Feb 25, 2019
"అమ్మా ! నీకు వందనం..!" జన్మనిచ్చావు,, అందులో ఉత్తమ మానవజన్మ ను. ప్రసాదించావు ! సంస్కారం సంప్రదాయం ఉన్న చక్కని కుటుంబంలో. బంధువు బలగం ఆస్తి ఐశ్వర్యం ,ప్రేమానురాగాలు గల కన్నవారు. సత్సంతానం.తో ,అనుగ్రహించావు . .అమ్మా !ఎన్ని ఉన్నా ఎంత మంది ఉన్నా, నీ ఒడిలో ఉన్నంత "ఆనందము ,హాయి, సంతృప్తి ""ఎక్కడా దొరకవు కదా.!. ఈ అద్భుతమైన మాతృప్రేమ కోసమే కదా రాముడు కృష్ణుడు దివినుండి భువికి దిగివచ్చారు. ఆ బ్రహ్మాండ నాయకుడు ,అలా తల్లి ఒడిలో పసివాడిలా తల్లి చనుబాలు త్రాగుతూ.. అమృతం కంటే ఎక్కువ బ్రహ్మానందాన్నీ అనుభవిస్తూ పరవశించాడు ! జీవి సహజంగా ,పరతంత్రుడు ఆస్వతంత్రుడు.ఇతరులపై ఆధారపడకుండా బ్రతకలేడు .అందుకే జననం నుండి మరణం పొందేవరకు జీవి ఎంతో మందికి ఋణగ్రస్తు డై ఉంటాడు.!.అన్ని రుణాలు తీర్చుకోవచ్చును ఒక్క మాతృఋణం తప్ప...! అందుకే సర్వ దేవతల సేవ ఒక్క తల్లిసేవకు సాటిరాదు!.. ఇప్పుడంటే సర్జరీ చేస్తూ కాన్పులు కృత్రిమంగా సులభతరం చేస్తున్నారు. ,కానీ సహజంగా తల్లి పడే ప్రసూతి వేదన వేయి తేళ్లు కుట్టినంత బాధను పడుతుంది. ,, అమ్మపాల కంటే గొప్ప పోషకాలు లేవు !. అమ్మ ప్రేమను మించిన అనురాగం లేదు.! అమ్మను మించిన దైవం లేదు. !వేదాలు , శాస్త్రాలు, పురాణాలు ,మతాలు, దేశాలు ,జాతులు ,ఇలా ఎన్ని వేదికినా సృష్టిలో కెల్లా అమ్మను మించిన ధనం, భాగ్యం ,అదృష్టం మరెక్కడా లేవు..! ""మాతృదేవో భవ..!! ""అన్న వేదవాక్యం నిత్య సత్యం.!! అమ్మ ఉన్న ఇంటిలో అన్నీ ఉంటాయి.. అమ్మ ప్రేమ సంతానానికి తరగని పెన్నిధి..! బిడ్డను కనడం కోసం తల్లి మూడురోజులు నొప్పులు తీస్తూ..బ్రతుకుతుందో లేదో అనిపిస్తూ ,చావుబ్రతుకుల్లో కొట్టు మిట్టాడుతూ, ఆమె నరకయాతన పడిన సంఘటన ఇంకా నాకు గుర్తు ఉంది.! ఆడదానికి ప్రసూతి ఒక పునర్జన్మ ! చచ్చి మళ్ళీ పట్టినట్టు ! అంతబాధల్లోనూ కడుపున పుట్టిన బిడ్డను తన ప్రక్కన చూస్తూ ,ప్రేమతో పాలుఇస్తూ ,తాను పడిన కష్టాలన్నీ మరచిపోతుంది. ఆ త్యాగమూర్తి .ఒక్కోసారి ఆ బిడ్డ కడుపులోనే పోతే, అయ్యే రక్తస్రావం తో ,బలహీనంగా అయ్యి, మాతృమూర్తి ఎంత అవస్థలు పడుతుందో ఆ అమ్మకి తెలియాలి..! బిడ్డను కనడం కోసం తాను యమద్వారం దర్శనం చేస్తుంటారు. తల్లులు !ఒక్కసారి అదే కాన్పుకు అంతిమ శ్వాస విడుస్తుంటారు.!తాను బ్రతికినన్నాళ్లు తన పిల్లలను కళ్ళలో పెట్టుకొని సంరక్షిస్తుంది,త్యాగమూర్తి ..తల !్లి వారికోసమే జీవిస్తుంది. బాధలు అవమానాలు ఉపవాసాలు నిష్టురాలు,, దేహాబాధలు ,మనోవ్యదలు ఎన్నో అనుభవిస్తూ కూడా.ప్రేమమూర్తి తల్లి ! .. తమ పిల్లల సుఖంలో తన సుఖం. వారి కష్టాల్లో కష్టం చూసుకుంటుంది అమ్మ !.. బిడ్డ ఏడిస్తే తాను ఏడుస్తుంది. బిడ్డ నవ్వితే తాను కూడా నవ్వుతుంది..! అంతేగాని , తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా సంతానం కోసం, దానికి కారణమైన భర్త కోసం జీవితాన్ని ఫణంగా పెట్టి కుటుంబ సేవకు ,వంశ ఉద్దరణకు జీవితాంతం , అంకితభావంతో కృషిచేసి ,ఆ యజ్ఞంలో లోనే ఆఖరుశ్వాసను విడిచే ,అపర దైవం ,అమృత కరుణామూర్తి, అమ్మ గురించి చెప్పే సాహసం.. చేయడం .సూర్యభగవానునికి దీపం చూపి హారతి పట్టినట్టు అవుతుంది.!మన చర్మం ఒలిచి చెప్పులు కుట్టి తల్లికి సమర్పించిన కూడా సరిపోదు..! ఈ మాటలు సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా తల్లి దేవకిదేవి తో ,తలిదండ్రులను చేరనుండి విడిపించినపుడు అన్న మాటలు..,తీర్చుకోలేని రుణం అమ్మ రుణం !! బిడ్డ సంతోషం కోసం ,భర్త నైనా ,బంధువు నైనా ,చివరకు దైవాన్నైనా ఎదిరిస్తుంది తల్లి ప్రేమ ! త్యాగం ఆమె శీలం ,దయ ఆమె సహజ గుణం క్షమ ఆమెలోని దైవగుణం !అమ్మ వలె ఆలోచించడం, అమ్మ లా ప్రేమించడం ,అమ్మ లా బ్రతకడం అమ్మ వలె ఒక జీవికి ప్రాణం పోయడం దేహం ఇవ్వడం ,చనుబాలివ్వడం,ఆనుక్షణం కనురెప్పపాటు కూడా మరవకుండా బిడ్డలను అప్రమత్తంగా కనిపెడుతూ ,,అందుకోసమే జీవించడం దేవునికి కూడా సాధ్యం కాదు..కదా ! అందుచేత . ఎవరివద్ద తల్లి సంతోషంగా ఉంటుందో అతడ్ని మించిన అదృష్టవంతులు ,భాగ్యవంతులు , ఈ భూమండలంలో ఉండబోరు..!రోజూ దేవాలయం కు వెళ్లే అవసరం లేదు.. తలిదండ్రుల కు ఆదరణ ,ఆనందం ,ఆప్యాయత ను అందించే కొడుకులకు, కూతుళ్లకు..!అలా భగవన్తుడు తాను స్వయంగా రాలేక, ఇలా అమ్మ రూపంలో దైవంలా వచ్చి, తన నిస్వార్థ పూరితమైన దయ కరుణ ,ప్రేమ ఆనందం అనురాగం ,ఆత్మసమర్పణా భావంతో,.జన్మనిచ్చి ,పాలిస్తూ , సకల ప్రాణికోటి ని ,,సచ్చిదానంద స్వరూపుడై , సంరక్షిస్తున్నాడా అనిపిస్తూ ఉంటుంది... !మనుషుల్లోనే కాకుండా, అమాయక ప్రాణులైన కోడి, కోతి పిల్లి, ఆవు,, పంది, లాంటి జీవనరీతిలోను,పులి, సింహం, ఏనుగు లాంటి అడవి జంతువుల్లోనూ అవధులు లేని మాతృప్రేమను చూస్తుంటాము.!.సర్వాంతర్యామి అయిన ఓ పరమాత్మా.. ! స్వామీ !నీవు మాకు" అమ్మ "అనే పరమాద్భుతమైన వరాన్ని ఇచ్చి మమ్మల్ని ధన్యులను చేశావు !ఆ విధంగా మా జీవితాలను అందంగా ఆనందంగా తీర్చి దిద్ది, మా బ్రతుకులకు ఒక అర్థం కలిపించావు.. అందుకు ,ప్రభూ! పరంధామా! పరమేశ్వరా.! నీకు శతకోటి సాష్టాంగ ప్రణామాలు!. తండ్రీ ! నీ దయకు కృతజ్ఞులం! నీ కరుణకు జన్మజన్మలకు ఋణగ్రస్తులం . ! దేవదేవా ! లక్ష్మీ రమణా ! ,శరణు !శరణు! శరణు ! హరే కృష్ణ హరే కృష్ణా !! స్వస్తి !!
No comments:
Post a Comment