Sunday, October 7, 2018

మమ పితృభ్యో నమః...

Dec 25 2017
శ్రీరామ చంద్రుని భక్తుడు.. శ్రీరామదాసు అంశ. ఉన్న. భక్తుడు... ఆనందరామాయణ. కావ్యాన్ని తన స్వీయరచనల్లో భక్తిని పండించిన. నియోగి బ్రాహ్మణుడు.... ఇంటిలో ని హాలులో దేవుళ్ళ నిలువెత్తు ఫోటోలు .వేలాడదీసి. తన రామభక్తిని ప్రకటించిన. నిష్కామయోగి..తొక్కుడు హార్మోనియం పై  ప్రతిరోజూ ఉదయం. అద్భుతంగా భక్తిపారవశ్యంతో రామగానంచేస్తూ భక్తి గీతాలను పద్యాలను పాడుతూ.. భజనలు చేస్తూ. జీవితాన్ని సార్ధకం చేసుకున్న సంగీతకారుడు..... ఎన్ని కష్టాలు వచ్చినా .చివరికి దీర్ఘవ్యాధితో. అత్తవారింట్లో .దిక్కులేని పరిస్థితి లో.. ప్రాణం పోయే సమయంలో కూడా.. ధర్మం  నిజాయితీ తప్పని. మహానుభావుడు... మా తండ్రిగారు.  "! అని చెప్పుకోడానికి నాకు గర్వన్గా సంతోషంగా. తృప్తిగా ఉంది...ఆయన పుణ్యమే మమ్మల్ని. పునీతులను చేస్తోంది.. ఆ ధర్మమే. మాకు శ్రీరామరక్ష యై.. రక్షణ కవచమై. సద్బుద్ధి పథం లో నడిపిస్తోంది... తండ్రీ.. నీవు ఎలా ఉంటావో. తెలీని చిన్నతనంలోనే. నిన్ను కోల్పోయాం.. అయినా నీగురించి రాగంపేట గ్రామస్తులు. మన బంధువులు బ్రాహ్మణులు.. చెప్పిన మాటలతో... మాకు తెలిసింది.. మా తండ్రిగారు. ఉత్తములు.సాదుస్వభావి.సంస్కారి..మేధావి.. చక్కని దస్తూరీ తో.. సవ్యసాచిలా. తన రెండుచేతులతో. పహణీ లు రాయగల బహుముఖ ప్రజ్ఞాశాలి. మొక్కవోని వ్యక్తిత్వం కలిగిన పట్వారీ.. ఎంతటి ఆఫీసర్ నైనా.. తహసీల్దార్ నైనా .తన నేర్పుచే వాక్చతురత చే.. మెప్పించిన ప్రతిభావంతుడు.....    ఆహా.. భాగ్యమన్న మాదే...! ఎంతటి సౌజన్యం. సౌశీల్యం. సంస్కారం. ప్రజ్ఞాశాలి అయిన  సత్పురుషుడు. మాతండ్రిగారు...!"   శ్రీరామచంద్రా.!".నీ దయ అనుగ్రహం ఇలానే. మాపై కూడా ఉంచు..! తండ్రీ..!". ఇదే మా శ్రద్ధాంజలి... నిన్ను మరవకుండా నీకు తర్పణాలు విడవడం.. నీవు వదిలిన రెవెల్లి వంశ సంప్రదాయాలను ..హరితస గోత్రంతో అనుసంధానం చేస్తూ.. సాగిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు... భక్తిజ్ఞాన వైరాగ్యాల. బాటలో నడిపించు.!"ఆ రాజారాముని. స్మరిస్తూ. జన్మ చరితార్థము అయ్యేలా  దీవించు..!..మమ పితృభ్యో నమః  !" శ్రీ సీతారామచంద్ర భగవానునికి జై... స్వామియే శరణం.. అయ్యప్పా...శరణం.. శరణం....! "

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...