Monday, November 5, 2018

దైవారాధన

Oct 5
భగవన్తుడు అంతటా ఉన్నాడని అందరికీ తెలుసు. కానీ దైవారాధన చేయడం ఎలానో దైవాన్ని చేరడం ఎలానో ఎంతమందికి తెలుసు ?ఎన్ని దేవాలయాలు ?ఎన్ని మూర్తులు. ?ఎంతమంది దేవుళ్ళు .?ఎక్కడ   ఎంతసేపు నిలిపేది మనస్సు ను,?,తిరుమల వేంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు దర్శిస్తే ,ఆ స్వామిని మన మనసులో కుదురుగా ఉంటాడు నిలకడగా. ,,మళ్ళీ వెళ్లి చూసే అవసరం లేకుండా..? త్యాగయ్య ,అన్నమయ్య మీరాబాయి లాంటి భక్తులు అర్చామూర్తులను ఆరాధించి తరించారు.కదా....! అలా మనం మన మనసును ఏకాగ్రత గా ఒక విగ్రహం పై నిగ్రహంతో నిలుపగలమా .? ఎంతసేపు చూస్తే ,ఆరాధిస్తే దైవం అనుగ్రహిస్తుంది ? మనసు పెట్టి చూడటానికి  ఒక్క దేవుడే ఉన్నాడా ?  భార్యాపిల్లలు ,బంధువులు,, స్నేహితులు వీరిని కూడా చూడాలా ! మనసుతో ఆదరించాలా..! ఇంటమందితో మనసు కలుపుతూ.. దైవంపై దృష్టిని ఉంచడం సాధ్యమా.? లేదా ,చూసే ప్రతీ ప్రాణిలో దైవాన్ని దర్శించడం అయ్యే పనేనా.?. మనసుకు అంత తీరిక ఓపిక ఉండేనా..? ఒకవేళ ఉంచాలనుకున్నా, చుట్టూ పరిసరాలు పరిస్థితులు మనల్ని దైవ ధ్యానంలో నిమగ్నం కావడానికి సహకరించేనా.? ఎన్ని లంపటాలు.!. ఎన్ని సమస్యలు.!. దేవుడెక్కడ ఉన్నాడు  ? అన్న ప్రశ్నకు నేరుగా జవాబు చెప్పే సత్తా ఏం చేస్తే వస్తుంది..? "nothing is impossible,, everything is possible!!" అంటారు కానీ , దేవుణ్ణి వెదకడంలో మాత్రం అసాధ్యమే కదా.! సృష్టి మొత్తం  చేశాక  దేవునికి ఒక సందేహం మిగిలింది అట ! తనకు చోటు ఏది ? తాను ఎక్కడ ఉండాలి అని ? ఒక చేప అందట ,,,ప్రభూ ! నీవు సముద్రంలో అట్టడుగున ఉండు..! అక్కడికి ఎవరూ చేరుకోలేరు.!. అని. దానికి దేవుడు నవ్వుతూ ఈ "" మనిషి అనే ప్రాణి మహా ప్రజ్ఞావంతుడు!. నేనిచ్చిన మేధస్సు తో అక్కడ కూడా శోధిస్తాడు.! నన్ను పట్టుకుంటాడు !" అనగానే ఒక పక్షి అందట ,,""స్వామీ! పైన అంతరిక్షంలో  సుదూరంగా నీ స్థావరం ఏర్పాటు చేస్తే. ఏ మనిషీ నిన్ను చేర లేడు కదా !"" అనగానే, ఓ అమాయకపు పక్షి..! మనిషి తెలివిని పట్టుదలని అంత తక్కువగా అంచనా వేయకు.! అంతరిక్షంలో కాదు కదా ,,నేను సృష్టించిన ప్రకృతిలో విశ్వంలో  అతడు తన పరిశోధన పట్టుదల లతో ఎక్కడికైనా వెళ్లగలడు.! నన్ను చూడగలడు కూడా !" అని  చిన్నబోయి ఏం చేయాలో ఎక్కడ ఉండాలో తెలీని సంకట పరిస్థితిలో  దేవుడు ఇరకాటంలో పడటం చూసి ,ఒక కోతి వచ్చి సలహా ఇచ్చింది అట  !  ""ఓ అంతర్యామి..! నీవు అదే మనిషి  హృదయఅంతరాళం లో ఎందుకు ఉండకూడదు. ?" .అన్న మాట దేవునికి నచ్చింది.  !నిజమే !మనిషి చేరుకోలేని , తెలుసుకోలేని చోటు అతడి అంతర్యం మాత్రమే..కదా ! అనుకుంటూ  ,మనిషిలో నే , పరమాణువు కంటే అతిసూక్ష్మరూపంలో  హృదయం అనబడే కమలంలో విరాజమానుడై ,ప్రకాశిస్తూ, మన విధి విధానాలను నియంత్రిస్తూ. కర్మ ఫలాలను అందిస్తూ.. అవి పూర్తి అవగానే తాను తప్పుకొంటూ జీవుడిని తదుపరి జన్మకు పంపిస్తూ సాక్షిగా. చూస్తూ ఇవేమీ తనకు సంబంధం లేని విషయాలు అన్నట్లుగా జీవులను పరిపాలిస్తూ స్థిరంగా తన స్థావరాన్ని మనిషి హృదయంలో నే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు..  ! ఈ విధంగా "నన్ను తెలుసుకో  ! నన్ను దొరికించుకో !! చేతనైతే  పట్టుకో  ! ""అంటూ మనలో ఉంటూ మనతో దోబూచులాట ఆడుతున్న ఆ " పరమాత్ముని "" పట్టుకునేది ఎలా.?పైగా  ఆయన్ని చూడాలంటే ముందుగా ఆయన స్వభావం ,గుణగణాలు ,ప్రభావం ,వైభవం ,,మహత్తు తెలియాలి  ! అంటే మన ఋషులు దర్శించి రచించిన వాఙ్మయాన్ని ,ఇతిహాసాలు ,పురాణాలు  చక్కగా వినాలి.! వింటే సరిపోతుందా  ? మార్గదర్శి గా సద్గురువు ను ఆశ్రయించాలి.!. ఆయన బోధనలు అర్థం చేసుకోవాలి.!. కానీ ఇదంతా ఆరంభం మాత్రమే !! ఇదంతా దైవదర్శనం యాత్ర కోసం తయారు చేయాల్సిన పరికరాలు మాత్రమే. ! ఇక వీటితో  మనం ప్రయాణం సాగించాలి. ! కాని ,,ఎక్కడికి ? తీర్థయాత్రలకా ! మానస సరోవర తీరాలకా.. కైలాసపర్వత శ్రేణి పరిక్రమానికా .! ఎవరు చెప్పారు దేవుడు అక్కడ ఉన్నాడని..? యాత్రలు చేయడం దేనికి.. ??దేవుడు ఎక్కడ ఉన్నాడు  అని వెదకడానికా.?. కాదు !మన  చిత్తశుద్ధి కోసం చేసే ఒక యజ్ఞం లాంటి ప్రక్రియ అది. !.అందుచేత బాహ్యములో ఉన్న దేవుడిని పట్టుకోవాలంటే  ,, ముందుగా "కోతి "లాంటి స్వభావము కల ,ఈ మనసును కదలకుండా పట్టుకోవాల్సి ఉంటుంది. !కానీ మనసును పట్టుకోవడం అంటే , మాటలా?తీసే.ఊపిరిని కాస్సేపు బంధించి ఉంచవచ్చేమో  ,కానీ మనసును కదలకుండా ఆపడం కష్టసాధ్యం కదా..! త్యాగరాజు అంతటి మహానుభావులు, భక్తశిఖామణులు, మనసును బ్రతిమిలాడు కున్నారు. " ఓ మనసా! , దయచేసి రామునిపై తప్ప మరే విషయాల్లో తలదూర్చకు !"నీకు పుణ్యముంటుంది !"  అంటూ.! అలా మనం కూడా బుజ్జగించాల్సి ఉంటుంది మనసును.! మెల్ల మెల్లగా ,సాధనతో, పట్టుదలతో  ,బుద్దిని ఉపయోగిస్తూ మనసును  దైవం కోసం " అంతర్ముఖం" చేస్తూ "అంతరాళం "లో దాగిన దైవాన్ని వెదికే ప్రయత్నం నిరంతరం చేస్తూ పోవాలి  ! అయితే "మనలో దేవుడు అంతర్యామి రూపంలో ఉన్నాడు  !" అణా అకుంఠిత విశ్వాసం ఉండాలి.. ఎంత విశ్వాసమో అంత ఫలితం కదా !! అలా అతడిని తెలుసుకోవడానికి తగిన  .జ్ఞానాన్ని ,స్పూర్తిని కరుణించమని  ప్రార్థిస్తూ, దేవుని అనుగ్రహం కోసం పూజించాలి! ,సేవించాలి! అర్చించాలి !చివరకి శరణాగతి చేయాలి !!" నీవే తప్ప నాకు వేరే దారి లేదు ,తండ్రీ !" అంటూ తీవ్రంగా  ఆవేదన చెందాలి. !మనకు అత్యంత ఇష్టమైన కొడుకు, కూతురు, భార్యా ,భర్త, తల్లిదండ్రుల కోసం  నిత్యజీవితంలో ఎలా ఏడుస్తూ ,ఆరాటపడుతూ, ఆక్రోశిస్తామో అలా ఆ దేవుడి కోసం కూడా  , మనం కన్నీరు కారుస్తూ,విలపిస్తూ ,కృష్ణా ! నిన్ను చూడలేనిదే నేను బ్రతకలేను ! నీ కోసం ప్రాణత్యాగం చేస్తాను !""అంటూ దీనంగా బేలగా ,ఆర్తితో ,బ్రతిమిలాడే హృదయం కావాలి.!కానీ అంత సులభంగా ,"" దైవానుగ్రహం  ""మనం కోరుకుంటే రాదు.! మన మనస్సు ,బుద్ది ,హృదయం, అంతఃకరణము, భావన ఎంత శుద్దిగా పవిత్రంగా ఉన్నాయో చూసి ,అవి పరిపక్వత చెందేవరకు పరమాత్ముని కరుణ మనపై  వర్షించదు కదా  ! వేల ,వేల  సంవత్సరాలు  ఘోరంగా తపస్సు చేస్తేగాని ఋషులకు మునులకు భక్తులకు దైవదర్శనం కాలేదు.! అందుకే  ఈ చంచలమైన చిత్తంతో. తాత్కాలికంగా ఈ భౌతిక సుఖ సౌఖ్యాలను పొందుతూ ,మరల మరల జన్మలను పొందుతూ. జనన మరణ చక్ర వలయంలో దిక్కు దారి తెలియకుండా కొట్టుకుపోయే బదులు ప్రశాంతమైన నిశ్చలంగా ఉన్న సచ్చిదానంద ఘన స్వరూపాన్ని ద్యేయంగా ఆరాధిస్తూ పొందే "అనుభూతియే " నిజమైన జీవిత పరమానందం !అదే బ్రహ్మానందం,,!అది జన్మరాహిత్యమైన పరమేశ్వర పరంధామము .! అందుకే నిరంతర యోగప్రక్రియ ద్వారా ,జీవపరమాత్మ సంయోగం పొందే యోగాన్ని సాధించాలి  ! అదే మన జీవన ద్యేయం కావాలి..! పాపభూయిష్టమైన ప్రపంచంలో పడే బదులు.. ప్రశాంతంగా  శాశ్వతంగా ఆనందంగా ఉండే పరమాత్మ సన్నిధిని చేరే ప్రయత్నం చేద్దాం ! అందుకే , "శాశ్వతము ,ఆనందకరము ,భుక్తి ముక్తిదాయకము ,సకల పాప దుఃఖహరణము ,దురిత నివారణము " అయిన "శ్రీహరి నామరూప గుణ వైభవ స్మరణ "లో జీవితాన్ని ధన్యత చేయమని మన మనసును కోరుకుందాం. ! ఓ మంచి మనసా! ,నా యందు, దయయుంచు ! నా చిత్తాన్ని ఆ  పరమేశ్వరునిపై ఉంచు ! ,,ఆ శ్రీపాద పద్మ కమలాలదివ్య దర్శన వైభవాన్ని అనుభవిస్తూ క్రమంగా  అక్కడే  ముక్తిని పొందే  భక్తి మార్గాన్ని దివ్యమైన ఆ యోగాన్ని  అనుగ్రహించు!.. ఓ మనసా!ఈ విధంగా  ఈ దీనుడిని తరింపజేయ్యి !.ఏకాగ్రతతో పరమాత్ముని భజించి, పూజించి ,,అర్చించి ,సేవించి ,తరించే మహాభాగ్యాన్ని ఈ జీవునికి ప్రసాదించవే .ఓ మనసా !"" అంటూ వేడుకుందాం..! పరమాత్మ చింతనయే ద్యేయంగా ,పరమావధిగా పెట్టుకొంటూ  "మనసును బుద్ధిని ,"దైవానికి అంకితం చేద్దాం. ! హరికృష్ణ హరికృష్ణ కృష్ణ క్రిష్ణ హారెహరే..!. హారేరామ హారేరామ రామరామ హారెహరే..!  సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు  !      స్వస్తి !""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...