Monday, October 1, 2018

అహం

నేను అంటే ఎవరు ?".అనే ధర్మ సందేహం అందరికీ కలిగేదే..! నేను అనేవాడు శరీరంలో ఉన్నాడా..? శరీరంలోనే  "నేను " అనేది ఉందా  ?, ఇది ఒక జటిలమైన ప్రశ్న.. !నిజానికి నేను అనే పదంలోనే అహంకార తత్వం దాగి ఉంది .శరీరంపై మోహం. నా భార్య ,  నా భర్త ,నా పిల్లలు ,బంగాళా ,ఆస్తి, డబ్బులు, బంధువులు, ఊరు వస్తువులు, వేసుకునే దుస్తులు, తినే తిండి ,ఉండే ఇల్లు. ఇలా ఇవన్నీ నావి ,! నాది .!నా స్వంతం  !అనే అహంభావం లో నేనెవరిని అనేది ఉందా..  ?లేక వేరే పరమార్ధం దాగి ఉందా..? అన్నది నిజమైన సత్యాన్వేషణ !.శరీరానికి నేను కు సంబంధం ఉంటే నిద్రలో నేను అనేది ఉండడం లేదు కదా , !అలాగే ఎదో ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో పని లేకుండా నేను అనేది ఎక్కడో ఎంతో సేపు తిరుగాడుతూనే ఉంటుంది కదా.. !అనగా నేను వేరు !,,నీవు వేరు  !అనగా ఈ శరీరం వేరు  !అని ఖచ్చితంగా చెప్పవచ్చును.. ఇక నేనులో శరీరం ఉందా లేక శరీరంలో నేను అనేది ఉందా . ? అన్నది అనుభవరీత్యా  తెలుసుకోవాల్సిన అంతరంగ మధనం అది  ! నిజానికి నేను అనేది మన భావన మాత్రమే దీనితో పంచేంద్రియాలు మనస్సు బుద్ది అహంకారం జోడించబడి ఉంటాయి., ఈ భావచైతన్యం దేహమంతా వ్యాపించి ఉంటుంది.. నా చేయి  !నా కాలు !. ఇలా దేహ సంబంధం వరకే కాకుండా ఇల్లూ ఆస్తులు బంధువులు ఇలా  తనది అనుకునే అన్నింటిని  కలిపి ,తన  చుట్టూ ఒక పరిధి గీసుకొంటూ చిన్న సామంత సామ్రాజ్యాన్ని ఏలుతున్న సంతృప్తి తో జీవితంలో ఏదో సాదించానన్న ఆనందంతో బ్రతుకుతూ ఉండడం గమనార్హం..! కొందరు ఈ పరిధిని ఆస్తి డబ్బు సంతానం లను పెంచుతూ  ఇంకా ఇంకా తోచినంతగా అభివృద్ధి చేస్తూ, దానితో సంతోషాన్ని పొందుతూ ఉంటారు !.అనగా నేను అనేది ఎవరికి వారు ఉహించుకునే మధురమైన భావన మాత్రమే. !అందుకోసం ఈ దేహాన్ని పనిముట్టుగా తన ప్రయోజనం కోసం  తనకు ఇష్టమైన విధానంలో తన దేహాన్ని  ఉపయోగిస్తూ ఉంటారు.!. ఒక యోగి భావనలో  ఇదే నేను యొక్క స్వభావం స్వరూపం మారుతూ విశ్వాంతరాళం లో నిండి ఉన్న సర్వాంతర్యామి సంగమంలో లయం చెంది   "అహం బ్రహ్మో స్మి !" అనుకుంటూ ఆత్మను పరమాత్మ తో అనుసంధించి బ్రహ్మానంద స్థితిని పొందుతూ ఉంటారు.!.ఇక్కడ నేను యొక్క పరిధి ఆనంతము ,!సృష్టిలోని ఎల్లలు  ఏవీ దానిని బందించడం లేదు...! అందుకే సాధన ద్వారా  "నేనెవరిని !"అనే ఆధ్యాత్మిక అధిభౌతిక అలౌకిక అద్భుత  అతిశయా నంద సచ్చిదానంద స్వరూప వైభవాన్ని గుర్తించగలం !.అందుకు దైవంపై గురి  దృఢమైన విశ్వాసం  అత్యవసరం..! ఈ తత్వ విచారణ తో వివేక విజ్ఞాన పొరలు తెరుచుకుంటాయి. మనసును కప్పియున్న అజ్ఞానాంధకారాన్ని రూపు మాపుతాయి.! ఇందుకు సద్గురువు ఆశ్రయం సజ్జన సాంగత్యం అవసరం ! ,నిరంతరం దైవాన్ని నిష్ఠతో ఆరాధించడం చేస్తూ కృషి చేయాలి !.ఇలా " నేను "అనే ఒకే ఒక్క మాట జీవితపరమార్ధాన్ని సూచిస్తూ చేరవలసిన గమ్యాన్ని తెలుపుతోంది. ! ఈ  అంతులేని యాత్రలో  మలుపులు  అడ్డంకులు చాలా ఉంటాయి.నిత్య దైవ ఆరాధన. శ్రుతి స్మృతి పురాణ శ్రవణ పఠనాదుల ద్వారా  సద్గురు బోధనల ద్వారా మాత్రమే  "తా నేమిటో  "తన అసలు "స్వరూపం " ఏమిటో,స్వయంగా అనుభవైక వేద్యంగా  తెలుసుకుంటాడు .తద్వారా  ముక్తిమార్గాన్ని చేరుకునే నిత్య సత్యాన్వేషన ప్రారంభం అవుతుంది. ఇలాంటి  "పరమపద సోపానాలు " అధిరోహించడానికి భగవన్తుని కృపకోసం ఆర్తితో ఆక్రోశించాలి ,!ఆర్ద్రతతో అర్తించాలి !వేదనతో .ప్రార్తించాలి ! "పూజనం, సేవనం ,భావనం ల  "సాధనా ప్రక్రియ " ల ద్వారా  దైవానుగ్రహం పొందాలి ..!మహాదేవ దేవా, !దేవాదిదేవా ! ఈశ్వరా  !నన్ను దయతో పాలించు ! .నాలో నీ ధ్యానం ,భావం , నామగానమాధుర్యాన్ని గ్రోలే  ద్యేయాన్ని  పెంచు ! తండ్రి !పరంధామా ! పరాత్పరా!. ఆపరాధాలు క్షమించి, అజేయమైన అపురూపం , పరమానందకరము అయిన నీ సాయుజ్యాన్ని అనుగ్రహించు  ,స్వామీ ! శరణు !శరణు !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...