Saturday, December 1, 2018

దేహమే దేవాలయం

Nov 28, 1018
భగవన్తుడు మనకు అందమైన దేవాలయం అనబడే ఈ  దేహాన్ని ఇచ్చాడు,, అనుభూతులను, ఆనందాన్ని ,ప్రశాంతత ను పొందడానికి.. ! ఎదురుగా అంతటా  తానే స్వయంగా అణువణువునా నిండి. రమణీయంగా. కమనీయంగా ,మనోహరంగా పువ్వులో ఆకులో నీటిలో నింగిలో  ప్రకాశిస్తూ "దైవం ఎంత అందంగా ఆనందంగా ప్రశాంతంగా ప్రమోదంగా , "" ఉంటుందో తెలియజేస్తూ ఉన్నాడు ! ప్రాణికోటి కి సంపదలతో బాటు సంతృప్తి ని ప్రసాదించడమే ద్యేయంగా ,ఆనందాన్ని వివిధ రంగుల్లో విరాజిల్లుతూ ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందమే ఆనందం అన్న భావనతో ,  , దైవానికి ప్రతిరూపంగా మనోజ్ఞంగా కర్మసాక్షి సూర్యభగవాను ని అరుణకిరణాల తో ఏర్పడే రంగురంగుల రంగవల్లుల సింగారాల శృంగారాల మేలిమి బంగారు కాంతులు  వినీలాకాశంలో  కన్నుల విందు చేస్తూ అగుపిస్తూ ఉంటున్నాయి. పచ్చని పొలాల్లో ఊరికి బయట అడవుల్లో మేఘాలను తాకే మంచుకొండల  దృశ్యాలు , సెలయేర్లు, వాగులు ,పచ్చని బయళ్లు ,, చెట్లూ, చేమలు, అన్నీ ప్రకృతి మాత సోయగాలే..! ప్రకృతి సంపదలే ! దైవారాధన కు నిలయాలే ! సహజ సిద్ధంగా వెలసిన స్వచ్ఛమైన పవిత్రమైన పరమేశ్వర నిలయాలుగా కొలువు దీరే దేవాలయాలే కదా !  రాధామాదవుల రాసకేళి విలాసవంతమైన అందాల బృందావనాలే  !   అద్భుతమైన చిత్ర రచనలు.ఆ ప్రకృతి సొగసులు  ! కవితకందని సాహిత్యాలు.  ఆ జగదేకసౌందర్య లావణ్యాలు ! అవి  అన్నీ మనం  భావించి పూజించి సేవించుకునే  దైవారాధన కోసం అందిస్తున్న వరాలే. !. దేవుని దయ ,కరుణ లను సూచించే మధురాతిమధుర ఘట్టాలే !మానవ జీవితాలు సరిపోవు.ఆ  నిర్గుణాకార నిశ్చల సచ్చిదానంద  ఘన స్వరూప వైభవాన్ని దర్శించి తరించేందుకు ! దైవ లీలలను వర్ణించేందుకు శక్తి చాలదు ! అనుభవించడానికి. జీవితం సరిపోదు !  దేవుడు ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు  ? మనకు కనబడుతాడా..? ఇలాంటి అమాయక అజ్ఞాన సందేహాలకు సమాధానం సూర్యోదయ సూర్యాస్తమయ  రంగు రంగుల వివిధ వైవిద్యాల ప్రకృతి దృశ్యాలే  ! ...ఆ సుందర దివ్య సౌందర్య లావణ్యాల  రాగరంజిత సొగసులు , అనుభవైకవేద్యాలు ! ఆ నీలమేఘశ్యామసుందరుని అందాలు ఇలా ఉంటాయని చెప్పగలమా ?. కొండలు, కోనలు ,చేమంతి ,గులాబీ, మల్లె ,పుష్పాలు ,వాని సౌరభాలు.. ఇవన్నీ దేవుని ప్రతిరూపాలు !  ఋతువులు ,మాసాలు మారుతూ ఉంటే ,మార్చి , మార్చి రంగు రంగుల కుంచెలతో వినీలాకాశాన్ని , మబ్బులను, ప్రవహించే నదులను , విశాల సముద్రాన్ని ,ఇలా ఎన్నింటినో రోజూ  చిత్రీకరిస్తూ క్షణమైనా తీరికలేకుండా  మాకోసం సకల ప్రాణికోటి మనుగడ కోసం నిరంతరం శ్రమిస్తున్న సర్వాంతర్యామిని పొగడటానికి వేయి పడగల అదిశేషువుకు కూడా చేతగాదు కదా.!. ప్రభో! విశ్వరూపా !అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా.! శ్యామసుందరా ! నీవు ప్రదర్శించే అపురూపమైన కళాఖండాలకు , నైపుణ్యాలకు  ,నీకు శతకోటి  ప్రణామాలు.,,! సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ న్నాము.! తండ్రీ ! విశ్రాంతి అనేది లేకుండా భువిని దివి సీమగా ,ధరిత్రిని అపర స్వర్గ ధామంగా ,అందాల స్వప్న లోకంగా ,తీర్చిదిద్దుతున్నావు !  ప్రతి ప్రాణిఆత్మలో నీవు అంతర్యామిగా కొలువుంటూ ,వాని కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపింపఁ జేస్తూ  జగన్నాటకం నడిపిస్తూ వెనక సూత్రధారి గా కథను నడిపిస్తూ  నీవు మాత్రం సాక్షిగా చూస్తూ ,,ఈ జీవుల జీవన చక్రాన్ని  నడిపిస్తూ ఉన్నావు  ! అయితే మాఅంతరంగంలో  నిక్షిప్తమై , ప్రకాశిస్తూ ఉన్న నిన్ను మేము చూడలేము అని  ,మాకు ఎదురుగా కోటి సూర్యప్రభల వెచ్చదనం తో  ,,స్వచ్ఛమైన చంద్ర కాంతి  వెండి వెన్నెల చల్లదనం తో  ,ప్రత్యక్ష దైవంగా నిత్యం మా కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తూ ఉన్నావు కదా ! హే నారాయణా ! జగత్పితా ! జగదేక బందో ! మా ఎదుట కదలాడే ప్రతీ ప్రాణిలో ,కదలకుండా జడం గా ఉన్న కొండా , కోన ,చెట్టు, చేమలో కూడా నీ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్షింప జేస్తున్నావు కదా ! అయితే అంతటా నిండి ఉన్న నిన్ను నీ మంగళకర స్వరూపాన్ని మేము దర్శించుకోలేక పోతున్నాము  ! కారణం ఏమిటీ   ? అంటే   నీ స్వరూపమును భూమి , జలము ,అగ్ని ,వాయువు మొదలగు వాని రూపమున కమ్మివేసి మాకు  చిత్తభ్రాంతిని కలుగజేస్తున్నాయి  ! ఈ విధంగా , జీవులను బహువిధములగు కర్మబంధముల యందు ముంచి  ,అందు వివశులను జేసీ ,ఆ కర్మఫలములను అనుసరించి ప్రవర్తిల్ల జేయునదియు ,,వారిని దుఃఖములందు పడవేయు నదియు అగు నీ ""విష్ణుమాయ  "ప్రభావం వలన  ,,నీవు మాలో ఉన్నా ,, మా చెంతనే  ,మా చేరువలోనే ఉన్నా  ,,కృష్ణా ! నిన్ను గుర్తు పట్టలేని దౌర్భాగ్య దుస్థితిలో మేము  ఉన్నాము   ! ఆ మాయా ప్రభావమును అణచివేయాలి అంటే నీ పాద పద్మాల యందు నిరతిశయమైన భక్తిపారవశ్యాలే శరణ్యము కదా స్వామీ !  పైగా ""అవ్యక్తము "అగు  నీ శుద్ధస్వరూపము ఏ మాత్రము  ఎవరిని కూడా  తెలుసుకొనుటకు  శక్యము కానిది  ! అది కేవలము "శుద్ధస్వరూపము "అనగా జగత్తును బ్రహ్మాండము ను ప్రకాశింపజేయు సచ్చిదానంద తేజము ! అదియే తిరిగి జగద్రూపమున వ్యక్తమగుచున్నది .!అందుచే ఇట్టి వ్యక్త రూపాన్నే  అంటే ఎదురుగా కనిపించే భువనమోహన ప్రకృతి రమణీయ సౌందర్య దృశ్యాన్ని నీ అవతార మూర్తిగా భావించి ,ఆశ్రయించి ఉపాసించుకొనుటకు మాకు కావాల్సిన స్పూర్తిని శక్తిని భక్తిని భావ సంపదను దయతో అనుగ్రహించు దేవదేవా ! దీనజనబాంధవా ! జగన్నాథ !  మేము  కర్మబద్ధులం !అల్పులము! మందబుద్ది కలవారము !,అజ్ఞానులం! కరుణించి మాకు సద్భావన సన్మార్గ చింతనలను ప్రసాదించుము.!. నిన్ను మేము మరచినా ,నీవు మాత్రం మమ్మల్ని మరిచిపోకు ! తల్లీ తండ్రి గురువు దైవము అన్నీ నీవే!అలా, నిన్ను భజించి తరించే భాగ్యాన్ని  అందించు !.స్వామీ శరణు ! పరమేశ్వరా  శరణు   !పరమాత్మా శరణు ! సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! స్వస్తి !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...