Monday, November 5, 2018

దీపావళి

Nov 6

మానవులకు కావలసిన సద్భావన ,సద్బుద్ధి, సత్సంగము ,,సమైక్యత వివేకము ,విజ్ఞానము కలగాలంటే మనం  దైవారాధన చేయాలి. దానితో మనలో నిద్రాణంగా ఉన్న దైవీ శక్తులు జాగృతమౌతాయి వాటి సాధనతో మనం అమిత శక్తి సంపన్నులం అవుతాం. ఇది శాస్త్ర ప్రమాణం గా చెప్పిన వేదవాక్యం !ఇంకా మన  వంశాభివృద్ధి కలగాలంటే , మనలో దాగివున్న ప్రగతి ,,ప్రతిభ పాటవాలు  ప్రభావితం కావాలంటే , పెద్దల దీవెన తప్పనిసరి  ! ఇలాంటి భావ సంపద "నే మనకు సంతోషాన్ని సంతృప్తి ని కలుగజేస్తుంది  !శ్రీకృష్ణభగవానుడు మన గీతాచార్యుడు చెప్పినట్లుగా మన "మనస్సే శత్రువు ,మిత్రువు " కూడా.! అందుకే "మనసు" పెట్టి ,అందరితో ఆనందంగా ఉండటం లో "అందం" ఉంటుంది .!  అందులోనే జీవిత పరమార్థం ఉంటుంది..కూడా ! " "దీపావళి "అనగా మన హృదయాల్లో" సంతోషం" అనే దీపాలు వెలిగించుకోడమే కదా  ..ఎంతమంది తో మనం ఇలా  ఆనందాన్ని పంచుకుంటామో అన్ని దీపాలు వెలిగించుకున్నట్టు అవుతుంది.. ! ఆ విదంగా అందరం కలిసి మహాలక్ష్మీ మాతకు నవ్వుల దివ్వెలతో స్వాగతం పలుకుదాం ! ఉండడం అంటే డబ్బులు ఆస్తులు అంతస్తులు ఉండడం కాదు కదా.! అందరితో కలిసిమెలిసి వారితో కష్టసుఖాలు పంచుకుంటూ ,ఎటువంటి అవాంతరాలు వచ్చినా విడిపోకుండా కలిసికట్టుగా ఉండడం లోనే నిజమైన పండగ వాతావరణం ఉంటోంది.!. దీనికి చిన్నా, పెద్దా, ఉన్నవాడు ,లేనివాడు,అని కాకుండా , కులమత వర్గాలకు తావులేకుండా, "మనమంతా ఒకటే "అన్న సుస్వర నాదమే మన మంగళకరమైన .కరదీపిక,!విజయ గీతిక ! ఇదే  "దీపావళి పండుగ "కు సూచిక కూడా !అందరినీ కలిపే నిజమైన అందమైన "బంధం " ఈ దీపావళి పండుగ.!మన కుటుంబ సభ్యులతోనే కాకుండా, స్నేహితులు బంధువుల తో కలిసి పంచుకునే అనుభూతులు హృదయాలను కలిపే మదురక్షణాలను తలపించేదే కదా   పండగ.అంటే !. మన పెద్దలు ,ఇలాంటి పుణ్యకరము ,దివ్యము, పాపభీతి హరణము మంగళ కరము  ,సకల జనావళికి  శ్రేయోదాయకము  అయిన శుభలక్షణాలను కలబోసి  అందించిన అద్భుతమైన అందమైన ఆనందాల అందాల వెల్లువ ఈ దీపావళి పండుగ..!అలనాడు, శ్రీకృష్ణుడు, దుష్టశిక్షణ ,శిష్టరక్షణ లో భాగంగా , సత్యభామ సమేతుడై లోకకంఠకుడైన నరకాసురుని వదించి, పదహరువేల స్త్రీలను చెరవిడిపించిన  వారికి స్వేచ్ఛను ప్రసాదించిన రోజు..ఈ రోజు ! శ్రీరామచంద్రుడు , పరమ ధర్మావతారమూర్తి, సాదుజనులను పీడించే రాక్షససంహారంలో భాగంగా , దుష్టుడైన రావణాసురుని హతమార్చి ,లోకపావని ,తన సహధర్మచారిణి అయిన ,సీతామాత ను చెర విడిపించి ,ఆమెతో కూడి , భరత లక్ష్మణ శత్రఘ్న హనుమ సమేతుడై,  14 సంవత్సరాల వనవాస దీక్ష అనంతరం ,పురజనుల,విజయోత్సాహాల మధ్య, అయోద్యనగరిలో పట్టాభిశక్తుడై,  ఆదర్శంగాఉంటూ, సకల ప్రజలను  ఆనందింప జేసిన అద్భుతమైన పండగ రోజు,, ఈ రోజు .! ..,మన సనాతన సంస్కృతిని, సంప్రదాయాలను ,పురాణ, ఇతిహాసాల గొప్పదనాన్ని సూచిస్తూ , అందరూ ఒకే వేదికపై చేరి , కోటిదీప కాంతులను వెలిగిస్తూ ,,పరమ పవిత్రమైన ,పావనమైన  మన హిందూధర్మ ప్రాభవాన్ని గుర్తు చేస్తున్న పండగ రోజూ..ఈ రోజు !! పిల్లలకు ,పెద్దలకు, ఆడపడుచులకు ,మహాలక్ష్మి లా అలంకారాలతో ,ఆభరణాలు కట్నాలు కానుకలు పిండివంటలు రంగు రంగుల ముగ్గులు రంగోళిల వేడుకలో , విందులు వినోదాల మధ్య ఉత్సాహంగా ఆనందంగా, అమితంగా  సంబరాలు పంచేరోజు..ఈ దీపావళి రోజు ! దివ్యమైనమంగళ హారతులతో ,ఇటు కుటుంబసభ్యులకు , అటు దేవతా మూర్తులకు. మాత్రమే గాక..  కీర్తిశేషులు అయిన మన పితృదేవతలకు కూడా ,వారి గమ్యాన్ని.చేరే దారిని సుగమం చేస్తూ, దీపాలు మతాబాలు ,కాగడాలు, ఆకాశదీపాలతో వారికి నింగిని  వెలుగులు చూపిస్తూ, మార్గదర్శనం చేస్తూ, వారిని కూడా సంతోషింపజేస్తూ ,వారి దీవెనలు కూడా అందుకునే చక్కని సంస్కారాన్ని ,సంప్రదాయాన్ని , మర్యాదని, వంశాభివృద్ధిని కలిగించే అద్భుతమైన  రోజు..ఈ దీపావళి రోజు ! అందుకే  ఇలలో ఇలా ఆనందాలను పంచుతూ  భువిని స్వర్గధామం చేసుకుంటూ ,అందరిలో ను అనురాగం  ,అనుబంధం పెంచుతూ. ఐకమత్యం అనే పవిత్రమైన భావనను  భావింపజేసే దివ్యమైన రోజు ఈ దీపావళి రోజు ! మానవజన్మ ను తరింపజేసే ఇంతగొప్ప పండుగ సంప్రదాయాన్ని అందజేసిన మన ఋషిపీఠం, ఇతిహాస, పురాణ ,శృతి ,స్మృతి కర్తలకు ,జగద్గురువు శంకరాచార్యులు మొదలగు సద్గురువుల పాదపద్మాలకు ముక్కోటి దేవతలకు.. మన తలిదండ్రులకు ,పూర్వికులకు, పితృదేవతలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుందాం !  .భగవన్నామ సంకీర్తన లతో..,కోటి దీపాల కాంతులతో ,మన హృదయంలో ఉన్న " అవిద్య అనే,అజ్ఞానాంధకారాన్ని పారద్రోలుదాం !అలాగే మన ఇంటిలోను, దేవాలయాల లోనూ ,"మనస్సనే వత్తిని" వేసి "ప్రేమ అనే చమురును" పోసి "హృదయం అనబడే దివ్వెతో "జగదాంబ కు .మంగళ హారతులు పట్టి.. ""సర్వ మంగళ మాంగళ్య ,శివే సర్వార్థ సాదకే, శరణ్యే త్ర్యంబకే గౌరీ ,నారాయణి నమోస్తుతే  !"అంటూ విజయగీతాలు పాడుకుందాం. ! జయోస్తు! విజయోస్తు !శుభమస్తు! సర్వే జనాః సుఖినోభవంతు.! సమస్త సన్మంగళాని భవంతు..! హరిః ఓమ్..!. స్వస్తి !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...