Mar 17, 2019
బయట సమాజంలో స్వేచ్చగా ఎక్కడా కూడా బేధాలు లేకుండా, రాకుండా జాగ్రత్త పడతారు జనాలు, ! పేకాట క్లబ్బుల్లోను,, సినిమా హాలు లో, హోటల్ లో నూ,, ఆఫీస్ లోనూ, విందు వినోదాల లోనూ ఐకమత్యం గా, అంద రం ఒక్కటే అన్నట్లు కలిసి ఉంటారు, కాని ఒక్క దైవా రాధన విషయంలో కి వచ్చేసరికి విబేధాలు వస్తాయి ."నీవు హిందూ, నీవు ముస్లిం , నీవు క్రైస్తవ,.." అంటూ విడిపోతారు.. ఎక్కడా కానరాని విచక్షణ ఇక్కడ మాత్రం ఎందుకు చూపాలి ? కారణం పరమాత్ముని గురించిన సరి అయిన జ్ఞానం లేక పోవడమే,. ఆదిగురువు శివుడు జ్ఞానఖని..! పురాణాలు ఉపనిషత్తులు, శ్రుతులు వేదాలు తన సతి పార్వతి కి బోధించడం ద్వారా సకల భక్త కోటికి జ్ఞాన సముపార్జన చేసుకునే వీలు కలిగింది. సత్యం శాశ్వతం !,శివం జ్ఞానం !సుందరం శాశ్వత అనందం,! ఇవి పరమేశ్వర తత్వ రహస్యాలు, !జ్ఞాన బండారాలు.! అతని నిరాడంబర జీవిత విధాన మే , ఆ సచ్చిదానంద నిర్గుణ నిరాకార శివలింగ రూపమే, మానవాళికి అందించిన అద్భుతమైన జ్ఞానో పదేశం ! ఎన్ని విద్యలు నేర్చిన కూడా "కూటికొరకు మాత్రమే "అని భావిస్తూ , అన్నింటికీ మూలం అయిన,,పరమాత్ముని గురించి అని గుర్తించలేక పోతే, అవి కేవలం ఇహాన్ని గురించే గానీ, పరాన్ని సూచించే పరమార్థం గురించి కాదు కదా .! సృష్టిలోని ఏ జీవరాశిని గమనించినా, ఒక నీతిని బోధిస్తాయి. కుక్క విశ్వాసానికి గుర్తు.! ఇది అందరికీ తెలిసిన సత్యం !తనకు ఆహారం పెట్టిన యజమానికి ఎన్నడూ అది హాని చేయదు.! పైగా ఒక రక్షక భటుని వలె ఇంటికి రాత్రింబవళ్ళు కాపలా ఉంటూ యజమాని నీ రక్షిస్తూ విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటుంది !. కాబట్టీ కుక్కను ఒక "గురువుగా" స్వీకరించ వచ్చును .!. ఎందుకంటే ఆ విశ్వాసం, ఆ గురి, ఆ నమ్మకం, మనిషిలో కొరవడింది కాబట్టి.! ఇంత తిండి తింటున్న కుక్కనే, తన జీవితాంతం, తన యజమాని పట్ల అంత విశ్వాసం చూపితే ,, సకల సంపదలు, తెలివిని, శక్తి యుక్తులను, ఇలా ఎన్నింటినో ప్రసాదించిన ఆ పరమేశ్వరుని పట్ల మనిషి ,ఎంతో విశ్వాసాన్ని, కృతజ్ఞతను,వినయవిదేయ తలను చూపాల్సి ఉంటుంది. అని అమాయకంగా అగుపించే శునకపు జీవన శైలి మనిషికి ఉండాల్సిన ఆ సద్బుద్ధి నీ గురువు వలె ఉప దేేశిస్తూ ఉంటుంది.!. అలాగే అడవుల్లో తిరిగే ఒక జింక..! "ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుం దో కదా !""అనుకుంటూ పంచేంద్రియాలు ఉగ్గబట్టి, ఎల్లప్పుడు అప్రమత్తంగా సంచరిస్తూ ఉంటుంది. .,! కాని మనిషి "మృత్యువు తనను ఎప్పుడు కాటేస్తుందో కదా" అని భయపడకుండా," అందరూ పోతారు, కాని తాను మాత్రం దానికి అతీతుడు!" అనుకుంటూ, ఉత్కృష్టమైన మానవజన్మ ను భోగ భాగ్యాలనడుమ విలాస వంత మైన జీవితం గడుపుతూ క్రమంగా తాను, దైవారాధన కు దూరం అవుతున్నాడు. ఇలా జంతువులు , క్రిమి కీటకాలు జ్ఞానం లేకున్నా కూడా తమ ధర్మాన్ని,తప్పకుండా ,, ఎన్ని కష్టలెదురైనా, తమ కర్తవ్యాన్ని నిర్వహి స్తు ఉంటున్నాయి. కానీ, దీనికి వ్యతిరేకంగా, అతితెలివి, దురాశా పరుడు, స్వార్థ బుద్ధితో, మనిషి మాత్రం ధర్మ భ్రశ్టుడౌతున్నాడు .! జంతువు కంటే తక్కువ స్థాయికి దిగజారి పోతున్నాడు. మూడవ గురువు ఒక చెట్టు ! అది తనకంటూ ఏమీ ఉంచుకోకుండా పూవులు పండ్లు, ఆకులు, చివరకు కొమ్మలు, కాండము, వేర్లు అన్నింటినీ ఇతరుల ప్రయోజనాలకు అందిస్తూ, త్యాగబుద్దిని బోధిస్తోంది. అంతే కాకుండా, చల్లని నీడను ఇస్తూ, చల్లని గాలులు వీస్తు,,, తనను ఆశ్రయించిన ప్రాణులకు, పశు పక్ష్యాదుల కు ఆత్మానందాన్ని, రక్షణను, ఆహారాన్ని , ఉచితంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా, నిస్వార్ధంగా , అందిస్తూ, మనిషికి ఉండాల్సిన త్యాగబుద్దిని, పరోపకార మహత్తును చాటి చెబుతూ, గురువులా ఉపదే శిస్తూ ఉంది. ! ఇలా ప్రకృతి మనిషికి మొదటి గురువు. అవుతోంది. ! అంతులేని విజ్ఞాన భాండాగారం ఈ ప్రకృతి " అని అంటారు. అందుకే ,Nature is the first and the best teacher to mankind. ! కృష్ణం వందే జగద్గురుమ్ ! భగవద్గీత ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్ని, జ్ఞానాన్ని ,, జీవిత సత్యాలను, మనిషి చేయాల్సిన విది విధానాలను శ్రీకృష్ణుడు అర్జునుడిని నెపం గా పెట్టుకొని , వివేకంతో మెదిలే ధర్మాలను అనేకం బోధించాడు. ,భారతదేశంలో శ్రీకృష్ణుని తత్వం తెలియని వారుండరు. ! శ్రీకృష్ణుని ప్రేమించే ప్రతి హృదయం నిత్యానంద నిలయమై వుంటుంది.!".work is worship అంటారు!".. కాని దొంగతనం, దౌర్జన్యం, హత్యలు అన్నీ పనులే, కర్మలే..! కాని వాటిని "దైవ కార్యాలు" అంటామా? అనలేము కదా ! అందుకే good work is worship , అంటే, సత్కర్మలు పూజనీ యాలు అనవచ్చును.! ఒక భక్తుడు కృష్ణునితో ఇలా అంటాడు,," స్వామీ !ఈ ధనం , ఈ దేహం , ఈ చిత్తం , ఈ సంపద, బందువులు , బలగము అంతా నీదే , సుమా అని..! అప్పుడు కృష్ణుడు చిరు నవ్వు తో, "మరి నీది అంటూ ఏమైనా మిగుల్చు కున్నావా లేదా ? అని . అనగానే "లేకెం కృష్ణా! నీవు నావాడి వేగా !నేవొక్కడివి నాతో ఉంటే చాలు.! అన్నీ ఉన్నట్టే ! నీవు గానీ, నాతో విడిపోతే, ఎన్ని ఉన్నా లేనట్టే కదా , స్వామీ ! హే కరుణాసిందొ,! హే భక్త జనబందొ !" అంటూ ఆర్ద్రత తో అనగానే అతడి పరిపూర్ణ భక్తి విశ్వాసాలకు ముగ్ధుడై భక్తుడినీ కరుణిస్తాడు.. నీలమేఘ శ్యామ సుందరుడు,!నవనీత చో రుడు , !గోపికా హృదయ విహారు డు !రాధామాధవుడు !మన శ్రీ కృష్ణుడు. !మన హృదయంలో కృష్ణుడు ఉండాలంటే , హృదయగతవిషయ వస్తువులు అన్నింటినీ దూరం చేయాలి..! "దేహాభిమానం , ధనం పై, కులం, మతం,జాతి,, లింగ,, ఐశ్వర్య,, రూప సౌందర్య, పదవుల పై గల అభిమానాలు "అన్నింటినీ వదలి, కేవలం శ్రీకృష్ణ పాదార విందాల పైనే, చిత్తాన్ని కుదురుగా నిలపాలి. ! కాళీయమర్దన సమయంలో , కాళీయుని భార్యలు చిన్ని కృష్ణుని శరణు వేడుతూ ,రెండు వరాలు కోరుతారు.! ఒకటి, తమ భర్తకు ప్రాణదానం! రెండు,నిరంతర కృష్ణ చింతన.!.. అయితే బాలకృష్ణుని సుందర లావణ్య సురుచిర రూపాన్ని తనివారా దర్శిస్తూ తన్మయులై,," స్వామీ !నీ సచ్చిదానంద స్వరూపం చూశాక ,మాకు ప్రత్యేకంగా వేరే కోరికలు ఉంటాయా.. ?మమ్మల్ని మా కర్మబందాల నుండి విముక్తులను చేసి మోక్షాన్ని ప్రసాదించు గోపాల కృష్ణా, ! "అని వేడుకుంటారు.. వారి భక్తికి ప్రసన్నుడై కృష్ణుడు వారిని ముక్తిధామాన్ని అనుగ్రహిస్తాడు ..! అనగా ఒక్కసారి పరమాత్మ నామ రూపాలు త్రికరణ శుద్ధిగా భావించి, తపించి, జపించి, దర్శిస్తే చాలు, మనం ఏమీ అడిగే అవసరం లేకుండా మన యోగక్షేమాల బాధ్యత తానే వహిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు.! అందుకే హరి నామంతో ,కర్మబందాలను, సకల పాపాలను కడిగి, చిత్తశుద్ధిని ప్రసాదించే హరి నామ గాన వైభవం తో పునీతులం అవుదాం!. ఇది తప్ప జన్మరాహిత్యాన్ని పొందడానికి మరి వేరే దారి మనకు లేదు !" అని ప్రాజ్ఞులు జ్ఞానబోధ చేస్తూ ,, నామమంత్ర జప సాధన మార్గాన్ని మరింత సులభతరం చేస్తూ శ్రీకృష్ణ చైతన్య మహా మంత్రాన్ని ప్రసాదించారు . దీనిని జపించడం వలన, , దే వాదిదేవుడై న శ్రీకృష్ణ భగవానునీ దివ్యధామము ను పొందవచ్చును.,! " హరే కృష్ణ హరే కృష్ణా. , కృష్ణ కృష్ణ హరే హరే,! హరే రామ హరే రామ రామ రామ హరే హరే. !"
Sunday, March 17, 2019
దైవా రాధన
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment