తుంది.. !అందుకు కాశీ క్షేత్రం అనుకూలంగా వసతులు ,వాతావరణం ,క్షేత్ర మహిమలతో సిద్ధంగా ఉంది .  మోక్షానికి మూలకారణం అయిన  వైరాగ్యానికి ఆహ్వానం ఎప్పుడూ  పలుకుతూనే  ఉంటుంది.. ! కాశీ గంగాతీరం లో నిలబడి నిదానంగా చూస్తుంటే , ప్రవాహంలో కొట్టుకుపోయే పీనుగలను చూస్తూ ఒక దండం పెట్టుకో.. ! ఆహా ! జీవుడా ! ఏం అదృష్టం నీది ? కాశీలో చచ్చావు కదా ! మోక్షం మూట కట్టుకొని పోతున్నావు కదా !" అనుకుంటూ...పొంగిపోవాలి  ! ఇక్కడి .వీధుల్లో ఊరేగింపులో పోయే శవాలు ,చచ్చిన కుక్కలు,కీటకాలు ,జంతువులను, చూస్తూ ఒక మారేడు దళం పెట్టి దండం పెడుతూ.ఆ జీవుల మహాభాగ్యానికి మురిసిపోయిన క్షణం  లో ,! ".నీవు ఈశ్వరుడి వాడవే  !"అవుతావు...

ఇక తీరానికి ఉత్తరం వైపు మనికర్ణికా ఘాట్.  లో నిత్యం 300కు పైగా శవ దహన వైభవాన్ని చూడగవచ్చును. ఇక దక్షిణం వేపు హరిశ్చంద్ర ఘాట్.లో 200 కు పైగా శవ సంస్కారాలు జరిపే భయానకమైన దృశ్యాలను ఒంటరిగా ఉండి చూస్తుంటే  ,ఎంతటి రాతి హృదయం అయినా నీరుగారక మానదు కదా !గుండె దడ దడ లాడిస్తూ రాత్రిళ్ళు నిద్ర పట్టక పిచ్చిగా దిక్కులు చూడాల్సిందే  !ఘోరంగా, కనిపించే ఆ శివవిలయతాండవ  ఆనందవన శోభలను , నింగినంటే నల్లని మేఘాల పొగలతో  ,దిక్కులు కనిపించని కారు మబ్బులతో  పొగలు ,సెగలు ,మంటలు,జ్వాలలు,పెట పెట మని కాటిమంట ల నుండి  వచ్చే  భయంకరమైన ప్రేతభూత నివాస స్మశాన భీతావహం , భయాన్ని కలిగించే చప్పుళ్లతో..వేల క్వింటాళ్ల కర్రలకుప్పలతో ,ఏడ్చే బంధు జనాలతో ,డబ్బులు దండుకునే దళారీలతో ,రణగొన ధ్వనులతో. నీకు ఖచ్చితంగా వైరాగ్యం అంటే ఏమిటో అనుభవరీత్యా  తెలుస్తుంది  ! .ఆరోజుల్లో హరిశ్చంద్రుడు స్మశానం దృశ్యం లో కాటికాపరిగా పాత్రలో పాడే సీస పద్యం.."" ఇచ్చొటనే కదా ! .పేరు పొందిన కవుల ఘంటముల్ గంగలో కలిసిపోయే  ! "......అన్న పద్యం జ్ణాపకం రాక మానదు !.."బాబోయ్.. !రేపు మన పరిస్థితి ఇంతేనా ! "  అనే భయంతో మనిషి  వణికి పోతాడు..! నిజానికి కాశీ క్షేత్ర మోక్ష రహస్యం ఇక్కడే ఉంది. ! "భక్తి జ్ఞాన వైరాగ్యాలు " కలిగితేనే తప్ప కాశీలో ఉండేందుకు తగిన అర్హత దక్కదు..!ఇదే భావన తో ఎక్కడ నీవు " కాశీ ,కాశీ, కాశీ  ,!" అనుకుంటూ స్మరిస్తూ దేహాన్ని విడుస్తావో . ,అదే స్థలం నీకు  "కాశీ క్షేత్రం" అవుతుంది.  మనలో భావసంపద అలా పెరగడం  ముఖ్యం..! అడుగడుగునా శివుణ్ణి వెదుక్కుంటూ పోవడం, శ్వాస లో ధ్యాస ఉంచి దైవాన్ని  దైవస్వరూపాన్ని భ్రుకుటీ మధ్య నిలిపి ,ప్రాణాయామం ప్రక్రియ ద్వారా అంతరాళం లో అంతర్యామిని దర్శించే ప్రయత్నం  చేస్తూ  ఉండడం ,,దైవం పై భారం వేయడం ,.,,లాంటి సాధనా మార్గాలు ఈశ్వరుని సన్నిధికి చేరడానికి సోపానాలు అవుతున్నాయి మరి  ! అయినా అంతా  "ఈశ్వరఇచ్చా ప్రకారం " నీవు నేను సర్వము నడుచుకోవాల్సిందే. !.మనము  ఈశ్వరుడు చేసిన బొమ్మలం ,  ! "ఆయన శాసకుడు..! కనీసం అతని దాసులం కావాలన్నా పెట్టి పుట్టాలి,  !పూర్వజన్మ కృత సుకృతం ఉండాలి ! అన్నిటికీ మించి,"గురు కృపా విశేషం!"" కలగాలి ..! "ఈశ్వరా  !నన్ను దిద్దుకో.!నీ దాసునిగా మలచుకో..! నీవాడిగా చేసుకో..!నేను నిన్ను మరిచిపోకుండా గుర్తు చేస్తూ, నీవు మాత్రం నన్ను గుర్తు పెట్టుకో ,,!అర్భకుడిని ,!అజ్ఞానిని ,!మహాపాత కుడిని !,దురహంకారిని! ,మమకారిని,!అవివేకిని ,!ఈశ్వరా !నిన్ను కొలుచుటకు ఇసుమంత యోగ్యత లేని దీనుడిని..!"నీవే దిక్కు !వేరే గతి లేదు నాకు !" శరణు !" అంటూ నీ పాదాలు గట్టిగాపట్టుకొని  వేసుకోవడం తప్ప మరే మంత్రము, జపము, స్తోత్రము ,యాగము చేసే యోగం లేని అధముడను !,తండ్రీ! దయఉంచి నన్ను కరుణించు.!నిన్ను మనసారా తలచుకొంటూ  ఆరాధించే దృఢమైన ఆత్మశక్తినీ,చెదరని స్పూర్తిని,ఆచంచమైన భక్తినీ, ప్రగాఢవిశ్వాసాన్ని  అనుగ్రహించు!.స్వామీ! విశ్వేశ్వరా..! గౌరీ మనోహరా,,! కైలాసవాసా,!దయాసిందో..,! భోళాశంకరా. !మహాదేవ దేవా..! శరణు !శరణు! శరణు..! "

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...