Saturday, February 2, 2019

చైతన్యం

కృష్ణ భక్తుడు సూరదాస్ పుట్టుకతో అంధుడు..! జీవితాంతం అతడు  కృష్ణనామ గాన భజనలతో  చిన్ని కృష్ణుణ్ణి కీర్తించి  తరించాడు .అంత్యదశలో  అతని గురువు వచ్చి అడిగాడు , కృష్ణ కీర్తనలను పాడమని .!...సూరదాస్ అత్యంత ప్రేమతో ,గురువు సాన్నిధ్యంలో , తాను గానం చేసిన భజనలన్నీ  అందరికి వినిపించాడు. అందరూ ఆనందించారు గురువుతో సహా..! అందులో ఒకరు అడిగాడు.,స్వామీ !. ఇన్ని కీర్తనలను కృష్ణునిపై పాడినావు కదా..! కొన్ని కీర్తనలను నీకు శ్రీకృష్ణ చైతన్యం అనుగ్రహించిన నీ గురువు పైన చదవండి .. అని అన్నాడట.!. అప్పుడు సూరదాస్ నవ్వి.. ""అయ్యా ! నాకు గురువే దైవం!. నాకు గురువుగా నిలిచి కృష్ణ ప్రేమను కరుణించి .ప్రేమతో నా వద్ద నిలుచున్న గురువు శ్రీకృష్ణుని ప్రతిరూపమే !...నా దృష్టిలో నా గురువుకు  ,  కృష్ణునికి బేధం లేదు. అబేదం! ,ఇద్దరు లేరు ఒకరే.! గురువే దైవం..! కృష్ణం వందే జగద్గురుమ్ . !నేను పాడిన గీతాలు నా జీవితం , అన్నీ  నా గురువుకే అంకితం.!  అంటూ ఆనందంగా ప్రశాంతంగా గురువు పాదాలను స్పర్శిస్తూ  కళ్ళు మూశాడు.. !  అలా  కృష్ణ పరందామము ను చేరుకున్నాడు శ్రీ  కృష్ణ భక్తుడు సూరదాస్.!.. ఇది భాగవత ఏకాదశ  స్కంధం లో శ్రీకృష్ణ భగవానుడు   తనను చేరుకోవాలంటే ఉపదేశించిన మార్గాలలో సద్గురువు ను ఆశ్రయించి ముక్తిని పొందడం.  అనే ఒకటవ మార్గం !!!....ఇక రెండవది. అంతటా  దైవాన్ని దర్శించడం !..ఇది  కష్టతరమైన మార్గం...! అయినా పరందాముని పరిపూర్ణంగా నమ్మినవారికి  భక్తులకు అసాధ్యమంటూ ఏది లేదు కదా. !  పండరీ విఠల్ భగవానుని పరమ భక్తుడు నామదేవ్..! ఒకరోజు  అతని ఇంట్లోంచి  ఒక కుక్క ఒక రొట్టెను నోట కరచుకొని పారిపోతుంటే. అతడు  అది చూసి..,"" భగవాన్. !ఇంకా ఉన్నాయి ! ఒక్కటే సరిపోదు కదా నీకు ! ఇవన్నీ నీకోసమే చేశాను..పైగా  వాటికి నెయ్యి కూడా రాయలేదు..! స్వామీ  ఆగండి !   తొందరపడకండి ! ఇదిగో వస్తున్నాను నేను ! నెయ్యి పట్టుకొని  ! నేను నెయ్యి  వీటికి రాసాక  నీవు తిందువుగాని. ! " అంటూ ఆ కుక్క వెంబడి నేతి గిన్నెను ,మిగిలిన రొట్టెలను పట్టుకొని. పరుగున  వెళ్లాడట.! ఇది సర్వాంతర్యామి ని భావించి సేవించుకునే రెండవ మార్గం..! . ఇవి రెండూ వీలు కాకపోతే కలియుగంలో ఉండనే ఉన్నది ! హరినామ కీర్తన స్మరణ భజన  .!,,,సకల పాప దుఃఖ శమనం కోసం !!..అదే శ్రీకృష్ణ భగవానుడు ఈ విదంగా శ్లోకం ద్వారా మనకు ,అంటే భాగవత భక్తులకు ఇలా తెలియజేశాడు  .  శ్లో !!నామ సంకీర్తనం యస్య ,సర్వ పాప ప్రణాశనం.,,,ప్రణామో దుఃఖ శమనః,, తం నమామి హరిం పరమ్ !!  హరినామ స్మరణ  భావిస్తూ చేద్దాం. మానవజన్మ ను ధన్యం చేసుకుందాం. జై శ్రీకృష్ణ ! జైజైశ్రీకృష్ణ ! గోపాలకృష్ణ భగవానుని కి జై ! కృష్ణం వందే జగద్గురుమ్ !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...