Tuesday, November 27, 2018

జీవుడు

Nov 27, 2018
దేహదారులగు మానవుల కు  సుఖాలతో బాటు సంసారదుఃఖములు కలగడం సహజం ! తప్పదు ! కానీ ,లోనున్న జీవుడు జీవనయాత్రలో  పడే విపరీతమైన  పలు విధాల కష్టాలు బాధలు ,వలన కలిగే మనోవ్యధ భరించలేక ఛీ ఛీ ఎందుకీ జన్మ ? అనుకుంటూ మానవజన్మ ను భారంగా ,మోస్తూజీవితాన్ని నరక ప్రాయంగా భావిస్తూ రోజూ చస్తూ బ్రతుకుతూ చావుకోసం ఎదురుచూస్తు ఉంటారు   !  ...కష్టాలు లేని మనిషి ఉండడు కదా ! అయినా . కష్టాలు అనేవి లేకపోతే మనిషికి బ్రతుకునకు అర్థమే ఉండదు. !.పుట్టిందే పూర్వజన్మ కర్మఫలాలు అనుభవించడానికి మరి ! అయినప్పుడు కష్టమొచ్చినా సుఖం వచ్చినా సంతోషంగా భగవద్ ప్రసాదంగా స్వీకరించాలి.  తప్ప ఎంత వ్యద పడినా. లాభం ఏముంటుంది ? "ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరి కైనను తప్పదన్నా !"" అన్నట్లుగా భావించాలి..! కానీ అంత " జ్ఞానం గుండె నిబ్బరం. తనపై తనకు నమ్మకం." ఉండడం ,, అద్భుతమైన మానవ జన్మ మహాత్మ్యం, తెలిసినా ,అనుభవంలో తెచ్చుకోవడం చాలా కష్టమైన పనే..! అందరికీ అన్నీ తెలియవు కదా.! వృద్దాప్యంలో మంచాన పడడం ,ఆదరించే వారు లేకపోవడం.. దీర్ఘకాలిక రోగాల పాలబడి కొలుకోలేని వారు .సంతానం లేక, అవమానం భరించలేక , ఆస్తి అంతస్తులు లేక ,అయినవారు లేక, ,అనాధలుగా బ్రతకలేక ,,ఇలా ఎన్నో రకాల కష్టాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టాలు వేలల్లో  ,లక్షల్లో , ఉంటూ పరిష్కారం వేరే తోచక  ఒక్కోసారి  కేవలం "చావు ఒక్కటే  శరణ్యం  !"అని నిర్ణయిస్తూ ఉండడం  నిత్యం పేపర్లో చూస్తున్నాం .! జీవితంలో పరిణతి ,తగినంత అనుభవ జ్ఞానం దైవారాధన ,ఆధ్యాత్మిక చింతన లేకపోవడం ఆధునికత తో ఫోన్ లతో మనశాంతి కరువై ,బ్రతుకే బరువై ,దైవానికి దూరమై ,దిన మొకగండంగా జీవితం గడిపేవారు ఎందరో ??  సత్సంగం ,సద్భావం ,లోపించడం వలన ఇలా జరుగుతుంటాయి !.నిజానికి జీవునికి  మానవదేహాన్ని ప్రసాదించింది ,మళ్ళీ జన్మ లేకుండా ఆత్మానుభవం ద్వారా సంస్కరించుకుంటు తమను తాము  ఉద్ధరించుకోవడానికి మాత్రమే.  ! దేహం ఉంటేనే కదా పరమాత్మ అనుభవ ప్రాప్తిని పొందేది.! నవ విధభక్తుల ద్వారా జీవుడు పొందే " పరమ ఆనందం ,,అత్మానందం ,బ్రహ్మానందం  ",ఈ మానవ శరీర ధారణ తోనే సాధ్యం అవుతోంది కదా.! అన్నమయ్య త్యాగయ్య కబీరుదాసు ,మీరాబాయి లాంటి ఎందరో భక్తశిఖామణులు జీవితాంతం భాగవతారాదనతో , త్రికరణ శుద్దితో ,భావించి సేవించి సంకీర్తనలు పాడి ,అందించి ,ఆనందించి  తరించింది ఈ దేహ దారణతోనే కదా.! శరీరం లేకపోతే అనుభూతులు లేవు  !ఆనందం లేదు ,! జ్ఞానం లేదు !,జన్మను ఉద్ధరించుకునే అవకాశమే లేదు.! 84లక్షల జీవుల్లో ఏ జీవికీ లేని మేధస్సు , జ్ఞానం ,పలుకు ,కరచరణాదులు ఉపయోగించుకొనే అదృష్టం ,కేవలం, మానవునికే  ఉంది ! ఈ భాగ్యాన్ని అనుగ్రహించిన  పరమాత్మ కు ఈ జీవుడు సత్కర్మల తో  చేరువ అవుతాడా.. ? లేక లౌకిక సుఖాలనే స్వర్గం అనుకోని ,జనన మరణ జీవన చక్రంలో చిక్కి, అంతులేని యాతన పడుతుంటాడా  ?అన్నది  మన విజ్ఞతకే వదిలేశాడు ఆ విధాత... ! ఈ జీవుడు తన బుద్దిని మనసును సంసారం తో కేంద్రీకరించి పొందే అత్మానందం శాశ్వతం అనుకుంటున్నాడు !. కానీ అది భ్రమ ,మాయ ,భ్రాంతి తో కూడిన జంతు ప్రక్రియ..! నిజానికి ఇదే మనసును ,బుద్దిని దైవం వైపుకు దృష్టిమరల్చి , దైవభక్తితో  పొందే మదురానుభూతులే  శాశ్వతం !,సాయుజ్యాన్ని అందించే సన్మార్గాన్ని అందిస్తాయి..! అందుకే ఈ జీవుడు దేహంతో పొందే పారలౌకిక దివ్యానందాన్ని ఆపేక్షించాలి కానీ క్షణికమైన సంసారసుఖాలే పరమావధి గా భావించరాదు ! శరీరము లేని జీవుడు సుఖమును గాని దుఃఖమును గానీ అనుభవింప జాలడు ,!పరమాత్ముడు జగత్తును కల్పించుటచే ,,జీవులకు శరీరమును కల్పించుటచే  వారు జగత్తునందలి ఇతర పదార్థముల వలన తమకు కలుగు ఆనందమునందలి అల్పత్వమును ఎరుగుటకును ,, పరమానంద ప్రదాయమగు భగవత్ తత్వ అనుభవమునకై యత్నించి  పొంది ఆనందించుటకును , అవకాశము కలిగినది !అందుకోసం జీవుడు అనునిత్యం తన ఉద్దరణకు  వేడుకోవాల్సిందే  ! ఇలా శరణు కోరాల్సిందే ! ఓ శ్రీ..కృష్ణా ! దేహదారులగు జీవులకు అనేక విధముల గు సంసారిక దుఃఖములను కలిగించునది అగుటచే !నీవు జరుపు జగత్ సృష్టి మిగుల దుఃఖకరము  !"అని ఇన్నాళ్లు తలచుకుంటూ ఉన్నాము !   కానీ ,కృష్ణా ! తలచిన కొలది మా ఆలోచనలో మార్పు వస్తోంది.. సుమా !నీవు ఆవిధంగా చేయనట్లయితే ,,జీవులు జ్ఞానానందరూపమును పొందలేరు కదా !  అందలి ఆనందరసమను ఆర్ద్రత ను  గ్రహించలేరు కదా !,లోకంలోని మదురములగువాని అన్నింటికంటెను అధిక మదురతరమగు  నీ శుద్ధ తత్వమయమును ,సచ్చిదానందాత్మకమగు నీ దివ్య మంగళ రూపమును ,కన్నులతో  దర్శిస్తూ ,,రూపగుణ వైభవ లీలలను  చెవులతో వింటూ పరమానందం పొందడం అసాధ్యం , అసంభవం అయ్యేది కదా ! శ్రీకృష్ణా ! నీ దయ కలిగితే జీవులకు అన్నీ సిద్ధిస్తాయి! దుఃఖాలు తొలగుతాయి !,లౌకిక సుఖములందు  విరక్తులౌతారు  !,జీవన్ముక్తులై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ! అందుచే  కృష్ణా! నా హృదయమునందు నిర్మలమైన నీ జ్ఞాన పరమానంద రూపము ప్రకాశించేలా అనుగ్రహించు !  దానివల్ల కలిగే ఆనందనుభవం చే అలవికాని బాధలను మరిచిపోయి  నీ పాద పద్మ ఆరాధనయందు ప్రీతి ని భక్తినీ పొందే అదృష్టాన్ని ఈ జీవునకు ప్రసాదించు  పరమాత్మా ! పరంధామా ! పరమేశ్వరా ! పాహిమాం !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...