Sunday, November 4, 2018

సృష్టి

సృష్టి అంతా భగవంతుని సృజన. ప్రతీ ప్రాణిలో , ,చెట్టు గుట్టా, కొండా, లోయలు, సముద్రంలో, సర్వమ్ అణువణువునా నిండిఉన్న దైవాన్ని గుర్తించడం మనకు కష్టమౌతోంది.. అందుకు మన కర్మలు, అవిద్య, అజ్ఞానం ,సంస్కారం ప్రతిబంధకాలు అవుతున్నాయి,, జీవునిలో ఉన్న ప్రాణశక్తియే ఈశ్వరుడు , లోన ఉంటూ తాను ఇచ్చిన శరీరాన్ని ,అందులోని పంచేంద్రియాలను ,జీవుడు చేసిన గతజన్మ కర్మలకు అనుగుణంగా చేయిస్తూ ,ఆ విధంగా బుద్దిని ప్రేరేపింపఁ జేస్తూ , ఫలితాలను అనుభవింప జేస్తూ , తాను మాత్రం సాక్షిగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఇన్ని కోట్ల రకాల మనుషులు ఉన్నా శరీర ఆకారాలతో బాటు ,వాని రంగు ,ఎత్తు ,,అభిరుచుల తో బాటు ,,ఎవరి ఆలోచనలు, పనులు ,కర్మలు ,ఫలితాలు అనుభవింప జేస్తూ ఉన్నాడు ,అన్నీ వైవిద్యాలే ,కానీ ఒకే ఒక సర్వ సాధారణ శక్తి, ప్రాణం రూపంలో అంతర్యామిగా జీవునిలో జననం నుండి మరణం వరకు ఉఛ్వాస నిశ్వాసాల రూపంలో నిరంతరం కదలాడుతూ ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఉన్నంతవరకు మనం సర్వ శక్తివంతులమే ,బుద్దిమంతులమే .ప్రాణం పోయిందా ,దేహం బుద్ది జ్ఞానం ,శక్తి యుక్తి ప్రజ్ఞా పాటవాలు అన్నీ ఆ గోవిందుడు తీసేసు కుంటున్నాడు.. ఈ నిజాన్ని అనుభవం ద్వారా తెలుసుకోడమే , విజ్ఞానం అవుతుంది.. ఇదే ప్రాణశక్తి ఆధ్యాత్మిక శక్తిగా ఎదగడానికి ,మనలో ఉన్న పరమాత్ముని గుర్తించడం అత్యవసరం. అతడు ఆనంతుడు ,మానవునిలో కూడా అద్భుతమైన ,అనంతమైన, అమోఘమైన శక్తియుక్తులు దాగిఉన్నాయి !,,శారీరికంగా ను ,మానసికంగాను తాను ఎంతో బలవంతుడు! ,,కానీ అలసత్వం, అంటే అవివేకం ,అజ్ఞానం తో బాటు అమితమైన నిర్లక్ష్యం ,బద్దకం, తో ప్రాణశక్తి ని దుర్వినియోగం చేస్తూ తనకు తానుగా దైవానికి దూరం అవుతున్నాడు!. కేవలం గుర్తిస్తేనే సరిపోదు కదా ,!",కృషితో నాస్తి దుర్భిక్షం.!". ఏ వృత్తిలో నైనా కష్టపడనిదే ఫలితం దక్కదు కదా !,అందుకు తగిన తపన, సాధన, అంకితభావం ఉండాలికదా మనకు.! ఉదాహరణకు మనం ఆఫీసులో పనిచేస్తూ ఉపయోగిస్తున్న శక్తియుక్తులను ,సెలవుల్లో దాచుకుంటున్నాం అదే శక్తిని వినియోగిస్తే లాభం మరింత గొప్పగా చేకూరి నట్లుగా ,,అంతటా నిండిఉన్న పరమాత్మ వైభవాన్ని గుర్తించడానికి కష్టపడాలి !సాధన చేయాలి, !చొరవ చూపాలి ,!!చేస్తున్న కర్మలు నిరాపేక్ష భావంతో చేస్తూ ,దైవసాక్షిగా తాను కూడా కర్మల ఫలితాల పట్ల ఆపేక్షను అతిగా చూపకుండా కేవలం నిమిత్తమాత్రుడి గా వ్యవహరించడం చేయాలి !,పుణ్యాలు దక్కినా అంటే "సుఖం "అనుభవానికి వచ్చినా ,పాపాలు అంటే "తీరని కష్టాలు "ఎదురైనా "సర్వమ్ పరమేశ్వరార్పణ మస్తు !"అనే భక్తి జ్ఞాన వైరాగ్య భావ సంపదతో ,ఆత్మజ్ఞానంతో ఆధ్యాత్మిక దృక్పతం తో తృప్తిగా వ్యవహరిస్తే ,అప్పుడు మనం పొందే ఆనందమే " నిజమైన ఆనందం ""అవుతోంది కదా !! అదే పరమానందం గా ,ప్రశాంతజీవనంగడపడానికి మార్గం సుగమం చేస్తుంది ! , అలాంటి అనుభవమే,అద్భుతం! ఆమోఘము! అపురూపం,, కూడా!! గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఇదే కదా !,,"" కర్మలు చేస్తుండాలి కాని వానిి ఫలితాలకు నీవు బాద్యుడివి అనుకోవద్దు !"" అని .!.. ఈ ఒక్క మాటలో మానవుడి అభ్యున్నతి ,జీవన గమ్యం ,దాగిఉన్నాయి !. ""భగవద్గీత "కేవలం చదువుకోడానికి మాత్రమే పనికి వచ్చే పుస్తకం కాదు ఆచరణీయం! ,అనుభవ యోగ్యం! ,practical science... కూడా.! అందుకే చేసే ,చేస్తున్న చేయబోయే ప్రతీ పనిలోనూ ఫలితాన్ని హరికో ,హరునికో , భగవద్ అర్పణం చేద్దాం,! నిత్యజీవితంలో మనం చాలా నటిస్తూ బ్రతుకుతున్నాం ! ,భార్యాభర్తల మధ్యగాని ,స్నేహితులు తలిదండ్రుల మధ్యగాని దాపరికం లేనిదే సంబంధాలు ఉండటం లేదు.! నటనా జీవితం అందరికీ అలాఅలవాటై సహజమయ్యింది.,! నటించకుండా.జీవించడం దుర్లభం అవుతోంది! .అలా జీవిస్తూ పోతుంటే చేస్తున్న తప్పులు మనకు తెలియడం లేదు కానీ మనలో ఉండి అనుక్షణం మన చర్యల్ని కనిపెడుతూఉన్న" ఆత్మసాక్షి "కళ్ళు కప్పలేం కదా! .ఆయనకు తెలీకుండా చేసే తప్పులు ఉండవు కదా! .అందుకే మన" తప్పులు ఒప్పులు "" అన్నీ అతనిపైనే వేసి మనం నిశ్చింతగా ఉండడంలో నిజమైన ఆనందం ఉంటోంది !అదే ""పరమానందం "అవుతోంది. నిజమే జీవితం ఒక నాటకరంగం.. పాత్రలు ముగిశాక కర్మల మూటలు సర్దుకొని రంగస్థలము దిగి పోవడమ్ ఎవరికైనా తప్పదు కదా ! అలాంటి కర్మలేవీ మన వెంటనంటి రాకుండా ఉండాలంటే ,"పరమాత్మ తో బాటు జీవాత్మ "కూడా సాక్షిగా చూస్తూ చేస్తూ నిరపేక్షగా బ్రతకడం అలవర్చుకోవాలి ! బురదలో కాలు పెట్టాలేందుకు ? కడగాలేందుకు ? అందుకే "పుణ్యం, పాపం " రెండూ ఇక్కడే అనుభవిద్దాం !₹,ఎలాంటి అంటుదల లేకుండా !! ..వాటిని ఇక్కడే భస్మం చేద్దాం "!! సంయమనంతో ,సహనంతో ,,హృదయంలో దైవభావనతో.." సర్వమ్ పరమేశ్వరార్పణ మస్తు!" అంటూ భావించుదాం.! అలా కాకపోతే ,అంటే ప్రతిఘటిస్తే ఆ కర్మల పాపపుణ్యాలు అనుభవించడానికి మళ్ళీ మనం ఎదో ఒక జన్మ ఎత్తాల్సి ఉంటుంది . !"పునరపి జననం,, పునరపి మరణం!!".. అంటూ చర్వితచరణం వలె రంగుల రాట్నం అనే జీవన చట్రం లో గుండ్రంగా తిరుగుతూనే ఉండాలి కదా.!. అందుకే ఇదే ఉత్కృష్టమైన మానవజన్మ ను సదుపయోగం చేసుకుందాం. !అనుభవం నేర్పిన విజ్ఞానం తో "భావములోనా, బాహ్యమునందున " పరమాత్ముని దర్శించుకుందాం ! అంటే నిరంతరం హరినామ స్మరణను , భక్తీ జ్ఞాన వైరాగ్య భావాలతో చేద్దాం ! అలాంటి పరమానందభరిత జీవనం కోసం కావాల్సిన చిత్తశుద్ధిని ,నిశ్చలతత్వం ను అనుగ్రహించమని పరమేశ్వరుని ప్రార్తించుకుందాం!. అందుకు త్రికరణ శుద్దితో శ్రీమన్నారాయణుని ప్రార్తించుకుందాం !"".నారాయణా !"నీపై చిత్తమును, బుద్దిని నిలిపే దృఢ సంకల్పాన్ని మాకు అనుగ్రహించు.!. స్వామీ! నన్ను దిద్దుకో..! సన్మార్గంలో ,సద్బుద్ధితో, సద్భావనతో నడిపించి తరింపజేసే భారం బాధ్యత నీదే !!తండ్రి , జగన్నాథ..! రక్షమామ్ !,పాహిమాం !! నీవే తప్ప మరెవరూ నేను చేసిన తప్పులు క్షమించి నన్ను బ్రోచేవారు లేరు.! ఇకముందు రారు !. నీవే నాకు తల్లివి! తండ్రివి! దైవానివి.! శరణు ! దీన బందో. శరణు! సర్వేశ్వరా శరణు !అపద్బాంధవా ,, అనాధ రక్షకా ,,శరణు..! వెంకటేశ్వరా,, శరణు !,,సర్వమ్ శ్రీకృష్ణ చరణవిందా ర్పణ మస్తు..! సర్వే జనాః సుఖినోభవంతు.!! సమస్త సన్మంగళాని భవంతు.!! స్వస్తి !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...