Nov 10
""జగమే మాయా ! బ్రతుకే మాయా !!""అంటూ పాత సినిమా దేవదాసు పాట లో అద్భుతమైన వేదాంత సారము ఉంది..ఈ శరీరం అనబడే కావడికట్టెతో కలిమి లేములనబడే కర్మలకుండలను కర్మ పరిపక్వం అయ్యేవరకు మోస్తూనే ఉండాలి. ఇష్టం ఉన్నా లేకున్నా. ! భగవద్గీత లో గీతాచార్యుడు చెప్పింది ఇదే ! "నేను ప్రాణిలో అంతర్యామిగా ఉండి , తన కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను అని ! "" అందుకే ఆ సంస్కారం వల మనిషి మనసు ,,ప్రకృతి ప్రభావానికి లొంగి, పంచభూతాత్మక స్వభావంతో ,,"పరబ్రహ్మాన్ని" తెలుసుకోలేకుండా వివశురాలై ,వివేకాన్ని కోల్పోయి ,తాత్కాలిక భౌతిక సుఖాలే శాశ్వత మని భావిస్తూ ,ఆ జగన్నాథుని జగన్నాటకం లో పావుల్లా కదులుతున్నాయి..!.నిజానికి ,మన ఎదుట ఉన్న నాటక ప్రపంచము ,, నిరంతరంశక్తి చైతన్యాల ప్రభావంతో మారుతూనే ఉంటుంది కదా !. ఈ మాయా జగత్తు లో , మనం తాత్కాలిక కష్టాలకోసం శాశ్వతమైన సుఖాలను ఒదులుకుంటున్నాం.! మనకున్న సాంఘిక సామాజిక ధార్మిక కట్టుబాట్లు మనస్సును నియంత్రించడానికి మాత్రమే,, కాదు దానితో బహుళ ప్రయోజనాలు పొందడానికి.కూడా ! కానీ,. మన దేహం పంచ భూతాత్మకం ! బయట ప్రపంచం కూడా పంచభూతాత్మకమే.! .అందుచే ఈ శరీరం ఎదుట అగుపించే శారీరిక సౌఖ్యాల అనుభవంలో ఆనందముందని భ్రమిస్తూనే ఉంటుంది !.మద్యపానం,చేయడం ,, మాంసాహారం భుజించడం ,విందులు , వినోదాలు ,ఇవి అన్నీ మనలో ఉన్న విపరీత భావాల ప్రకోపమే !. అంటే పెద్దలు విధించిన ,శాస్త్ర సమ్మతమైన హద్దులు ఆతిక్రమించడమే. !! "ఏమౌతుంది అబద్ధమాడితే ,? ,తాగితే ఏమౌతుంది ? స్నానం చేయకుండా తింటే ,, రాత్రి ళ్లు మేల్కొని ఉంటే ,,తింటే , ఏమౌతుంది ??. ఉదయం లెవకుండా పొద్దెక్కే దాకా పడుకుంటే ఏమౌతుంది.? పెద్దాళ్లకు, దేవుని కి నమస్కరించక పోతే ! ,భార్యాపిల్లలని కోప్పడితే ! కొడితేే ! ఏమౌతుంది..? మేము పురాణాలు వినం !ఇంట్లో దేవుడికి నిత్యం దండం పెట్టం.!. నా ఇష్టం! ,నేను చెప్పినట్టు అంతా వినాలి. !! బయట తిండి తింటే ఏమౌతుంది.. ?మొండితనం తో వేసే ఇలాంటి ప్రశ్నలు , వేయడానికి కారణం ,,ఈ మాయాప్రకృతి..! చిన్నికృష్ణుడు ఎన్నోసార్లు తన లీలల ద్వారా నేను భగవానుడిని అని కృష్ణావతారం లో చెబుతూనే ఉన్నాడు అందరికీ !.. కానీ బృందవనంలో గానీ ,,రేపల్లె, మధుర ,ద్వారక లో గాని , కురుక్షేత్ర సంగ్రామంలో గాని ," శ్రీకృష్ణుడు దేవుడు " అని భావించిన వారు లేరు.!. భీష్ముడు , ఆక్రూరుడు ,కుంతి , విదురుడు లాంటి కొందరు క్రిష్ణ భక్తులు తప్ప... ! అంటే మాయమోహితులై , పూర్వజన్మ పుణ్యసంస్కార బలం తగినంతగా లేకపోవడంతో. ప్రత్యక్షంగా దేవుడే దిగివచ్చి చెప్పినా కూడా కుసంస్కారులు నమ్మలేరు . !భక్తి విశ్వాసం లేనిదే ఆ దైవీ భావన కలుగదు. !ఇదే విష్ణుమాయ.! " త్రాడుని పాము "గా అనిపించే తలంపే ,భ్రమనే మాయ ! నిజానికి ఎదుట కనిపించే సకల ప్రపంచం అణువణువునా , బ్రహ్మపదార్థం తో నిండివుంది. ! ప్రతీ ప్రాణి కూడా బ్రహ్మ పదార్థమే ! అందులో మనం కూడా ఒక భాగమే ! మన ఈ వివేకాన్ని ""అజ్ఞానం , అవిద్య "అనే మాయతెరలు మన కనులపై పొరలుగా ఏర్పడి ,,పదార్థ,వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకోకుండా అడ్డు పడతాయి.. !దానికి కారణం ఈ పంచభూతాలు.!. ఏది కనబడితే అది తినాలని అనుకోవడం పృథ్వి లక్షణం !,మనం తినే ఆహారం పదార్థాలు .ఈ మట్టినుండే వచ్చాయి.కదా ! కనుక మన లో కలిగే అమితంగా తినాలనే దురాపేక్ష కు కారణం ,మహా శక్తివంతమైన భూతం , ఈ భూమియే కారణం ! అలాగే మన దేహంలో ఉన్న రెండవ మహాభూతం అంటే " జలం "అనే గొప్ప శక్తి ,! నీటిప్రభావం అంతా ఇంతా కాదు..! ఏది చూసినా త్రాగాలి అనిపిస్తుంది !cool drinks, wines, beers ,tea, కాఫీలు గంజాయి సారా,, ఇలా బజార్ లో చూసిన ప్రతీ మత్తు పానీయాలు తాగాలని ,ఎగరాలి ,డాన్సులు చేయాలి, అని మనసును ప్రేరేపిస్తుంది ! బయట జల రూపంలో ప్రవహించే శక్తిని గ్రహించమంటూ మనసును పంచేంద్రియాలను ,ఒత్తిడి చేస్తుంది.! ఇక లోనున్న మూడవ ప్రకృతి శక్తి , అగ్ని తత్వం ,జటరాగ్ని !అది "ఆకలి " రూపంలో కడుపులో ఏదైనా సరే పడేయాలి , !తినాలి! సమయము ,సందర్భము లేకుండా బయట దొరికే నీచు పదార్థాలు, మాంసాహారం, హోటల్ మసాలా ఫలహారం, మిర్చీలు ,icecream, బగ్గర్లు పిజ్జా లు ,అతివేడిమి ,అతిచల్లనివి ,నాలుకకు రుచించే ఏ ఘన పదార్థమైనా సరే ,, లోనున్న ఆకలి అనే అగ్నికి ఆహుతి చేయకుండా విడిచిపెట్టదు..! అగ్ని ఒక ప్రళయాంతకమైన మహా శక్తిభూతము.! పుట్టినప్పటి నుండి వేల క్వింటాళ్ల ఆహారాన్ని తింటున్నా కూడా పంచేంద్రియాలకు ,జిహ్వకు , మనసుకు , తృప్తి ఉండదు !..ఇక నాలుగవ మహా పంచభూతము ,గాలి !అదే ప్రాణవాయువు ! కొండంత కోరికల వాసనలు తోడేస్తుంటాయి !మనిషిని , మనసును పిండేస్తుంటాయి!! ..జననం నుండి మరణం వరకు ఎదుట కనిపించే ప్రతీ వస్తువు పై మమత ,ఇష్టం పెంచుకొంటూ ,అవి పొందడానికి అరిషడ్వర్గాల ను దేహంలో పోషిస్తూ ఉంటుంది.! "కోరిక" అనే కామం, వాంఛ ,వాసనలు తీరకపోతే కోపం,,మదం ,మాత్సర్య,, ఈర్ష్యా ,ద్వేషం ,అహంకారాలు విశృంఖలంగా విజృంభిస్తాయి ,మనిషిని మృగం లా మారుస్తాయి కూడా ! ఈ విదంగా ,బయట ఉన్న "వాయుతత్వం "అనే నాలుగవ మహా శక్తి భూతం , మనలోఉశ్వాసనిశ్వాస రూపంలో ఉంటూ ప్రాణం నిలబడుతూ కూడా ,చూపుతున్న వాయుశక్తిని నియంత్రించడం , మహా మహా ఋషులు, మునులు ,యోగులకే సాధ్యం కాలేదు..! కోరికలు లేకుండా ఏ జీవి అయినా మనగలదా? . జీవించాలంటే కనీసం తిండి బట్టా ,నీడా ఉండాల్సిందే కదా.!. వీని అవసరాలతో ఇక ప్రారంభం అవుతాయి ,కోరికల మూటలు !. .ఇక మిగిలింది ఐదవది ఆకాశము ! అంటే స్వేచ్చా జీవనము.!. అంటే స్వతంత్రం గా ఉండాలని ,పక్షిలా ఎగరాలని ,తనపై ఎవరి నియంత్రణ ఉండకూడదనే స్వేచ్చా భావం !,జీవి పుట్టిందంటేనే కట్టుబాట్లు ,హద్దులు ,నియమాలను ప్రకృతి సహజంగా ఏర్పడుతున్నాయి.. ఉదాహరణకు నడవడానికి ,తినడానికి ,భుజించడానికి హద్దులు ఉంటున్నాయి కదా.. అలాగే గాలి పీల్చడానికి ఒక్కొక్కప్రాణికి నిముషానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఆ మోతాదు మించినా ,తగ్గినా ప్రాణాంతకమే అవుతోంది కదా..! మన దేహంలో గల శూన్యం కూడా , విశ్వంలోని శూన్యంతో ఆకర్షణ పెంచుకొంటూ , "ఎప్పుడు అందులో లీనమౌతానా ? ",అంటూ బయటపడే నిరంతర ప్రయత్నం జీవికి జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది.!. పుట్టినప్రతి జీవి,,ఒకనాడు పంచభూతాలలో లయం కాకతప్పదు కదా !.ఈ "లయం " అనేది నిత్యం మనదేహంలో జరుగుతున్న నిరంతర జీవన ప్రక్రియ నే !ప్రతిసారి తినే.ఆహారం జీర్ణం కావడం ,హాయిగా నిద్రపోవడం, జీవితానికి అవసరమున్న వస్తువులు పొందుతూ తృప్తి పడడం. నచ్చిన దృశ్యాన్ని సంతోషంగా చూడడం , అందరితో,సరదగా మాట్లాడడం,రుచికరమైన తిండి తినడం,,ఇలా మనకు అత్మానందం కలిగించే మదురనుభూతులన్నీ లయం కావడం వల్లనే జరుగుతున్నాయి. ఆనందాన్ని ఇస్తున్నాయి కూడా ! ఈ ప్రకారంగా ,.పంచభూతాల్లో కలిసిపోయే ఈ శరీరాన్ని ఆ పంచభూతాలే తమ ప్రకోపంతో ప్రచండంగా ప్రభావితం చేస్తుంటాయి .. !ఇదే విష్ణుమాయ ! ,భగవద్గీత లో చెప్పినవిదంగా తన మాయను జయించేవారు కోటికి ఒకరుంటారు అని..! ఈ మాయను అధిగమించాలంటే ,అపారమైన భక్తి ప్రపత్తులు ఉండాలని కూడా చెప్పాడు.!. అందుకే అంతటా నిబిడీకృతం అయిన పరమాత్మను దర్శించాలంటే" నిరంతర సాధన "అవసరం !అందుకు ,లోన ఉంటూ మనసును ప్రలోభపెట్టే , అరిషడ్వర్గాలను నియంత్రిస్తూ ,ప్రకృతి మాయలో "వివశులం" కాకుండా ,వివేకంతో విజ్ఞానం తో దైవాన్ని అన్వేషించాలి..! మనసును , బుద్దిని దైవారాధన పట్ల నిలిచేలా బుజ్జగించాలి !భక్త మహాశయుడు , త్యాగరాజస్వామి ,అందుకే మనలోని అజ్ఞానపు చీకటి తెరను తొలగించమని ప్రాధేయపడుతూ మధురమైన సంకీర్తనద్వారా ,మాయ ఎంత బలమైనదో , దానివలన దైవస్మరణ కు ఎలా దూరం అవుతున్నాడో చెప్పాడు ".తెరతీయగ రాదా,! , నాలోని మత్సరమను తెర తీయగ రాదా.!!". అంటూ తిరుమల వేంకటేశ్వరుని వేడుకొన్నారు.!అలాగే సంకీర్తనాచార్యులు.అన్నమయ్య కూడా తనకీర్తనలో" ,నానాటి బ్రతుకు నాటకము! .కానక కన్నది కైవల్యము ! "".. అంటూ " మాయాజాలం ఈ బ్రతుకు నాటకం "అన్న వైరాగ్యభావనను అందించాడు ! ఈ మాయా ప్రపంచంలో ,పూర్వజన్మ కర్మల ఫలాలను మూటలతో, దుర్భరమైన ,దుర్భేద్యమైన ,దుఃఖకరమైన ఈఘోర సంసారసాగరతరణం కోసం ,, భక్తి జ్ఞాన వైరాగ్య భావ సంపద జోడించకుండా తొలగించడం ఎవరికైనా అసాధ్యం ,!.అని ఎందరో మహానుభావులు తమ అనుభవాల ద్వారా ఉద్భోదించారు!". కళ్ళకు కనపడే పదార్థం నిజం కాదు.అది మాయ ! పదార్థం యొక్క యదార్థ బ్రహ్మ జ్ఞానం నిత్యము సత్యము ,మాయా రహితము. ! ఇంకా అన్నమయ్య తత్వ బోధన చేస్తూ మన నిస్సహాయత ను ,వివరించాడు ఈ కీర్తనలో !" ..""కోరిన కోర్కెలు, కోయని కట్లు,, తీరవు నీవవి తెంపకా .!-మా పాపపుణ్యాలనే భారపు పగ్గాలు నీవు వద్దనకుండా తెగేవి కావు.! . అంటూ అన్నమయ్య ప్రతీ గీతంలో ,మనం అనునిత్యం పడే బాధలు , దుఃఖాలు ""వెంకటేశా! నీవు మాత్రమే వాటి బారినుండి మమ్మల్ని రక్షించగలవు! నేవే దిక్కు! నీకే శరణు ! అంటూ మనతరఫున స్వామికి సమస్యల తోరణాలు చూపుతూ, పరిష్కరించే బాధ్యత కూడా వేంకటేశ్వరుని పాదాల ముందు సవినయంగా ,భక్తిపూర్వక ముగా సమర్పించాడు..! శ్రీరాముడు తన నడవడిలో ఏ మాయను మహత్తును ప్రదర్శించ లేదు.. కానీ శ్రీకృష్ణుడు మాత్రం అడుగడుగునా "మాయ" ను కప్పుతూ, మహత్తును ప్రదర్శిస్తూ ,""దుష్ట శిక్షణ శిష్టరక్షణ ""మహోద్యమాన్ని విజయవంతం గా ముగించాడు!. యశోద గర్భంలో ఆడ శిశువు రూపంలో జగదంబను తన "మాయ" గా అవతరింప జేశాడు.!అదే. విష్ణుమాయ తో చిన్ని కృష్ణుడు మధుర నుండి రేపల్లె చేరేవరకు , తిరిగి అడశిశువు తో మధురను వసుదేవుడు చేరేవరకు అందరూ "మాయ " నిద్రలోనే పడిపోయారు!.కొడుకు నోటిలో "విశ్వరూపం" చూసినా కూడా విష్ణుమాయా ప్రభావంతో కృష్ణుడు తన కొడుకే అన్న వెర్రి భ్రమతో మాయలో పడి, జరిగింది మర్చిపోయింది ., యశోదా మాత ! ఒకసారి ,బ్రహ్మగారు గోపాల బాలురను సంవత్సరం పాటు దాస్తే,, విష్ణుమాయా జాలం వల్ల గోపికల కు ఎవ్వరికీ తమ వద్ద ఉన్నది" మాయా కృష్ణుడు "అని తెలిసి రాలేదు. !,,మహాజ్ఞాని అయిన వసుదేవునియందు మాత్రమే మాయ తన ప్రభావం చూపలేకపోయింది..! రాసలీలరస కేళీవైభవప్రదర్శనలో ఎంతమంది గోపికలో అంతమంది కృష్ణులు.!. కానీ ప్రతీ గోపికకు కృష్ణుడు తనవద్ద మాత్రమే ,,తనకు మాత్రమే చెందినవాడు గా భావించారు! ఇదీ మాయనే !.రాయబారం దృశ్యంలో చూపిన విశ్వరూప ప్రభావం ,కురుక్షేత్రం లో,గీతబోధన ఇవన్నీ విష్ణుమాయ ను ప్రకటించేవే..! అందుకే కోరికలను నియంత్రిస్తూ ఈ మాయా జగత్తులో పడిపోకుండా ,,మన జీవితాలను ఉద్దరిస్తూ ,మనలను వెంట ఉండి సంరక్షిస్తూ ,అనుక్షణం కాపాడుతూ ఉండమని శ్రీమన్నారాయణుని కోరుకుందాం ! .అంతటా, అందరిలో సర్వాంతర్యామి ని భావించాలంటే శ్రీహరి కృప వల్లనే సాధ్యం! .కనుక ఈ పంచభూతాత్మక మయ మాయా ప్రపంచంలో ,దైవాన్ని నేరుగా చూడలేం.!. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అన్నట్లుగా.. దైవానుగ్రహం ఉంటేనే తప్ప ఈ మాయ నుండి బయట పడలేం కదా..! కొండలవంటివి ఘోర పాపములు ,ఖండించును హరి ఘన నామ జపము,,! జలదుల వంటివి జనన బంధములు తొలగించును హరి స్మరణ భక్తితో.! త్రోవరాని బహు దుఃఖములు అణచును.,, శ్రీవేంకటపతి చేరిన శరణము..!. కావున చంచలమైన మనస్సును నిశ్చలంగా తన పాదకమలాల చెంత కుదురుగా నిలుపుటకు తగిన భక్తిని యుక్తిని శక్తిని స్పూర్తిని విశ్వాసాన్ని సమయాన్ని అనుగ్రహించమని ఆ దేవాదిదేవుడు శ్రీ వెంకట విభువును ,లక్ష్మీ నారాయణుల ను వినమ్ర భావంతో వేడుకుందాం.!. జై శ్రీకృష్ణ !.జై శ్రీ రామ!"
Saturday, November 10, 2018
జగమే మాయా ! బ్రతుకే మాయా
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment