Mar 22, 2019
పరమాత్మా ! పరంధామా !! మనిషికి జంతువుకు తేడా కేవలం నీవు ప్రసాదించిన ఈ జ్ఞానమే. కదా! దానిని మాటల ద్వారా చేతల ద్వారా ప్రకటించి భావించి నిన్ను తెలుసుకునే అవకాశం లభించింది కూడా నీ కృపతో నే కదా నారాయణా ;!!దీనితో నే సకల ప్రాణికోటి లో ఉత్కృష్టమైనది మానవ జన్మ ,ఉత్తమమైనది ! అనిపించు కుంటున్నా ము కదా నారసింహ !, అనునిత్యం నా జీవన చర్యల్లో భాగంగా నిన్ను భావిస్తూ సేవించే ప్రయత్నం చేస్తున్నాను జనార్దనా ! నాకున్న ఈ అవయవ సౌందర్య సంపద నీ అనుగ్రహమే కదా,పురుషోత్తమా !,, నా అంగాంగమునందు నీవే ప్రతిబింబిస్తూ నన్ను జీవింప జేస్తూన్నావు కదా పరమేశ్వరా,,! అందుకే నేను తల దువ్వుకుంటూ ఉన్నపుడు, నీ నల్లని కేశాలంకరణకు నీకు ఇష్టమైన మల్లెలు, గులాబీ, మొదలైన పరిమళ భరితమైన మకరంద ద్రవ్యాలతో అలది నట్టుగా తలచి ఆనందిస్తూ ఉన్నాను. నేను ప్రతి రోజు చేసే స్నానం పద్మనాభ !నీ పాద కమలాల అభిషేక భావంతో గంగా కృష్ణా, మందాకిని, అలకా నంద లాంటి దివ్య నదీజలాల ధారల స్నాన ఫలిత మస్తు!" అంటూ నీకు స్నానం చేయిస్తున్నట్లు గా భావిస్తూ చేస్తున్నాను! , గోపీ మనోహర ! విశాలమైన నీ ఫాల భాగాన తిరుమణి తో" కస్తూరీ తిలకం "దిద్దుతున్నా నని నా నుదుట జ్ఞాననేత్రం వద్ద తిలక ధారణ చేస్తూ, ఉన్నాను ,,!దీన జన బందొ! నీ ఈ కన్నులతో, సర్వాంతర్యామి వైన నిన్ను , మొదట నాలో, పిదప అంతటా నీ విశ్వరూపం చూసే ప్రయత్నం చేస్తున్నాను .కమలనయనా ! ,నాలో ఉంటూ , నా జీవనచర్యలకు మూలాధారము గా వెలిగే నిన్ను నేను ధరించే ఈ బొట్టు ద్వారా జ్ఞా నానందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. కేశవా!,, నీవిచ్చిన నేత్రాలతో నాలో ప్రకాశించే అంతర్యామివైన నిన్ను, నా ఎదుట సాక్షాత్కారం అవుతున్న నీ బ్రహ్మత్మక రూపంగా ,ప్రాణుల లో, చెట్టూ పుట్టా, పత్ర పుష్పాలు, అందమైన ప్రకృతి సోయగాల లో, సూర్యోదయ, సూర్యాస్తమయ రమణీయ దృశ్యాలలో నీ అద్భుత విరాట్ స్వరూప లీలా వైభవాన్ని దర్శిస్తూ, దివ్యానుభూతి నీ పొందుతూ, నిత్యం నిన్ను దర్శిస్తూ, ఉన్నాను. గోవిందా !. కళ్ళు మూసుకొని నీ ధ్యానం లో నేను ఉన్న పుడు , భుజించే సుగంధ ద్రవ్యాల, ఆహార పదార్థాల ఘుమఘుమ లు నాలో ఉన్న నీవే ఆస్వాదిస్తూ ఉన్నట్టుగాప్రతిస్పందిస్తూ ఉన్నాను, మాధ వా!. ,వీనులకింపైన సంగీతంతో నీవు పరవశిస్తూ ఆనందిస్తూ వింటున్న అనుభూతిని నేను పొందుతూ ఉన్నాను. నందనందనా ! నా కంఠం లో ధరించే బంగారు హరము, గానీ, తుల సీ దళ పూసల మాల గానీ, శ్రీకృష్ణా ! నీ మెడలో ధరించే వనమాల గా భావిస్తూ ఉన్నాను శ్రీనివాసా !.. నా భుజాలపై గల చక్రాంకితాల్లో నీవు ధరించే పంచయుధాల ప్రభావంగా భావిస్తూ ఉన్నాను ,, రాధా మాధవ ! నీవిచ్చిన ఈ రెండు చేతులతో, ఆలయంలో అర్చాముర్తిగా , ప్రత్యక్ష దైవం గా వెలిగే సూర్యచంద్రులు , తలిదండ్రులు, గురు వులకు , భక్తి పూర్వక ప్రణామాలు సమర్పించే భాగ్యాన్ని అందిస్తూ ఉన్నావు కదా పద్మనాభ ,!, నిత్యం నన్ను నిమిత్త మాత్రునిగా చేస్తూ , నీవు స్వీకరించే మధుర ఆహార పానీయాల లో నీవే ఉంటూ, నేనే నీవు అవుతూ, శక్తివి కూడా నీవే అవుతూ , అన్నమయ, జ్ఞానమాయ, మనోమయ, ఆనందమయ, కోశాల వినియోగం తో పరమానందాన్ని అనుగ్రహిస్తూ , ఇదంతా కేవలం నీ ఉనికి మహాత్మ్యం గా గుర్తిస్తూ ఉన్నాను. అనంతా !. పవిత్ర క్షేత్రాల , మహాత్ములదర్శనం కోసం,, పుణ్య నదులలో స్నానం కోసం,, అంతటా నిండి ఉన్న నీ అనంత అద్భుత విరాట్ వైభవాన్ని దర్శించి సేవించి తరించడానికి, నీవిచ్చిన మానవ జన్మను , ఉద్దరించు కోవడానికి, నీవిచ్చిన ఈ పాదాలతో వెళ్లి చూస్తూ పునీతుదను అవుతున్నాను . అచ్యుతా ,! ఇలా నిరంతరం ,నన్ను విడవకుండా, నేను నా పాపపుణ్యాలు అనుభవించడానికి తగిన శక్తిని ఇస్తూ, నీ పని అయిపోగానే ,, ఈ జీవితాన్ని "గాలి తీసిన బుడగ"లా చేసి,, తిరిగి ఇదే గాలిని మరో బుడగలో కి ఊదుతూ నన్ను కీలుబొమ్మలా చేసి నాతో ఆటలాడుతూ వినోదాన్ని పొందుతావుగదా వేణు గాన లోలా ! కానీ, ప్రభూ !. ఈ జ్ఞానం నిన్ను తెలుసుకోడానికి సరిపోవడం లేదు కదా , తండ్రీ ! మధుసూదనా,,!, ఏ రూపము లేని నిన్ను ఎలా గుర్తించను,? ఎలా భావించను ?ఎలా సేవించను?, అఙ్ఞానిని,! మహా పాపిని,! పైగా అహంకారి నీ,!, దయచేసి నాకు మార్గ దర్శనం చేసి, సరియైన మార్గం లో నడిపించు స్వామీ!" , ఎది మంచి,ఎది చెడు " అని గుర్తించే విజ్ఞానం నాలో కొరవడింది, జగదీశా !అందుకే నిన్ను శరణు వేడుకుంటున్నాను ,, లక్ష్మీ వల్లభ ! కానీ ,, ఒక్కటి మాత్రం చెప్పగలను !, ముకుందా !నీవు ఉన్నావు! నన్ను చూస్తున్నావు! నా చర్యలు గమనిస్తూ సాక్షిగాఉన్నావు,!, అందుకే , సర్వజ్ఞు డివి , సర్వాంతర్యామి వి. అయిన నీకే నా మనసును ,తనువును నీకు అంకితం చేస్తూ ఉన్నాను దామోదర !" నాకు నీవే గతి !నీకే శరణు." జగన్నాథ , అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, శరణు! శరణు! శరణు ! స్వస్తి ! హరే కృష్ణ హరే కృష్ణా !""
Sunday, March 24, 2019
పరమాత్మా ! పరంధామా!
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment