Saturday, March 16, 2019

శరణాగతి

Mar 10, 2019

సృష్టి లోని ప్రతీ ప్రాణీ పుట్టడం జీవించడం, పోవడం బందనాల మద్య జరుగుతుంది, అది సర్వసంగులకైనా ,సంసారులకైనా  కూడా వర్తిస్తుంది. "బంధనాలు "అంటే హద్దులు. ! తినడానికే, చూడటానికి త్రాగడానికి , నడవటానికి, రాయడం చదవడం,ఆలోచించడం , కనడం, నవ్వడం ఎడవటం, ఇలా  మ న జీవన ప్రక్రియలు అన్నీ నియమించబడినాయి,, ఇవి భగవంతుడు అందించిన అందమైన అనుబంధం, ఈ బంధం! జీవితకాలం తక్కువ,,! మరి ఏర్పాటు చేసుకున్న బందాలేమో ఎక్కువ.! అందుకే "టైమ్ లేదు, నాకు ! తినడానికి, రావడానికి, ,చివరకు కనీసం మాట్లాడటానికి కూడా టైమ్ లేదు !,, త్వరగా వెళ్ళాలి!",, అంటూ అనునిత్యం పరుగులే పరుగులు!, తెగని ఆరాటం తో బ్రతుకు పై పోరాటం సాగుతోంది. అలా సాగుతూనే వుంటుంది, అందుకే " జీవితమంటే అంతులేని ఒక పోరాటం !"అంటాము. మనం. !" హద్దులు "అంటే ఒక  పరిమితి,! ఇది ఎక్కువైతే విపరీత మే.! కట్టలు తెంచుకున్న గోదావరీ నదీ ప్రవాహంలా భయానకంగా ఉంటాయి దాని ప్రభావాలు.! దురాశ అత్యాశ, అతిగా వాగడం కోపానికి రావడం , అన్నీ అనర్ధ దాయకాలే  కదా,! అంతే కాదు ! ప్రేమ, పెండ్లి, విషయంలో కూడా అంతే! భార్యాభర్త లు, కావచ్చు, బందువులు, స్నేహితులు, సోదరులు,, డబ్బుపై, ఆస్తి పై,  మోహం కావచ్చు !చివరికి మన దేహంపై పెంచుకున్న  అతి ప్రేమ,,, వ్యామోహం మన మానసిక, శారీరిక పతనానికి దారి తీస్తుంది,,! అందుకే "వినాశ కాలే విపరీత బుద్ది !" అన్నారు పెద్దలు , అంటే బుద్ది హద్దులు మీరుతోంది అని అర్థం ! మనిషి మానవత్వం మరచి దానవత్వం తో మృగంలా ప్రవర్తించే  సంఘటనలు ఎన్నో చూస్తున్నాం మనం !ఇందుకు రావణుడు, దుర్యోధనుడు,, వాలి, కైక,, లాంటి పాత్రలు ప్రస్తుత సంఘం లో  కోకొల్లలు,,! తలిదండ్రులపై ప్రేమ తప్పు కాదు,, అది భక్తి గా ఉంటే తప్ప !  దానికీ  కూడా మోతాదు ఉంటుంది,! కొంత సమయము, ఉంటుంది. !పురుషుడు, కొడుకుగా, భర్తగా, తండ్రిగా, తాతగా, మామగా, స్నేహితుడిగా , ఇలా, సభ్య సమాజంలో బాధ్యతలు కొన్ని హద్దులతో నిర్వహించాలి,! అలాగే స్త్రీలు, కుమార్తెగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మ నానమ్మ, అత్తయ్య,, వదిన,, ఆడపడుచు, స్నేహితుల తో ఇలా ఎన్నో రకాల బాధ్యతలు కొన్ని నియమాలు పాటిస్తూ చేయాలి. ఇలా మనుషులకే కాదు, జంతువులకు, నీటిలో కదలాడే, భూమి పై ప్రాకే ప్రాణీ కోటికి భగవంతుడు హద్దులు, బంధనాలు నియమించాడు ! ఇందులో అందము ఆనందము  ఉంటున్నాయి,! , ఎవరికీ? అంటే  ఉన్నదానితో తృప్తి పడే వారికి ! కాని ,ఇక్కడే చిన్న  చిక్కుముడి ఉంది ! ఎంత ఉంటే ఉన్నట్టు అని ?. అయితే, దీనికి జవాబు ఎవరికీ వారే వివేకంతో చెప్పుకోవాలి,,! మనుషులు వేరు,!మనస్తత్వాలు వేరు,!, చేసే పనులు వేరు,,! దేనితో తృప్తి పడాలో నిర్ణయం చేయాల్సింది కూడా మనమే.! ఇది మన జీవితం. ! అభ్యున్నతికి అనుకూలంగా మలచుకుని, తీర్చి దిద్దు కునే స్వాతంత్ర్యం  , అధికారం ,మనకుంది !!""తృప్తి చెందనివాడు సప్త ద్వీపాలు తిరిగినా బాగుపడే అవకాశం లేదు.!"" అని భాగవత కథలు అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాయి. మనకు !  అందుకే  భాగవతం చదివితే మనం బాగవుతాము,! అంటే సిరి సంపదలు వస్తాయని కాదు.! చేసే పనుల్లో చిత్తశుద్ది, కలుగుతుంది,! దానితో ,,తానెవరో, తన జీవిత పరమార్థం ఏమిటో, లాంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది.! చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ బంధాలు, తమ ఆత్మ ఉద్దరణకు, ఆధ్యాత్మిక చింతనకు, అడ్డంకుల ని భావించకుండా ఇదే సుఖము, ఇదే ఆనందము అని అపార్థంచేసు కుంటున్నాడు ఈ  జీవుడు.! నిజమైన బంధనాలు  ఏమిటంటే ,, అవి ,మనం అనుభవిస్తున్న "సుఖ దుఖాలు, పాప పుణ్యాలు ""అనబడే కర్మాఫలా లు.! నిజానికి . బంధాలు అనేవి  భగవంతుడు మనకు అపురూపంగా ప్రసాదించిన అందమైన వరాలు.! ఉదాహరణకు. భార్యాభర్తల అనుబంధం  అపురూపం  !అపూర్వం! అనిర్వచనీయం !, కాని అలా అందంగా జత కూర్చి, ఆనందాన్ని ఇచ్చింది ఆ సర్వేశ్వరుడు అని మరిచిపోవద్దు మనం  ! అదే కాదు మనం అనుభవిస్తూ ఆనందించే ప్రతీ సంఘటనా దైవానుగ్రహం గా భావించాలి ! ఇక బంధనాలు అనేవి ,మనం చేతులారా మనకు మనమే బిగించు కుంటున్న బంగారు సంకెళ్లు,!, ఇవి రంగుల రాట్నం లాంటి జీవితవలయ చక్రంలో ఆగకుండా తింపే  విడివడ న,ి విడదీయరాన మోకు త్రాళ్లు.!,. ఈ చిక్కుముడిని విప్పడం బ్రహ్మతరం కూడా కాదు ! అది ఎవరికీ వారే. " తృప్తి "అనబడే కర్ర సహాయంతో, జీవితం అనే పడవను, సంసారం అనబడే సముద్రాన్ని దాటా ల్సి ఉంటుంది కదా !"". తృప్తి  ""అనేది కేవలం ఒక మానసిక చింతన..! సంఘర్షణ కూడా ! దీనికి అడ్డంకులు మన గతజన్మ వాసనలు,! అంటే కర్మ ఫలాలు !, ఇది తొలగాలంటే  మనం పరమాత్మని ఆశ్రయించక తప్పదు.! వేరే దారి లేదు ! ఆయన ఒక్కడే ఈ అడ్డు దారి తొలగించ సమర్థుడు,! కనుక ఆగామి సంచిత ప్రారబ్ద కర్మలను తొలగించి, మనల్ని బంధనాల నుండి విముక్తిని ప్రసాదించే నారాయణుని శరణు వేడు కోవాలి.. ఈ "శరణాగతి" అనేది అన్నీ బంధాలకు బంధనాల కు అతీతంగా ఉండే అలౌకిక అపురూప అద్భుత భావ సంపద !, ఇదే జీవునికి  శాంతిని తృప్తిని  సంతోషాన్ని ఇచ్చే పరమ ఔషధం.!. పదార్థ గ్రహణం లో తృప్తి ఉండవచ్చును,, కానీ  పరమాత్మయదార్థ స్వరూప ఆరాధనా విధానం లో ఎవరూ కూడా తృప్తి పడాల్సిన అవసరం లేదు.! ఈ ఒక్క విషయంలో, అంటే దైవారాధన, అర్చన, పూజనం, సేవనం, భజన, జపం, తపం,, కైంకర్యం, ఆత్మనివేదనం,, శ్రవణం, కీర్తనం, పఠనం,, రామకోటి రాయడం,, ఇలా భగవద్ సంబంధమైన కృత్యాలు ఎన్ని చేసినా ఎంత చేసినా, ఎల్లప్పుడు చేసినా కూడా తృప్తి పడని వారిని కర్మాఫలా లు అంటవు. ! భగవంతుని సేవ ఎంత చేసుకున్నా మనకు  తృప్తి కలుగదు ! ఎందుకంటే ఆయన అనంతుడు,! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.! అంతా అయనదే.!మనం కూడా ఆయన సొత్తు ,సొమ్ము లమే ! ఆయన చేతి కీలు బొమ్మల మే కదా ! ఆయన విశ్వంభరుడు ! శాసన కర్త ! కానీ దయానిధి ! భక్తజన హృదయ మందారుడు. ! శరణాగత వత్సలుడు , ప్రేమమూర్తి ! కరుణా సాగరుడు ! మన హృదయంలో అలాంటి మహానుభావుని, పరంధాముని నిక్షిప్తం చేశాక, ఏ దుష్ట శక్తులు , గతజన్మ ల పాపపుణ్యాల ప్రభావాలు కూడా ఏమీ చేయలేవు కదా !. ఈ జన్మ ఇచ్చింది, బంధాలు కల్పించింది, సంపదలు అనుగ్రహించింది , తద్వారా ఆనందాలు నింపింది  వాడే ! ఆ శ్రీమన్నారాయణ స్వామియే,,! ఆ పరమేశ్వరుడే !, ఆ జగన్మాత యే కదా! సబ్ కా మాలిక్ ఏక్ హై ! అందుకే,.. మనం దైవాన్ని ఏమీ కోరాల్సిన పని లేదు..! మనకు ఏం కావాలో  ఎప్పుడు ఇవ్వాలో, అసలు ఇవ్వాలో వద్దో,, ఇవన్నీ మనకంటే బాగా ఆ పరందామునికే తెలుసు.! మనం కోరుకునేది ఒక్కటే. "స్వామీ ! జగన్నాథ..! కారుణ్య సిందో ! దీన జన బందో ! ఎల్లప్పుడూ, నిన్ను మరవకుండా  ఉండే బుద్దిని,, నిన్ను స్మరించి భజించి సేవించుకునే శక్తిని, నీ నామరూపాలు నిరంతరం గానం చేసే అవకాశం అనుగ్రహించు తండ్రీ ! ""అంటూ త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తూ భక్తవత్స లుడిని , సర్వాంతర్యామినీ  శరణు వేడుకోవాలి..! ఇదియే శాశ్వత అనందం. ! ఇందులోనే  మన ప్రశాంతత,, జీవన్ముక్తి, మానవ జీవన ధ్యేయం, పరమార్థం ఉంటున్నాయి. .! ఇంతకన్నా అనందం ఐశ్వర్యం ఇంకా ఏముంటాయి మీరు చెప్పండి !! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. ! హరే రామ హరే రామ రామ రామ హరే హరే !""అనే దివ్య మంత్రం జగతి లోని సకల ప్రాణి కోటిని  సంరక్షించా లని అందరం కోరుకుందాం ! సర్వే జనాః స్సుఖినో భవంతు..! సమస్త సన్ మంగళాని భవంతు..! ఓమ్ శాంతి ,శాంతి, శాంతిః !   , స్వస్తి !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...