Nov 15, 2017
ఆనందకరమైన రోజు.. ఈ రోజు.. కార్తీక మాసం. క్రిష్ణ పక్షం ఏకాదశి రోజున సాయంత్రం. ప్రదోషకాలం.. గూడెం వద్ద పావన గోదావరీ తీరంలో. దివ్య నదీ జలాల్లో స్నానం. పితృదేవతలకు నదీ తీరంలో తర్పణాలు.. సూర్య భగ వానునికి అర్ఘ్యం..సమర్పించడం .. ఒడ్డున గల నల్లని మెత్తని రేగడి మట్టితో అద్భుతంగా పార్థివ శివ లింగం చేయడం.. పద్మావతి శివునికి అత్యంత భక్తితో పసుపు కుంకుమ తో అక్షింతలు. లతో అలంకరించడం .. దగ్గరే ఉన్న జ్యోతి దీపం వెలిగించి గంగా మాతకు హారతి నివ్వడం.... ఇంత గొప్ప భాగ్యం కలిగిం చిన పరమేశ్వరుని దయకు జోహరులు జేజేలు.. ప్రణామాలు... ఇక్కడే ఈ పుణ్య నదీ తీర క్షేత్రంలో నే . పుణ్యాత్ములు. పరమ భక్తులైన పద్మిని తండ్రి. నా తండ్రీ పరమపదించారు ... ఈశ్వరా.. నీవెంత కారుణ్య మూర్తి వి. తండ్రీ.. నిరంతరం నిన్ను ఇలా సేవించుకునే అదృష్టాన్ని అనుగ్రహించు.. కోటి లింగేశ్వర.. ధర్మపురి లక్ష్మి నారసింహ.. గూడెం సత్యనారాయణ స్వామీ. నమో నమః..
నిన్నటి రోజున సాయంత్రం కార్తీక సోమవారం ప్రదోష వేళ లో. శివాలయంలో పార్థివ శివలింగ పూజ నం దర్శనం.. నేడు గంగా తీరంలో అదే సమయానికి పార్థివ శివ లింగం చేసి. గంగా హారతి నివ్వడం. . ఇదే సమయానికి కాశీలో నిత్యం చేసే గంగ హారతి నీ జ్ఞాపకం చేసింది..... ఆ తలంపులో ఎంత ఆనందం. ఎంత దివ్యత్వం.. ఆహా.. ప్రశాంత వాతావరణం లో చల్లని గంగాజలా ల తీరంలో.. చక్కని సామగాన భజన యుక్తంగా. ఏడుగురు సప్తర్షులు ఒక గంట పాటు . విధి విధానంగా.. సుమారు మూడువేల మంది కాశీ నివాసులు భక్తులు యాత్రికుల సౌకర్యార్థం. అద్భుతంగా అపురూపంగా.. భక్తి పారవశ్యం తో. గంగా మాతకు నిత్య నూతనంగా. దశాశ్వమేధ ఘాట్ మెట్ల పై సమర్పించే గంగా హారతి వైభవాన్ని. అందాన్ని ఆనందాన్ని.. కాశీ విశ్వనాథుని క్షేత్ర మహిమను పొగడ తరమా...
నేడు కార్తీక మాస ద్వాదశి రోజున.. పవిత్ర గంగా నదిలో స్నానం.. పితృదేవతల తర్పణాలు. సూర్య భగ వంతుని అర్ఘ్యం.. నల్లని మెత్తని మట్టి తో పార్థివ శివ లింగం తయారు తో తృప్తి సంతోషం..... సాంబశివ జ్యోతిర్లింగ ఆలయంలో ద్వాదశ లింగ దర్శనం పూజ నం... దివ్యం. ఆనందకరం. పరమేశ్వర అనుగ్రహం.... ఓమ్ నమశివా య... ఓమ్ నమో నారాయణాయ ... శివాయ గురవే నమః....
No comments:
Post a Comment