Oct 31, 2018
శివలింగం అంటే జ్ఞానానికి సంకేతం.! ప్రాణానికి జయానికి ,శుభానికి ,మంగళాకారుడు ,సృష్టి స్థితి లయకారుడు ,త్రిగుణాతీతుడు ,విశ్వంభరుడు ,సర్వాంతర్యామి ,అయిన శివ పార్వతుల అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించే రూపం . ఈ శివలింగం !"లింగం "అంటే స్త్రీ ,లేదా పురుష,జాతిని తెలిపే పదం ! ఈ,,సృష్టి మొత్తం స్త్రీ పురుష సమ్మేళనమే.!" శివమ్" అంటే విశ్వవ్యాప్త శక్తి చైతన్యస్వరూపం !. మిగతా దేవుళ్ళను ఆకారం తో పూజిస్తే ,పరమేశ్వర ధ్యానం ,పూజా ,అర్చనలకు శివలింగమే ఆధారం.!.స్త్రీ ఆధారంగా శక్తి స్వరూపిణిగా ప్రాణ వట్టం సూచిస్తే ,,లింగ రూపం చైతన్యం గా శివుణ్ణి సూచిస్తుంది !. ,చరాచర జీవుల్లో ,నిండి ఉంది ఈ శక్తిచైతన్య ప్రభావం! స్థూలంగా చూస్తే . " నేను" అనబడేది ఒక మాంసపు ముద్దమాత్రమే ! శరీరం వచ్చింది మట్టినుండి..! అంటే నేలను ఆశ్రయించిన గాలి, నీరు, అగ్ని, మట్టి ,ఆకాశము లతో ఏర్పడిన పంచభూతాత్మక ము ఈ దేహం !ఇక జీవించేది కూడా ఆ ఐదింటితోనే..కదా !చివరికి కలిసిపోయేది కూడా ఇదే ఐదు భూతాలలో నే..! .. శివలింగానికి జీవునికి ఉన్న తేడా ప్రాణం ఒక్కటే అనగా చైతన్యం , !అది కదలదు. ! ఇది కదులుతోంది..!కానీ శివునికి " స్థానవే "నమః అనే పేరు కూడా ఉంది ! ..అనగా కదలడానికి ఇసుమంతైనా చోటులేకుండా విశ్వవ్యాప్తంగా ప్రకాశిస్తూ ఉండేవాడు ,,అంతటా తానై ఉన్నవాడు కదిలేది ఎక్కడికి ? కదలని శివలింగం లో "చైతన్యం లేదు "అనడానికి వీలు లేదు .ఆ చైతన్యం విశ్వవ్యాప్తం దానిని మనలాంటి సామాన్యులకు అందని విషయం..! మనకు వీలుగా దర్శించి సేవించుకోవడానికి ఈశ్వరుడు ఇలా తనకు తాను చిన్న శివలింగ రూపంలో కుదించుకొని మనకు ఈ సౌలభ్యాన్ని కలిగిస్తున్నాడు.!నిజానికి అంతటి బ్రహ్మాండనాయకుడిని దర్శించి , పూజించేది ఎలా !.ఏ దేవుడినైన మూర్తి ఆకారంలో పట్టుకోవచ్చేమో కానీ శంకరుడిని ఒక రూపంలో చూడటం కుదరదు..ఒక్క శివలింగ రూపంలో తప్ప..! అందుకే. శివాలయానికి వెళ్లేముందు శివ తత్వాన్ని కొంత అర్థం చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది.! అతడు ".నిరాకారుడు ,నిర్గుణుడు "కదా .ఇలాంటి ఆకారం ఎందుకు శివయ్యకి.. ? అన్న ప్రశ్నకు ముందు "నేను ఎవర్ని.?".అనే ఆలోచన తో జవాబును వెదకాలి ! ఈ మానవజన్మ కు కారణం చేసుకున్న కర్మలు అనుకుంటే ,ఈ రథాన్ని నడిపించేవాడు చోదకుడు ఈశ్వరుడు అవుతున్నాడు ! ప్రాణవాయువు రూపంలో. తానుంటూ, శరీరంలో ని అణువణువునా నిండి ఉండి,, తన శివచైతన్యం తో జననం నుండి మరణం వరకు ఈ జీవుని వెంట సాక్షిగా ఉంటూ.. జీవితంలో మాధుర్యాన్ని పండిస్తున్నాడు..మన . లోన ఉంటూ ,ఆకలి కలిగించడం ,రుచి పుట్టించడం ,తిన్నది అరిగించడం ,అండ, వీర్య కణాల ఉత్పత్తితో. ఉత్పాదక శక్తిని ,,,ప్రకృతి సంపదలను వినియోగించుకునే బలాన్ని ,వివేకాన్ని ,జ్ఞానాన్ని.. పొందిన ఆనందాన్ని కానీ,దుఃఖాన్ని కానీ అనుభవించే ప్రజ్ఞకూడా తానై ఉంటూ. ప్రకాశిస్తూ ఉన్నాడు.!. ఈ వైభవం ,విభూతి, ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వల్లనే కలుగుతున్నాయి.. ఇవే కాదు,ప్రతీ జీవి జీవనము లో వెంట తెచ్చుకుంది ఏదీ లేదు. కర్మలు అనబడే మూటలు తప్ప..!అలాగే నిష్క్రమణ కూడా కర్మలు మోస్తూనే వెళ్ళాలి.. ఇదంతా ఈశ్వరుని ఇఛ్చానుసారం నడుస్తుందని అందరికీ తెలుసు. ! కానీ అలా భావించే జ్ఞానానికి మసి అనే "అవిద్య " పూసి స్వయంప్రకాశాన్ని కోల్పోయింది .. లోనున్న దైవశక్తి ని తెలుసుకున్న వాడే నిజమైన విద్యావంతుడు.అవుతున్నాడు ఈ శరీరంలో ఎంత జ్ఞాన,,,భావ ఆధ్యాత్మిక ,శాస్త్రీయ ,దైవ సంపద,లు ఉన్నాయో, తెలుసుకోడం మన తరం కాదు.. జీవుడు దేవుడని తెలుసుకుంటే.. శివలింగం లో శివపార్వతులు ఉన్నారని కూడా తెలుస్తుంది..ఇదంతా విజ్ఞానం లో అనగా నిరంతర సాధనతో అనుభవం ద్వారా తెలుసుకున్న విషయం లో శాశ్వత సుఖము ,పరమానందం ఉంటున్నాయి .పరమేశ్వరుని దర్శన, స్పర్శనలో ఉన్న సుఖం ప్రాపంచిక సుఖాల్లో లేదు.. ఇది అనుభవైకావేద్యము.. అదే తపన తపస్సు తో శివలింగాన్ని పూజిస్తేనే ,ఆ జ్ఞానం ,దానితో బాటు ఈ బ్రతుకు నకు అర్థం ,పరమార్ధం గోచరిస్తుంది !! "భక్తి జ్ఞాన వైరాగ్యాలు ,"మనకు ఈశ్వరుడు అనుగ్రహిస్తున్న ప్రసాదాలు !నిత్యం. దైవానికి ఇచ్చే మంగళ హారతి ,ఎదురుగా ఉన్న శివలింగానికేనా.? లేక . మనలో దేదీప్యమానంగా వెలుగుతూ.. జ్ఞానేంద్రియాల ప్రకాశంతో ప్రపంచాన్ని ఆనందమయంగా దర్షింపజేస్తున్న అంతర్యామిగా భాసిస్తూ,, నీ హృదయంలో కొలువై ఉన్న అర్ధ నారీశ్వర స్వరూప తేజానికా.? ...! మనలో ఉండి ,జీవితంలో అందాన్ని ఆనందాన్ని వర్షిస్తూ ,జీవితాన్ని ధన్యం చేస్తున్న శివ చైతన్యాన్ని ,ఇలా ఎదురుగా శివలింగం రూపంలో భావిస్తూ. మనసారా ఆనందంతో స్వామికి కృతజ్ఞతలు తెలుపుకోడం కోసమే ఈ విదంగా అన్ని శుభకార్యాల వేళల్లో పట్టే మంగలహారతి అంతరార్థం.!. ఎందుకంటే లోనున్న ఈశ్వరుని దర్శించుకునే సత్తా ఆత్మజ్ఞానం మనకు లేదు ! హృదయ అంతరాళం లో అతి సూక్ష్మ రూపం లో కొలువున్న ఆయనకు పూజలు ,అర్చనలు ,సేవలు చేయలేము. ! ,కనుక ఎదురుగా ఇలా శివలింగం ను ఆరాధ్యదైవంగా భావిస్తూ.. ఈశ్వరుని పూజిస్తూ అర్చిస్తూ .ఈ విదంగా మనలోని స్వామిని సేవిస్తున్నామని తృప్తి పడుతూ. సంతోషంగా చేసే ప్రక్రియ ఈ శివారాధన !.మనం నిత్యం చేసే పూజావిధానాలు , విగ్రహారాధన రూపంలోనే కదా ! రూపం ఉంటేనే గాని మనసు నిలబడదు కదా ..!అందుకే ఈ మూర్తి పూజ ! .ఇక ఆదిదంపతులు,,గౌరీశంకరుల అర్ధనారీశ్వర తత్వాన్ని తెలిపే శివలింగ ఆరాధన ,సృష్టిలోని స్త్రీ, పురుష లింగ జాతుల సమ్మేళనం !,,భిన్నత్వంలో ఏకత్వం !,ద్వైతం లో అద్వైతం!,నీవు, నేను వేరు కాదు! నేనే నీవు ,నీవే నేను ! అనగా నేనే శివుడిని.అనే అపురూప అద్వైత భావన. !ప్రాణవట్టం రూపంలో అడ్డంగా ఆధారంగా శక్తి స్వరూపిణి స్త్రీ, అనగా గౌరీ దేవి ఉండగా.. నిలువునా లింగరూపంలో పరమేశ్వరుని భావిస్తాము.. శివలింగ రూపంలో ,! చతుషష్టి కళలతో ప్రకాశిస్తున్న భవానీ శంకరులను 64 రకాల ఉపచారాలలో సేవిస్తుంటాము కదా !. అందులో ఏ ఒక్కటైనా శివలింగం గ్రహిస్తుందా. ? ఎన్ని పాలు,నీరు ,నివేదనలు ,పూలు ,పండ్లు ,సమర్పించినా కూడా , ధ్యానం ద్యేయం భావం చిత్తం శివలింగం పై ఉంచకపోతే చేసిన పూజలు దండగే !అందుకే ,వాటితో బాటు నీ "మనసు "అనబడే హృదయకుసుమాన్ని జోడిస్తేనే గానీ ఈశ్వరుడు ప్రసన్నుడు కాడు !.ఈ నైవేద్య, పూజా పదార్థాలు అన్నీ ఆయనవే..కదా మనం తయారుచేసింది సృష్టిలో ఏమీ లెదు కదా ! తనది తనకే ఇవ్వడంలో మన గొప్పతనం ఏముంటుంది కనుక !' .నాది "అనబడేది ఒకటి నీ వద్ద ఉంటూ నీ మనుగడకు కారణం అవుతోంది.!.అదిగో.. !దాన్ని ఇచ్చేస్తే చాలు ,,నీవు తనవాడివి అవుతావు..@ అహం బ్రహ్మో స్మి..! ఈశ్వరా! .నేనే నీకు ఇచ్చేవాడిని,,,,నీవు తీసుకునే వాడివా..?? ఇవన్నీ నీవే కదా .! అయినపుడు నాది కానీ వాటిని నేను నీకు ఇవ్వడంలో ఎంత అవిద్య అజ్ఞానాంధకార అహంభావం నాలో ఉండి. నిన్ను నేనుగా నేరుగా తెలుకునేందుకు ప్రతిబంధకాలు అవుతున్నాయి..!" శంకరా !" ఎదురుగా శివలింగ రూపంలో నాకోసం నా అజ్ఞానాంధకారాన్ని తొలగించడాని కోసం ఒక ఆకారాన్ని ధరించావా ? తండ్రి ! పరమేశ్వరా.!.ప్రకృతి పురుషులు, పార్వతి పరమేశ్వరులు, శివలింగరూపంలో అబేధంగా అఖండంగా, అద్వితీయంగావిరాజిల్లుతున్నారు జీవుడు వస్తోంది మాతృగర్భంలో నుండి . ఆకారం వచ్చింది స్త్రీపురుషుల సంయోగం నుండి . పుట్టుకకు జీవనానికి ప్రకృతి అనబడే పార్వతిశక్తి మాత ఒడిలో లాలింపబడి..,జీవన చైతన్యానికి కారకుడైన శంకరుని చేయూత తో ..సకల ప్రాణుల మనుగడకు ఆధారమైన పార్వతీ పరమేశ్వరుల సన్నిధిని సూచించే భగవద్ వైభవ సంకేతమే మన శివలింగం.. భావములోనా ,బాహ్యమునందున ఈ శక్తిచైతన్యాలతో జీవిస్తూ కూడా.. వాని ములాధారాలైన శివలింగ జ్యోతి స్వరూప దర్శనంతో పరమానందం పొందకపోతే.. మనిషిని రెండు కాళ్ళ పశువుతో పోలిస్తే తప్పేంటి. ? ఎన్ని కొబ్బరికాయ లు పగులగొట్టినా అహం అనే పెంక తొలగక పోతే,, అందులో స్వచ్చంగా తీయగా ,దివ్యంగా పవిత్రంగా ,పరమాత్ముని దర్శనంగా ,మధురమైన ,మృదువైన ,సాత్విక మైన,, కొబ్బరినీరు, కొబ్బరితురుము. ఈ జన్మకు అర్థాన్ని తెలిపినా ...అలా అంతగట్టి తనం గల నేను అన్న భావన పోయి.. ఈశ్వరా అణా భావం కలగాలంటే.. శివలింగ ఆరాధన అత్యవసరం. దానిలో నీవు పరమేశ్వరవైభవాన్ని దర్శించ గలిగితే . ,అప్పుడు నీకు శివాలయంలో కి ప్రవేశించే యోగ్యత సిద్దించినట్లుగా భావించాలి. అంతః కరణశుద్ది తో శివారాధన చెయ్యాలి.కాశీకి వెళ్ళాలి. కాశీఖండం విశేషాలు వినాలి.. పవిత్ర హృదయం కలగాలంటే పాపాలు పోవాలి. దానికి గంగా స్నానం ,విశ్వేశ్వరుని దర్శనం చెయ్యాలి.. అంతటా అన్నివేళలా ,ఈశ్వరవైభవ అనుభూతిని పొందాలి. చేసే ప్రతీ పనిని ఈశ్వరుని ఆజ్ఞగా, తినే ఆహారం శివయ్య ప్రసాదంగా. నడుస్తున్న చీమ దోమ కుక్క మొదలైన సర్వ ప్రాణుల్లో శివ చైతన్యాన్ని భావిస్తూ దర్శిస్తూ పులకిస్తూ బ్రతికే బ్రతుకు నిజమైన ,,జీవితం. ఈశ్వరుడు మెచ్చిన విధానం.
Thursday, November 1, 2018
శివలింగం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment