Wednesday, February 20, 2019
రేపల్లెలో దీపావళి
యశోదా మాత రేపల్లెలో , దీపావళిరోజున ,సాయంత్రం ,యమునానదీమ తల్లికి దీపపు దొన్నెలతో మంగళహారతి నిద్దామని ,రేపల్లెలో ని గోపికల నందరిని సమాయత్తం చేసింది.., వారి సనాతన సంప్రదాయం ప్రకారం. అలా ఏటా చేస్తూనే ఉంది.,! తనకి సంతానంగా "అందాల ముద్దుల కృష్ణుణ్ణి " అనుగ్రహించిన జగదాంబ కి ,తనపై ఇంత దయ చూపిన "అమ్మలగన్న అమ్మ "కు ,కృతజ్ఞతతో ఎన్నో పూజలు నోములు వ్రతాలు దానాలు చేస్తూ. మొక్కులుకూడా చెల్లించుకుంది. ! ఆమె ఏ పుణ్యకార్యం చేస్తున్నా ,తోటి స్త్రీలను కూడా కలుపుకుని ఆనందంగా ఒకేచోట చేస్తుంది !. ఆ గ్రామానికి నందగోపుడు "నందరాజు! " ఆయితే ఆమె "నందరాణి.!" కానీ ,తాను "రాణిని !"అన్న అహంభావం లేకుండా, అందరితో స్నేహ భావంతో ,ప్రేమగా ఉండడం వలన,, కృష్ణునిపై యశోదకు ఎంత "ప్రేమ " ఉందొ ,అంతే ప్రేమ ,వాత్సల్యం ,అనురాగం , చూపిస్తూ చొరవగా గోపికాలంతా యశోదా ఇంటికి వస్తూ ,ఎదో పని నెపంతో ,కృష్ణుని పై పెంచుకున్న అవ్యాజమైన ప్రేమ వల్ల, కన్నయ్యను మురిపెంగా చూస్తూ , అందమైన దుస్తులతో ,ఆభరణాలతో కృష్ణుణ్ణి స్వయంగా అలంకరిస్తూ, ఎత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, తాము వెంట తెచ్చుకున్న వెన్న అతడికి తినిపిస్తూ ,,ఉయ్యాలలో పడుకోబెట్టి "జో అచ్యుతానంద !జో ,జో ముకుందా !'" అంటూ అంతా కలిసి జోలపాటలు పాడుతూ ,కృష్ణప్రేమలో ,కృష్ణ సాన్నిధ్యంలో ,భగవద్ అనుభూతిని పొందుతూ,కృష్ణ ముఖారవింద లావణ్య వైభవంలో తాదాత్మ్యం చెందుతూ, , కృషుణ్ణి తమ కుమారుడిగా భావిస్తూ, యశోధమ్మ ఇంట్లోనే వారు ఎక్కువ కాలం గడిపేవారు ! రాత్రి ,నిదురపోయే కృష్ణుని ముద్దు మోము ను ,ఎంత చూసినా తనువితీరని ఉత్సుకతతో ,కృష్ణ,విరహంతో,కృష్ణుని విడిచి వెళ్లలేక , వెళ్లలేక ,తమ ఇండ్లకి వెళ్లే వారు.. దేహాలు ఇక్కడ , వారి మనసేమో అక్కడ, బాల కృష్ణుని అందచందాలచెక్కిళ్ళ సొగసుల తళుకుల వద్ద లగ్నమయ్యేది..! అలా ఉండేది కృష్ణ ప్రేమ ,!కృష్ణునిపై ప్రేమ..!.అందుకే ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసి వెళ్తారు. !ఇప్పుడు యమునా దివ్వెల హారతి ఇవ్వడం కోసం కూడా , యముననది తీరం పై ,షోడశోపచారా లతో ఆ తల్లికి నీరాజనం పట్టడానికి గోప స్త్రీలు అంతా కలిసి , కృష్ణుణ్ణి మధ్యలో ఉంచి ,చుట్టూ తాము గుమిగూడి ,శ్రావ్యంగా పాటలు పాడుతూ వచ్చారు.. కృష్ణయ్య కూడా తనవెంట తన స్నేహితులను కూడా వెంటపెట్టుకొని వచ్చాడు ! ఎదురుగా , యమునానది పొంగి పొర్లుతూ ,విపరీతమైన వేగంతో ,ఒరవడితో ,ప్రవహిస్తోంది..!యమున నల్లగా ,కృష్ణయ్య వర్ణంలో నే ఉంటుంది కదా ,,! అందుకే యమునా తీర విహారి అయిన కృష్ణుడంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ భక్తి !, , శ్రీకృష్ణ జననం రోజున మధురానగరి న్7నుండి వసుదేవుడు అర్ధరాత్రి క్రిష్ణయ్యను నెత్తి మీద గంపలో ఉంచుకొని ,గుట్టుగా ,ఎవరికి తెలియకుండా రేపల్లెకు వెళ్తున్నాడు అప్పుడు ,తాను ,పరమాత్మ ను చూసిన పరవశత్వం తో , పరవళ్లు తొక్కి ప్రవహిస్తూ కూడా ,స్వామికి,దారి ఇచ్చి ,కృష్ణయ్య చిన్ని చిట్టి సుకుమార పాదార విందాలను తాకుతూ పరమాత్ముని దివ్యమైన పాదాలను కడిగి ,,జన్మ,ధన్యత పొందింది యమునమ్మ ! ,,,,ఇప్పుడు మళ్లీ తనను కరుణించ వచ్చిన కన్నయ్యను చూసి , ఆనందంగా పులకించింది ఆ నదీమ తల్లి ! యశోద చిన్నికృష్ణునిపై ప్రేమతో చేతినుంచి. ,,అతని పద్మాలవంటి నేత్రాల లోకి చూస్తూ. !"చూడు,,!..కృష్ణా .! కన్నయ్యా ! మేము యమునాదేవి మాతకు దీపాలతో హారతి ఇవ్వడానికి , వెళ్తున్నాము..!ఆ ప్రవాహం ఎంత వేగంగా ఉందో చూశావా..! కన్నా !'అక్కడకు నీవుగానీ ,నీ స్నేహితులు గానీ ఎవరూ రావద్దు సుమా ....! "అంటుంటే కృష్ణుడు అన్నాడు ,"",,అమ్మా ! ఇంత చిన్న దీపాలహారతి, అంత పెద్ద నదికి ఎలా సరిపోతుంది..? .అని! ,,,,,,యశోద అంది,,, నిజమే !..కన్నా. ! కానీ .యమునమ్మ మనసు గొప్పది.. !ఎంత చిన్న దీపంతో హారతి ఇచ్చినా ,ప్రేమతో స్వీకరిస్తుంది.....! తెలుసా. ! . మళ్ళీ కృష్ణయ్య ప్రశ్న ! "" అయినా అమ్మా.!. ఆమెకు ఎందుకు ఇలా దీపావళి చేయాలి. ?. చెప్పు ! యశోదాదేవి జవాబు.! ...""కన్నా.! యమునమ్మ చల్లని తల్లి. ! చల్లనిగాలిని, తీయని నీటిని సదా సర్వకాలము ఇస్తుంది..! వర్షాలు ,పంటలతో ,మనం ఆనందంగా జీవించడానికి ,ఈ తల్లి దయనే కారణం..! అందుకే ప్రతి దీపావళి రోజున మన కృతజ్ఞతలు ఇలా దీపాలు వెలిగిస్తూ.పసుపు కుంకుమాపూజ లతో పుష్పాలు ,నైవేద్యాలు సమర్పిస్తూ తెలియజేస్తున్నాము ! నల్లనయ్య తర్వాత ప్రశ్న ..!.అమ్మా..! ఇక్కడ ప్రవాహంలో నీళ్లు మాత్రమే చూస్తున్నాం కదా !.మరి యమునదేవి రెండు చేతులూ లేకుండా ఎలా హారతి స్వీకరిస్తుంది...? తల్లి సమాధానం.. ",కన్నా.! ఎన్ని ఆలోచనలు రా ,,ఈ చిట్టి తండ్రి కి. ! యమునదేవి ఒక అపర దేవత ,సర్వ శక్తి సమన్విత ! దయా సింధువు ! ఆమె.. హృదయం నీ వలె నవనీత మ్ ..!. ఉత్తరభారత ప్రాంతమంతా తన దివ్యమైన స్వడు జలాలతో పావనం చేస్తూ కాలవేగంతో సమా నంగా ప్రవహిస్తూ ఉన్న శక్తిస్వరూపిని.!. ఈ తల్లి దయఉంట ఆమెను సేవిస్తే ఇలా పూజిస్తే ,అకాల ప్రమాదాలు ఉండవు....! శాంతి సౌఖ్యం ఆనందం ప్రసాధిస్తోంది.. మనకు.. ఇక చేతులు అంటావా ఆమె వైభవ దివ్య స్వరూపం మనం చూడలేము.. మహాద్భుత దివ్యమూర్తిని మనం సామాన్య మానవ మాత్రులం చూడలేమురా నాన్నా ..అంది... నంద బాలుడు ,మరో ప్రశ్న సంధించాడు. " అమ్మా..! యముననది నీరు నల్లగా ఉందేం ? అని ! ,,అమ్మ జవాబు... కన్నయ్యా .ఆమె కాలుని అంటే యమధర్మరాజు తొగుట్టువు..! అతడు కూడా నల్లనివాడు! , అందుకే అన్నాచెల్లెలు ఇద్దరూ నలుపే...! మళ్ళీ గోపాలుని ప్రశ్న ! ""..అమ్మా ! నేను కూడా నలుపే కదా... .! అని గోముగా మూతి ముడుచుకున్న చిన్నికన్నయ్య అలుకను చూసి తల్లి నవ్వింది, ప్రక్కన ఉన్న గోప వనిత లు అందరూ విరగబడి నవ్వారు..! నల్లనయ్య స్నేహితులు కూడా నవ్వడం ,గోవిందుని కి చిరుకోపం వచ్చింది.. కొడుకు బుంగమూతి పెట్టడం చూసి , యశోదమ్మ ,కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకొని బుజ్జగిస్తూ ,అంది...! నాన్నా ! నా పిచ్చి తండ్రి.! బంగారు కొండా ! ఎవరన్నారు రా నీవు నల్లవాడివాని ? నిన్ను అన్నవాళ్లే నల్లని వారు.. వారి బుద్ధులు నల్లన.నిన్ను చూసి గెలిచేసిన వీరంతా మసిబూసిన నల్ల మొహం కల వారే..! లేదురా కన్నా.!. నీవు నల్లనయ్యవి కాదురా ! ఎంచక్కా "చందమామ "వలె నీవు చక్కని చల్లనయ్యవి. ! . చూడు నా కళ్ళలోకి ! ఎంత అందంగా ముద్దొస్తూ ,దీపంలా మెరిసిపోతున్నావు గదరా చూడు చూడు.. నిన్ను చూసి ,నీ అందమైన ముద్దు మోము చూసి ,అయ్యో తమకు ఇంత అందం లేదే అని అసూయతో కళ్ళు మండి ,నిన్ను అలా అంటున్నారు కృష్ణా వజ్రాల మూటా. నా వరాల పంటా. మీరంతా దూరంగా పొండి ! మా బిడ్డకి మీ దిష్టి తగిలేను.. రోజూ నాకు మీ దిష్టి కళ్లనుండి బంగారు తండ్రిని దూరంగా ఉంచడం నా వల్ల కావడం లేదు..!" అని వారిని అక్కడినుండి తరిమేసినట్లుగా నటించి. " "వెండికొండా ! ఈ గోపికలు తమ కాటుక కళ్ళతో ఎప్పుడూ ,నీ చుట్టే తిరుగుతూ ,నిన్ను ఎత్తుకుని, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి , ఎప్పుడూ , నిన్నే కళ్ళార్పకుండా చూస్తుంటారు కదా ! .అందుకే, వారి కళ్ళకాటుక నలుపుతనం .నీ ఒంటికి పట్టిందిరా కన్నా..! అంతే. ! వారెప్పుడూ ఇంతే ! నీవేం పట్టించుకోకురా కన్నా ! అంది లాలిస్తూ..! గోవిందుడు కురిపించే సందేహాల పరంపరకు ,అలుకల చిలుక పలికే పలుకుల్లో ,మాతృత్వ ఆనందాన్ని అనుభవిస్తూ,,.నవ్వుతూ, తుంటరికృష్ణుని కొంటె ప్రశ్నలకు తోచిన సమాధానాలు ఇస్తున్న నందరాణి ని ,ఆమె ఒడిలో బుద్ధిగా కూర్చుని ఉన్న నందనందనుని సోయగాలను దూరంగా నిలుచుని గోపగోపీజనం తనివితీరా చూస్తోంది సృష్టిలోని ప్రకృతిఅందాలు ఆనందాలు కలబోసి పోతపోసినట్లుగా ఎదుట అగుపిస్తున్న , ఆ భువనైక మోహనాకార సుందర సౌందర్యరూపాన్ని , ఆనందకరమైన ముగ్దమోహన సుకుమార ,నీలమేఘశ్యాముని అందచందాలను ,,ముద్దుగోపాలుని నల్లని జుట్టునీ, అందులో మెరిసే నెమలి పించాన్ని ఫాలభాగాన దిద్దిన కస్తూరీ తిలక ధారణ తో, విరిసిన పద్మాల రేకులవలె విచ్చుకుని ఉన్న ఆ విశాల నేత్రాలను ,,సన్నని సంపెంగ లాంటి నాసికాగ్ర భాగాన తారవలె ప్రకాశించే నవ మౌక్తిక కాంతులను,, ముద్దుగారే అరవిందాలను మరపించే ,చిరునవ్వులు చిందిస్తున్న కృష్ణయ్య ఎర్రని లేతచిన్ని పెదవులను ,, చంద్రకాంతుల ప్రకాశంతో మెరుస్తున్న నునులేత చెక్కిళ్ళ సొగసులను.. మెడలో ని వైజయంతి మాలను ,కంఠసీమలో తళతళ మంటూ కాంతులు చిందే కౌస్తుభమణి ని ,చంద్రకాంత మణి దివ్య శోభలను తలదన్నే సుందర వదనానికి రెండుప్రక్కలా చెవులకు వ్రేలాడుతూ ధగ ద్ద గాయమానంగా మెరుస్తున్న స్వర్ణమకర కుండాలాలను , సూర్యోదయ వేళలో ఉష కాంతుల్లో ,చుట్టూ విద్యుల్లతా కాంతుల ప్రకాశంతో వివిధ రంగుల్లో శోభించే నల్లనిమేఘంలా ,తల్లి ఒడిలో ఒదిగి హత్తుకొనిఉన్నా ,కూడా, తమను దొంగ చూపులు చూస్తూ ,పెదాలపై చెరగని చిరునవ్వుతో అలరించే బాలకృష్ణ సౌందర్యాన్ని వారు ఆనందంగా ,చూస్తున్నారు ,ఆ మెరిసే నీలిమేఘశ్యామసుందరుని మంగళక ర విగ్రహం , దర్శిస్తూ ,పరవశిస్తూ ,మనసును కృష్ణద్యాన భావచిత్తంతో నింపి , మేనులు మరచి ,చేష్టలు డిగి ,"శిలాప్రతిమ "ల వలె ఉండిపోయారు.!. అవి వారి ఎదలోనుండి పాలపొంగులా , పొంగి పొర్లుతున్న అవ్యాజమైన శ్రీకృష్ణ ప్రేమానురాగాల వెల్లువల తరంగాల భావనా వీచికలు !అపరిమితానంద డోలికలు.. ! ....అలాంటి సుందర సన్నివేశ దర్శనా భాగ్య సమయంలో ,,కృష్ణుడు వారి దృష్టిని మరలిస్తూ , ఇంకా మారాం చేస్తూ తల్లి కొంగు పట్టుకొని ,".అమ్మా ! నేను కూడా మీతో వచ్చి హారతి ఇస్తాను ! "" అనగానే యశోద భయపడుతూ , " అమ్మో ! .అటు చూడు ! ,సుడులు తిరుగుతూ, కళ్ళు తిరిగే ఆ నీటి ప్రవాహం ఎంత. వేగంగా ప్రవహిస్తోందో ..? .పెద్దవాళ్ళం ! మాకే ఇంతభయం వేస్తోంది..! కన్నా .!.చిన్నపిల్లాడివి. ! అది .నీకు తెలీిదురా కన్నా !బుద్ధిగా ఇక్కడ కూర్చోరా ,నాన్నా..!అంటుంటే మళ్ళీ అంటున్నాడు.."". అమ్మా! అమ్మా !నాకో సందేహం..! నేను నల్లన!..ఈ అమావాస్య చీకటి నల్లన..! చుట్టూ నల్లన ! .మరి ఈ చీకట్లో నన్నెలా గుర్తు పడతావు...? అంటే అమ్మ అంటోంది మురిపెంగా ! ""... కన్నయ్యా. !నీవు నా ప్రాణం!. నా నోములఫలం!..ముక్కోటి దేవుళ్ళు ఇచ్చిన వరం.రా నువ్వు..! .ఇదిగో ! ఆ నల్లనమ్మ ,, ఈ నల్లనయ్యను, .మా పూర్వజన్మ ల పంటగా అనుగ్రహిస్తూ ,నిన్ను గుర్తించే శక్తి ని లాలించి ,ఆనందించే వైభవాన్ని ఈ తల్లికి ,ఈ రేపల్లెలోని గోప గోపి జనాలకు అందరకీ ఆ జగన్మాత ఇచ్చిందిరా , కన్నా.మాకు ! కృష్ణా .! నీ నీలమేఘశ్యామసుందర అందాల ఆనందాల రూపం ,ఈ చీకట్లను దూరం చేసే ఇంద్రాణీలమణుల కాంతులను వేదజల్లుతూ నీ వద్ద నుండి వెలువడే దివ్యజ్యోతుల ప్రకాశం ముందు,, కన్నయ్యా. !మా చేతుల్లో ఉన్న దొన్నెల దీప జ్యోతుల కాంతులు వెల వెల బోతున్నాయి కదరా! నాకే కాదు.,!,. ఈ యమునాతీరములో ఉన్న పూలమొక్కలకు ,తరువులు ,పొదలు ,వృక్షాలకే కాదు. ,, ఇక్కడ సంచరించే సకల జీవ జంతు సముదాయాలకు,..కూడా ఆనందాన్ని అందిస్తున్న అందాల ముద్దుల చిన్ని కృష్ణ జ్యోతివిరా నీవు ! .మాకే కాదు.!,రేపల్లె గోపగోపికల ఆశా జ్యోతివిరా, కన్నయ్యా..నీవు..! అందుకే. ఈ దీపావళి ,మనకు నిజమైన పండగ రోజు.! ఈ వేడుకలు, ఆ పరమాత్ముని కి మేము సమర్పించుకునే నీరాజనాలు!. ఎన్ని ఆపదలు రానీ , .ఈ దీపాల దివ్యకాంతులతో .,.ఆ పరమాత్ముని గుర్తించే జ్ఞానాన్ని, బుద్దిని ,,తనపై చెదరని అపారమైన ప్రేమానురాగాలను కరుణించమని ,రేపల్లె వాసులను శాంతి సౌఖ్యాలతో. మా చిన్నికృష్ణుని చిరునవ్వుల వెన్నెల వెలుగుల్లో, ఆనందంగా బ్రతుకులు గడపాలని..,, అందుకు , ఆ జగదాంబ ను కోరుతూ భక్తితో అందిస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు !..ఈ దీపసముదాయ వైభవ కాంతులతో ,ఎదుట కనిపించే జగన్మాత యమునదేవికి.. తెలియజేసుకుంటున్నాం .! అల్లరికృష్ణా !నీకు.ఇంకా అడగాలని ఉంటే.,. తర్వాత చూద్దాం !సరేనా..! ఇక మేము వెళ్తున్నాము ! జాగ్రత్తరా ,, కన్నయ్యా...! ""అంటూ తల్లి యశోదదేవి కన్నయ్య రెండు చెక్కిళ్ళపై నుదుటిపై ముద్దుల తో ముద్దుగా ముద్దుపెట్టుకుంది. ఆహా ఏమి భాగ్యము ఆ యశోదాదేవి ది.. బ్రహ్మాండాల ను బొజ్జలో నుంచుకొని ,విశ్వాన్ని తన కేళీ విలాస, నటనా చాతుర్య కౌశలా ప్రదర్శనతో విశ్వరూపుడై ,అన్నీ తానై ,,తానే అన్నీ అయినా కూడా ,దేనికి అంటకుండా కేవలం సాక్షిభూతమై ,జగన్నాటక సూత్రధారియై ,,విరాజిల్లే విశ్వాత్ముడు నేడు ఇప్పుడు ఇక్కడ ,ఈ సంధ్యా సమయంలో ,"తల్లి గాని తల్లి "కి "తనయుడు కాని తనయుడు " అయ్యి ఆమె చనుబాలు త్రాగే పసివాడి గా నంద గోకులంలో ఇలా,వర్ధిల్లుతున్నాడుఆ జగన్నాథుడు , ! పాపం, కన్నయ్యకు తాను కన్నతల్లిని కాదని తెలియక పెంచినప్రేమతో కన్నయ్యపై అమితంగా ప్రేమానురాగాలు పెంచుకున్న ప్రేమ పిచ్చి తల్లి కి ,అపారమైన అఖండమైన అవ్యాజమైన తరగని కీర్తిని , తనపై చెదరని భక్తిని ప్రేమను వాత్సల్యాన్ని యశోదామాతకు ప్రసాదించాడు..శ్రీకృష్ణ పరమాత్మ ! ఆ విధంగా ,ఆమె పూర్వజన్మల పుణ్య తపః ఫలం ఇదిగో ఈ విధంగా కృష్ణయ్య రూపంలో , ఆమెకు అనుభవానికి వచ్చింది.!. పెట్టి పుట్టింది. .ఆ తల్లి పరందాముని అనురాగాన్ని ఆశించి ,తపించి ,సాదించుకుంది,సాక్షాత్తు మహావిష్ణువే పుత్రునిగా అవతరించి పుత్రప్రేమ ను పొంది మాతృత్వ మాధుర్యాన్ని అందులో దివ్యత్వాన్ని ,పొందుతూ తరిస్తున్నది ,అందుకే తన ముద్దులకృష్ణుని మోము చూస్తూ ,మధ్యలో మళ్ళీ మరలి మరలి వెనుకకు తిరిగి చూస్తూ. ,క్రిష్ణయ్య సమ్మోహన రూపసందర్శనం నుండి చూపులు మరల్చుకోలేక ,వెళ్తుంటే.. వెన్నదొంగ, చిలిపిగా ,చాటుగా నవ్వుకుంటున్నాడు. తోటివారిని దగ్గరకు పిల్చుకుని ,వారిని తన ఆటపాటలతో అలరిస్తుండగా కృష్ణుణ్ణి చూస్తూ ,తాను చెప్పిన చోటునుండి కృష్ణుడు లేవడం లేదు కదా. !. అన్న ధైర్య తో ముందుకు వెళ్ళింది యశోదాదేవి ,, యమునా తటికి ! తోటి గోపికలతో కలిసి , యమునదేవికి షోడశోపచారాలతో సేవలు సమర్పిస్తూ యమునదేవి రూపాన్ని ,దుర్గాభవాని గా హృదయంలో భావిస్తూ పూజించారు ,చివరకు అందరూ కలిసి శ్రావ్యంగా , మంగళహారతి పాటలు సామూహికంగా చదువుతూ. , దీపాలను పసుపు కుంకుమ పూలతో అలంకరించి , నివేదనగా జున్ను ,వెన్న లను ఉంచి , సేవించి , భక్తితో ,యమునా నదీ నీటిలో వదులుతూ ,గోప వనితలు అంతా కలిసి నమస్కారం చేశారు...! అయితే విచిత్రంగా ,దీపపు దొన్నెలు, నీటి ప్రవాహావేగానికి తీరానికి దూరంగా పోకుండా.. అన్నీ ఒడ్డుకే తిరిగి ఒకే చోటుకే వస్తున్నాయి..! ఈ "వింత ఏమిటని .'!"" అందరూ వెళ్లారు అక్కడికి.. దీపాల వద్దకి ! అశ్చర్యంగా అక్కడ , ఒడ్డున యమునజలాల లో కృష్ణుడు నిలబడి ఉన్నాడు..! ఆ దీపాలన్నీ అతని చుట్టూరా తిరుగుతూ అతని వైపే వెలుగుతూ ,కాంతులను వేదజల్లుతూ ఉండటం కూడా గోపకాంతలు చూశారు..విస్మయంతో ! వెంటనే, యశోదాదేవి పరుగున వెళ్లి నీళ్లలోకి దిగి ,దీపాలను చూస్తూ ఆనందిస్తున్న కన్నయ్యను .చేతులలో కి ఎత్తుకొని, ఆలస్యం చేయకుండా ఒడ్డుకు వచ్చేసింది.! కన్నయ్య ఒక్కడే అలా లోతైన నీళ్లలోకి దిగడం చూసి యశోదమ్మకు చాలా భయమేసింది..!ఇప్పుడు,... ఆమెకు కృష్ణుని పై , నిజంగానే "కోపం" వచ్చింది .! "కన్నా!. నేను నీకేం చెప్పాను.?.నువ్వేం చేస్తున్నావు రా.?. నానా..! సుడులు తిరిగే ఈ యమునా నదిలోకి ఈ చీకటి పూట వెళ్లవద్దురా అన్నానా. ?. ఎందుకు వెళ్లావు చెప్పు..? అని గద్దించి అడిగింది..! కృష్ణయ్య భయం నటిస్తూ , తత్తరపాటుతో.. అన్నాడు..,,"" అమ్మా..! నీవు చెప్పినట్లు అక్కడే ఉన్నాను ! .. కానీ, మీరు నీళ్లలో విడిచిన ఈ దీపాలన్నీ ,నేను ఉన్నచోటికె వస్తున్నాయి ..,,నేనేం చేయను , అమ్మా..!?? ,, పైగా.. మీరు దీపాలతో హారతులు ఇస్తుంటే ,నాకు కూడా ఈ యమునా నదీ మతల్లికి మంగళహారతి పట్టాలనిపించింది..,,! అమ్మా..! అలా చూడు ! ఆ నల్లని యమునమ్మకు ,ఈ నల్లనయ్య ను చూస్తుంటే ఎంత సంతోషమో... ? మీరిచ్చిన దీపాలన్నీ నావద్దకే తెచ్చి తనకు హారతిపట్టే అదృష్టాన్ని నాకు కలిగించింది కదా ,, ! అమ్మా ! "అని నవ్వుల పూవులు కురిపిస్తున్న కృష్ణుని అమాయకపు ముద్దు మొహాన్ని చూసి..,,. "అమ్మో.. !ఇంకా నయం..! నీవు నీటి లోతుకు పోలేదు.. !ఈ రోజు నీకు ఒక పెద్ద జలగండం తప్పిందిరా, కన్నా ..!ఇంటికెళ్లాక దిష్టి తీయాలిరా నాన్నా .! ఈ చీకటి రాత్రి. ! ఆ లోతైన నల్లని నీళ్లలో ఎంత భయపడ్డావో కదా ..! ""అంటూ కన్నయ్యను గుండెకు హత్తుకొని ప్రేమతో , ముద్దులు కురిపిస్తూ , వెంట వస్తున్న గోపాలకుల ,గోపికల ,సందడితో ,తమ రేపల్లె గ్రామం వైపు వెళ్తున్న యశోదాదేవి భాగ్యాన్ని ,చూస్తూ ఆమెను వేనోళ్ళ పొగిడింది యమునాదేవి..! ఆనాడు, "కృష్ణ జననం !"రోజున , కోటిమన్మధకారుడు ,సచ్చిదానంద సుందర విగ్రహ స్వరూపుడు , జగన్మోహనకారుడు సాక్షాత్తూ, మహావిష్ణువు పరిపూర్ణ అవతారుడు,,,షోడషకళా నిధి ,సకల గుణసంపన్నుడు ,,వేదపురుషుడు ,అయిన ఈ బాలశ్రీకృష్ణుని చిన్ని చిన్ని పాదాలను స్పర్శిస్తూ, తననీటి ప్రవాహం లో ,ఆ కృష్ణ పాదాలను మృదువుగా తన స్వాదు జలాలతో అభిషేకించుకొని., ఆవి శిరస్సు పై ధరించే సౌభాగ్యాన్ని. . తలచుకొంటూ యమునమ్మ పులకరిస్తోంది.!. ఈ రోజున ఈ విదంగా ,ఆ గోపికలు అందించిన దీపాలతో శ్రీకృష్ణ భాగవానునికి దివ్యమైన మంగళహారతిని పట్టి, భక్తితో అతని చరణ కమలాలను తాకి నమస్కరించి సేవించుకునే మదురక్షణాలను మరచిపోలేకుండా ఉంది...! అంతులేని ఆనందాన్ని అందించిన గోప స్త్రీలకు కృతజ్ఞతతో ,వారికి దీర్ఘ సుమంగళత్వాన్ని ,సౌభాగ్యాన్ని ప్రసాదించింది కూడా...! ఆ విధంగా తనను కరుణతో అనుగ్రహించిన నందకిశోరుని కరుణా కటాక్ష వీక్షణాలకు పరవశిస్తూ., పారవశ్యం తో జలజలా ప్రవహిస్తూ , శతకోటి ప్రణామాలు మదిలో సమర్పిస్తూ.. ఆనందామృత తరంగినుల మువ్వల సవ్వడులతో, భక్తి తరంగాల సమర్పణా భావం తో , కూడిన ప్రవాహ వేగంతో అదే తన్మయత్వం తో ,ఇంకా శ్రీకృష్ణ సందర్శన అతిశయంతో ,,బృందావన దివ్య గోలోక స్వర్గ ధామం సమీపంలో మీరాబాయి ,రాధాదేవి ల వలె కృష్ణప్రేమతత్వ ఆరాధనా సక్తితో ,భక్తి భావాలు వెదజల్లుతూ, ,ప్రవహిస్తూనే ఉంది.! ,శ్రీకృష్ణ ఆంతరంగిక భక్తురాలు ,,ఈ ,యమునాదేవి.!.! చిన్ని కృష్ణయ్య బాల్యక్రీడలు ,,ఈ యమునతీరం లోనే ఆనందంగా అందంగా ,అద్భుతంగా అపురూప వైభవంగా జరిగాయి!. రేపల్లె ,గ్రామం , బృందావన దివ్య సీమ , ,మధురానగర వాసులతో బాటు ,మన కృష్ణయ్య ఆటపాటల్లోని అనురాగం పండించి ,వారందరి తో తీయని తరగని పెన్నిధి గా అనుబంధాన్ని పంచుకుంది. శ్రీ కృష్ణుని దివ్య లీలలను , బాల్యక్రీడలను సా మూలాగ్రం ప్రత్యక్షంగా దర్శించింది యమునదేవి . !గోపాలకులంతా ఇదే యమునాజలాల్లో స్నానం చేస్తూ ,ఇక్కడే ఆడుకుంటూ, పాడుకుంటూ , తింటూ ,త్రాగుతూ.. ,తిరుగుతూ , ,కృష్ణ పరమాత్మ తిరుగాడిన ,అతడి పదారవిందాలు సోకిన ఇదే ఇసుక తిన్నెలపై , పడుకుంటూ , ఈ యమునా తీరంలోని పచ్చిక బయళ్ల లో తమ ఆలమందలను మేపుతూ. ఆనందంగా గడిపారు.. అపర,గోలోక వైభవాన్ని తలపించి మురిపించి ,మైమరపించే బృందావన భూముల ధూళి కణం ఒక్కటి చాలు ,శ్రీకృష్ణ చిత్తద్యాన పరాయణులకు... ఈ ఆధ్యాత్మిక భావ సంపద ,కృష్ణ చైతన్య ముసకల సృష్టిని సమ్మోహింప జేస్తూ ,తన దివ్యాలీలా వైభవం తో ఆనందింప జేశాడు! ,,ప్రకృతి అందాల సోయగాలను ని , ,చరాచర జగత్తును ,శ్రీకృష్ణుడు, తన వేణుగానమధురిమతో పులకింపజేసింది ఇదే యమునతీర ప్రాంతంలోనే ! గోపికల తో రాసలీలా మహోత్సవ వైభవం ప్రదర్శించి,, తాను ఒక్కడైనా ,వ్రజవనితలు ఎందరో , అన్ని శ్రీకృష్ణ దివ్య రూపాలతో సాక్షాత్కరించి , ,వారిని కేళి విలాస అభినయ ఆనందానుభూతుల తరంగాల డోలికలో ఒలలాడించింది ఇదే యమునా పులింద వనతీర ప్రాంతంలోనే ! పరదేవత, ప్రేమమూర్తి ,శ్రీకృష్ణుని ఆరాధ్యదేవత ,బృందావన పట్టపు రాణి. , కృష్ణుని కోసం ,గోలోకం నుండి దిగివచ్చి .కృష్ణప్రేమకు తన సర్వస్వాన్ని ధారపోస్తూ ,యోగినిలా జీవించి తరించింది ఇక్కడే.కదా ! అలా గోలోకం లో చిదానంద స్వరూపిణిగా భాసించిన రాధాదేవి ఇక్కడే ఇదే యమునా తటాన కృష్ణ విరహతాపంతో ,, కృషుణ్ణి తనవాడిగా జేసుకుంది ! నిష్కలంకమైన తనప్రేమతో "భగవద్ సాక్షాత్కారం పొందవచ్చును ! " అని తన రాధామాధవ అద్వైత భావనా జీవన విధాన వైభవంతో , తోటి గోపికల జీవితాలను ఉద్దరిస్తూ,కృష్ణ చైతన్యాన్ని చాటింది ఇక్కడే ,! ..అలా అవ్యాజమైన వారి భక్తి విశ్వాసాలకు కృష్ణుడు కరుణించి, ,బ్రహ్మానందాన్ని అనుగ్రహించింది ఇక్కడే ,,,ఈ పవిత్ర పావన యమునా తీర ప్రాంతంలో నే.! .కాళీయనాగుని గర్వం అణచి ,,నాట్యకళా భి నివేశంతో ,అద్భుతంగా కాళీయనాగు ఫణిపై ,రేపల్లె వాసులే కాకుండా ,దివినున్న దేవాదిదేవతలు సంతోషంతో కృష్ణయ్య నాట్యకౌశల్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ ,పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా ,అపర నాట్యాచార్యుడుగా ,సంగీత శాస్త్ర సకల కళా కోవిదుడుగా ,ఆకాశంలో దేవ గంధర్వులు సంగీతాన్ని వినిపించగా , దానికి అనుగుణంగా నట సామ్రాట్, శ్రీకృష్ణ పరమాత్ముడు ,ఇదే యముననదీ తరంగాల మృదంగాల సవ్వడులు ,గతి తప్పకుండా ధ్వనించగా , భయంకరమైన కాళీయుని పడగలపై ,వివిధ గతులలో ,తాళబద్దంగా భరత శాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ అభినయిస్తూ చిన్నికృష్ణుడు ప్రదర్శించిన అద్భుతమైన అభినవ ఆనంద సుందర నాట్య విలాస వైభవమును గాంచి ,ప్రకృతి పులకించింది ,దేవగణాలు హర్షాతిరేకం తో పూలవాన కురిపించారు.. నెమళ్లు పురి విచ్చుకుని సంతోషంగా గంతులు వేశాయి. రేపల్లె వాసులు , గోబృందం ,విరులూ తరువులు, చెట్లూ చేమలు , చల్లని యమునా తరంగాల ఒరవడిని తాకుతూ వీచే చల్లని పిల్లవాయువుల వింజామర వీవనల మధ్య. ,,మృదువైన పెదాల నుండి రాధాదేవి ప్రేమామృత ధార ,వంశీ లోలుని సుమధుర సుస్వర సంగీత ఝరికి ప్రాణం పోయగా. వేణువును తన ఆధారాలపై మధురంగా కదిలించాడు రాధా మనోహరుడు. అలా భువనమోహన సంగీత విభావరితో తన అద్వితీయమైన ,నాదరూప బ్రహ్మ తత్వాన్ని ,మురళీ గాన దివ్యానంద లహరితో ,ప్రకృతి ,పురుషులు రెండూ అద్వైత ఆనందామృత అమృతప్రేమమయ దైవ స్వరూపాలని ,బ్రహ్మ పదార్థాలుగా కీర్తింప జేశాడు ..బాల్యంలోనే అంత అద్భుతమైన ఆనంద తాండవ నృత్యం చేసింది ఇక్కడే! ,ఇదే యమునాదేవి అమృత స్వాదు జలాల్లోనే. !.ఏ గోపాలకృష్ణుని దివ్యచరితలను, అద్భుత లీలా వైభవాలను బ్రహ్మాదులకు కూడా వర్ణించతరము కాదో ,అట్టి శ్రీకృష్ణ మంగళకర ఆనంద మయ, భవ్య ,దివ్య లీలలను ప్రత్యక్షంగా దర్శించి ,అనందిస్తూ ,ఆ బ్రహ్మానందాన్ని నిత్యం గ్రోలుతూ,ఆ మదురసుధారసానుభూతితో పరవశిస్తూ ,పరవళ్లతో పరుగులు తీస్తూ నిరంతర శ్రీకృష్ణ లీలామృత పాన చిత్తంతో, పరమానందాన్ని, అందులో ధన్యతను పొందుతూన్న పరమ పావన ధన్య చరిత , మన ఉత్తరభారత ,ఉత్తర ప్రదేశ్ , పుణ్య ధాత్రిలో,జీవనదిగా ప్రవహిస్తూ అక్కడి జీవకోటి ప్రాణాధారమై ,,అక్కడి భూములను సస్యశ్యామలం చేస్తూ ,ఉంటున్న యమునాదేవి నదీమతల్లి కి ,, శతకోటి నమస్కారములు ! గంగా గోదావరీ కృష్ణ ,యమునా మొదలగు నదులు,, ఎక్కడో హిమాలయాలలో పుడతాయి ,సముద్రంలో కలుస్తాయి.!. కానీ వాని ప్రయాణంలో కష్టాలు ,కడగండ్లు!. అంటే బండలు కొండలు అరణ్యాలు ,ఇసుకదారులు , కొండలపైనుండి లోటు తెలియని అగాధాల గుండా ,ప్రయాణం చేస్తూ ఉంటాయి. !విశ్రాంతి ఉండదు ,ప్రయాస తెలియదు..! భారం బరువులు తెలియవు.! కేవలం జీవకోటికి ,తన స్వాదు జలాలతో ప్రాణశక్తిని కలిగించడం.,బీడు భూములను సుక్షేత్రాలుగా మారుస్తూ , ,తన తీయని నీటిధారలతో పుష్కలంగా పంటలు పండించి పోషకాహారం అందించడం.. వారి ఆనందంతో తాము ఆనందాన్ని పొందడం ,తమ నిర్మల నిర్వికార సత్వ గుణ సంపద భావంతో తమ జీవన స్రవంతి విధానం ద్వారా ,,త్యాగ గుణం లో ఉండే అద్భుతమైన దైవ సంపత్తిని మానవాళికి అందించడం ,మనం నేర్చుకోవాల్సిన పాఠాలు..!నిత్యమైన జీవన సత్యాలు ,! అందువలన ఈశ్వర శాసనంగా ,పరోపకారమే తన పరమార్థంగా తన సుదీర్ఘ,ప్రయాణంలో అలుపెరుగని పరాశక్తి ,, సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లికి కోటి కోటి దండాలు సమర్పిద్దాం ! శక్తిని అనుగ్రహించి ,జీవకోటిని తన దయతో కరుణిస్తూ ఉన్స అమేయ శక్తి సంపన్నుడు ,పరమ దయాలువు ,,అయిన దేవకీసుతుని నయనమనోహర సురుచిర సుందర మందహాస వదనారవిందాన్ని మన హృదయంలో భావిస్తూ , సాష్టాంగప్రమాణాలు సమర్పించుకుందాం... ! హే రాధా మానసచో రా ! గోవిందా !హే,,,బృందావన విహారా ,!వనమాలీ ! గోపాలా ! ,,హే,యమునాతీర సంచారా ! గోపగోపిజన మానస చోరా ! ,,, హే నందయశోదా నంద సుందరాకారా ,! నందనందనా ! హే గోపాలకృష్ణ ,! నీకు మంగళములు.., ! స్వామీ ! నిన్ను ఎంత వర్ణించినా, ఎంత భావించి ,సేవించినా ,తనివితీరని నీ తలపులకు మా హృదయాలు నెలవులు కావాలి !,,,అనునిత్యం నిన్ను స్మరించి తరించే జీవన విధానం మాకు ఉండాలి ! మా ఈ ఆర్తిని ,గ్రహించి ,నీ లీలా వైభవ సందర్శన భాగ్యాన్ని అనుభవించి తరించే మధుర క్షణాలను అనుగ్రహించు..! తండ్రి ! రాధా వల్లభా ,!,వేణుమాధవా ,!"" జయం !శుభం ! స్వస్తి !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment