Mar 9, 2019
ఒకరోజున ఒక తండ్రీ కూతుర్ని తన ఊరిలో గోపాలకృష్ణ దేవాలయానికి తీసుకెళ్ళాడు . శ్రీకృష్ణుని దివ్య మంగళ విగ్రహ దర్శనం చేశాక, అక్కడే ఒక పండితుడు శ్రీమద్భాగవతం పురాణం వినిపిస్తు ఉంటే తాము కూడా కూర్చున్నారు. అందరితో బాటు వీరు కూడా కూర్చుని శ్రద్ధగా వింటున్నారు. శ్రీకృష్ణుని బాల్య లీలలు, ముగ్ద మోహన కృష్ణ రూపము,, గోపికా వనితల ను సమ్మోహన పరిచిన వెన్నదొంగ కన్నయ్య కమనీయ గాథలను, అత్యంత రమణీయంగా భావుకత తో వివశుడై వర్ణిస్తూ పండితుడు చెబుతుంటే శ్రోతలు ముగ్ధులై వింటున్నారు. తండ్రి. తన కూతురు వైపు మద్య మద్య చూస్తూ ఆమె కళ్ళలో నుండి అశ్రువులు ధారగా ప్రవహించడం, కొంగుతో తుడస్తూ కృష్ణ భక్తి పారవశ్యంతో కథలో లీనమౌ ఉండటం గమనించాడు .. ఏమీ అనలేదు.! చిన్న పిల్ల కదా, ఆ మాత్రం అనుభవం సహజం !అనుకున్నాడు.. పురాణం సమాప్తం అయ్యింది.. !అందరూ వ్యాస పీఠానికి ప్రణామాలు చేసి వెళ్తున్నారు .! చివరకు పండితుడు కూడా భాగవత గ్రంథాన్ని తీసుకొని వెళ్లి పోతున్నాడు. !. ఈ ఐదేళ్ళ పాప ఆయన దగ్గరికి వెళ్ళి,, ""స్వామీ! ఒక విన్నపం మీతో మనవి చేసుకో వచ్చా ? "అని రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ అడిగింది.. ఆయన అగాడు.! పాపని చూశాడు.!. నీకు ఈ పండు, కావాలా?, ఇదిగో ఈ తియ్యని మిఠాయి! కావాలా ?",, ఇదిగో తీసుకో!" అంటూ ఇవ్వబోయాడు... కానీ ఆ పాప అవి తీసుకోక, "నేను అడిగింది అది కాదు..! అంది .మరి నీకు ఏం కావాలో చెప్పు ?తల్లీ..! అని అంటూ పాపని దగ్గరికి తీసుకుని అడిగాడు.. ఇదంతా తండ్రీ చూస్తూనే ఉన్నాడు .ఆయనకు కూడా తన బిడ్డ వైఖరి విచిత్రంగా అనిపించింది..! ఆప్పుడు అంది.". స్వామీ !మీరు ఇందాక కథలలో చెప్పిన కృష్ణుడు ఎక్కడ ఉంటాడు.? అతడిని చూడాలని ఉంది.! నాకు చూపించరా !" అలా దీనంగా అంటూ , బొట బోటా కళ్ళ నీరు కారుస్తుంటే పండితుడు ఒక్కసారిగా నిశ్చేష్టడయ్యాడు.! ఏమిటీ నా ప్రసంగం ఈ చిన్నారి పాప లో ఇంత మార్పు తెచ్చిం దా.? ఇన్నేళ్లుగా తాను చెబుతున్న పురాణం ఈ విధంగా, ఇప్పుడు ఇలా , ఈ రూపంలో ఫలించిందా !"ఆహా ఏమి నా భాగ్యం ! ఇన్నాళ్ళకు కృష్ణుని కృప నాపై వర్షించింది..! నన్ను దన్యున్ని చేసిన ఈ దేవత, రాధాదేవి అంశ కాబోలు,! కృష్ణా !నీ లీలలు. అమోఘం కదా !""అని హృదయంలో మురిసిపోతూ, భావిస్తూ తన కృషి ఇంతటి సత్ఫలితా న్ని ఎదుట సాక్షాత్కారం ఇస్తుండటంతో ఆయనకు అపరిమిత అనందం కలిగింది. . !ఎందరికో ఇంతగా కృష్ణుని గురించి చెబుతూ జీవితం గడుపుతున్న తనకే ఈ పరి ప్రశ్న తట్టలేదు.!. ఇంత చిన్న వయసు గల పసి మనసులో, ఇంత పెద్ద ప్రశ్న ఉదయించడం మామూలు విషయం కాదు. కదా.! అనుకుంటూ పరీక్షగా చూస్తుంటే ఆ పాప ముఖంలో కృష్ణుని పట్ల గల ఆరాధనా భావం ఆయన హృదయాన్ని కదిలించింది. .!" తల్లీ .! ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, అని చెప్పను. ! అతడు సర్వాంతర్యామి ! లీలా నాటక సూత్రధారి ఆ చల్లని నల్లనయ్య ! ఏడేడు భువనాలు తన బొక్కలో దాచుకొని , తాను మాత్రం ఇదిగో నీలాంటి నిశ్చల నిర్మల భక్తుల గుండెల్లో కొలువై ఉంటాడు. నీ వలె తపన తో ఆయన కోసం వెదకి వెదకి అలసిపోయాను ,,, ఉన్నాడు అందరిలో అంతటా అని నోరు విప్పి ఎందరికో ఎన్నోసార్లు నొక్కి చెప్పాను , కానీ నేను ఆ గోవిందుని చూడలేక పోయాను తల్లీ. ఎవరికీ చూపలేక పోయాను. నా నమ్మకం లో అపనమ్మకం కనబడిందేమో ఆ నవనీత చోరునికి ! నాకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు ,,నా బహుశా నాకు అంతటి యోగ్యత లేదేమో ? అయినా కృష్ణయ్య ఎక్కడ లేడు..? చెప్పు! అంతటా ఉన్నాడు.! నీది పవిత్ర భావన!, పసిపిల్లలు దేవుళ్ళు,! నీవు చూస్తావు ఆ చిత్త చోరుని,,! నేను నీకు చూపిస్తాను !, నీవు నేను చెప్పినట్టు చెయ్యి తల్లీ ఇలా కూర్చో ! అంటూ అక్కడే వున్న రాతి పై కూర్చుండ బెట్టాడు. చిట్టి తల్లీ , ఆ శ్యామ సుందరుడు , ఈ మాంసపు నేత్రాలకు కానీ ఈ కళ్ళకు కనపడ డు..! అతడిని ఆత్మానుభవం తో దర్శించాలి. అది నీవు చేయగలవు. నీకు శ్రీకృష్ణ దర్శన అనుభవ ప్రాప్తి ఉంది. అని ఆర్ద్రంగా ఉన్న నీ కళ్ళు చెబుతున్నాయి , అమ్మా ! ఒక్కసారి నీ కళ్ళు మూసుకో..!". అనగానే ఆ పాప తన రెండు కళ్ళను రెండు చేతులతో గట్టిగా మూసుకుంది.! ఆయన నెమ్మదిగా పాప కు దగ్గరగా కూర్చుం డి తాను పొందిన కృష్ణచైతన్య అనుభవ ఆనందాన్ని చెప్పసాగాడు."". ఇప్పుడు నేను పురాణం చెబుతుండగా నీవు విన్న శ్రీకృష్ణ సౌందర్య రూపాన్ని, నెమ్మదిగా, మనసులో ఊహించుకో.. తల్లీ. ! శ్రీకృష్ణుడు అతిలోక సుందరుడు, అమేయ శక్తి సంపన్నుడు,,, భక్త వత్సలుడు,,,నీలమేఘశ్యా ముని సౌందర్యం, లావణ్యం,,, భువనైక మోహన రూప వైభవం వర్ణించుట బ్రహ్మాదుల కు కూడా అసాధ్యం ! నగుమోము తో జగత్తును బొమ్మలా అడించే కృష్ణ పరందాముని కి శిఖ లో నెమలిపింఛం , నుదుట తిరునామం, తో, నల్లనిరింగుల జుట్టుతో, కమలాల వంటి విశాల నేత్రాలతో, సన్నని పొడవాటి నాసిక, ఎఱ్ఱని పెదాలు, కాంతులు చిమ్మే చెక్కిళ్ళు, చేతులకు బంగారు కంకణాలు,,, మెడలో వ్రేలాడే వైజయంతి మాల, స్వర్ణ భూషణ నవ రత్న ఖచిత, కౌస్తుభ మణిరత్న హారములు, పట్టు పీతాంబర ధారి, కాళ్ళకు సరి మువ్వ గజ్జెలు, చెవులకు కుండలాలు, ఇలా సర్వా లంకరణ భూషితుడై , జగన్మోహన ఆకారంగా, కనిపిస్తూ, నయన మనోహరంగా వెలుగుతూ ఉన్న నీ కృష్ణుని ,,నీ ఎదలో, నీ మదిలో, హృదిలో తనివారా దర్శించు.! అతడు, తన మృదువైన రెండు హస్తాలతో వేణువు ను లీలగాధరించి, దానిపై అద్భుతంగా, ప్రకృతి పులకించే లా, హృదయాలు పరవశించే లా మ్రోగించే సప్తస్వరాల ను కూడా మనసు పెట్టి ఆలకించు. ! నీకు వినిపిస్తుంది.!" అంటూ ఉంటే నిజంగానే ఆ ఐదేళ్ళ పాప, కళ్ళు మూసుకొని అంతరాళం లో శ్రీకృష్ణ సుందర సందర్శన వైభవం. లో రమిస్తూ అలానే పరవశిస్తూ ఉండిపోయింది,, తనకు కనిపించే కృష్ణుని, అతడు వినిపించే వేణు గాన మాధుర్యం తో తాదాత్మ్యం పొందుతూ. ఆ బ్రహ్మానందం లో ఓలలాడుతున్న ఆ చిన్నారి పాపను చూస్తూ ,ఆయన పరమానందం తో , ఒక యోగి పుంగవు ని ముందు భక్తితో మోకరిల్లి నట్టుగా, ఆమెకు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు . ఆ పండితుడు ..! తిరిగి లేచి ఇదంతా ఆశ్చర్యం తో , చూస్తున్న ఆ పాప తండ్రీ కి నమస్కారము చేశాడు.!"" అయ్యా ! ఇంత పిన్న వయసులో అంత గొప్ప కృష్ణ చైతన్యం సిద్దించుకున్న కూతు రికి మీరు తండ్రి వై నందుకు నీ జన్మ ధన్యం అయ్యింది.! అదృష్టం అంటే మీదే.! ఎన్ని జన్మల పుణ్య మో దైవాంశ సంభూతు రాలు నీకు బిడ్డగా జన్మించింది. ! మహ మహా యోగులకు లభ్యం కాని ఆ శ్రీకృష్ణ సాక్షాత్కారం నీ కూతురికి సాధ్యం అవుతున్నది,, చూడండి ఆ పారవశ్యం ! జీవాత్మ పరమాత్మ ల అనుసంధానం , చూడండి !"" అంటూ మాటి మాటికి ప్రణామాలు చేస్తూ అక్కడినుండి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయాడు ఆ పండితుడు. అక్కడినుండి !. ఇంకా ఆ కృష్ణ ధ్యాన పరా యణ చిత్తంతో మమేకమై,ఆనందానుభూతిని పొందుతున్న తన కూతురి మొహంలో, భక్తి పారవశ్య తరంగాలను , ఆ అపురూప అద్భుత దృశ్యాన్ని చూసి పొంగిపోయాడు. , తనకి గోచరించనీ ఆ శ్రీకృష్ణ పరందాముని నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపానికి , కృతజ్ఞతగా మోకరిల్లి పోయాడు..,తాను కేవలం నిమిత్త మాత్రంగా నిలబడి చూస్తూ, వినీలాకాశంలో చేతులు జోడించి నమస్కారం చేస్తూ, కూతుర్ని ఎత్తుకొని ,", హరే కృష్ణ హరే కృష్ణా !"అంటూ తమ ఇంటివేపు సాగిపోయాడు. ! . అలా తన బాల్యం నుండియే శ్రీకృష్ణ దాసియై, కృష్ణ భజన లాలసతో, కృష్ణ ధ్యాన తత్పరురాలై, కృష్ణ గాన మాధుర్యం తో,, శ్రీకృష్ణ మధుర సంకీర్త నలతో ఆడుతూ పాడుతూ,, తాను కృతార్తు రాలై, కృష్ణ భక్తి లో అనురక్తి కలిగిన శ్రీకృష్ణ చైతన్య భక్త జనసందోహ మునకు కూడా ధన్యత చేకూర్చిన అపర కృష్ణభక్త శిఖామణి, ఎవరో కాదు ! మన" భక్త మీరాబాయి !" ఆమెకు"కాక మరెవరికి అంతటి కృష్ణచైతన్య బ్రహ్మానంద అనుభవం కలిగే వీలు ఉంటుంది ? చెప్పండి !" ఆవిధంగా మీరాబాయి కృష్ణ దాసిగా వర్దిల్లుతు, అతడే తన భర్త, తన గతి తన దైవం, తన గమ్యంగా ఆరాధిం చింది. ఇప్పుడు అంతరంగం లోనే కాదు , సృష్టి లోని అణువణువు లో నంద నందను ని దర్శించి , పులకిస్తు తన్మయంగా పాడుతున్న భజనలు ఎందరి కో కృష్ణచైతన్య ప్రభా వితులను చేసింది.. బృందావనం ఆమెలోని కృష్ణ ప్రేమానుాగాల ను మరింతగా పెంచింది..తనకివ్వబడిన విషపాత్ర ఆమె కృష్ణార్పనం అంటూ అమృతం లా భావించి త్రాగింది.. ఇసుక ఎడారులు మీరాబాయి కి యమున తీీరం లోని వెన్నల కాంతులతో కృష్ణుడు నడిచిన పచ్చిక భూములు అయ్యాయి.. భర్త సంసారం ఇల్లు, పరువూ ప్రతిష్టలు కాదని,, ఆత్మ లో కృష్ణ నామ రూప వైభవం ప్రతిష్టించి ""శ్రీకృష్ణా.! రాధికా వల్లభా ! అంటూ తిరిగితే మీరాను పిచ్చిది అన్నారు. తర్వాత మీరా కున్న కృష్ణ ప్రేమ ను గుర్తించి వారంతా మీరాకు భక్తు లు గా మారి ఆమె కీర్తనలు తాము కూడా పాడుతూ శ్రీకృష్ణ చైతన్య ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఎవ్వరివాడు కాడు కేవలం నా వాడు మాత్రమే అని "తత్వమసి" నీవే నేను అన్న అద్వైత భావనను అందించింది. రాధాదేవి కి కృష్ణుని పై గల ప్రేమను , ఇప్పుడు మీరాబాయి కృష్ణ ప్రేమ లో చూడవచ్చును. అంతా కృష్ణ మయం మీ రా కే ప్రభూ,, గిరిధర్ నాగర్ ! అంటూ పాడుతూ కృష్ణుడిని తనవా డుగా చేసుకొని భావించి సేవించి తన జీవితాన్ని కృష్ణ ప్రేమలో అర్పించి తరించింది శ్రీకృష్ణ భక్తురాలు మ న మీరాబాయి ! అందుకే పిలిస్తే పలికే దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ! లీలామానుష విగ్రహ స్వరూపుడు,! భక్తజన మందా రుడు,! గోపిమానస చిత్త చో రు డు . ఆ యశోదా తనయుడు ,,! నంద నందనా.!. నీ లీల లు అమోఘం! అద్భుతం,! అపురూపం,! నీ మహిమల నెన్న తరమా!. భక్త పారిజాత మా!. దయయుంచి కరుణించి చల్లగా మమ్మల్ని పాలించు !! స్వస్తి !!!""ఓంశ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమః ! హరే కృష్ణ హరే కృష్ణా , కృష్ణ కృష్ణా హరే హరే,,,! హరే రామ హరే రామ ,,రామ రామ హరే హరే !!!"
Saturday, March 16, 2019
గోపాలకృష్ణ
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment