Sept 29
మహాదేవ మహాదేవా.! ఈరోజున అయోధ్య యాత్ర అద్భుతంగా జరిగింది...!,,ఎన్నో రోజులనుండి అనునిత్యం స్నానం చేసే సమయంలో జ్ణాపకం చేసుకొని చేసిన సరయు నదీ స్నానం,,నిజంగా సాకారమైంది. ఆ కల సీతారాముల దయవల్ల ఈరోజున ఫలించింది.నిజానికీ ఇది మాతండ్రి కలల పంట.! ఆయన రాముని భక్తుడు !".ఆనంద రామాయణం "స్వంత రచన చేస్తూ పద్యాలు కీర్తనలను రాయడం ,నిత్యం రామభజన చేస్తూ ఎలుగెత్తి పాడుతూ , కాళ్లతో హార్మోనియం తొక్కుతూ రెండు చేతులతో సవ్యసాచి లా హార్మోనియం వాయిస్తూ తన్మయంగా పాడుతూ జీవితం భగవద్ అర్పణం చేసుకొంటూ ఉండేవాడిని రామదాసుకు మరో రూపం అని రాగంపేట గ్రామస్తులు ,కృష్ణశాస్త్రి గారు ఎంతో గొప్పగా మా బాపు... లచ్చయ్య పంతులు గురించి చెప్పగా నేను విన్న అపర రామభక్తుడు ఆయన .. !బాల్యంలోనే అంత చక్కని తండ్రిని కోల్పోయిన దురదృష్టవంతులం మేము ! అయినా అలాంటి గొప్పభక్తుడైన తండ్రికి కొడుకుగా పుట్టడం గర్వంగా ఉంది.నిజంగా ఇది మా పూర్వజన్మ కృత సుకృత వైభవం కూడా .! దివ్యము భవ్యము పరమ పావనము పరమానందకరము, పతితపావనము. అయిన ఆ రామానుగ్రహం ఆయనపై తద్వారా మాపై కూడా ఉందని అనిపిస్తుంది.. ! మా తండ్రి తల్లి గార్ల రామచంద్ర గాన ధ్యాన భజన పూజన సేవన జీవనము గురించి చెపుతుంటే హృదయంలో ఉత్సాహం సముద్రంలో కెరటాల వలె ఉవ్వెత్తున పొంగి వస్తూ ఉంటుంది .ఈ "అయోధ్యారాముని యాత్ర " కృప చేసిన మా తలిదండ్రులకు పాదాభివందనాలు ! భక్తితో వినయంగా కృతజ్ఞతతో వారికి నమస్సులు సమర్పిస్తున్నాము ...!"..జై శ్రీరామ్ ! భరత లక్ష్మణ శత్రఘ్న హనుమద్ సమేత శ్రీ సీతారామచంద్ర భగవానుని కి శతకోటి ప్రణామాలు.! జై శ్రీరామ్ !జై జై శ్రీరామ్...!" "ఎక్కడున్నావురా రామచంద్రా. ? మా మొరాలకించి కరుణించిన నీ కృపకు చేతులెత్తి ప్రణమిల్లడం తప్ప మరేమీ సమర్పించలేని సామాన్యులం.!.అల్పులం ! అజ్ఞానులం.!.ప్రభూ..! నిరంతరం నీవు శ్రీరామరక్షగా నిలుస్తూ మమ్మల్ని సన్మార్గంలో నడిపించే భారం నీదే తండ్రీ.. !శరణు !శరణు ! శరణు..!".
అయోధ్య ప్రయాణం,ఉదయం 5.30 am కి తవేరా లో మరో ఇద్దరు ఢిల్లీ మిత్రులు హైదరాబాద్ నివాసులు తెలుగు తెలిసిన వారితో 7గురం వెళ్ళాం 11.30ఆమె సరయు నదితీరం చేరాము . దూరం 230kms.గతుకు రోడ్డు కొంతవరకు.. త్రోవలో సూర్యగుండం ఒక ఊరు వద్ద పితృపక్షాల జనం వందల్లో.. సరాయునది స్నానం వేళకు మండే ఎండ.. ఒడ్డున పార్టీవశివలింగమ్ చేసి అందరం పూజించుకునే భాగ్యం .2km దూరంలో అయోధ్య ,పెద్ద గ్రామంలా ఉంది..హనుమాన్ గడి రామ దర్బార్, తర్వాత రామ జన్మ భూమి వెళ్ళాం దాదాపు 2kms నడక 4 చోట్ల స్కానింగ్ checking. అంతా అడా మగా మిలిటరీ .దళం గన్నులతో పహారా.. దాదాపు 200ఎకరాల పైగా ఉంటుంది రామ జన్మ భూమి.. బాబ్రీ మసీదు కూల్చిన చోట ఎత్తైన గుట్ట మీద సీతారామలక్ష్మణ ఆంజనేయ ప్రతిమలను స్థాపించారు పైన గుడ్డతో టెంట్ గుడారం వేసి ఉంది..నిరసనగా ముస్లింలు ఏ ఊరిలో ఉండడం లేదట ..హనుమాన్ గడి 80 మెట్లు రామభజన తాళాలు మోగిస్తూ కనిపించారు అక్కడ వైభవంగా సందడిగా ఉంది .రామాలయం నిర్మాణానికి అవసరమైన శిల్పాలు, స్తంభాలు తయారు చెడు ఉన్న రాజస్థాన్ శిల్ప కళాకారులు కనిపించారు.. అంతే. ఒక గైడ్ సహాయంతో 3గంటల దర్శనం అయ్యింది. అత్తకు నడక కష్టం అయ్యింది రామజన్మభూమి దర్శనం లో.5.30pm కి తిరుగు ప్రయాణం 11పీఎం రాత్రికి తిరిగి వారణాసి ఇంటికి చేరాము.. ఈ రోజు అందరికి రామచంద్రుడు ఒక పూట టిఫిన్ టీ మాత్రం తో సరిపెట్టాడు.. జై శ్రీరామ్ ..
No comments:
Post a Comment