Sept 30
""పరమ పావనక్షేత్రం "!" గా భాసిల్లే కాశీ క్షేత్రంలో ,వారం రోజులనుండీ ఈశ్వర సమర్పణా భావంతో తృప్తిగా ఉంటున్నాం.! చక్కగా ప్రతిరోజూ గంగాస్నానం, పితృదేవతలకు తర్పణాలు , సూర్యభగవాను నికి ఆర్ఘ్యం .., కేదార్ నాథ్ ఘాట్ శివ సాన్నిధ్యం లో వేణునాదం, అందులో గల ఎన్నో శివలింగాల దివ్య దర్శనం! ,పిదప విశ్వేశ్వరుని దర్శనం,! క్యూలో అరగంట పాటు తోటిభక్తుల తో సామూహిక హరుని భజన..! "హరహర మహాదేవ శంభో.. కాశీ విశ్వనాథ గంగే !" అంటూ ఆనందంగా ఆనందనిలయుని ఆనందవనం లో ఆర్తితో పాడుకోడం !..విశ్వేశ్వరుని దివ్య దర్శనం , అక్కడ గాయత్రీ మంత్ర ధ్యానం ,!అన్నపూర్ణమ్మ ముంగిట్లో లలితా సహస్రనామ, ఖడ్గమాల,లలితా అష్టోత్తర శత నామావలి.. చదవడం,! అన్నపూర్ణమ్మ ప్రసాదం 'భిక్షామ్ దేహి అనుకుంటూ "" మాతృభిక్ష "వలె ఎంతో ఆనందంగా భుజించడం ! ,విశాలాక్షి మాత ఆలయంలో అమ్మ దర్శనం,!,సాయంత్రం కరివేన సత్ర ఉపహారం !.ఆంద్ర ఆశ్రమంలో కాశీ ఖండం,ఉపనిషత్తు ల శ్రవణం.!. వెంటనే రెండు గంగా ఘాట్ లలో కన్నుల పండువుగా గంగాహారతి వైభవ దర్శనం ! ""ఇలా అద్భుతంగా వైభవంగా ,భక్త జనం మధ్య చిత్తశుద్ధి తో ఆనందంగా ,గడుస్తోంది. ఈ రోజువరకు .!ఇల్లు వాకిలి ధ్యాస మరిచాం..! పితృపక్షాల రోజులు కనుక గంగాతీరం కోలాహలంగా ఉంటోంది.!. అయినా పదిమందిలో పరమేశ్వరుడు ఉంటాడని ,రోజు రోజుకూ ఈ క్షేత్ర దివ్య వైభవ దృశ్యాలు మనసుకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తున్నాయి..! "కాశీ క్షేత్రనివాస వైభవం..వలన, పురాణ శ్రవణం వలన , చేస్తున్న దానిలో తృప్తి ,సంతోషం ఉంటున్నాయి..! కానీ మరి రెండు రోజుల్లో స్వస్థలం వెళ్లిపోవాలంటే బాధతో బాటు దుఃఖం కూడా కలుగుతోంది.!.ఎందుకు ? " అంటే. కాశీలో అణువణువునా గల శివమహాత్మ్యం, శివమయం, !మనతో పోటీపడుతూ విదేశస్తులు కూడా చక్కగా కట్టు ,బొట్టు ,జడ, లతో అన్నిచోట్లా సంప్రదాయంగా కనిపిస్తుండడం ,! వారు ఏండ్లనుండి ఇక్కడ గడపడం.!. అంటే ఇక్కడి కాశీ క్షేత్ర మహిమ ,విశ్వేశ్వరుని పై ఉంచిన నమ్మకం వారిలో కూడా ఎంత దృడంగా బలపడుతుందో తెలుస్తోంది.. ! అంతేకాదు..,!తెలిసో , తెలియకో చేసిన పాపాలు , గంగాస్నానం ,విశ్వేశ్వరుని దర్శనం వలన క్షేత్ర నివాసం వలన ప్రక్షాళన అవుతాయి ,! " 'అని ఈశ్వరుని శాసనం.! ఇక మనకు మిగిలింది అలౌకిక ,ఆధ్యాత్మిక, పరమానందమే.కదా ! .రామకృష్ణ పరమహంస కి ఒకసారి సందేహం కలిగిందట ,"కాశీ లో మరణిస్తే నిజంగా శివుడు స్వయంగా వచ్చి తారకమంత్ర ఉపదేశం చేస్తాడా.? జీవునికి మోక్షం ఇస్తాడా...? "అని యోగదృష్టితో ధ్యానిస్తే ,అప్పుడు అతడికి కాశీ నగరంలో ఒకచోట చచ్చి పడివున్న కుక్కశవాన్ని ఒడిలో పెట్టుకొని దాని చెవిలో తారక మంత్రం ఉపదేశం చేస్తున్న విశ్వేశ్వరుని దివ్యరూప వైభవసందర్శన భాగ్యం ఆయనకు అంతరంగంలో ద్యోతకమయ్యిందట. ! ఆ దృశ్యం దర్శించిన పరమహంస "పరమనందంతో నృత్యం " చేశాడట !.పరమహంస గారి అద్భుత కాళీ ఉపాసనా బలం వల్ల ,కాళీ మాతతో,బాల కృష్ణునితో ,శివయ్యతో అలా అలా అంతరంగంలో రమిస్తూ ,తాదాత్మ్యం తో ఆనందిస్తూ ,బాహ్యప్రపంచము మరిచి, బ్రహ్మానంద స్థితిలో గంటల తరబడి గడపడం. అనితర సాధ్యం !,అలాంటి అద్వైత అపురూప ,.మానవాతీత మైన శక్తిని పొందడం. ఇదంతా ఆయన ఆరాధనా బలం. వలన లభించిన ఫలం ! ఈశ్వర తత్వం పై ప్రగాఢమైన అవగాహన..,! సనాతన వైదికధర్మం పై చెదరని నమ్మకం, !ఇష్టదైవం పై గురి !, ఆత్మ సమర్పణా భావం !, ""నేను దేహాన్ని కాదు, !నాలో ఉన్న దైవాన్ని నేను చూడగలను.! "అహం బ్రహ్మో స్మి ! " అంటూ "' మీరు దేవున్ని చూశారా ?'"అన్న వివేకానందుని ప్రశ్నకు " చూశాను !" నీవు కూడా దీక్షతో ప్రయత్నించి సాధన చేస్తే చూడగలవు.. !" అని ప్రత్యక్షంగా పరమాత్మ సాక్షాత్కార యోగాన్ని సిద్ధిమ్ప జేసీ. మాతృభూమికి విశిష్టమైన దేశభక్తుని తయారుచేసి పంపిన మహనీయుడు రామకృష్ణ పరమహంస అయితే అతని శిష్యుడు ,మనదేశ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ఖండాతరాలకు వ్యాపింపజేసి భారతదేశ కీర్తిప్రతిష్టల ను చాటి చెప్పిన మహా పురుషుడు ,!యువజన వైతాళికుడు ! ,సంఘసంస్కర్త,, మన నరేంద్రుడు. ! అంతేకాదు ,! దేశ యువతను భుజం తట్టి లేపి ,వారిలోనిద్రాణంగా ఉన్న అద్భుత దివ్య శక్తుల ప్రభావాన్ని గుర్తు చేసి ,వాటిని వినియోగిస్తే కలిగే ప్రయోజనాన్ని ,యువత శక్తిని ,,వారి అంతరాళం లో దాగివున్న ఆత్మశక్తిని, చక్కగా నిర్వచించి బోధించి , యువత నిర్వీర్యం కాకుండా శక్తివంతులను చేస్తూ ,వారికి మార్గదర్శకం చేసిన "ఆధ్యాత్మిక యోగ గురువు.".అతడు !మనదేశ ఆధ్యాత్మిక సంపదను గుర్తుచేస్తూ ,ఆత్మబలాన్ని అందించిన స్వామి వివేకానందుడు , పరమహంస శిష్యుడు..! ఇలాంటి అసాధారణ అతీంద్రియ అద్భుత ప్రజ్ఞలను , "సత్య సాయి, షిర్డీసాయి, శృంగేరి చంద్రశేఖర సరస్వతీ మహా స్వామి ! "లాంటి గొప్పయోగి పుంగవుల జీవనవిధానాల పఠనం ద్వారా గ్రహించవచ్చును..!. అందుకే కాశీ క్షేత్రం దివ్యం , !ఇక్కడి జీవనం పాపహరం,! నివాసం, భుక్తి ముక్తి దాయకం.!, గౌరీశంకరుల ప్రత్యక్ష విహార నివాస స్థలం ! కనుక "అవిభక్త క్షేత్రం ! ",అనగా విశ్వేశ్వరుడిని ,కాశీ నుండి వేరు చేయలేము. !" అనగా శివుడిని ఒక్క అతడి ఆలయంలోనే కాదు ! ,ప్రతీ లింగంలో ప్రతీ స్థలంలో ,5 క్రోసుల పరిధిలో , ఉంటాడు గౌరీదేవి తో కూడి.!గంగానది ప్రవాహానికి పశ్చిమదిశ లో అనుకోని ఉన్న భూభాగానికి కాశీ క్షేత్రం అని పేరు..! సృష్టిలో పరమేశ్వరుడు గౌరీదేవి తో కలిసి పృథ్వి పై ,తమకోసం నిర్మించుకున్న మొట్టమొదటి ఏకైక పరమ పావన క్షేత్రం ,ఈ కాశీక్షేత్రం..! నిజానికి ఇది స్మశానస్థలం, !ఇదే ఆనందవనం..!రుద్రుడు ప్రమదగణాలతో స్మశాన వాటికలో ఆనందంతో డమరుక శంఖ వాద్య నినాదంతో ,నిత్యం విలయతాండవ నృత్యం చేసే చోటు ఈ కాశీ క్షేత్రం ! సచ్చిదానంద స్వరూపంగా క్షేత్రం అంతటా విశ్వేశ్వరుని దర్శించవచ్చును.. !నాకు మొన్న దర్శనం ఇచ్చిన కుర్ర బ్రాహ్మణుడు ,అలా బాలపరమేశ్వరుని రూపంలో వచ్చిన విశ్వేశ్వరుడే అని గ్రహించాను నేను పురాణం విన్నాక !అలా vivida రూపాల్లో కనబడుతూ భక్తులను అనుగ్రహిస్తాడు . అని ఈ రోజు కాశీ ఖండ పురాణ వైభవ శ్రవణంలో విన్నాను. ! పట్టలేని ఆనందం కలిగింది.నాకు.! అతనిదర్శనం కంటే మహాభాగ్యం ,మహానందం ఉంటుందా ! అందుకే "విశ్వేశ్వరుని తో ఇంత అనుబంధం "పెంచుకున్న నాకు కాశీని విడిచిపెట్టి వెళ్లాలంటే ,వేదన కలగకుండా ఉంటుందా.? పరమేశ్వరుని కృప వల్ల కలిగే యదార్థ విషయ జ్ఞానం నుండి తిరిగి సంసారంలో పడి పదార్థజ్ఞానం వైపు మళ్లడం అజ్ఞానం అవివేకం ,మూర్ఖత్వం కాదా. ? ఎన్నో జన్మలనుండి అజ్ఞానం అవిద్య ,అనే నిద్రావస్థలో ఉన్న జీవునికి ,ఈ జన్మలో ఈ విధంగా విశ్వేశ్వరుని కరుణతో వివేకంతో ఈశ్వరుని గుర్తించి సేవించే భాగ్యం ఇక్కడ ఈ కాశీ క్షేత్రం లో నివసించడం వలన సిద్దిస్తోంది..! ఎందుకంటే ఈ క్షేత్రంలోకి మన పాపాలు కర్మలు మనవెంట ప్రవేశించలేవు.! అది ఈశ్వరుని శాసనం. ! ఇక్కడ నిత్యం చేసే గంగా స్నానం ,లింగదర్శనం ,దానము ,పురాణ శ్రవణం లాంటి పుణ్య కర్మల ప్రభావం వలన వేరే క్షేత్రాల కంటే ఇక్కడ వందరెట్లు సత్పలితాలు లభిస్తున్నాయి...! "" ఇక ఇదంతా విన్నాక . ఇప్పుడు చెప్పండి ! "ఇంతటి పునర్జన్మ రాహిత్యం, మోక్షదాయకం ,పరమానందకరం ,పరమార్థదాయకం అయిన ఈ దివ్య మోక్ష ధామాన్ని విడిచి వెళ్లడం భావ్యమేనా... ? అయినా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు కదా.. ! అందుకే విశ్వేశ్వరుని నిర్ణయం శిరోధార్యం.. ఆయనపై భారం వేసి.. హరహర మహాదేవ శంభో శంకర. అంటూ పరమేశ్వరుని దివ్య మంగళ కర రూపాన్ని ఎదలో నిలుపుకొని , ఈ హృదయమే అతని ఆలయంగా భావించి సేవించే శక్తినీ స్ఫూర్తిని, అదృష్టాన్ని, సమయాన్ని ,నిశ్చలమైన భక్తినీ, అనుగ్రహించమని త్రికరణ శుద్దితో కాశీ విశ్వనాథుడిని నిరంతరం ప్రార్తించుకుందాం , ! పరమేశ్వర కృపకు పాత్రతను ,యోగ్యతను ఆర్తితో ,అన్యధా శరణం నాస్తి అన్న సత్ భావనతో సంపాదించుకుందాం ! మహాదేవ మహాదేవా ! ఓమ్ నమః శివాయ..!
No comments:
Post a Comment