Wednesday, February 20, 2019

కళ్యాణం

" కళ్యాణం  "అంటే అందరికి ఆనందాన్ని పంచేది.!. పెండ్లి చేసుకునే వధూవరులు, ఇరుపక్షాల వారు మాత్రమే కాకుండా, వివాహానికి విచ్చేసిన వారందరు సంతోషంగా వచ్చి , పెళ్లి జంటను దీవించి భోజనాలు చేసి సంతృప్తి పొందడం వల్ల , కలిగే ఆనందం ,, పెళ్ళివారికి "జయాన్ని శుభాన్ని" ఇస్తుంది.!.ఎలాగంటే పెండ్లికి పిలుస్తూ మనపై , ప్రేమతో  ఉన్న ఆత్మీయలను బంధువులను ,""పెద్దవారు.!.రండి .!మీ ఆశీర్వచనం, వలన ఈ  జంట చల్లగా ఉంటారు! " .అంటూ దేవతలను ఆహ్వానించిన విదంగా  ,పేరు పేరునా ఇంటింటికి వెళ్లి పిలుస్తాము .వారు కూడా మంచిమనసుతో ,ప్రేమతో  వస్తారు. "వీరే అతిథి దేవుళ్ళు.!. దైవస్వరూపులు!" కూడా ..!. ఒక పెండ్లి చేయడం వలన. వధువు వరుడు వైపు గల రెండు కుటుంబాల వంశాల వారే కాకుండా  ,వారితో బంధుత్వం గలవారంతా వివాహపరిచయ వేదికపై కలుస్తారు. అక్కడ ఒకరికొకరు స్నేహాలు బంధుత్వాలు కలుపుకుంటారు. అంటే. ఇటువైపు వారు 500 అనుకుంటే అటువైపు వారుమరో  500. !!ఇలా 1000 మందిని పరస్పరం ప్రేమతో. వాత్సల్యంతో అభినందించుకునే ""అద్భుతమైన అనుబంధాల కలయిక "" ఒక పెండ్లి వలన  ఒకే వేదికపై  ఏర్పాటు జరుగుతోంది. ! ఇదీ మన సనాతన సాంప్రదాయ వైభవం  ,మనం పొందే ఆనందాన్ని వేలాదిమందితో పంచుకుంటూ పెంచుకొనడం వల్ల ఈ వ్యవస్థ కల్యాణకరం !! అందుకే  మన సనాతన  హిందూధర్మంలో వివాహానికి పెద్ద పీటను వేయబడింది.  ఇంతమందికి  "ఆనంద నిలయంగా " ఈ కళ్యాణవేదిక అవుతోంది..! ఏటా మనం శ్రీరామనవమి రోజున  సీతారాముల కల్యాణం కమణీయంగా రమణీయంగా  అత్యంత వైభవం గా  , ప్రతీ చోటా జరుపుకుంటాం !మన ఇళ్లలో జరిగే పెండ్లి వలె. కొట్టబట్టలు నైవేద్యం, కట్నకానుకలు , అమ్మవారికి పుస్తెలు  ,,పసుపుకుంకుమ  మంగళహారతి పళ్లెం తో సహా  సకలసంభారాలు  సమకూర్చుకొని, ఉత్సాహంతో, బంధుజనాలతో  ,కళ్యాణం అయ్యేవరకు ,ప్రసాదం గ్రహించేవరకు , ఉపవాసం చేస్తూ కూడా , దేవాలయాలలో సామూహికంగా జరుపుకునే సీతారామ కల్యాణం చూస్తూ , మనం  పొందే ఆనందము చెప్పనలవి కాదు కదా.!రోజూ.మనం  ఆనందించే ప్రతీ సందర్భాన్ని  కళ్యాణం అనము కదా..! సీతారాముల  వివాహాన్ని మాత్రమే " కళ్యాణం" అంటాము ! .ఎందుకంటే మనకోసం లక్ష్మినారాయణులు ,సాధారణ మానవులుగా దివినుండి భువికి దిగివచ్చి .మానవులు ఆచరించే సంప్రదాయాలు పాటిస్తూ . మానవులుగా అవతరించి ,సకల బంధుజనాల సమక్షంలో కన్నులపండువుగా  సాంప్రదాయ మన హిందూ ధర్మ వేదం శాస్త్ర పద్దతిలో ఋషులు మునులు సమ్మతంతోనే  పెళ్లి చేసుకున్నారు , ఈ అపురూపమైన పెండ్లి చూడటానికి సకల దేవతలు కూడా మానవ రూపాలు ధరించి. కల్యాణం తిలకించి తన్మయులై ధన్యత పొందారు. అందుకే, దేవతావైభవాన్ని తలపించే సీతారాముల పెండ్లి  వలెనే మనం కూడా మన ఇళ్లలో మన కూతుళ్లకు   యధాశక్తితో ,జరిపించే పెళ్లిని కళ్యాణం అంటాము.!.వధూవరులు సాక్షాత్తు" లక్ష్మీ నారాయణ స్వరూపాయ.. !"అంటూ.. వేదమంత్రాల మధ్య.. వయసులో పెద్దవారైన అమ్మాయి తలిదండ్రులు తమకంటే చిన్నవాడైనా అల్లుడి కాళ్ళు కడిగి  ,తమ కూతురు ను "మహాలక్ష్మి" వలె ,అల్లుడిని "నారాయణు "డికి  ఇచ్చి కాళ్ళు కడిగి ,కన్యాదానం చేస్తున్నట్టుగా భావిస్తూ జీవితం ధన్యం అయినట్లుగా ,. ఆ పాదోదకాన్ని అదే పవిత్రభావంతో తమ తలపై చల్లుకుంటారు .!.. దీవించటానికి విచ్చేసిన బంధుజనాలను ,స్నేహితులను  తమ కూతురు అల్లుళ్ళను దీవించడానికి వచ్చిన దేవతామూర్తులుగా  ఆహ్వానిస్తూ ఆదరణగా గౌరవిస్తూ మర్యాదలు చేస్తారు..! ఇదే రీతిలో రుక్మిణీ కృష్ణులు, గౌరీ శంకరులు,శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కూడా రంగరంగవైభవంగా ,కన్నుల పండుగ లా వేలమంది తో సామూహికంగా  చేస్తాము..!  భోజనాలు ,పులిహోర లాంటి ,దేవతా ప్రసాదాన్ని కూడా సామూహికంగా స్వీకరిస్తాము  !ఆ విధంగా సీతారాముల కళ్యాణం ఆదర్శంగా ఆచరణీయంగా తీసుకుంటాము..! ఎందుకంటే రాముడు మర్యాదపురుషోత్తముడు.! శివదనుస్సు విరిచినా. సీత వరమాల వేసి  శ్రీరామునిపతిగా  స్వీకరించినా కూడా తమ తలిదండ్రులుమాత్రమే తన వివాహం విషయంలో నిర్ణయం తీసుకుంటారని ..అంతిమ నిర్ణయం వారిదే అని. వారి సమ్మతి తో మాత్రమే వివాహం జరగాలని  చెప్పాడు.. అలా కన్నవారిపై రామునికి గల అపారమైన గౌరవ మర్యాదలు. భక్తిశ్రద్దలు రాముని పూజ్యునిగా ,దైవంలా , చేశాయి.. ఇక సీత సకల ధర్మ వేద శాస్త్రాలు తండ్రి జనక మహారాజు  కూతురు. అతడు  మహా ధార్మికుడు !భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూర్తీభవించిన మహా జ్ఞానికి కూతురు "జానకి "అని తండ్రి పేరుననే గుర్తింపు పొందింది. సీత, మహాసాధ్వి  కనుకనే రావణాసురుని చెరలో.10 నెలలు  అష్టకష్టాలు పడుతున్నా కూడా,, చెదరని బెదరని అదిరిపోని  ఆత్మవిశ్వాసంతో, రామునిపై  అపారమైన నమ్మకంతో, రావణాసురుని అంతమొందించ గలిగింది.  తన తలిదండ్రుల పెంపకం , శిక్షణ, వారిపై ఆమెకు గల ప్రేమానురాగాల వల్లనే  సీత రాముని కి యోగ్యురాలైన భార్య కాగలిగింది..! అంటే రామాయణం లో సీతారాముల కల్యాణం  ఆనందదాయకం కావడానికి కారణం. తలిదండ్రులు ,గురువులు సోదరులు, బంధుజనాల పట్ల సీతారాముల  భక్తి విశ్వాసాలు  శ్లాఘనీయం..! అద్భుతం..! అందుకే ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రతీ పెండ్లి వైభవం  సకల జనులకు ఆమోదాన్ని ఆనందాన్ని కలిగిస్తూ  కళ్యాణకరం గా ఉంటుంది అందుకే .వివాహవేదిక దేవతావైభవాన్ని సూచిస్తుంది..  ! పాదరక్షలతో పోకుండా ,ఆలయానికి వెళ్తున్న పవిత్ర భావం తో ఆచరణతో పెండ్లి జరిపించాలి. వధూవరులు ప్రత్యక్ష దైవాలైన సీతారాముల కు ప్రతిరూపాలుగా తలపిస్తూ ఉంటారు.. ఈ కళ్యాణం కేవలం ఒక జంటకు మాత్రమే  జరిగే బంధము ,లేదా ఒప్పందం కాదు..!  కళ్యాణ వేదిక వద్ద జమగూడిన మనమంతా జీవులం అనుకుంటే . .పరమాత్ముడు పరంధాముడైన ఆ నయన మనోభిరాముడు. కళ్యాణ గుణ దాముడు.. జగదాభిరాముడు అయిన పరమాత్మతో ఈ జీవాత్మల సంయోగమే ఈ  కళ్యాణంగా అవుతున్నట్టుగా భావించి పరవశించి తరించాలి. అంటే వధువును మన కుమార్తెను " మహాలక్ష్మీ." స్వరూపిణి గా తలంచాలి. ఇక వరుని రూపంలో ఉన్న అతడిని "శ్రీమన్నారాయణుడి "గా భావించాలి.. ఇలాంటి భావనతో వెళ్తే ప్రతీ పెళ్ళి.. "కళ్యాణకరం.!. మనోహరం.!" అలాంటి భావ సంపద తో  చూచిన కళ్ళు ,,కన్నుల పండుగ ! అలా .చూడలేక పోతే పెళ్లికి వెళ్లి దండగ. అనుకోవాలి..! రామాయణం లాంటి కావ్యం.. మనం అనుసరించి ఆచరించి ఆనందించే ఇలాంటి సీతారాముల కళ్యాణం సకల జనావాలికి శ్రీరామరక్ష కావాలని  కోరుకుందాం.! శ్రీరాజా రామచంద్ర భగవాన్ కి జై .!.జై శ్రీరామ్ !జై జై శ్రీరామ్!. రామలక్ష్మణ జానకీ..! జై బోలో హనుమాన్ కి..!శ్రీరామ్ జయరాం జయ జయ రామ్. !!! స్వస్తి !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...