Nov 19, 2018
కృష్ణయ్య లీలలు మధురం ! పరమానందభరితం ! స్మరణ మాత్రముననే తన్మయత్వం పొందే చిన్నికృష్ణుని లీలామానుష విగ్రహ స్వరూపుని అందచందాలు ,దివ్య మంగళ కర,రూపలావణ్యాలు అద్భుతం ! రేపల్లె నందగృహం లో ఒకరోజు , మారాం చేస్తూ ,పంతం తో తనవద్ద చనుపాలు త్రాగుతున్న కృష్ణుని ముగ్దమోహన సౌందర్యం చూస్తూ ,వీడు "విశ్వాంతరాత్ముడు " అనుకోకుండా తన" కొడుకే " అన్న భ్రాంతితో కృష్ణమాయలో పడి ,మాతృ వాత్సల్యం పొంగుతూ వస్తోంది ఆమెకి..! ఆ బ్రహ్మానందానుభూతిలో కృష్ణునికి ఎంతసేపు పాలు ఇస్తున్నది మరిచిపోయి, పొయ్యిపై తాను పెట్టిన కుండలో పాలు మరిగి మరిగి పొంగిపోతున్న విషయం కూడా గమనించ లేదు..ఆమె ! అమ్మపాలులో ఉన్న చైతన్యమే అంతటా నిండి ఉండి ,అవుపాలు లో కూడా ఉంటుంది కదా.అది కూడా పరమాత్మ కటాక్షాన్ని . కాంక్షిస్తూ ఉంటుంది కదా ! అందుకే ,,ఆ పాలలో ఉన్న చైతన్యం అనుకుంది !"కృష్ణా !నీ వు నీ తల్లిపాలు కడుపునిండా త్రాగాక ,ఇక మా పాలు త్రాగడానికి నీకు ఆకలిగా ఉంటుందా. ! చెప్పు ? నీలమేఘశ్యామా ! నవనీత చోరా ! నీ మధురాదర పానంతో మమ్మల్ని కూడా సేవించి ఉద్ధరించక పోతే మా బ్రతుకెందుకు ?.ఇదిగో ! ఈ అగ్నిలో పడి ఆహుతి అవుతున్నాము ,,చూడు , కృష్ణా ! "అంటూ కుండలో ని పాలలో ఉన్న కృష్ణచైతన్యం వినిపించిన ఆవేదనభరిత ఆర్తికి కన్నయ్య స్పందించి , కుండలో నుండి పొంగే పాలను చూడటానికి వెళ్లేలా ,తల్లిదృష్టిని మళ్లించాడు . . ! ఆమె కొడుకును క్రింద దింపేసి పరుగుపరుగున వెళ్ళింది దూరంగా పొంగే పాలకుండను పొయ్యిపై నుండి కిందకు దింపేయడానికి ! ఇక్కడ కృష్ణుడు లేని కోపం తెచ్చుకొని ,నోటి నిండా పాలతో ,,కడుపు నిండా పాలివ్వక వెళ్లిపోయిందన్న ఉక్రోశంతో , అక్కసుతో ,దగ్గరే ఉన్న కవ్వం తో పాల ,పెరుగు వెన్న కుండలను పగులగొట్టి ,,తల్లికి దొరక్కుండా అక్కడినుండి దూరంగా పారిపోతున్న అల్లరిదొంగ ,!వెన్నదొంగ! ,గోపిమాన స చోరుడు..! భక్తజన హృదయ మందారుడు ! అయిన ముద్దుల కృష్ణుని సుందర లావణ్య సౌందర్య మూర్తిని ధ్యానిస్తూ , చేతులెత్తి భక్తితో వినమ్రంగా ప్రణమిల్లి ,,పాదాభివందనం చేద్దాం ! .హే కృష్ణా! అచ్యుతా !ఆనంతా! మాధవా !ముకుందా! మధుసూదనా ,! ఇలాంటి నిరతిశయానంద అమృతపాన మాధుర్యాన్ని అనుభవించే మధురానుభూతులను ,పరమానందాన్ని , భావ సంపదను సదా అనుగ్రహించి జన్మను ధన్యం చెయ్యి గోవిందా ముకుందా ,యశోదానందా ! బాలగోపాలా ! రాధాలోలా ,! మురళీగా న వినోదా ! పాహిమాం ! పాహిమాం ! కృష్ణం వందే జగద్గురుమ్ ! స్వస్తి !!!"
Tuesday, November 27, 2018
కృష్ణయ్య లీలలు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment