Saturday, February 2, 2019

భావన

శుభదినం దొరికితే చాలు శుభకార్యాలు జరుగుతాయి.!. ముఖ్యన్గా పెండ్లిళ్ళు చేయడానికి ముందుగా బుక్ చేయకుండా ఉంటే ఫంక్షన్ హాల్స్ దొరకడం లేదు కదా ! మనం , ఏ పెండ్లి కి వెళ్లినా ""వధూవరులు లక్ష్మీ నారాయణ "" స్వరూపులుగా భావించాల్సి ఉంటుంది ! కళ్యాణవేదిక ను పూజ్యంగా దేవతా మంటపం లా , పరమ పవిత్రంగా ను పెండ్లి కుమార్తెను మహాలక్ష్మి దేవి గాను,పెండ్లి కుమారుని శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించాలి. ఇక వచ్చినవారు అందరూ కన్యాదాతలుగా అనుకోవడం వల్ల తమ కూతురు ను నారాయణుని కి ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్న భావన రావాలి దృష్టిని తిండిపై లేదా అతిథుల పై , కాకుండా చెప్పుకాళ్ళతో కళ్యాణవేదిక ను అపవిత్రం చేయకుండా పెండ్లివారికి చేతనైనంత గా సహకరించాలి ఆ పని ,దైవారాదనభావంతో మాత్రమే సిద్ధిస్తుంది .స్త్రీలంతా పట్టుచీరలు నగలు జడలో పూలు చేతులకి రంగురంగుల గాజులు. నుదుట తిలకం కళ్ళకు కాటుక లతో తమని తాము మహాలక్ష్మి లా సింగరించుకొని చక్కని అలంకారాలతో. దేవాలయంలో జరుపుకునే సీతారాముల కల్యాణం వైభవాన్ని తిలకించి పులకించి తరించే ఆలోచనతో తయారై పెండ్లికి వెళ్ళాలి. పురుషులు స్త్రీలు శుచిగా ఉంటేనే పెండ్లికి వెళ్ళాలి . లేకుంటే వెళ్లవద్దు ఇక .వధూవరులు ఎలా ఉన్నారు అన్నది మనకు అనవసరం ! .మన భావన దివ్యంగా భవ్యంగాఉండాలి. పరమాత్ముని స్మరిస్తూ , మనసును పెండ్లి భోజనాలపై కాకుండా దేవతా స్వరూపులైన లక్ష్మినారాయణుల కళ్యాణం చూస్తూ పులకించి పోవాలి. వాస్తవానికి ప్రకృతి అంతా లక్ష్మీనారాయణ నిలయం. ప్రతీ పువ్వు సుగంధం అందం లాలిత్యం సౌకుమార్యం ఇవన్నీ లక్ష్మీదేవి అయితే ఆకారం నారాయణుడు.మాట లక్ష్మీదేవి అయితే మాట నుండిే శబ్దం నారాయణుడు ఇందుగలదండు లేడని సందేహము వలదు.. ఎందెందు వెదికి చూచిన అందందే తోచు చుండు. అన్నట్టుగా సర్వమ్ బ్రహ్మ మయం ఏటా చేసుకునే మన. బతుకమ్మ పండుగ లో రంగురంగుల పువ్వుల బతుకమ్మ సాక్షాత్తు మహాలక్ష్మి దేవి అయితే జలరూపంలో ఉన్న నారాయణుని చెంతకు ఆమెను చేరుస్టు న్నామన్న సంతోషంతో బతుకమ్మ ను నీళ్లలో నిమజ్జనం చూస్తుంటాము. !ఎప్పుడూ. వారు ఒకరినొకరువిడిచి ఉండరు ఇద్దరినీ కలిపి పూజించాలి అలా భావిస్తూ నిరంతరం సేవించాలి ,.అలా చూడకుండా అహంకరించి , రామునికి సీతను దూరంగా చేసిన రావణుడు పతనమయ్యాడు అందుకే .కేవలం ధనాన్ని అంటే లక్ష్మీదేవి ని ఆశించి ,, దైవాన్ని అంటే నారాయణుని మరిచేవారి ఇల్లు లక్ష్మీదేవి వాహనంగా ఉన్న గుడ్లగూబల కు నిలయంగా శిథిలమై పోతుంది. ! అందుకే ఎప్పుడూ ఇద్దరు భార్యాభర్తల మధ్యనుండి పొగూడదు అంటారు.. అలా పోతే వారిని విడదీసినట్టు అవుతుంది అలా చేస్తే మహా పాపం అని శాస్త్రం చెబుతోంది. అందుకే పుష్పాలను లక్ష్మినారాయణుల ,సీతారాముల రుక్మిణీ కృష్ణుల ,గౌరీశంకరుల కళ్యాణాలకు అందంగా రంగురంగుల సుగంధ పుష్పాలను అలంకరిస్తూ ఆనందించే సనాతన హిందూ సంస్కృతి మనది. సూర్యుడు నారాయణుడు అనుకుంటే సూర్యకిరణాలు మహాలక్ష్మి స్వరూపాలు. అలాగే వెన్నెల చంద్రుడు. అగ్ని వేడిమి... మంచుకొండలు శీతలం.అలా ప్రతీ ప్రాణిలోను మనలోను వారు కొలువై ఉన్నారు. అందుకే సృష్టిలో శక్తి చైతన్యం! ,బ్రతుకు మనుగడ ! ,,జీవితం సంతోష మయం !! ఆనందం అనేది నారాయణుడు అయితే.అంటే సంతృప్తి.లక్ష్మీదేవి..అవుతుంది కదా ! స్త్రీలువారి జడలో ధరించే పువ్వులతో మహాలక్ష్మీ దేవి లా శోభిస్తారు. దైవపూజకు ఉపయోగించిన పువ్వుల నిర్మాల్యాన్ని కూడా పవిత్ర జలాల్లో నిమజ్జనం చూస్తుంటాము.. ! సృష్టిలో పవిత్రమైనవి ,పరమాత్ముని పూజించేందుకు యోగ్యతను కలిగి ఉన్నవి పుష్పాలు మాత్రమే..కదా !తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం చేసే దివ్యమైన సేవ ,తోమాల సేవలు మొదలైనవి చూస్తుంటాము ! .ప్రతీ ఆలయాలలో ను , కల్యాణ క్రతువు యజ్ఞ యాగాది దేవతా ఉత్సవాలలో , బ్రహ్మోత్సవాలల్లో కూడా , అద్భుతంగా పూలమాలల అలంకరణ లో దైవాన్ని దర్శిస్తూ అమితానందాన్ని పొందుతుంటాము.మనం !లక్ష్మీ స్వరూపంగా వెలిసిన పుష్పాల మాలలను కైంకర్యంగా సమర్పిస్తూ చేసే నిత్యకల్యాణ అర్చన సేవలు స్వామికి అమితానందాన్ని కలిగిస్తూఉంటాయి.! భక్తుల అభీష్టాలను అనుగ్రహించేలా కళ్యాణప్రదంగా కన్నులపందువుగా కమణీయంగా రమణీయంగా అపురూప వైభవంగా స్వామి తన దర్శనభాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ జన్మ ధన్యం చేస్తుంటాడు. అందుకే పుష్పాలను పరమ పావన పవిత్ర భావంతో లక్ష్మీదేవి సహిత పరమాత్ముని .పూజకి సేవకు.. వినియోగిస్తూ. అదే భావనతో పువ్వులను కైంకర్యం చేస్తూ , ధరిస్తూ తరించుదాం ! శ్రీ లక్ష్మీనారాయణ భగవాన్ కీ జై.. సనాతన హైందవ దివ్య సంస్కృతికి జై..! రామాయణ భారత భాగవతాది పరమ పవిత్ర గ్రంధాలకి జై.! గంగా యమునా సరస్వతీ మొదలగు నదీమతల్లులకు జై! సత్సంగము నకు జై ! భారత మాతాకి జై. !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...