Friday, November 9, 2018

తల్లిదండ్రులు

Nov 9

ప్రస్తుతం గల ఆధునికీకరణ ప్రపంచంలో మమతానుబంధాలకు చోటు ఉండటం లేదు ,,మనిషి జీవితంలో రోజంతా నటించడం తోనే సరిపోతోంది ! . కృత్రిమంగా నవ్వుతూ , సంతోషన్గా ఉన్నట్టు నటిస్తూ, ,జీవిస్తున్నాం ! మన పిల్లలు గానీ ,మనం గానీ , నిజమైన ప్రేమానురాగాలు అనుబంధాల మధ్య పెరగడం లేదు ! అందరూ ఒకేచోట కలిసి  ఆనందంగా ఉంటూ , అంతా ఒకే కుటుంబంగా ,సంఘంలో ఆదర్శంగా ఉండాలి . కానీ ఎంతమంది ,మలివయసులో కూడా తమ కుటుంబసభ్యులతోహాయిగా, సంతృప్తిగా ,,ప్రశాంత జీవనం గడిపే వారు ఉంటున్నారు ? అలాంటి వారు , మనకు  బహు అరుదుగా కనబడుతుంటారు.!! ఏ కొద్దిమందో తప్ప, కొడుకులు కోడళ్ళతో సంతోషంగా జీవితం గడుపుతున్న తల్లిదండ్రుల సంఖ్య వేళ్ళతో లెక్కబెట్టవచ్చును .!సమిష్టి కుటుంబాలు  క్రమక్రమంగా తగ్గుతున్న బాధాకరమైన వ్యవస్థలో కుటుంబాలు అనురాగంతో   జీవించడానికి సమయం చాలడం లేదు. !నాకు తెలిసిన ఒక జంటకు ఒక కూతురు, ఒక కొడుకు.ఉన్నారు !వారికి పెండ్లిళ్ళు చేశారు ,,మనవళ్లు  మనవరాళ్లు కూడా ఉన్నారు  !,ఆస్తి కూడా ఉంది .! పాపం,, ఆ జంటలో ,,తల్లికి  దమ్ము లాంటి వ్యాధితో మంచం పట్టింది   !భర్త లక్షలు ఖర్చు చేస్తున్నాడు ఆమె బాగు కోసం! ..అయినా వ్యాధి  తక్కువ కావడం లేదు ! కన్నతల్లి ,పాపం , తాను చచ్చేలోగా అందర్నీ చూసుకోవాలని అనుకుంది. !కూతురి కుటుంబం దగ్గరే ఉంది ,,కాని కొడుకు కుటుంబం రాలేదు!  ,,చూడలేదు ,!కోడలు అందట" తమ పేర ఆస్తి రాస్తేనే వస్తామని.! !!"చివరకు  ఆమె పోయింది,, !అయినా వాళ్లు రాలేదు ! చివరి చూపులో కూడా ,,తన ప్రేవు తెంచుకొని పుట్టిన కొడుకును, ఎక్కడో అమెరికా లో కాకుండా దగ్గరి ఊర్లో ఉండి కూడా .,, కళ్లారా చూసుకోలేకుండా, దీనస్తితిలో ,మనోవేదన పడుతూ .ఆత్మక్షోభ అనుభవిస్తూ పోయింది ,,పాపం  ఆ నిర్భాగ్యురాలు..!అంటే ఇక్కడ , ఆస్తులు అడ్డొచ్చాయి వారి అనుబంధాలకు  !!! మరొక ఉదాహరణ ! ,,ఒక దుస్థితి తండ్రి గురించి ఉంది.!,,ఆయనకు  కొడుకులు ,కూతుళ్లు ఉన్నారు !  కానీ భార్య లేదు. !మన అందరికీ తెలుసు ,!, వృద్ధాప్యంలో భార్యను పోగొట్టుకున్న భర్తల దయనీయ దుస్థితి గురించి...!! భగవానుడు స్త్రీలకు ఇచ్చిన మనోనిబ్బరాన్ని ఎందుకో మన  పురుషులకు ఇవ్వలేదు.!అందుకు, నా బాల్యజీవితమే గొప్ప ఉదాహరణ !  మా కన్న తండ్రి ,నా 5ఏళ్ల చిన్న వయసులో పోయాడు. !మా అమ్మ కు అప్పుడు 32 ఏళ్ల వయసు..! అప్పటినుంచి 85 ఏళ్ల వయసు వరకు మమ్మల్ని కొంగుకు కట్టుకుని ప్రేమతో  పెంచింది ! మా పెండ్లిళ్ళు చేసి మనవళ్లు ,మనవరాళ్లు పెద్దయ్యేవరకు చూసి సంతోషంగా వెళ్ళిపోయింది.! ఇంత  ఓపిక,  శక్తి ,ఆత్మస్తైర్యం, మగవారిలో చూడలేం.! ఎందుకంటే భర్తను ప్రేమగా చూడటం లో "భోజ్యేషు మాతా !" అన్నట్లుగా తల్లివలె  భోజనం తినిపిస్తుంది.!తాను లేకపోతే అతను బ్రతకలేడుఅన్నంతగా లాలిస్తుంది   భర్తను దేవుడిలా  పూజిస్తుంది. ఏ మాత్రం కష్టం కలగకుండా ,చూస్తూ , ప్రేమిస్తుంది.!ఈ త్యాగం ,అంకితభావం మగవాడికి చేతకాదు ! కానీ అతడు లేకున్నా తాను పిల్లలకోసం మొండి ధైర్యంతో జీవిస్తుంది స్త్రీ ! అందుకు తన ప్రాణం అయినా ఫణం పెడుతుంది..! ఎందరినైనా ,ఎంత విపత్కర పరిస్థితి నైనా ఎదురిస్తూ , దేనికైనా తెగించి ,తన సంతానాన్ని రక్షించు కుంటుంది .! అది తల్లి హృదయం లోని ప్రేమా బలం ! కానీ ఇప్పుడు ఇక్కడ  ఈ పెద్దాయన  భార్య పోయాక ,మంచం పట్టగానే  ,అతని కొడుకులు చేసిన మొదటిపని ,,ఆయన పేరు పైనగల ఆస్తి fixed depostits postal savings అన్నింటినీ withdraw చేస్తూ voucher లపై సంతకాలు పెట్టించడం , తమ పేరు మీద చేయించుకోడం !!.ఆ తతంగం అంతా అయ్యాకే తండ్రిని  హాస్పిటల్ లో చేర్పించడం..!  ఇలా బ్రతికుండగానే రిక్తహస్తాలతో ఒంటరిని చేసి, వారి దయా ధర్మం పై బ్రతికే దౌర్భాగ్యాన్ని  వారసులు తమ తల్లిదండ్రులకు కలిగిస్తున్న విషయం కూడా మనకు అవగతమే కదా !! నాకు తెలిసిన మరొక వ్యక్తి అలాంటి దుస్థితి తోనే , భార్యను పోగొట్టుకొని ముగ్గురు కొడుకులు, కోడళ్ళు ఉన్నా ,ఇప్పుడు అనాధాశ్రమంలో ఉంటున్నాడు.!అందుకే మా అమ్మ అంటూండేది.. ! "ఎన్ని కష్టాలు వచ్చినా ,ఎవరి జోడి వారికి ఉండాలిరా ! ""అంటూ భర్త వియోగాన్ని తలచుకుంటూ, దుర్భరమైన శేషజీవితాన్ని పరమేశ్వర భావన ,సేవన, పూజన లకు అంకితం చేస్తూ  ,పరమ ధామాన్ని పొందింది మా అమ్మ !ఇక్కడ పాపం ,ఆయన తన  కొడుకు చేసిన అప్పులకు, స్వంత ఇల్లు కుదువబెట్టి , అప్పులు కట్టి , ఇంకా తీరకుంటే ,తనకు వచ్చిన పెన్షన్లు కుదువబెట్టినా సరిపోక పోతే , ముగ్గురు కొడుకులు తండ్రిని  పట్టించుకోక పోతే ,అప్పుడు స్నేహితులు చందాలు వేసుకొని ,స్నేహాధర్మం తో సహాయం చేస్తూ , అతడిని  అనాధాశ్రమంలో ఉంచి అతడిని పోషిస్తున్నారు..! మరో చోట ,,ఒక, కొడుకు  ,తండ్రి పైన కోపంతో కొట్టడంవల్ల తండ్రి చనిపోతే ,దయగల కూతుళ్లు కన్నతల్లిని తమతో తెచ్చుకొని ప్రేమతో పోషిస్తు,  ఇంకా మానవత్వం బ్రతికే ఉంది ,, అని రుజువు చేస్తున్నారు !ఇలాంటి బహు దయనీయ హృదయ విదారక , వాస్తవ జీవనదృశ్యాలు నిత్యం  మనం చూస్తూనే ఉన్నాం..! వింటున్నాం ,,రోజూ పేపర్లో చూస్తున్నాం కూడా  ! ఒకరి కుటుంబ వ్యవస్థలో మనం జోక్యం చేసుకునే హక్కు లేదు,, నిజమే..  !కానీ ఉసూరు మంటున్న  ముసలిప్రాణాలు  అఘోరిస్తూ ,స్వంత ఇండ్లలోన సజీవంగా బందీలైే ,  సమాజానికి భారంగా "నా" అన్నవారు లేక దిక్కుతోచని దుర్భర జీవితాన్ని గడుపుతూ విషాదంగా ముగిస్తున్నారు! . తనవారిని చూడలేక  వారితో ఉండలేక ,వారికి ఇక్కడ ఉండడానికి వీలు ,తీరిక లేక ,,,ఉంటూ ,వారు ఎవరూ రాలేకపోతే మనోవేదనతో ,దీర్ఘకాలిక వ్యాధులతో ,మందులకు, బట్టకు ,పొట్టకు ,కట్టుకునే బట్టలకు కూడా నోచుకోకుండా ,ముసలి పశువులను బయటకు ఈడ్చివేయ బడినట్టుగా ,తనవారినుండి నిర్దాక్షిన్యంగా  వెలివేయబడి ,ఆవేదనతో ఆక్రోశిస్తున్నాయి  !",ఎవరు ఆదరిస్తారు  ? ఎవరు ఆసరా అవుతారు ? ఎవరైనా  వచ్చి ప్రేమతో పలకరిస్తారా  ?అంటూ, అనుకుంటూ,ఆత్మీయత కోసం ఆదరణ కోసం  అంగలారుస్తూ ,విలపిస్తున్నారు ఎందరో వృద్ధులు  !! శరీరంలో శక్తీ,, చేతిలో డబ్బు ఉన్నప్పుడు అందరూ బంధువులే,!చుట్టాలే,! ఎక్కడలేని ప్రేమ ,బంధుత్వం ఒలకబోస్తుంటారు .!దేహంలో శక్తి తగ్గినా అంటే ,అంటే ఒకరిపై ఆధారపడవల్సి వచ్చినా ,చేతికర్ర లేకుండా నడవలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడినా ,అప్పుడు తెలుస్తున్నది తన వారెవరో ,పరాయివారు ఎవరో,,! నిజమైన ప్రేమ అప్పుడు  బయటపడుతుంది ,, తలిదండ్రులు మంచంలో పడినప్పుడు.  ,డబ్బు ఖర్చు చేయాల్సినప్పుడు ,వారికి సేవ చేసే అవసరం  వచ్చినప్పుడు  ! ఇక డబ్బు మహాత్మ్యం అంతా ఇంతా కాదు. ప్రాణం ఉండగానే జింకను తినే క్రూరమైన మృగం లాంటిపులిలా ,వారి పేరుమీద ఉన్న ఆస్తులకోసం , గుంటనక్కల్లా కాచుకొని ,"నాకు ఇది, నీకు అది  "అంటూ కాటిలో కుక్కల్లా కన్నవారి ముందే ఘోరంగా ,,పొట్లాడుకునే వారిని చూస్తున్నాం  !వారి వద్ద లక్షల్లో డబ్బు ములుగుతున్నా కూడా , హక్కుల పేరిట ,పంచాయతీ కూడా పెడుతుంటారు. పరువుప్రతిష్టాలకు ప్రాణం ఇస్తూ బ్రతికిన  ముసలి తల్లిదండ్రులు , ఇప్పుడు ఇరుగుపొరుగు వారిముందు తలదించుకునేలా అవమాన భారంతో మొహం చూపలేక ఎవరికీ చెప్పుకోలేక ,,ఆ నలుగురి ముందు సిగ్గుతో చస్తూ బ్రతికేస్తుంటారు.!. ఇలా ఒంట్లో సత్తువ ,బాంక్ బాలన్స్ లను  మాత్రమే చూస్తూ ,తలిదండ్రులపై చూపాల్సిన బాధ్యతాయుత విధులు చేయడానికి మొహం చాటేస్తున్నారు కడుపున పుట్టినవారు !.  కన్నవారి సేవ నిమిత్తం ,కొంత డబ్బును , నెలకు ఒక పనిమనిషికి ఇస్తూ చేతులను దులిపేసుకునే వాళ్ళు కొందరైతే ,,అనాధాశ్రమంలో అప్పజెప్పి నెలకు ఇంత ముడుపు , అంటూ చెల్లించి. తాము అప్పుడప్పుడు అతిథి వలె పరామర్శకు వెళ్తుంటారు మరి కొందరు ..!ఇలాంటి సంఘటనలు అంతటా  సర్వ సాధారణం అవుతున్నాయి !స్వార్థం డబ్బు పిచ్చి తనం తో మనిషిలో ,.మానవత్వం లోపించి స్వంత ప్రయోజనం,,పశుత్వం ,చోటుకుంటున్నాయి..! కొడుకులు లేనివారికి కూతుళ్ళ వద్ద ఆశ్రయం పొందితే తప్పా.? దయలేని కొడుకుల కంటే దయగల అల్లుళ్లు దేవుళ్ళతో సమానం కదా. మాకు తెలిసిన దగ్గరి బందువుల్లో ఒకరికి భర్త పోయాక, ఉన్న ఒకే ఒక కూతురు తల్లిని ప్రేమతో పోషిస్తోంది  ! అలాగే ఆమె అల్లుడు కూడా అటు తలిదండ్రులను , ఇటు అత్తగారిని ,గౌరవిస్తూ ఆదరిస్తూ ప్రేమగా చూస్తున్నాడు !.. అలాంటి దయార్ద్ర హృదయం గల అల్లుళ్లకు చేతులెత్తి నమస్కారం చేస్తూ అభినందించాలి .  అనాధాశ్రమంలో  ఎందరో ఇలా ," ఆత్మీయతహస్తం" కోసం ఎదురుచూస్తున్న వారిని మనం  తీరిక చేసుకొని అక్కడికి వెళ్లి చూడవచ్చును  కూడా ! ఇలాంటి దారుణాలు ఎన్నో, మనం అందరం   మనచుట్టు ఉన్న బందువుల్లో,,  రోజూ పేపర్లో చూస్తున్నాం   !అయినా చూస్తూ  చూడనట్టు నటిస్తున్నాం! అందుకే  వృద్దాశ్రమాలు ఇంకా పెరిగిపోితూనే ఉన్నాయి  ! వృద్ధులయ్యాక .కూతురు ఇంట్లో ఉందామంటే ఆదరణ  ,స్వతంత్రం ,అధికారం ,ఉండవు కదా ! సామాజిక కట్టుబాట్లు అడ్డు వస్తున్నాయి ! .తాను కన్యాదానం చేస్తేనే  కదా , అతడికి  భార్యాపిల్లలు వారితో సంతోషం సౌఖ్యం వంశాభివృద్ధిని పెంచే సంతానం .కలిగింది..! కొడుకులు లేని తలిదండ్రులకు అల్లుళ్ళ ఇంటిలో స్థానం ఉండకూడదా ?. కొడుకులైనా కూతుళ్ళయినా సమానమే అంటూ భావించి పోషించి పెంచి ,  పెండ్లిళ్ళు చేసి పంపించి  ,,ఇప్పుడు వృద్ధులు అయ్యాక  ఆ మాట అసత్యం అవుతోందా ?  అది ఇప్పుడు పనికిరాకుండా పోయిందా  ?  ప్రేమతో ఆదరించే వారు, కూరిమి గలవారు స్ట్రీలు అంతా కూతురులే ! పురుషులందరు కొడుకులే కదా ! అభిమానంతో ఆప్యాయంగా ఆదరించే వారంతా కన్న బిడ్డలతో సమానం ! కొడుకు ఒక్కడుంటే సమస్యలు కొన్ని  మాత్రమే ఉంటున్నా, ఎక్కువ మంది కొడుకులు ఉంటే మాత్రం  ,,మళ్ళీ వంతులవారిగా కన్నవారిని వారి ఆస్తినీ పంపకాలు చేసుకుంటున్నారు  !.. ఏది ఏమైనా , కన్నవారిని వృద్ధాప్యంలో ప్రేమగా చూడాలి ఇది మన కనీస మానవతా ధర్మం !  ఈ రోజుల్లో డబ్బుకు కొరత ఎవరికి లేదు.  ఈ రోజుల్లో ,బిచ్చగాడు కూడా బ్యాంక్ లో అకౌంట్లు డిపాసిట్లు  లక్షల్లో పొగుచేసు కుంటున్నాడు .అందరికీ అరుదైన వస్తువు ఒక్క టే.. అదే  ప్రేమ !  ఎన్ని పురాణాలు  పుస్తకాలు అనుభవాలు చూస్తేనేం ,వాటిని  అర్థం చేసుకొంటూ ,అందరితో పంచుకొంటూ ,ఆచరణ లో పెట్టకపోతే ,ఎంత చదువు, ఆస్తి , సంపద ,విజ్ఞానం, ఉంటే  మాత్రం ,మానవత్వానికి విలువలు ఉంటాయా.? రేపు తాము కూడా పెద్దవారయ్యాక ,, తమ పిల్లలు కూడా ,తమను వేలెత్తి చూపుతూ,"" నీవు చూశావా,, మీ తలిదండ్రుల ను ప్రేమతో. !వృద్దాశ్రమాల పాలు చేయలేదా ?? అని నిలదీసే రోజులు ఉంటాయని తెలియని అమాయకులా వీరు...?అయినా  ఏమడుగుతున్నారు వారు..! ప్రేమతో రెండు మాటలు .!ఎలా ఉన్నారు,,!? నానా  !అమ్మా ! నీ ఆరోగ్యం ఎలా ఉంటోంది..?  ఇలాంటి కొంచెం ఆదరణ ,! కొంత సానుభూతి!  , కాస్తంత ఆప్యాయంగా పిలిచే పిలుపు ,! పలకరింపు ! ,,వాత్సల్యం కురిపించే చూపు  !...అంతే కదా !!వాళ్ళు కోరేది !..ఇన్నేళ్లు తమ ప్రాణ సమానంగా సంతానాన్ని పెంచిన ప్రేమతో ,కన్నవారు  ,,""తమ పిల్లలను తమ బాగోగులు చూడండి  !""అని అడిగే హక్కు లేదా..?అయినా  అడగాలా ఆ విదంగా..?అది  వారికి తెలియని విషయమా.  ?అడిగి చెప్పించుకునే   అవసరం ఉంటుందని అంటారా మీరు ?? కన్నప్రేమ .కన్నవారికి తెలుస్తుందంటారు కదా..! మరి ఎందుకు పెద్దవారి మనసు గాయపడుతోంది వారి మలివయసులో !? ఆస్తులా! అంతస్తులా ! అవేమీ కాదు చచ్చేవరకు ప్రేమ చూపమని ! అంతే ! అది చాలు వారికి కొండంత బలం  ,"రామా ,కృష్ణా. ! ""అనుకుంటూ శేషాజీవితాన్ని ఆనందంగా పరమాత్ముని స్మరణతో గడుపుతారు .అందుచేత మనిషిగా నిలబడదాం ! కన్నవారిని ప్రేమతో నిలబడదాం ! .ఇంట గెలిచి రచ్చ గెలుద్దాం.! సంతానానికి దూరమై ,వారి నిర్లక్ష్యానికి గురియై, భారంగా బ్రతుకులు ఈడుస్తూ అనాధలుగా జీవశ్చవాలుగా ప్రాణమున్న శవాలుగా ఉంటున్న వృద్ధులైన తలిదండ్రుల బ్రతుకు , ఇతరుల దృష్టిలో ఎంత ఘోరంగా ,దయనీయ కరంగా ఉంటుందో  ,ఊహిస్తే నే ,,అది దుర్భరం.! అయ్యో, పాపం !! ఎందరుంటే ఏం లాభం..?పెద్దయ్యాక , చివరిదశలో ప్రేమతో పిరికెడు అన్నం పెట్టే దిక్కులేకపోయాక.. ? అంటూ ప్రక్కవారుచేసే మూతివిరుపు ముచ్చట్లు, సానుభూతి మాటలకు ,మొహం చూపలేక. ఎదురు మాట్లాడలేక.చావలేక బ్రతకలేక, రోజూ చస్తూ, బ్రతుకుతూ ,చావుకు ఎదురుచూస్తున్న తలిదండ్రుల దౌర్భాగ్యాన్ని  దూరం చేద్దాం..!  మనం నిత్యం చేస్తున్న  సకలదేవతా పూజలకంటే  "కన్నవారి సేవే గొప్పది !" కనుక గౌరవంతో ప్రేమానురాగాలతో  కనిపించే ప్రత్యక్ష దైవాలు అయిన  మన తలిదండ్రులను. ప్రేమిద్దాం! పూజిద్దాం.!భక్తితో సేవించుదాం..! దేవాలయాలకు పోకున్నా. తీర్థయాత్రలు వెళ్లకున్నా ,, నిత్యం ఇంట్లో పూజలు చేయకున్నా.,, దేవుడిని పొరబాటున కూడా తలవకున్నా  ,,పరమ నాస్తికుడైనా  ,,.ఏం ఫర్వాలేదు !!   నిన్ను కన్న తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటే చాలు ! అదే వారికి పది వేలు !. వారి చివరి శ్వాస వరకు "మేంఉన్నామని " ధైర్యం, విశ్వాసం ,తృప్తిని ,ఆనందాన్ని  కలిగించుదాం!. కోటి తీర్టాల ఫలితం కూడా వారి సేవకు సమానం కాదు కదా!.రక్తసంబందాలను  కేవలం ఆర్థిక సంబంధాలుగా  చూడవద్దు  ! డబ్బు, ఆస్తి పెంచుకోవడం సంతోషాన్ని ఇస్తుందేమో ! కాని ,..తోబుట్టువుల, అన్నదమ్ముల తలిదండ్రుల అనుబంధం తో మధురమైన  ఆనందాన్ని పొందుతాము ! శరీరం విడిచి వెళ్ళేటప్పుడు , మనతో ఒక గ్రాము బంగారం గానీ ,,10రూపాయలు గాని ,పిరికెడు అన్నం మెతుకులు కానీ  వెంటరావు కదా!   ,కేవలం ఇంత మట్టి తో  కలిసిపోతూ జీవితాన్ని ముగిస్తాము ! మనవెంట వచ్చేది  ఈ మన పాప పుణ్య కర్మలే కదా ! చచ్చాక సాదించేది ఏమీ ఉండదు కనుక మనం  బ్రతికుండగానే, బంధాలు, అనుబంధాలు , ప్రేమానురాగాల తో ఆత్మీయత ను ,  మానవత్వం విలువలను  కాపాడుకునేందుకు పాటు పడుదాం !.. దేవుడిచ్చిన ఉత్కృష్టమైన  ఈ మానవజన్మ ను సార్ధకం చేసుకోవాలంటే వివేకంతో , విజ్ఞానాన్ని  ఉపయోగిస్తూ ,జన్మనిచ్చిన తలిదండ్రులను, జ్ఞానాన్ని ఇచ్చిన గురువులు ,పెద్దవారిని ,గౌరవించాలి,!మనంఅనుభవించే భౌతిక సంపదలు,  దైవానుగ్రహంగా  భావించాలి   .మానవసేవలో మాదవుని స్మరణ తో తరించాలి !.కొడుకులు తమ తలిదండ్రులనే గాక ,తన వంశాభివృద్ధికి తమ కూతుర్ని ఇచ్చిన అత్తమామలను కూడా ఆదరించే ఉత్తమ సంస్కారాన్ని అలవర్చుకుందాం .!అలాగే కూతుళ్లు కూడా ఇటు తలిదండ్రుల కు అందిస్తున్న ప్రేమానురాగాలతో బాటు అటు అత్తమామలకు కూడా ఆత్మీయతహస్తం అందిస్తూ ,, ఆత్మీయనురాగాలు పెంచాలి !  . నిజమైన  జీవితవిధానం  మన సంస్కారం సంప్రదాయం వాని ఆచరణ లోనే ఉంది..! అది స్త్రీల వల్లనే సాధ్యం  .అవుతుంది కూడా !".ప్రతీ అత్తా ఒక ఇంటి కోడలే .!" అన్న సూక్తి ప్రకారం , కోడలు కాపురానికి వస్తే, పెద్దవారైన అత్తామామలను ,తలిదండ్రులవలె ప్రేమిస్తూ ఉండాలి ! అలాంటి అనుబంధం తో వృద్దాశ్రమాలు ఇక పెరుగవు !, అల్లుళ్లు కూడా , పెద్దవారైన  తలిదండ్రుల ను ఆదరిస్తూ, దానితో బాటు తమ అత్తమామలనుకూడా గౌరవిస్తూ ఉండాలి .! ప్రతీ పండగకి ,పబ్బానికి తాము కట్నాలు తీసుకొంటూ,తల్లిదండ్రులు ,అత్తమామలకు కూడా ఆదే గౌరవాన్ని అందిస్తే, అంతకంటే ఆనందం వృద్దాప్యంలో కావాల్సింది ఇంకేముంటుంది ?  .అమెరికాలో ఉన్నా ,మన దేశంలో నే ఏ మూలలో ఉన్నా ,తలిదండ్రుల బాధ్యత తమపై ఉంటుందని  కూతుళ్లు కానీ కొడుకులు కానీ  ఎన్నడూ మరవవద్దు  !సంతానం లేని పెద్దవారిని కూడా ఆదరించడం మన సంస్కృతి ,సభ్యత, సంస్కారం, సామాజిక బాధ్యత కూడా  !  .అందుకే  ""ఇంట గెలిచి రచ్చ గెలవాలి !" అన్నట్లుగా మన ఇళ్లను  అనుబంధాల నిలయంగా , స్వర్గధామంలా ,దైవారాధన తో దేవాలయం లా మార్చుకుందాం..!  "మాతృదేవో భవ!..పితృ దేవోభవ! "" అన్న వేద శాస్త్ర వాక్య ప్రమాణాన్ని అక్షరాలా  పాటిస్తూ నిజం చేద్దాం. !  మన సనాతన వేద ధర్మాన్ని చైతన్య వంతం చేద్దాం.! తల్లీ నమస్కారం.! తండ్రీ నమస్కారం ! ఆచార్యదేవా ప్రణామాలు! అంటూ అనునిత్యం పలికే వేద శాస్త్ర  ప్రమాణ సత్యాన్ని నిజం చేస్తూ ఆచరిస్తూ ,మనవారితో ఆచరింప జేస్తూ కన్నవారిని వృద్దాశ్రమాల బారిన పడకుండా భక్తితో ప్రేమతో గౌరవంతో అభిమానఆదరణ ఆత్మీయత భావం తో సేవిద్దాం ,! తద్వారా ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని పొందుదాం ! అతి పవిత్రమైన ఈ మాతా పితరుల సేవాయజ్ఞం చేయడానికి కావాల్సిన స్పూర్తిని శక్తిని భక్తిని ఇవ్వమని పరమాత్ముని ప్రార్తించుకుందాం  ! జై శ్రీకృష్ణ !   స్వస్తి !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...