Sept 30 , వారణాశి
"శ్రీకృష్ణ దివ్య సచ్చిదానంద స్వరూపాన్ని " ఇష్టపడని వారుండరు ! .అతడి పేరు పెట్టుకొని,పిల్లలను క్రిష్ణ వేషధారణ లో చూస్తూ ,ఆనందించని తలిదండ్రులు ఉండరు !..సకలజనుల సమ్మోహనకర సచ్చిదానంద రూపం ! ,జగన్మోహనాకారం , బాలకృష్ణుని చిన్మయచిదానంద స్వరూపం.!. ఎంతచూసినా కూడా తనివితీరని అలౌకిక అద్భుత ,ఆనందకర అపురూప సౌందర్య విగ్రహ రూపాన్ని హృదయంలో ఒక్కసారి నిలుపుకుంటే పొందే ఆత్మానందానుభూతిని మాటల్లో చెప్పలేము.. సరికదా ! అది కేవలం అనుభవైకావేద్యము .! ఆత్మ ,పరమాత్మల అద్వితీయమైన అనురాగ బంధం!. ఒకరకమైన అవినాభావ సంబంధము ! చిన్నికృష్ణయ్య, రేపల్లెలో ఎన్నో కొంటె చేష్టలు చేస్తూ గోపీ గోపకులను ఎంతో సంతోషింప జేశాడు , అని భాగవత పురాణ వ్యాఖ్యానాల ద్వారా మనం ప్రేమతో ఇష్టంగా విన్నాం. ముఖ్యంగా వెన్న ,పెరుగు, పాలు ఇతర గోపికలయిండ్లలో చొరబడి తినడం తోటి స్నేహితులకు పంచడం ,కోతి పిల్లిలాంటి ప్రాణులకు ఇస్తూ. అందరినీ కలుపుకొని భాగస్వాములను చేసుకొంటూ ,,తమ పిల్లలకు కూడా పాలు వెన్న ఇవ్వకుండా మధురలో డబ్బుకోసం అమ్ముకోడానికి వెళ్తున్న గోపికలను అడ్డుకొని ,వారికి వెన్న యొక్క ప్రాచుర్యాన్ని ,సత్వగుణ సంపదనీ ,అందులో ఇమిడివున్న దైవారాధన భావాన్ని ,. అద్వితీయమైన ఆత్మ సమర్పణ భావాన్ని తన బాల్యక్రీడల ద్వారా నిరూపించాడు చిన్నికృష్ణుడు. అయితే అలా " వెన్నదొంగతనం " చేస్తూ కూడా తల్లి యశోదాదేవి దగ్గర మాత్రం తాను "దొంగతనంగా వెన్న తినలేదని "అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా తోస్తుంది కదా..! నిజానికి తన శైశవ స్థితినుండి తాను అసాధారణ పనులు చేస్తూ ,పూతన లాంటి రక్కసులను చంపుతూ , తాను ఒక దైవం అని ,మామూలు పిల్లవాడిని కాదనీ , చెప్పకనే చెబుతున్నాడు. పైగా అంతటి శిశుహంతకురాలికి కూడా మోక్షాన్ని ప్రదానం చేశాడు కదా.!. ఇక తనది కానివస్తువు జగతిలో ఉంటుందా...? తాను సకల సృష్టి కర్త ! స్థితికర్త. ! లయకర్త కూడా ! విశేషం ఏమిటంటే ,వేరే ఇతర పదార్థాలను ముట్టకుండా కేవలం వెన్నలాంటి మెత్తని రుచికరమైన శరీరపోషక పదార్థాన్ని గ్రహించడంలో కృష్ణయ్య ఉద్దేశ్యం ఏమై వుంటుంది ? అని చూస్తే ..1.అది తన వస్తువు.2.అందులో తానున్నాడు 3.వెన్నను చేసిన గోపికల హృదయాల్లో ఉన్నాడు ,5.వారు చేసింద కన్నయ్య కోసమే కదా 6.సత్వగుణాన్ని పెంచి దైవత్వాన్ని ఆపాదించే వెన్న పరమాత్మకు ఇష్టం కాకుండా ఉంటుందా 7.మనలోని సుతి మెత్తని హృదయాన్ని కూడా వెన్నవంటి సాత్విక భావ సంపదతో నింపి పరందామునికి నివేదన చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో కృష్ణయ్య ఆంతర్యం , అలా వెన్నదొంగగా ఆడిన ఒక బ్రహ్మానందకరమైన రసవత్తరమైన, రమణీయ నాటకం. ! 8 .తన వస్తువును తాను తీసుకోవడం ,అదీ తనకోసమై తయారుచేసింది ,,చెప్పి తీసుకున్నా చెప్పక తీసుకున్నా కూడా , దొంగతనం అవుతుందా..? శ్రీరాముని ఆదర్శజీవిత నడవడిని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టవచ్చును .కానీ శ్రీకృష్ణ తత్వాన్ని ,లీలల అంతర్యాన్ని మాత్రం మహామునులు ,ఋషులు, ఎందరో తత్వవేత్తలు కూడా గ్రహించలేక పోయారు. కదా ,ఇక మనబోటి సామాన్యులకు సాధ్యమా .?
No comments:
Post a Comment