Sunday, October 7, 2018

భగవద్గీత

భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు  గొప్ప స్రష్ట లా.. వేదాంతి లా.. జ్ఞానిలా .మాట్లాడుతాడు...కృష్ణుడు జవాబు లేదు ఇక్కడ .అలాగే ఇన్నేళ్ల స్నేహంలో. బంధుత్వంలో.. ఎక్కడా ఎప్పుడు గీత బోధ ప్రసక్తి లేదు...13ఏళ్ల అరణ్యవాసంలో   కలిసి ఉన్నా స్నేహమే ఉంది వారి మధ్య.....రెండవ అధ్యాయంలో7వ శ్లోకంలో.. శిష్యస్తే హం నేను నీకు శిష్యుడను.. శాధి మాం త్వాం ప్రపన్నం... శరణాగతుడను.. ఉపదేశింపుము ...అప్పుడుమాత్రమే గీతాచార్యుని పాత్ర శ్రీకృష్ణుడు దరిస్తాడు... గురు శిష్య సంబంధం. వల్లనే  గురు సాక్షాత్కారం కలుగుతుంది   ...నిజానికి శ్రీకృష్ణునికి చాలా చిక్కు సమస్య... యుద్ధం తప్ప మరేదైనా అదేశించు...!అని మూర్ఖంగా మొండిగా ఉన్న అర్జునుడిని  క్రమంగా తన దారికి .తెచ్చుకోవడం.. ఆ. పరమాత్మకే చెల్లింది... ఓమ్ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః..!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...