Wednesday, February 20, 2019

సుగుణాభిరాముడు

సుగుణాభిరాముడు శ్రీరాముడు.. ! వనవాస దీక్ష ముగించి తిరిగి అయోధ్యా నగరానికి వచ్చాక తన కన్నతల్లి కౌసల్య కంటే ముందుగా పినతల్లి కైకమ్మకు మోకరిల్లి కృతజ్ఞతలు తెలియజేశాడు.." అమ్మా! నీవు నన్ను అడవికి పంపకుండా ఉంటే నేను చాలా నష్టపోయేవాడిని. తల్లీ ! . నన్ను  అలా వనవాస దీక్ష అన్న నెపంతో పంపించి నాకు మహోపకారం చేశావు. నీ రుణం ఎలా తీర్చుకొనగలను మాతా. !? నీ కరుణ అపారం.. అమ్మా ! " అంటూ ఆమె చెంత కూర్చుండి.. తాను అడవిలో పొందిన అనుభవాలు అనుభూతిని చెబుతాడు.. ఈ విదంగా చెప్పడంతో కైకమ్మ లో ఉన్న దుఃఖం ,అపరాధ భావన తగ్గాయి. నా విషయంగా వీరు అడవుల పాలైరి కదా ! అన్న పరితాపం తగ్గింది..కన్నతల్లి కంటే తనకు రాముడు ఇస్తున్న ప్రేమాభిమానాలు ,గౌరవమర్యాదలకు ఆమె హృదయం ద్రవించింది. ఆనందంతో  రామయ్యను  అక్కున చేర్చుకుంది.. ఇంతకష్ట పెట్టినా కూడా తనపై ఈగ వాలకుండా ,ఎవ్వరూ పల్లెత్తు మాట అనకుండా కట్టుబాటు చేసిన రాముని అమృత హృదయం చూసి ఇంతటి ఉదారుడు వీరుడు స్థితప్రజ్ఞతకలవానికి తల్లి అయినందుకు పొంగిపోయింది. రాముడు ప్రేమతో  ఇంకా విస్తారంగా  దీక్షలో జరిగిన సంఘటనలు చెబుతూ.. ""అమ్మా  !   భరతుని వంటి తమ్ముడు నాకు లభించడం నా అదృష్టం ! ఇలాంటి తమ్ముడు ఎవ్వరికీ ఉండడు.. ఉండబోడు కూడా !  భరతుని కి అన్నగా కీర్ట్ గాంచడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సుమా ! భరతుడి మహత్తును, ప్రభు భక్తిని, సోదరప్రేమను ,,త్యాగనిరతి ని,, నాపట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమను అనురాగాన్ని  నీ వల్లనే విఖ్యాతి గాంచాయి కదా. !అలాగే తమ్ముడు లక్ష్మణుని అచంచలమైన  స్వామి భక్తి. నాకు రక్షణ కవచం గా  ఉండి విజయోత్సాహం తో తిరిగి రావడం నీ ప్రోద్బలంతోనే కదా.. అమ్మా.  !ఇదిగో హనుమ ! అతడి భుజబల పరాక్రమం ,నాపై అతడి అపారమైన విశ్వాసం , అతడి అకుంఠిత పౌరుషం తో కష్టాలలో మునిగిపోయిన మా ప్రయాణం తిరిగి సుఖాంతం  చేశాయి ఇంతగొప్ప ఉపకారం చేసిన మహానుభావుడు హనుమ  కేవలం నీ సంకల్పం వల్లనే మనకు లభించాడు కదా..! అలాగే సుగ్రీవుడు ,విభీషణుడు. మమ్మల్ని  అన్ని విపత్తులనుండి సంరక్షించారు వారు ! ఇలాంటి ప్రాణమిత్రులు అమ్మా  ! నీ దయచేతనే నాకు దొరికారు కదా.  ! అంటూ  కష్టాల్లో సహకరించిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతూ వారి శౌర్యాన్ని బుద్ధికుశలత ను వేనోళ్ళ ప్రశంసించాడు   .చివరన సీతా సాధ్వి లాంటి ప్రేమమూర్తిని,తన వెంట పంపించడం వల్లనే ఆమె పాతివ్రత్యం,, సౌశీల్యం, సహధర్మ చారిణి వ్రతం. ఇవన్నీ  కీర్తింప బడటం , అమ్మా !  కేవలం నీ అపారమైన అనుగ్రహం మా మీద ఉండడం వల్లనే కదా. ఇంత గొప్ప కీర్తిని ,యశస్సును కరుణించిన నీ వాత్సల్యం చిరస్మరణీయం !!" అమ్మా! అంటూ ఆనందాశ్రువు లు రాలుస్తూ. పినతల్లికి హృదయాంజలి ఘటించాడు రఘురాముడు.!. వారు.వనవాసము చేస్తున్న రోజుల్లో ఒకసారి లక్ష్మణుడు అంటాడు. అన్నగారితో.. !""" సాధారణంగా లోకంలో ,  కొడుకులకు తల్లి గుణాలు ,కుమార్తెలకు తండ్రి గుణాలు అబ్బుతుంటాయి.. కానీ భరతుని కి మాత్రం తల్లి స్వభావం రాలేదు.. అని !  " అన్నాడు  ఆ మాటలు రాముడిని అమితంగా బాదించాయి. విపరీతమైన కోపం వచ్చింది  లక్ష్మణా !నన్ను ఏమైనా అను ! కానీ ఆమెను అంటే నీవు నాకు దూరం గా ఉండాల్సి వస్తుంది. అలా దూషించడం నేను ఏమాత్రం  సహించను  ! నా తల్లికౌసల్య కంటే నాకు పినతల్లి కైకమ్మ మీదనే నాకు ఎనలేని ప్రేమ  ! అది నీకు తెలుసు కదా !నాకు ఆమె ఎదో "నష్టం ,కష్టం" కలిగించింది అని నీవు అనుకోవచ్చు ! కానీ నేను అలా అనుకోడం లేదు..నీకు ఇష్టం లేకపోతే అయోధ్యకు తిరిగి వెళ్ళు ! కానీ ఆమెను  అలా కించపరచి మాట్లాడితే మాత్రం ఇకముందు  నేను సహించను. !అని కోపిస్తే లక్ష్మణుడు అన్నగారి పాదాలు పట్టుకుని క్షమించమని కోరతాడు. కన్నీళ్ళతో ..!  అంతటి దయాగుణం ,శత్రువునైనా దగ్గరికి తీసే క్షమా గుణం శ్రీరామచంద్రుని స్వంతం! సహజం ,!మహోన్నతం.! కష్టాలెన్ని రానీ, ధర్మం తప్పని ఆదర్శపురుషుడు! ,సీతారాముడు..! ధర్మావతారుడు!,జగదాభిరాముడు...! శరణాగతవత్సలుడు,! సాకేతసార్వభౌముడు!.అందుకే రాముని కథలు యుగ యుగాలకు కూడా  రమణీయం ,!కమణీయం ,!మహోన్నతం.!.! ఆదర్శనీయం...!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...