Wednesday, February 20, 2019

దైవ భక్తి

అందరికీ దైవభక్తి ఉంటుంది మదిలో , మనలో  తెలియకుండా !. పరమ నాస్తికులు కూడా అంతరాళంలో దైవాన్ని విశ్వసిస్తారు..!  కానీ వారు సమాజంలో ఉండే విశ్వాసాలను, తాము దర్శించలేక, భగవద్ ప్రాప్తికి నోచుకోక, వైష్ణవులు కాలేక ,భాగవతులతో సత్సాంగత్యం చేయలేక, అందుబాటులో లేని, భావించలేని భావ దారిద్య్రం తో , జ్ఞాన అజ్ఞాన విచక్షణ కోల్పోయి,"" దేవుడు లేడు !" అనే పిడి వాదన చేస్తూ ఉంటారు. అయితే అందుకు కారణాలు కూడా లేకపోలేదు.   దైవంపై విశ్వాసం లేకపోవడానికి,సాధారణంగా  భక్తి కంటకాలు 5 ఉంటున్నాయి..1.) జాతి గురించిన అభిమానం.!"" నేను ఉన్నతజాతికి చెందినవాడను!,నేను ఎక్కువ! ,వారు తక్కువ.! అందువలన నేను చెప్పిందే, చేసిందే, నిజము..! అనుకుంటూ అదే స్థాయిలో ఉండేవారితో కలుస్తూ. అదే విదంగా ఆలోచిస్తూ ఒక్క మెట్టు కూడా కిందికి దిగి రాకుండా ఉంటూ. భక్తి తత్వసిద్ధాంతమునకు దూరమౌతున్నారు  కొందరు  2  ) కుల భావన !.భగవద్గీత లో గీతాచార్యుడు ప్రతిపాదించిన చాతుర్వర్ణాలు కాకుండా ఈ రోజు ఎన్నో కులాల వర్గీకరణ ప్రభుత్వమే స్వయంగా అన్ని కార్యక్రమాల్లో సూచిస్తూ ,రాజకీయాలలో  వానికి పెద్దపీట వేస్తూ ఉండడం  చూస్తున్నాం. ఇందులో కూడా ఎక్కువకులం తక్కువ కులం లాంటి  వ్యవస్థ వేళ్ళు పాతుకొని ఉంటోంది..  ఫలితంగా  కులాలవారీగా దేవుళ్ళు పుట్టుకొస్తూ ఉన్నారు..అలా దైవభక్తి చీలిపోతోంది.! నా దేవుడు ఇతడు.!. నీ దేవుడు అతడు..!అనే వాదనలు తో .  కుల వ్యవస్థ భక్తికి కంటకంగా మారుతోంది.. రామాయణం లో సీతారామలక్ష్మణులను గంగానదిని దాటించిన గుహుడు  కేవలం ఆటవికుడు మాత్రమే! అతడికి రామునిపై గల నిరూపమానమైన భక్తి తో  శ్రీరాముని కరుణకు నోచుకున్నాడు. అలాగే సూరదాస్ పుట్టుకతో అంధుడు. అయినా బాలకృష్ణుని కీర్తనలు పారవశ్యంతో గానం చేస్తూ ఉంటే చిన్నికృష్ణుడే రోజూ స్వయంగా వచ్చి అతని ముందు కూర్చుని వింటూ ఆనందించాడు.!. మరో రామభక్తుడు కబీర్ దాసు..! అతడు పిలిస్తే  రాముడు పలికేవాడట! అనన్యసామాన్యమైన అనితరసాధ్యమైన భక్తిప్రపత్తులకు వారి జాతి కుల వర్గాలు అడ్డు రాలేదు.! దైవంపై వారికున్న అచంచలమైన విశ్వాసం,, ప్రేమ ,వారు నమ్ముకున్న ఇష్ట దైవానికి  అలా దగ్గరగా చేర్చింది. .3 విద్యాభిమానం. కూడా !  చదువుకున్నవారు అంటే పండితులు. ,విద్యావంతులు,! చదువులేనివారు ,అనగా పామరులు.,అనగా తక్కువ విద్య నేర్చినవారు..! ఇలాంటి చీలికలు దైవాన్ని నమ్మడంలో  క్రమంగా  అడ్డంకులు గా మారుతున్నాయి !. భక్తి విషయంలో చదువు అనేది ఏ రకంగా ఇబ్బంది కాకూడదు.! కాదు కూడా.! విద్యతో  నాలుగు వేదాలు చదవడంరావచ్చునేమో,, కానీ అందులో ఉన్న వేదాంత రహస్యాలు నేర్వాలంటే నీలో ఉన్న "అవిద్య  "తొలగాలి !అంటే అంతటా దైవాన్ని దర్శించే జ్ఞానం కలగాలి కదా   4.)   రూపం. పై అభిమానం అద్దంముందు రోజూ తీర్చిదిద్దే అందమైన దేహం పై తీరని మోహం ! దేవుడిచ్చిన ఈ శరీరంపై దురభిమానం పెంచుకొని.. ఆకారం పై మక్కువతో, నేను! నాది !నావారు..! అనే బంధాలలో చిక్కుకొంటూ. ఈ రూపాన్ని కరుణించి న దైవం యొక్క అసలు రూపాన్ని. గుర్తించలేక. .సంసారకూపంలో కొట్టుమిట్టాడుతూ భక్తియోగం అంచులకు కూడా చేరకుండా జీవనయాత్రను ముగించడం జరుగుతోంది.కదా .5..) యవ్వనం పొంగు !. ఇది వేగంగా పారుతున్న ప్రవాహం లాంటిది. ఉరుకులు పరుగులతో ఉడుకు రక్తంతో ,రెండు తీరాలను ఒరుసుకొని పారుతూ కట్టలు తెంచుకొని విశృంఖలంగా స్వేచ్ఛగా ,స్వేచ్చా విహంగంలా ఎగిరిపోవాలని అనిపించే యువత స్వభావం!  .స్వామి వివేకానందుడు కావాలన్నా, భక్త ప్రహ్లాదుడు కావాలన్నా బాల్యంలోనే భక్తి అనే విత్తనం బీజం మొలకెత్తాలి హృదయంలో.!. అప్పుడే మనసు చెప్పినట్టు శరీరం వింటుంది. !గురువు ఆశ్రయాన్ని కోరుతోంది! తలిదండ్రుల, పెద్దల మాట శిరోదార్యంగా ఉంటుంది.! సత్సంగంతో సాత్విక గుణం తో రామాయణం, భారత భాగవాత పఠనం శ్రవణం చేస్తుంది! దేవాలయాలను దర్శిస్తుంది.! పరులలో దైవాన్ని చూస్తూ  సేవిస్తుంది! నేటి యువతకు ఇంటిలో తలిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు. చదువుతో బాటు సంస్కారం,సనాతన సంప్రదాయం ,నేర్పుతూ  చక్కని మార్గదర్శనం చేస్తే తప్ప యువతకు అభ్యుదయం వీలు కాదు .!""ముసలివాళ్లకు భక్తి దేవుడు ,దేవాలయాలు, పురాణాలు. కావాలి. అప్పుడు వారికి ఏ పని ఉండదు కనుక అదే పని.."" మేము కూడా అప్పుడు పూజలు చేస్తాము ఇప్పుడు మాత్రం "లైఫ్ ఎంజాయ్" చేస్తాం .!!"అని యువకులు యువతులు భావిస్తూ ఉంటారు ..",విత్తనం చిన్నతనంలోనే పడాలి! అది క్రమంగా పెరిగి ఫలవంతం కావాలంటే అప్పటికప్పుడు అయ్యేదికాదు కదా.-!ఇలా ఈ 5 అవరోధాలను ఎదుర్కోవడం సామాన్య విషయం కాదు.--- దైవభక్తి కి ఈ విదంగా కంటకాలు గా ఉన్న దుర్భేద్య వాతావరణాన్ని భేదించాలంటే సాధన, సత్సంగము, ఆత్మ పరిశోధన,  భగవద్గీత, పౌరాణిక గ్రంధాల పరిశీలన ,అనునిత్యం దైవారాదన, దైవంపై ప్రగాఢంగా విశ్వాసం నిలుపక తప్పదు. ""!నీలో , నాలో, అందరిలో ,అన్నింటిలో ,విశ్వమంతా నిండి ఉన్నాడు విశ్వంభరుడు !!". అని భావిస్తూ.. తండ్రీ !, దయామయా ! కరుణాసిందో,! దీన బంధో  .!!దయయుంచి నాకు నీపై చెదరని ,నిన్ను వదలని నమ్మకాన్ని అనుగ్రహించు..! నారాయణా.! నేను అజ్ఞానిని !పామరుణ్ణి.! మహా పాపిని !..నిన్ను దర్శించుటకు అసమర్థుడను..! అందుచేత నీవే నన్ను నీ సేవకు, నీ బంటునగుటకు యోగ్యతను అనుగ్రహించు!.. నిరంతరం నీ ధ్యాన గాన భావ సేవా తత్పరతో ధన్యుణ్ణి చెయ్యి..!అది నీ బాధ్యత ! దేవదేవా  !పరంధామా! పరాత్పరా  !పరమేశ్వరా! శరణు..!అఖిలాండకోటి బ్రహ్మాణ్డె నాయకా! శరణు.!. సర్వాంతర్యామి.!శరణు! స్వస్తి.! సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! హరే కృష్ణ ! హరే కృష్ణా !!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...