Wednesday, February 20, 2019
రామాయణం లో ప్రేమ
రామాయణం లోని శూర్పణఖ --శ్రీలంక కు, సింహళం ద్వీపానికి చెందిన రాక్షసజాతి వనిత. ! వారికి కట్టు బొట్టూ ఉండవు ,వావి వరుసలు అసలే ఉండవు.నేడు Valentine s day అనే ప్రేమికుల రోజు న,అందరూ ప్రేమ కేవలం యువతీ యువకులకు మాత్రమే స్వంతం అయినట్టుగా,ఉత్సాహంతో ఉత్సవం చేస్తున్నారు.. మిగతవయస్సు వారు దానికి మినహాయింపుగా పరిగణిస్తూ ఉన్నారు. శూర్పణఖ లాంటి ఒక స్త్రీ ,రాముని లాంటి ఒక పురుషుని చూడటం. ఆమె ఇష్టపడటం అలా . I love you ,అనే సంస్కృతిని ప్రచారం చేస్తూ.తన ఇష్టానికి అడ్డువచ్చిన సీతమ్మను ,లక్ష్మణుడిని చంపేసి. తామిద్దరు సుఖంగా ఉండడం కోసం. ఏమైనా చేస్తూ ,దేనికైనా తెగిస్తూఉండే జాతి అది !. చివరకు తాను ప్రేమించిన ప్రియుడు తనకు దక్కలేదన్న అక్కసుతో, అటు సోదరులైన ఖరదూషణులను,రావణాది రాక్షస జాతి సర్వనాశనానికి కారకురాలైన దుస్సాహసి ఆమె ! శూర్పణఖ ప్రేమ ఎంత ఘోరాన్ని తెచ్చి పెట్టిందో రామాయణం చదివి తెలుసుకోవాలి .. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతోంది.!. తల్లీ,తండ్రి ప్రేమ కొరకు రాముడు,!.సోదర ప్రేమతో భరత లక్ష్మణ శత్రఘ్నసోదరులు!..రాముని మిత్రప్రేమకోసం సుగ్రీవ విభీషణులు.! భర్తపై ప్రేమతో సీతమ్మ !,,,రామస్వామి పై గల భక్తి అనే ప్రేమతో హనుమ.!. ఇలా ప్రేమకు పవిత్రతను త్యాగం తో అపాదించారు. . ! ఈ శూర్పణఖ ద్వారా సూచింపబడే విదేశీ సంస్కృతి ,ఆచరణీయం కాదనీ, అధర్మం గా ఉంటుంది అని రామాయణం సూచిస్తుంది ! కాని ,నేడు అదే పద్ధతిని నేడు యువతీ యువకులు అవలంభిస్తూ ప్రేమకు కొత్త నిర్వచనం చెబుతూ,. పవిత్రమైన తలిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ, వారిని అనాధ ఆశ్రమాల పాలు చేస్తున్నారు.. !కొడుకులు కూతుళ్లు సంపద ,డబ్బు ఆస్తులు ఉండికూడా కన్నవారు దౌర్భాగ్యస్థితిలో కన్నపిల్లలకు కట్టుకున్న ఇంటికి దూరం అయ్యి అందరు ఉండి అనాధల్లా బ్రతుకు ఈడుస్తు అయోమయంగా అశాంతితో బ్రతుకు లు ముగిస్తున్నారు.."నేను నా భార్యా పిల్లలు బావుంటే చాలు ,! అనుకునే స్వార్థబుద్ది దురదృష్టవశాత్తు ,క్రమంగా నగరాల్లో, విద్యావంతుల్లో ప్రబలిపోతోంది. కన్నవారు తమ కుటుంబం వారు కాదు ,పరాయివారు! అనేది విదేశీ సంస్కృతి..!! భారతీయ సంస్కృతి కాదు ! మనం పరధర్మాన్ని పాటిస్తున్నాం ,కనుక మానవత్వం మంట కలిసిపోతోంది..!. భగవద్గీత లో గీతాచార్యుడు ,శ్రీకృష్ణభగవానుడు "స్వధర్మం " ఎంత కష్టం అనిపించినా పాటించడం శ్రేయస్కరం !" "పరధర్మం "ఎంత సులభతరం గా తోచినా పనికిరాదు. !" ఆచరణీయం కాదు !" అని బోధించాడు ,అయితే అంత దుష్ట స్వభావం గల రాక్షసి శూర్పణఖ కు ఆమె సోదరులు ఖర దూషణులకు కూడా భువన మోహన రామచక్కదనం చూసి మోహితులై మొదట వైరం విరమించు కున్నారు. తర్వాత శూర్పణఖ భంగపాటు తో రెచ్చగొట్టడం వలన వివశులై పోరాడి మహాబలి శ్రీరాముని చేతిలో అగ్నిలో మిడుతల వలె హతమయ్యారు .! రాముని అద్భుత పరాక్రమాన్ని ,రూపలావణ్య సౌందర్యాన్ని చూసి ఆమె ,,.".తరుణౌ రూప సంపన్నో ---.. మహాబలౌ !"...అంటూ శ్రీరాముని మన్మధకార విగ్రహాన్ని అందంగా స్తుతించింది.! అంటే రాక్షసులచే త కూడా స్తుతించబడిన దివ్య చరిత ,శ్రీరామచంద్రునిది !.శ్రీరాముని దూషించిన వారైనా , పూజించిన వారైనా . వారు నిరంతరం రామనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ముక్తిదామాన్ని పొందారు..అదే రాక్షస జాతికి చెందిన మారీచుడు కూడా "అపర శ్రీ రామభక్తుడు "అయ్యాడు భయంతో ..!! అటు శివ భగవానుడు తారకనామ జపంతో రామభక్తుడు అయ్యాడు భక్తితో.!! ఇద్దరూ రామభక్తులే ! ". ర " అనే శబ్దం తో మొదలయ్యే " రథం,,రా,, ""అన్న శబ్దాలు వింటేనే గజగజ వణికి పోతాడు మారీచుడు !.ఎక్కడో ఉత్తరభారత ప్రాంతం మిథిల నుండి రాముడు కొట్టిన ఒకే ఒక బాణపు దెబ్బకు వేల యోజనాల దూరంలో , మారీచుడు దక్షణంలో శ్రీలంకలో చావకుండా పడిపోయాడు..అంతటి భుజబల సంపన్నుడు.,, దనుర్ధారి ,,రఘురాముని స్మరిస్తేనే సింహాన్ని చూసిన జింకపు పిల్లలా అచేతనుడై భయంతో కంపించి పోతాడు మారీచుడు !.. ఎటువైపు నుండి రాముడు వస్తాడో అని నిద్రలో కూడా ఉలిక్కిపడి రామధ్యాసతో తో కాలం గడుపుతున్నాడు..అతడు !అంతటి బలశాలి రాముడు ,తన సోదరుడు సుబాహుని చంపి, తనను మాత్రం చంపకుండా శతయోజనదూరం లో సముద్రం ఆవల పడగొట్టిన రాముని శౌర్య పరాక్రమాన్ని మరచిపోలేక పోతున్నాడు రాక్షస మారీచుడు !..రాముని దెబ్బ తినకముందు రాక్షసుడు !కానీ ,ఇప్పుడు మాత్రం మారీచుడు ఋషి అయ్యాడు .!రాక్షస ప్రవృత్తి మాని ,..మునులతో గూడి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా ఒక రాక్షసునికి సజ్జనత్వం కేవలం శ్రీరాముని నామస్మరణ మాత్రాన లభించింది.కదా !. అలా రామాయణం లోని పశు పక్ష్యాది ప్రాణులకు వానర రాక్షసులకు ,మానవులకు ,ఎందరో,ముని ఋషి పుంగవులకు, శబరి లాంటి భక్తులకు,, అందరినీ దర్శన,స్మరణ మాత్రం చేత ముక్తిని పొందారు. అందుకే మన అందాలరాముడు అందరివాడు,ఆచరణీయుడు , ఆదర్శనీయుడు. అనుపమ పరాక్రమవంతుడు,, ధర్మావతారుడు ,రఘుకుల సోముడు, జగదాభిరాముడు ! కావున ,రామాయణం వినినా పాడినా ,భజించినా ,స్మరించి ,సేవించి తరించినా , భవ్యము !దివ్యము !జన్మ ధన్యము కదా !జై శ్రీరామ్! జైజై శ్రీరామ్ !"
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment