Mar 24, 2019
సృష్టి లోని ప్రతీ ప్రాణికి, భగవంతుడు కరుణించి,అనుగ్రహించిన అమృతతుల్యమైన నిద్ర, అనే వరం మన జీవితంలో ఏ రోజున కూడా మరవరాని , మరవలేని, ఒక అద్భుతమైన, మధురమైన దివ్యానుభూతి,,! ఈ అనందాను భవాన్ని, ఉదయం లేస్తూనే గుర్తిస్తూ ఉంటాము, రోజంతా పనిచేస్తూ అలసి సొలసి విశ్రాంతి కోసం పరమ పదాన్ని తలపించే , స్వర్గ సుఖాన్ని మరపించే నిద్ర దేవతని శరణు వేడుకుంటాు. ఆహార పానీయాలు లేకుండా కొన్ని రోజులు జీవించగలమేమో కాని, రోజుకు కనీసం 5,,6 గంటలు పడుకొక పోతే ఆరోగ్యంగా , ప్రశాంతంగా ఆనందంగా ఏ జీవీ మన లేడు కదా ! నిద్రలో ఒడలు మరచి, బాహ్య ప్రపంచం తో సంబంధం లేకుండా మరో లోకంలో ,మరో ప్రపంచం లో విహరిస్తూ, అద మరచి నిద్రిస్తూ ఉంటాం..! అప్పుడు జీవుడు కనే కలలు స్వప్నాలు అన్నీ గతజన్మ కర్మ అనుభవాల పునరావృత స్మరణ లే...! ఒకప్పుడు జరిగిన సంఘటనలే ! అవి సు స్వప్నాలు అయినా, దు స్వప్నాలు అయినా, ఇప్పుడు జీవునికి అప్రస్తుతం ! అనవసరం ! కలలో కాదు ఇలలో ఆ కర్మలు జీవుడు అనుభవించాల్సి వుంటుంది ., ఆ కలల సారం ఏమిటంటే, ఈ జీవితం కూడా అలాంటి స్వప్నం లాంటిదే అని ! అది ఈ జీవుడి పాంచభౌతిక శరీరాన్ని అవరించిన ,మాయాప్రపంచాన్ని , మిధ్యా జగత్తును సూచిస్తూ ఉంటుంది , తన, స్వప్నంలో జీవి , అలా ఎన్నో పాత్రలు ధరిస్తూ, దేహానికి అంటకుండా ఉంటాడు., ఆ అనుభవం జీవునిది, దేహానిది కాదు . నిద్ర అనేది ,జీవుడు దేహంతో సంబంధం లేకుండా, ఆత్మానందం పొందే అందమైన బ్రహ్మానంద ఉన్మాద అవస్థ !.. అలా జీవుడు తనఆత్మ అనే అమ్మఒడిలో సేద దీరుతు ఉండగా, అతడి ఉపాధి అనగా వాహన రూపమైన ఈ శరీరాన్ని , జీవుడి సుషుప్తి అవస్థ లో,భగవంతుడు అతడి శరీరాన్ని repair చేస్తూ సంరక్షిస్తూ, జీవన చర్యలని నియంత్రిస్తూ, సక్రమంగా నిర్వహిస్తూ , బండిని మంచి కండిషన్ లో ఉంచ డానికి ఎంత సమయము అవసరమో, అంతవరకు తన పర్యవేక్షణ లో ఉంచుకొని,, అప్పుడు జీవుడి నీ నిద్రలేపి శరీరాన్ని అప్పగిస్తాడు ,. అలా అడగకుండానే , ఏ ప్రతిఫలం ఆశించ కుండానే, సేవచేసినందుకు ఈ జీవు డు ఎన్ని జన్మలెత్తినా తీరే ఋణం కాదు అది !! అలసిపోయింది దేహం, కాని జీవుడు కాడు.. కదా! లేచింది మొదలు పడుకునే వరకు, జీవుడి కర్మలకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ శరీరం రోజంతా పనులు చేసి చేసి,, ఇక పరుగెత్త లేక నడవనని మొరాయిస్తుంది ,! ఎందుకంటే జీవుడు, శరీరానికి పెట్టిన పరిమితులు, హద్దులు దాటి దైవాన్ని దిక్కరిస్తు పోతున్నాడు. కావున అనారోగ్యంగా మారిన శరీరం, తిరిగి కోలుకునే వరకు, జీవుడు తన వాహనంగా దానిని ఉపయోగించు కోలే డు. , ఒక వేళ , ఈ వాహనం లో ఏ కారణం చేతనైనా, గుండె కిడ్నీ , ఊపిరితిత్తు లు , రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా పని చేయకుండా పోతే,, ఈ వాహనం నడపడానికి అక్కరకు రాదు,! ఇక మరో ఉపాధి అనగా మరో శరీరం ,, జీవుడు మద్యంతరంగా ఆగిపోయిన తన జీవన యాత్ర కొనసాగించడానికి సిద్ధమవుతుంది.. దైవనిర్ణయం ప్రకారం ! అంతటితో, జీవునికి ఈ శరీరం తో సంబంధం తెగిపోవడం తో ఇదే, అతడి శాశ్వత నిద్ర అవుతోంది.. !అంటే దీనితో జీవుడికి ఈ శరీరం తో చేయవలసిన కర్మలు పూర్తి అయినట్టే.! ప్రాణం ఉండటం అంటే జీవునికి ఈ వాహనం అతడు నడపడానికి అనుకూలంగా ఉండటం అన్నమాట..! ఉదయం లేస్తూనే కదిలేది,, జీవుడిలో మొదట" నేను!" అనే అహంకారం, దీనితో మనస్సు బుద్ధి పంచేంద్రియాలు,5 కర్మేంద్రియాలు 5 జాగృతం అవుతాయి. గాఢమైన, నిద్ర నుండి తెలివి రాగానే మొదట కదిలేవి మన చేతులు. ! దానితో మనకు మరో రోజు ఆయుర్దాయం పెరిగింది ,. అంటే ప్రతీ ఉదయం జీవునికి పునర్జన్మ అన్నమాట.! ఎన్ని ఉదయాలో జీవుడికి అన్నీ జన్మలు.! కొంతమందికి అదే నిద్ర, శాశ్వత నిద్రగా అవుతూ ఉంటుంది,,! గుండె పోటు, మెదడులో నరాలు చిట్లడం, పక్షవాతం, రక్తపోటు, మధుమేహం, , ఆక్సిడెంట్ ,లాంటివి తీవ్రంగా ఉంటే నిద్రలోనే నిశ్శబ్దంగా చనిపోతుంటారు ,,అంటే వాహనం చెడిపోయింది ,అందుకే ఉదయం లేవగానే కుడి అరచేతి నీ చూస్తూ," కరాగ్రే వసతే లక్ష్మీ,! కర మధ్యే సరస్వతీ, !కర మూలేశు గోవిందా,!, ప్రభాతే కర దర్శనం !!""అనుకుంటూ దైవాన్ని స్మరిస్తూ ఆ దైవాన్ని హస్తంలో దర్శిస్తూ మెల్కొనడం ఉత్తమం అని శాస్త్ర ము చెబుతోంది. ఏ దేవుడైతే మనం నిద్రిస్తూ ఉండగా, శరీర రక్షణ భారం వహిస్తూ , మన ప్రమేయం లేకుండానే ఊపిరి తీయిస్తు, రక్త ప్రసరణ చేయిస్తూ, గుండెను కిడ్నీ లాంటి లోన ఉండే సకల అంగాలను చక్కగా నడిపిస్తూ. Servicing కోసం ఇచ్చిన బండి, మంచి కండిషన్ లో మెకానిక్ మనకు అప్పజెప్పిన విధంగా, భగవంతుడు ఆరోగ్యం, ప్రశాంతత, బలము శక్తి , లను ప్రసాదించి, మరుసటి రోజున ఉత్సాహంగా దైనందిన కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి యోగ్యంగా మన శరీరాన్ని తయారు చేసి ఇస్తుంటాడు.! నిజానికి ఒక్క నిద్రలోనే కాదు,,, బ్రతికినన్నాళ్ళు మనం ఆనందంగా ,సంతృప్తిగా జీవించడానికి కావలసిన బందువులు ,బలగం ,అస్తి ఐశ్వర్యం, ఇలా అనుభవించే వి అన్నీ పరమేశ్వర ప్రసాదా లే కదా.! ఏదీ జీవుడు తనతో తేలేదు ! అలాగే వెళ్ళేటపుడు తనతో పూచిక పుల్ల కూడా తనతో తీసుకెళ్ళ డు కదా ! నిజానికి ఈ జ్ఞానం ,ఈ వివేకం , కేవలం స్మశాన ,పురాణ, ప్రసూతి వైరాగ్య ముల వల్ల మాత్రమే మనకు ఈ జీవన సత్యాలు తెలుస్తాయి అనుకోవద్దు ,,! మనం భగవద్గీత చదువుతూ ,కొంత ఆత్మ విచారం చేస్తూ పోతూ ఉంటే,, లోన ,బయట ఉండే సర్వాంతర్యామినీ , మనం కన్నులతో చూడలేకున్నా , హృదయంలో అతడి దివ్య వి భూతులను , లీలలను,, సకల ప్రాణి కోటిపై కురిపించే అపార కరుణా కటాక్షాల అనుభూతిని, అంతఃకరణం లో, భక్తి అనే ఉపకరణం ద్వారా దర్శింపవచ్చును .! ఈ జీవుడు ఎవ్వరి వాడూ కా దు ! ఎందరికో కొడుకు! ఎందరికో తోబుట్టువు,! ఎక్కడెక్కడో తిరుగుతుంటా డు ,,! తన వెనక జన్మమెక్కడో, !ఎక్కడికి పోతా డో,,? ఎన్ని జన్మలు మోశా డో,, ఇంకా ఎన్ని మోయాలో ,ఎవరికీ తెలియదు ! చివరికి ,ఆ జీవుడికి కూడా తెలియదు! ఇదంతా భగవంతుని లీల, ఆయన మాయ ! నీవు ఎవరవు ? అన్న ప్రశ్నకు సూటిగా జవాబు ఒక్కటే నేను నా లో ఉంటూ దేదీప్యమానంగా, దైవాంశ గా వెలుగుతూ , అది అంతము లేని , నాశము పుట్టుక లేని , సత్యము నిత్యము అయిన పరమేశ్వర తత్వాన్ని ,,! ఈ జీవుడు ఆ ఆత్మకు బంధువు !దేహ సంబంధమైన బంధువులకు బంధువు కాడు ! నేను పరమాత్మకు మాత్రమే బంధువును ! ఎన్ని జన్మలెత్తినా అతడినుం డి నన్ను ఏ శక్తీ దూరం చేయజాల దు ! అనే తత్వమసి అనే అద్వైత తత్వాన్ని తెలుసుకునే అద్భుతమైన ప్రక్రియ , మనిషికి మాత్రమే సాధ్యమయ్యే "భావ సంపద ,భావ ప్రకటన, !! వీటిని " మనకు వరాలుగా కరుణించి యోగక్షేమాలు విచారిస్తున్న ఆ దేవా దిదేవునికి ప్రతిగా మనం ఏమివ్వగలం చెప్పండి ? అంతా అతని సొమ్మే కదా ! పైగా మనం కూడా అతడి సొత్తే ! అందుకే , అనునిత్యం, అనుదినం, అనుక్షణం, అనవరతం, జీవితాంతం , ఆ జగన్నాటక సూత్రధారి కి కృతజ్ఞతా పూర్వక శతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ ,ఉత్కృష్టమైన మానవజన్మ ను ధన్యత చేసుకుందాం,,! హే పరమేశ్వరా ! నిరంతరం నీ నామ రూప వైభవ స్మరణ లో మా జీవితాలు వర్దిల్లెలా, ప్రతీ ఉదయం,, మా హృదయం, నిన్ను పూజించే, సేవించే, భావించే పవిత్ర వేదిక అయ్యేలా , తగిన యోగ్యత ను మాకు అనుగ్రహించు తండ్రీ,! నారాయణా,!, పరాత్పరా,! పరందామా,!, శరణు! శరణు! శరణు !"ఓం శాంతి! శాంతి !శాంతిః ! స్వస్తి!"""
Sunday, March 24, 2019
జీవుడు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment