Mar 11, 2019
ఆ సీతా రాముల చిత్రం, అది చూస్తుంటే వనవాసానికి వెళ్ళేటపుడు, నారచీరలు కైకమ్మ తెచ్చి ఇస్తే, అన్నదమ్ములు కట్టు కుంటారు, కానీ ఎంతసేపటికీ సీతమ్మ బయటకు రాకపోవడం చూసి, రాముడు వెళ్లి చూస్తే అయోమయంగా సీతమ్మ తల్లి కనబడింది,, కళ్ళలో నీళ్ళు.. స్వామీ చీర కట్టుకో వడం తెలుసు,, కానీ నారచీర కట్టడం నావల్ల కావడం లేదు, మీరు దయచేసి ఎలా కట్టాలో చెప్పరూ, అంటూ దీనంగా బేలగా, సిగ్గుగా తలదించుకుం ది సీతమ్మ తల్లీ...
ఆ కమనీయ దృశ్యం కదలాడింది కళ్ళ ముందు. ఎంతైనా రామాయణం రసవత్తర రమణీయ దృశ్యకావ్యం,, లవకుశ సినిమాలో వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ ఉంటున్నపుడు , ఒకసారి ఆమె నీటి కుండను మోయలేక , నానా అవస్త పడుతూ ఉండగా మహర్షి చూసి పాడిన ,, ""రంగారుు చెంగావులు ధరించు.. ..""అనే పద్యం ఆ యమ్మ పడిన కష్టాలను చెప్పకనే చెబుతున్నాయి ,, ఆ సినిమాను ఒక పదిసార్లు చూసి ఉంటాను, పాతిక మార్లు కంటతడి పెట్టి ఉంటాను. అందుకే " సీతమ్మ కష్టాలు" అంటారు . అలా ఉంటుంది సతీ ధర్మం..! నా చిన్నన తనంలో ఒక బొమ్మల రామాయణం పుస్తకం చదివాను.. విపరీతంగా దుఖం వచ్చింది, కళ్ళ నుండి నీరు కారిపోతున్నాయి,, ఏదో పని మీద ఇటు వచ్చిన మా అమ్మ పుస్తకం తీసుకొని , నేను చదువుతున్న పేజీ చూసింది. ""భరతుడు దుఖిస్తు , ఏం పాపం చేశానని నన్ను ఇలా పదిమంది ముందు దోషిని చేశావు. ? రాజ్యం అడిగితే రాముడు సంతోషంగా ఇచ్చి వాడే. !ఇదేనా ఇన్నేళ్ళు రాముని పెంచి పోషించిన తల్లీ ప్రేమ !?? కన్న తల్లీ ప్రేమ కంటే పెంచిన తల్లి ప్రేమ ఎక్కువ అంటారే. !""అంటూ విలపిస్తున్న భరతుడిని ఆ క్షణంలో నేను అయ్యాను., అమ్మ నన్ను ఊరడించింది ! ..అది రామ కథ అంటే!!
1 comment:
Sri Rama Jayam
Post a Comment