Mar 20, 2019
రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించవచ్చును . రాముడు కౌసల్య కన్న కొడుకు అయినా ,,పెరగడం పెంపుడు తల్లి కైకేయి మాత ఒడిలోనే జరిగింది . అందుకే రాముడంటే తన కొడుకు భరతుని కన్నా, కూడా వల్లమాలిన ప్రేమ, అభిమానం!, రాముని సౌశీల్యం, ధర్మ నిరత, పరాక్రమం ఆమెకి బాగా తెలుసు. !పట్టాభిషకం జరిగితే రాముడు అయోధ్య కు మాత్రమే చక్రవర్తి గా పరిమితి అవుతాడు, అది ఆమెకు ఇష్టం లేదు., రాముడిని జగదో ద్దారకుడిగా, సకల భువన పరిపాలకుడిగా చూడాలని ఉంది ఆమెకు..! అప్పుడు రాక్షసుల దాడి అయోధ్యానగరానికి చుట్టూ , అన్ని వైపులా , బెదిరిస్తూ, మాన ప్రాణాలను తీస్తూ ఉంది .. లక్షల సంఖ్యలో అడవుల్లో రాక్షసులు యదేచ్చగా సంచరిస్తూ, అటు ఋషి ముని పుంగవుల తపస్సు, హోమ య జ్ఞా ది క్రతువులు ధ్వంసం చేయడం, క్రమంగా ధార్మికత తగ్గుతూ, దమన కాండ పెరిగి పోతుండటం ఆమెకు చాలా బాధ కలిగించింది . అంతేకాదు ఆమె తన రాము డిని రాక్షసుల ,అకృత్యాలను రూపుమాపేందుకు అడవులకు పంపించాలని కూడా అనుకుంది, . తమ గ్రామాలు నగరాల నుండి మరో గ్రామం వైపు ఎవ రు వెళ్ళినా ,వారు రాక్షసుల బారిన పడి ,ప్రాణాలతో తిరిగి వచ్చేవారు కాదు. , విశ్వామిత్రుని తో వెళ్లి, రాముడు, అరణ్యాలలో నరసంచారం లేకుండా చేసిన తాటకి నీ వధించ డం తో రాక్షసుల దమనకాండ అగిపోలేదు. వా రి ఆగడాలు ఇంకా ఉదృతమయ్యాయి , ప్రతీకార భావంతో చెలరేగి పోయారు ,,జనసంచారం ఉంటున్న గ్రామాల లో చొరబడి, స్త్రీలను చెరబట్టి, పురుషులను క్రూరంగా చంపుతూ నరమేధం సృష్టిస్తూ, గ్రామాలు కొల్లగొడుతున్నారు , దుష్టశిక్షణ , శిష్టరక్షణ నియమంగా దీక్షగా పెట్టుకున్న రాముడు, ఇటు వశిష్ఠుడు, అటు విశ్వామిత్రుడు, వద్ద దివ్యాస్త్రాలు సంపాదించి అజేయుడై , నిలిచాడు,, రాక్షస లోకాన్ని తు దముట్టించే సామర్థ్యం , శౌర్య ప రాక్రమాలు. కలిగినవాడు అని ఆమెకు తెలుసు..! అయితే రాముడ్ని విడిచి ఒక క్షణమైనా ఉండలేని దశరథుడు , తన నిర్ణయాన్ని ఒప్పుకో డు అని కూడా తెలుసు! , కాని బలాత్కా రానికి,అత్యాచారాలకు గురవుతూ, నరమాంస భక్ష కుల చేతిలో వి ధవలుగా. మారుతున్న స్త్రీల దుస్తితి కైకమ్మను కలచి వేసింది.! ఆమె కూడా వీర వనిత,! దేవాసుర సంగ్రామంలో భర్తకు అండగా నిలిచి,, తన పరాక్రమం తో విజయాన్ని సాధించి,, అతన్ని కాపాడిన వీరనారి ,సాహసిఆమె.! అందుకు కృతజ్ఞతగా దశరథుడు ఆమెకు రెండు వరాలివ్వడం,, కూడా జరిగింది. అందుకే ఈ రెండు వరాలను ఉపయోగించి, రాముని పట్టాభిషేక ఉత్సవాల ను అడ్డుకోవాలని నిర్ణయించు కుంది. సూర్యవంశ రాజులు ఆడిన మాట తప్ప రని ఆమెకు బాగా తెలుసు,! రాముడు లేకుండా దశరథుడు జీవించడ నీ కూడా తెలుసు.. ! కానీ ,ఎంతో మంది అబలలు విధవ లుగా మారుతూ, ప్రాణాలు అర చేతిలో, పెట్టుకొంటూ, దీనంగా విలపిస్తూ ఉన్న వార్తలు ఆమె వింటూ, ఉంటే ఆమె వీరవనిత కాబట్టి ,రక్తం ఉడికి పోతోంది .!. అందుకే వేల సంఖ్యల్లో ఉన్న అనాధ స్త్రీల పసుపు కుంకుమలు కాపాడటానికి , తన ఒక్క పసుపు కుంకుమ ను బలి చేయడానికి, ఆమె తన గుండెను రాయి చేసుకుంది.! వేరే దారి లేక, "వరాలు "అనే నెపంతో, రాముడిని వనవాసం పంపి, తన ద్యేయాన్ని సాధించి నిజంగానే వీరమాత అయ్యింది.! రాముడు ,దండకారణ్యం లాంటి దట్టమైన అరణ్యాలు తిరిగి తిరిగీ రాక్షస జాతిని నిర్వీర్యం, చే స్తూ అడవులను నిష్కంటకం చేశాడు,,! అలా జనావాసాలు పెంచాడు. !ఋషులు , మునులు నిర్భయంగా వారి తపస్సు, క్రతువులు చక్కగా నెరవేరుస్తూ వారి ధర్మా లను నెరవేర్చడానికి మార్గం చాలా సు లువయ్యింది.! కాని ఈ మహా యజ్ఞం లో కైక మ్మ బ్రతుకు, నడవడి , మాత్రం సమిధలా కాలిపోయింది .! అయినా అంతిమజయం కైకమ్మదే,,! రాముని ఖ్యాతి , ధర్మా వతారు డని, పరాక్రమశాలి, శరణాగత రక్షకుడు అనీ,, పితృవాక్య పరిపాలకుడు అనీ ,ఇలా యుగ యుగాలలో ప్రజలు శ్రీరాముని నుతించడానికి కారణం,, , అతడి వెనక ఉండి కథను చక్కని ప్రణాళికా బద్దంగా నడిపించిన మన ఉక్కుమనిషి,, త్యాగ ధను రాలు,, స్త్రీజాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మన కైకమ్మ యే.!!. అనవసరంగా ఆమెను అపార్థం, చేసుకొని, శాపనార్థాలు పెడుతున్నారు ఆమెను..! ఆమె పాత్రను అర్థం చేసుకోవాలి, మనం ! ప్రేమ కంటే త్యాగం , దేశభక్తి గొప్ప వి. అని నిరూపించింది, !రాముని పై గల ప్రేమ ను గుండెల్లో దాచుకొని, అతడి ధార్మికత ను ఖండాంతర ఖ్యాతిని చాటి చెప్పిన కౌకమ్మ వందనీయు రా లు .! చిరస్మరణీయు రాలు,,! ""అమ్మా ! కైకమ్మా . !అందమైన రాముని కథ ను నీవు స్వయంగా తీర్చి దిద్ది , రామాయణం చదువుతూ, అద్భుతమైన ఆనందా ను భూతినీ పొందే భాగ్యాన్ని కలిగించిన నీకు సాష్టాంగ ప్రణామాలు !తల్లీ. !నిన్ను అపార్థం చేసుకుంటున్న వారిని క్షమించు! ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉన్నట్టే, శ్రీరామ విజయం, అతని పెంపుడు తల్లి కైకమ్మ . సంకల్ప బలం !! రాముడు రావణ సంహారం తరువాత , తిరిగి వచ్చి మొదట కైక పాదాలకు ప్రణామాలు చేస్తూ అంటాడు. అమ్మా నా విజయానికి , కీర్తి ప్రఖ్యాతుల కు నీవే కారణం , హనుమ వంటి బంటు, సుగ్రీవుడు, విభీషణుని వంటి మిత్రులు ,, లక్ష్మణుని వంటి తమ్ముడు , సీత వంటి భార్య నాకు లభించా రు. ఇదంతా కేవలం నీ అనుగ్రహం ! నేను ఏమి చేసినా నీ ఋణం తీర్చుకోలే ను , నా హృదయపూర్వక ప్రణామాలు స్వీకరిం చు మాతా ! ఎవరైనా నిన్ను నిందించి నీకు మనస్తాపం కలిగిస్తే వారిని క్షమించు వారి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను అమ్మా ! నీ చల్లని దేవనలే ఈ సీతారాములకు రక్ష ! అంటూ ప్రార్థిస్తాడు ! ఇక కైకమ్మ తల్లి ఆనందానికి అవధులు ఉంటాయా మీరు చెప్పండి ! అందుకే ప్రేమ కంటే త్యాగం గొప్పది ! ఒకరిని మించిన ఒకరు రామాయణంలో త్యాగ మూర్తులు ! అందుకే శ్రీరామ కథ అపురూపం అపూర్వం ! రామ నామం , రామ బాణం కంటే గొప్పది అయ్యింది. ధర్మాలలో కెల్లా అత్యంత మహిమాన్విత మైనది త్యాగధనం !! రామ నామ స్మరణం, సకల పాప హరణం ! జై శ్రీరామ్ , !!జైజై శ్రీరామ్.!! రాజా రామచంద్ర భగవాన్ కీ జై!!" స్వస్తి !!""
No comments:
Post a Comment