Dec 22, 2017
భగవన్తుడు సమకూర్చిన భార్యభర్తల సంబంధం.. అద్వితీయం.. అమోఘం.. శక్తి చైతన్యం... పెద్దలు ఏర్పాటు చేసిన కట్టుబాట్లు సంప్రదాయం వెనక.. ధర్మం. న్యాయం. సత్యం.. ఆచరిస్తూ. అందరికీ ఆదర్శంగా ఉండాలి.. వంశాభివృద్ది తో బాటు. భార్యాపిల్లలతో సంతోషంగా ..ఉండాలన్నది. మానవజన్మ ఉద్దేశ్యం... నిజంగా స్త్రీ మూర్తులతో జగతి ప్రగతి.. వృద్ధి వికాసం. ఆనందకరం.. రమణీయం.. కమణీయం. ..ఆలయాన వెలసిన దేవుని రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి.....
భార్య ల మీద విపరీతంగా వచ్చే జోకులు బాగానే ఉంటాయి.కానీ ఈ ప్రపంచమ్ లో భార్యని మించి మనను చూసుకునేది ఇంకెవరూ లేరు.అమ్మ కొంత వరకు మాత్రమే అనుబంధం కలిగి ఉంటుంది.మన దుఃఖం, సుఖం అన్నింటిలోనూ పాలు పంచుకుని మనకోసమే జీవించే ఓకే ఒక వ్యక్తి భార్య.మనం బయట అన్ని చోట్లా అవసరమైతే తగ్గి మాట్లాడతాం. కానీ భార్య దగ్గరకు వచ్చేటప్పటికి ఇగో ఫీలింగులు వచ్చేస్తాయి.భార్య భర్తలు ఇద్దరూ సమానమే.నిజంగా మనం ఒప్పుకోవాల్సి న విషయం ఏమిటంటే వారు ప్రేమించినoతగా మనం వారిని ప్రేమించలేము.వారి మీద చెయ్యెత్తారంటే ఇక పురుషుల జన్మ అనవసరం.బయట చాలా బాగుంది ఇంట్లో బిగుసుకు పోయే వారు చాలామంది ఉన్నారు.మనకు ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు చూడొచ్చు వారి ప్రేమ.తగ్గేదాకా వారు చేయని ప్రయత్నం ఉండదు.వారికి గుడి కట్టక్కర్లేదు కానీ మనిషి గా చూడండి. ఈ ప్రపంచం లో100 శాతం మన గురించే ఆలోచించే ఓకే ఒక వ్యక్తి శక్తి ఆమే. తన పెదవులపై చిరునవ్వు పోనీకుండా చూడండి
No comments:
Post a Comment