Jan 5, 2019
సర్వేశ్వరా ! నేనే బ్రహ్మను.. నేనే దేవుడి స్వరూపాన్ని . ! అనుకునే వాణ్ణి ! కానీ, ప్రభూ. ! నేనెమో ఒక జీవుడిని ! అల్ప ప్రాణిని ! నీవు మాత్రం జగన్నాథుడవు.! నీవలె ప్రశాంతత ను. నిశ్చలంగా ఉండే సచ్చిదానంద చిత్తాన్ని కలిగివుండడం నావల్ల సాధ్యం అవుతుందా ! ??ఎక్కడి ఆ వైకుంఠ పదము.?. ఆ మహోన్నత వైభవాన్ని కనీసం కలలోనైనా నేను ఊహించగలనా ,స్వామీ. ? నీ సచ్చిదానంద స్వరూపాన్ని చూడాలన్న తపన , కోరికలు ఎక్కడ..? నాలాంటి అజ్ఞానాంధకారబంధురంలో కొట్టుమిట్టాడే కర్మబద్ధుడిని నేను ఎక్కడ ?? ఇక నీయొక్క చింతన ,ప్రార్థన, భజనలలో కలిగే తన్మయానంద పారవశ్యం ఎక్కడ ? నేనెక్కడ ? దేవాది దేవా ! దివ్యప్రభావా ! నీవు పరమాత్ముడవు ! నేను జీవాత్ముడను !.కానీ ఈ జీవి , పరమ పరమ పాపాత్ముడు !రోజుకు ఎన్ని అబద్ధాలు ఎన్ని పాపపు కర్మలు చేస్తున్నామో కదా !. ఎన్నెన్ని జన్మల కర్మ ఫలాలను మూట గట్టుకొని ,ఇది "పాపపుణ్యాల రాశి " అని ,నీ నామ స్మరణ అనే అగ్ని తో భస్మం చెయ్యకపోతే విముక్తి లేదు!" అని గ్రహించకుండా ఇదే బ్రహ్మానందంగా భావిస్తూ ఉన్న నేను ఇక తరించేది ఎన్నడు తండ్రీ ? నాకు అందాలన్నీ ఆనందాలని పొరబడుతున్నాను.. మారుతున్న అందాలు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవని , తెలియని అజ్ఞానిని నేను ! నశించని ఆనందం నీగురించిన చింతనతో ,నీ తత్వజ్ఞానం లో , నీ గురించిన నిరంతర ఆరాధన లో ఉంటుంది కదా గోవిందా ! అందుకే , కేశవా .!పరమ భక్తుల సత్సంగంలో ఆ ఆనందాన్ని వెదుక్కుంటూ తృప్తిని పొందుతున్నాను ..! నాకున్న ఈ అల్పమైన విజ్ఞానం తో ,నిన్ను తెలుసుకోవాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా ! అందుకే పరమేశ్వరా ! నీ వైభవాన్ని గుణగానం చేస్తూ , దివ్యమైన చరితలను వింటూ ధన్యత పొందుతాను!. పరంధామా! ఇక జన్మరాహిత్యమైన ముక్తిని పొందాలి అనే భావన నా అమాయక అజ్ఞానాంధకారాన్ని సూచిస్తుంది కదా. !ఏది నిరంతర సాధన ?ఏది సద్గురువు ద్వారా సన్మార్గ దర్శనం ? ఏది సత్సాంగత్యం.?. ఎక్కడ దైవారాధన ?ఎక్కడ తత్వదర్శనం.?. ఆ వివేకం ఆ విజ్ఞానం ఆ అంతర్మధనం ,ఆత్మశోధన ,అంతరాత్మలో నిన్ను చూడాలన్న ఆవేదన ఎక్కడ ? చిత్తశుద్ధి లేదు ,నిలకడ లేదు బుద్దిలో !అందుకే స్వామీ. నీ సన్నిధిలో ఉంటూ నీ సేవ చేస్తూ ఉంటూ ఇదే ముక్తిదాయకము ,ముక్తిదామము ,అని భావిస్తూ నీగురించిన కథలను లీలలను ,కీర్తనలను వింటూ కలిగే భాగ్యమే. నాకు నీవు అనుగ్రహించిన కైవల్యపదవి అన్న పరమానందం తో జీవించే శాశ్వత సంపదను దయతో కరుణించు! .నారాయణా !.లక్ష్మీరమణ..!.పరాత్పరా@ పరంధామా..! ఇలాంటి సద్భావనను ,స్పూర్తిని , ,ప్రసాదించు. గోవిందా పుండరీకాక్షా ! రక్షమామ్ ! పాహిమాం !
Monday, January 7, 2019
నేనే బ్రహ్మను
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment