Sunday, October 7, 2018

కృష్ణయ్య

Nov 12, 2017
ఎంతా చక్కాని వాడు.. మా కృష్ణయ్య.
ఎంతా అందగాడు .. మా కృష్ణయ్య...!
నల్లా నల్లనివాడు.. మా కృష్ణయ్య.!..
కమలాల కన్నుల వాడు.. మా కృష్ణయ్య.....!
నెమలి పింఛము వాడు మా కృష్ణయ్య.. ! ఎంతా !!

చెవులాకు  కుండలాలు. మా కృష్ణయ్య...!
నుదుటా  సింధూరమువాడు  మా కృష్ణయ్య.! కాళ్ళా కు గజ్జెలు కట్టి. మా కృష్ణయ్య. .!
మొలను మొలత్రాడుకట్టి. మా కృష్ణయ్య..! ఎంతా !!

మెడలోన కౌస్తుభ హారం. మా కృష్ణయ్య..!
చేతూల కంకణలు మా కృష్ణయ్య..!
పెదవూల పిల్లనగ్రోవి. మా కృష్ణయ్య....! !
నుదుటా సింధూర తిలకం.. మా క్రిష్ణయ్య.! ఎంతా !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...