Nov 13, 2017
చేతులు కాళ్ళు. మనిషి కుండే అవయవాలు నాకు అంటగట్టి.. ఓ రూపాన్ని నాకు ఆపాదించి... నన్ను మానవజాతికి మాత్రమే పరిమితం చేయడం.... నా సృష్టి లోని బొమ్మలైన మీరు.. నన్ను ఒక బొమ్మను చేయడం.... మిగిలిన చీమ. లాంటి ప్రాణులు... అహో. ఈ శివు డు ఎంత పక్షపాతి... మాకంటే ఆ మానవ జన్మ ఉత్కృష్టమైనది అని ఆ రూపాన్ని ధరిస్తున్నా డు.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట దు కదా.. శివ ప్రేరణ తో కదా.. ఈ మనిషి ఇన్ని రకాల శివ రూపాలు తయారు చేస్తున్నాడు ... అసలు రూపమే లేని శివుని కి... శివలింగ రూపం లో పూజ లందుకునే . సర్వాంతర్యామి పరమేశ్వరునికి ..... శివోహం అనుకోవాల్సి న మనిషి కి అంత జ్ఞానాన్ని.. వివేకాన్ని ఇచ్చి ఏం లాభం..... అని క్రిమి కీటకా ది ప్రాణులు నన్ను అ డిపోసుకుంటున్నాయి ... మానవా.. ఇకనైనా. ఇన్ని రూపాల్లో నన్ను చూడటం మానవా....
No comments:
Post a Comment